అనువాదలహరి

మినర్వా జోన్స్… ఎడ్గార్ లీ మాస్టర్స్, అమెరికను కవి

1915 లో Spoon River Anthology అన్న పేరుతో Edgar Lee Masters సంకలనం ప్రచురించి ఒక అద్భుతమైన ప్రయోగం చేశాడు. ఆయన స్వంత ఊరుకి దగ్గరగా ప్రవహిస్తున్న Spoon River పేరుతో ఒక నగరాన్ని కల్పనచేసి, ఆ నగర ప్రజలలో 212 మంది మృతులు తమ జీవితాలగురించి తామే చెబుతున్నట్టుగా 244 సంఘటనలను ప్రస్తావిస్తూ కవితలు వ్రాసాడు. అమెరికను నగరాల గురించి, పల్లెల గురించి ప్రజలలో ఉన్న కొన్ని భ్రమలని తొలగింపజెయ్యడమే ఈ సంకలనం ముఖ్యోద్దేశం.

***

నా పేరు మినర్వా, నేనొక జానపద కవయిత్రిని
వీధిలో అల్లరిచిల్లరగా తిరిగే పోకిరీవాళ్ళు
నా భారీశరీరానికీ, మెల్ల కళ్ళకి, కాళ్ళీడ్చి నడవడానికీ
నన్ను వెక్కిరించేవాళ్ళు. అన్నిటికీ మించి ఆ దుర్మార్గుడు
వెల్డీ నన్ను దారుణంగా వెంబడించి మరీ చెరిచాడు.
డాక్టర్ మేయర్స్ దగ్గర నా ఖర్మకి నన్ను విడిచిపెట్టాడు.
పాదాలదగ్గరనుండి పై వరకూ స్పర్శకోల్ఫోతూ క్రమక్రమంగా
మంచులోకి కూరుకుపోతున్నట్టూ, మృత్యుకుహరంలోకి ప్రవేశిస్తున్నట్టూ ఉంది.
దయచేసి ఎవరైనా ఈ పల్లెలోని పాత వార్తాపత్రికలు సంపాదించి
అందులో నేను వ్రాసిన కవితల్ని కవితల్ని సంకలించరూ?
నేను ప్రేమ కోసం అంతగా ప్రాకులాడేను!
నేను జీవితంకోసం అంతగానూ తపించేను!
.
ఎడ్గార్ లీ మాస్టర్స్

(August 23, 1868 – March 5, 1950)

అమెరికను కవి

.

.

Minerva Jones

.

I am Minerva, the village poetess,

Hooted at, jeered at by the Yahoos of the street

For my heavy body, cock-eye, and rolling walk,

And all the more when “Butch” Weldy

Captured me after a brutal hunt.

He left me to my fate with Doctor Meyers;

And I sank into death, growing numb from the feet up,

Like one stepping deeper and deeper into a stream of ice.

Will some one go to the village newspaper,

And gather into a book the verses I wrote?—

I thirsted so for love!

I hungered so for life!

Edgar Lee Masters

(August 23, 1868 – March 5, 1950)

American Poet

 

ఆ కొండ… ఎడ్గార్ లీ మాస్టర్స్, అమెరికను కవి

ఎల్మర్, హెర్మన్, బెర్త్, టామ్, ఛార్లీ అంతా ఏరీ,
స్థిరచిత్తం లేని వాళ్లూ, భుజబలం కలిగినవాళ్ళూ, హాస్యగాడూ,
తాగుబోతూ, యోధుడూ…ఏరీ?
అందరూ… అందరూ ఆ కొండమీద నిద్రిస్తున్నారు.

ఒకరు జ్వరంతో పోయారు
ఒకరు గనిలో కాలిపోయారు
ఒకరు తగవులాటలో మరణించేరు
మరొకరు చెరసాలలో మరణించేరు.
భార్యాబిడ్డల్ని పోషించడానికి పనిచేస్తూ మరొకరు వంతెనమీంచి జారిపోయారు
వాళ్ళంతా… అంతా… ఇప్పుడు ఆ కొండమీద నిద్రిస్తున్నారు.

ఎలా, కేట్, మేగ్, లిజ్జీ, ఎడిత్ వీరంతా ఏరీ.
మెత్తని మనసూ, అమాయకత్వం, గయ్యాళితనం, గర్వం, ప్రశాంతత ఉన్నవీళ్ళేరీ?
అందరూ… అందరూ ఆ కొండమీద నిద్రిస్తున్నారు.

