అనువాదలహరి

మా అమ్మకు… ఎడ్గార్ ఏలన్ పో, అమెరికను కవి

ఊర్ధ్వలోకాలలోని దేవదూతలు ఒకరితో ఒకరు

గుసగుసలాడుకుంటూ, వారి అత్యంత ప్రేమాస్పదమైన పదాల

వెదుకులాటలో, “అమ్మ”ను మించిన పూజనీయమైన మాటను

కనుగొనలేరని నేను భావిస్తున్నాను గనుక,

ఇష్టమైన ఆ పేరుతోనే నిన్ను ఎప్పటినుండో పిలుస్తున్నాను…

నువ్వు నాకు జన్మనిచ్చిన తల్లికంటే పూజనీయురాలవు,

నా మనోంతరాలములో సదా నిలుస్తావు, నా వర్జీనియను చైతన్యాన్ని

స్వేచ్ఛగా విడిచిపెట్టడానికి మృత్యువు నిను నియోగించింది.

నా తల్లి… కన్న తల్లి… నా చిన్నప్పుడే మరణించిన తల్లి

కేవలం నాకు మాత్రమే తల్లి; కానీ నువ్వు

నేను అమితంగా ప్రేమించే వ్యక్తికి మాతృమూర్తివి,

కనుక నే నెరిగిన తల్లికంటే మిక్కిలి ప్రేమాస్పదురాలివి

ఎంత ఎక్కువ అంటే, నాకు నా ప్రాణం కంటే

నా భార్య నాకు ఎంత ఇష్టమో, అంత.

.

ఎడ్గార్ ఏలన్ పో

January 19, 1809 – October 7, 1849

అమెరికను కవి.

Edgar Allan Poe

.

To My Mother

Because I feel that, in the Heavens above,

    The angels, whispering to one another,

Can find, among their burning terms of love,

    None so devotional as that of “Mother,”

Therefore by that dear name I long have called you —

    You who are more than mother unto me,

And fill my heart of hearts, where Death installed you

    In setting my Virginia’s spirit free.

My mother — my own mother, who died early,

    Was but the mother of myself; but you

Are mother to the one I loved so dearly,

    And thus are dearer than the mother I knew

By that infinity with which my wife

    Was dearer to my soul than its soul-life.

(1849)

Edgar Allan Poe

January 19, 1809 – October 7, 1849

American

Poem Courtesy:  

http://www.literaturepage.com/read/poe-various-poems-23.html 

 

శాస్త్రవిజ్ఞానానికో నమస్కారం… ఎడ్గార్ ఏలన్ పో, అమెరికను కవి

శాస్త్రవిజ్ఞానమా! ప్రాచీనకాలానికి అచ్చమైన బిడ్డవు నువ్వు.

నీ నిశితమైన దృష్టితో అన్నిటినీ పరివర్తన చెయ్యగలవు.

ఎందుకునువ్వు ఈ కవిహృదయాన్ని కబళించడానికి సిద్ధపడతావు?

నువ్వు హృదయంలేని కరుకు సత్యాలరెక్కలతో విహరించే రాబందువి కావూ?

కవికి నీమీద ప్రేమ ఎక్కడినుండి కలుగుతుంది? నీ జ్ఞానాన్ని మెచ్చేదెలా?

అలుపులేని ఆలోచనల రెక్కలతో అతను మింటికెగసి

అక్కడ నిక్షిప్తమైన సౌందర్య నిధులకై తిరుగాడుతుంటే

నువ్వు అతన్నికూడా విడిచిపెట్టవు గదా!

డయానాని తన సింహాసనం నుండి బహిష్కరించింది

వనదేవతలని చెట్లనుండి వేరుచేసి

మరో చోటు వెతుక్కునేలా చేసింది నువ్వు కాదూ?

జలదేవతలని తమ ఉధ్థృత ప్రవాహాలనుండీ

పచ్చని పచ్చికకు అధినాయకులని తమ నెలవులనుండీ

ఈ చింతచెట్టుక్రింద నన్ను నా కలలనుండీ వేరుచేసింది నువ్వు కాదూ?

.

ఎడ్గార్ ఏలన్ పో

(January 19, 1809 – October 7, 1849)

అమెరికను కవి

 Edgar Allan Poe

Sonnet — To Science

Science! true daughter of Old Time thou art!

Who alterest all things with thy peering eyes.

Why preyest thou thus upon the poet’s heart,

Vulture, whose wings are dull realities?

How should he love thee? or deem thee wise?

Who wouldst not leave him in his wandering

To seek for treasure in the jeweled skies,

Albeit he soared with an undaunted wing?

Hast thou not dragged Diana from her car?

And driven the Hamadryad from the wood

To seek a shelter in some happier star?

Has thou not torn the Naiad from her flood,

The Elfin from the green grass, and from me

The summer dream beneath the tamarind tree?

.

Edgar Allan Poe

(January 19, 1809 – October 7, 1849)

American Poet, Editor

http://wonderingminstrels.blogspot.in/2004/07/sonnet-to-science-edgar-allan-poe.html

సుందర నదానికి…. ఎడ్గార్ ఏలన్ పో, అమెరికను

ఓ సుందర నదమా*! స్ఫటికంలా స్వచ్ఛంగా,

తళుకులీనుతూ, జలజలా గలగలా

పరుగులిడి ప్రవహించే నీటితో,

నీ సయ్యాటల హేలతో, మనసులో

ఏ దాపరికమూలేక తుళ్ళిపడే ఆల్బెర్టో కూతురిలా,

రాశీభూత సౌందర్యపుజిగికి నీవొక ప్రతీకవు.
.

ఆమె ఒకసారి తన నీడని నీలో చూసుకునే వేళ

అది ఒకపక్క మెరుస్తూనే, ఆర్ద్రతతో వణుకుతుంది;

ఎందుకంటే,అప్పుడు, అంత అందమైన సెలయేటివీ

తనని ఆరాధిహించే ప్రియునిలా కనిపిస్తావు;

అతని మనసులోనూ, నీ తరంగాలమీదలా

ఆమె ప్రతిబింబం గాఢంగా ముద్రించబడి ఉంది;

అతని మనసుకూడా గుండేలోలోతులను పరిశీలించే

ఆమె నిశితమైన చూపులకి వణుకుతుంటుంది.
.

ఎడ్గార్ ఏలన్ పో

అమెరికను.

(*నదం అన్న మాట ఇక్కడ దాని అసలు అర్థంలో వాడలేదు. నదికి పర్యాయపదంగా వాడబదినది అని మనవి.)

.

[Notes:

1. ఈ కవిత అన్ని ప్రతులలోనూ  నది పెరుని కవి ఎక్కడా ప్రస్తావించలేదు.  1945 వరకూ ఎవరూ దీని దురించి ప్రస్తావించలేదు కూడా. కానీ, Richard L Lord లార్డ్ బైరన్ పో అన్న నది