ఒకరు, చెప్పాలంటే సిగ్గుచేటు, ప్రసవసమయంలో పోయారు
ఒకరు ప్రేమలో మోసగించబడితే,
ఒకరు వేశ్యాగృహంలో విటుడి చేతిలో,
ఒకరు మనసైనది వెతుక్కుంటూ, సాధించలేకపోయిన అవమానంతో మరణిస్తే
లండన్, పారిస్ మహానగరాల జీవితానికై పరుగుతీస్తున్న మరొకరిని
ఎలా, కేట్, మేగ్ తమ చిన్న ఊరికి వెతికి తీసుకొచ్చారు
చివరకి అంతా… అంతా ఆ కొండమీద నిద్రిస్తున్నారు.

ఐజాక్ మామ, ఎమిలీ అత్తా ఏరీ?
పట్టణంలోఎక్కువ బతికిన ముసిలి కింకైడూ, సెవిన్ హౌటనూ ఏరీ?
విప్లవవీరులతో మాటాడిన ప్రఖ్యాతి గలిగిన
మేజర్ వాకర్ ఏడీ?
అంతా… అంతా ఇప్పుడు ఆ కొండమీద నిద్రిస్తున్నారు.

కొందరు యుధ్ధంలో మరణించిన వీరపుత్రుల్ని తీసుకొచ్చారు
కొందరు జీవితం విచ్ఛిన్నం చేసిన కూతుళ్ళనీ
రోదిస్తున్న, అనాధలైన వాళ్ళ పిల్లల్నీ తెచ్చుకున్నారు.
ఇప్పుడంతా… అంతా ఆ కొండమీదే నిద్రిస్తున్నారు.

మంచుపడుతున్నా పైమీదబట్టలేకుండా
త్రాగుతూ, అరుస్తూ, పెళ్ళాం పిల్లల మాటలేకుండా
డబ్బూ, ప్రేమా, స్వర్గనరకాల ఊసులేకుండా
తను జీవించిన తొభై ఏళ్ల కాలమూ
ఫిడేలు వాయిస్తూనే బ్రతికిన ముదివగ్గు జోన్స్ ఏడీ?
అడుగో చూడండి, ఏనాటివో చేపల వేపుళ్ళుగురించీ
క్లారీ తోటలో జరిగిన గుర్రప్పందాలగురించీ
ఒకప్పుడు స్ప్రింగ్ ఫీల్డ్ల్లో
అబ్రహాం లింకన్ ఏమన్నాడో … నిద్రలో ఏదో వల్లిస్తున్నాడు.
.
ఎడ్గార్ లీ మాస్టర్స్
(August 23, 1868 – March 5, 1950)
అమెరికను కవి

 

.

The Hill

Where are Elmer, Herman, Bert, Tom and Charley,

The weak of will, the strong of arm, the clown,

the boozer, the fighter?

All, all, are sleeping on the hill.

One passed in a fever,

One was burned in a mine,

One was killed in a brawl,

One died in a jail,

One fell from a bridge toiling for children and wife—

All, all are sleeping, sleeping, sleeping on the hill.

Where are Ella, Kate, Mag, Lizzie and Edith,

The tender heart, the simple soul, the loud, the proud, the happy one?—

All, all, are sleeping on the hill.

One died in shameful child-birth,

One of a thwarted love,

One at the hands of a brute in a brothel,

One of a broken pride, in the search for heart’s desire,

One after life in far-away London and Paris

Was brought to her little space by Ella and Kate and Mag—

All, all are sleeping, sleeping, sleeping on the hill.

Where are Uncle Isaac and Aunt Emily,

And old Towny Kincaid and Sevigne Houghton,

And Major Walker who had talked

with venerable men of the revolution?—

All, all, are sleeping on the hill.

They brought them dead sons from the war,

And daughters whom life had crushed,

And their children fatherless, crying—

All, all are sleeping, sleeping, sleeping on the hill.

Where is Old Fiddler Jones

Who played with life all his ninety years,

Braving the sleet with bared breast,

Drinking, rioting, thinking neither of wife nor kin,

Nor gold, nor love, nor heaven?

Lo!  he babbles of the fish-frys of long ago,

Of the horse-races of long ago at Clary’s Grove,

Of what Abe Lincoln said

One time at Springfield.

Edgar Lee Masters

(August 23, 1868 – March 5, 1950

American Poet, Attorney, biographer and dramatist

Poem Courtesy:

http://www.poemtree.com/poems/TheHill.htm

(In 1915, Edgar Lee Masters published The Spoon River Anthology, a book of 244 poems spoken by the deceased residents of Spoon River (a rural area in Illinois) from their graves on “the hill”.  The book created a stir because many of the supposedly fictional speakers were recognizable as real people.  The poems are remarkable for the breadth of personalities and the honesty with which they speak.  All the poems were written in free verse, which puts them outside the scope of this “formalist” anthology.  Nonetheless, I include some here because they are moving and haunting.  These poems are food for my spirit like no other.  I recommend this book more strongly than any other book of poetry…  Editor, Poem Tree … an anthology of metered verse. )

ఓ మిత్రమా! … ఎడ్గార్ లీ మాస్టర్స్, అమెరికను

ఓ నా మిత్రమా!
నీ గురించి చెప్పడానికి నాదగ్గిర తగిన మాటలేవీ?
ఓ నా చెలికాడా!
చెప్పలేనన్ని సంభాషణలు పంచుకున్నవాడా!
నా ప్రేరణా!
నా మార్గదర్శీ!
నా ఉత్తమవ్యక్తిత్వాన్ని బయటకి తెచ్చినవాడా!
ఈ దేశా పశ్చిమభాగానికి నువ్వొక వెలుగువి.
నువ్వే ఒక సంపదల ఖనివి.
అఖండ యశస్సువి
ఒక చెప్పలేని ఆకర్షణవి
ఈ సంయుక్త రాష్ట్రాల పంటవీ, సంపదవీ నువ్వు!

బిల్! నువ్వు లేవని తెలుసు.
నేను ఈ ఊర్లోకి పొద్దున్నే వచ్చేను.
జిగేలుమంటున్న ఈ జులై నెల ఎండలోనూ, కార్ల హడావిడిలోనూ
నువ్వు మనసులో మెదిలావు.
నిజానికి ఈ కబురు నాకు అందింది.
మళ్ళీ నీతోనే ఎక్కడో నవ్వుతూ,
కబుర్లు చెబుతూ గంటలు గంటలు గడుపుదును గాక!
.
ఎడ్గార్ లీ మాస్టర్స్

(August 23, 1868 – March 5, 1950)
అమెరికను

 Photo Courtesy:

https://www.poets.org/poetsorg/poet/edgar-lee-masters

.

O, My Friend!

.

O, my friend,

What fitting word can I say?

You, my chum,

My companion of infinite talks,

My inspiration,

My guide,

Through whom I saw myself at best;

You, the light of this western country.

You, a great richness.

A glory,

A charm,

Product and treasure of these States.

Bill, I knew you had gone.

I was walking down into town this morning,

And amid the hurry of cars and the flash of this July sun,

You came to me.

At least the intimation came to me;

And may it be you,

That somewhere I can laugh and talk long hours with you again.

.

Edgar Lee Masters

(August 23, 1868 – March 5, 1950)

American Attorney, Poet, Dramatist

Poem Courtesy:

http://www.bartleby.com/273/116.html

(This poem was a tribute to his friend William Marion Reedy by the poet )

 

Reedy’s Mirror

కొండవాలు… ఎడ్గార్ లీ మాస్టర్స్, అమెరికను కవి

ఆ ఎల్మర్, హెర్మన్, బెర్ట్, టామ్ , ఛార్లీ ఏరీ?
మనసు నిలకడలేనివాడు, భుజశాలి, చమత్కారి, తాగుబోతు, తగవులమారి ఏమయ్యారు?
అందరూ, ఇపుడందరూ కొండవాలులో నిద్రిస్తున్నారు.

ఒకడు జ్వరంతో పోయాడు
ఒకడు గనిలో కాలిపోయాడు
ఒకడు పోట్లాటలో మరణించాడు
ఒకడు జైల్లో చనిపోయాడు
ఒకడు భార్యాపిల్లలకై శ్రమిస్తూ వంతెనమీంచి జారిపోయాడు…
అందరూ, ఇపుడందరూ నిద్ర, దీర్ఘనిద్రపోతున్నారు కొండవాలులో.

ఎలా, కేట్, మేగ్, లిజ్జీ, ఎడిత్ ఏరీ?
దయాళువు, అమాయకురాలు, కోపిష్టి, గర్విష్టి, ఎప్పుడూ హాయిగా ఉండే వాళ్ళేరీ?
ఒక్కొక్కరూ, చివరికి అందరూ కొండమీద నిద్రిస్తున్నారు.

ఒకతె అన్యాయంగా ప్రసవంలో చనిపోయింది
ఒకతె వికటించిన ప్రేమతో
ఒకతె వేశ్యాగృహంలో దుర్మార్గుడి చేతిలో,
ఒకతె మనసుకి నచ్చినది దొరకక, అహం అణచుకోలేక,
ఒకతె లండను, పారిస్ నగర జీవితాలకై అర్రులుజాస్తూ
చివరకి ఇక్కడకి కొనిరాబడింది… ఎలా, కేట్, మాగ్…
అందరూ, ఇప్పుడు అందరూ కొండమీద హాయిగా నిద్రిస్తున్నారు.

అంకుల్ ఐజాక్, ఆంట్ ఎమిలీ ఏరీ?
దబ్బపండులాంటి కిన్ కైడ్, సెవి హ్యూటన్ ఏరీ?
అమెరికను విప్లవంలో పేరుపడ్డ వారితో
భుజం భుజం రాసుకు తిరిగిన మేజర్ వాకర్ ఏడీ?
అందరూ… ఇప్పుడు అందరూ కొండమీద నిద్రిస్తున్నారు.

వాళ్లు యుద్ధంలో మరణించిన కొడుకుల్ని తెచ్చుకున్నారు
జీవితం అణగదొక్కిన కూతుళ్ళని తెచ్చుకున్నారు
ఇప్పుడు వాళ్ళపిల్లలు దిక్కు లేక రోదిస్తున్నారు…
అందరూ… ఇప్పుడందరూ కొండమీద నిద్రిస్తున్నారు.

బతికిన తొంభై ఏళ్ళూ జీవితంతో చెలగాటమాడిన
సోమరిపోతు… ఆ ముసిలి జోన్స్ ఏడీ?
మంచుకురుస్తున్నా అనాచ్చాదితంగా తిరుగుతూ
తాగుతూ,అరుస్తూ, పెళ్ళాం గురించి గాని, పిల్లల గురించి గాని
డబ్బూ, ప్రేమా,స్వర్గం గురించిగాని ఆలోచనలేని వాడు.
ఏనాటివో, చేపల వేపుళ్ళగురించీ,
క్లారీ గ్రోవ్ లో ఎప్పుడో జరిగిన గుర్రప్పందాలగురించీ
అప్పుడెప్పుడో స్ప్రింగ్ ఫీల్డ్ లో
అబ్రహం లింకను మాట్లాడినదానిగురించీ … వాగుతుండేవాడు…
.
ఎడ్గార్ లీ మాస్టర్స్

August 23, 1868 – March 5, 1950

అమెరికను కవి

 .

Edgar Lee Masters

.

The Hill

.

Where are Elmer, Herman, Bert, Tom and Charley,

The weak of will, the strong of arm, the clown, the boozer, the fighter?

All, all, are sleeping on the hill.

One passed in a fever,

One was burned in a mine,

One was killed in a brawl,

One died in a jail,

One fell from a bridge toiling for children and wife—

All, all are sleeping, sleeping, sleeping on the hill.

Where are Ella, Kate, Mag, Lizzie and Edith,

The tender heart, the simple soul, the loud, she proud, the happy one?—

All, all, are sleeping on the hill.

One died in shameful child-birth,

One of a thwarted love,

One as the hands of a brute in a brothel,

One of a broken pride, in the search for heart’s desire,

One after life in far-away London and Paris

Was brought to her little space by. Ella and Kate and Mag—

All, all are sleeping, sleeping, sleeping on the hill.

Where are Uncle Isaac and Aunt Emily,

And old Tawny Kincaid and Sevigne Houghton,

And Major Walker who had talked

With venerable men of the revolution?—

All, all, are sleeping on the hill.

They brought them dead sons from the war,

And daughters whom life had crushed,

And their children fatherless, crying—

All, all are sleeping, sleeping, sleeping on the hill.

Where is Old Fiddler Jones

Who played with life all his ninety years,

Braving the sleet with bared breast,

Drinking, rioting, thinking neither of wife “or kin,

Nor gold, nor love, nor heaven?

Lo! he babbles of the fish-frys of long ago,

Of the horse-races of long ago at Clary’s Grove,

Of what Abe Lincoln said

One time at Springfield.

.

(From: Spoon River Anthology)

Edgar Lee Masters

August 23, 1868 – March 5, 1950

American Poet, Attorney, Biographer and Dramatist

Poem Courtesy:

The New Poetry: An Anthology.  1917.

Harriet Monroe, ed. (1860–1936).

http://www.bartleby.com/265/215.html

%d bloggers like this: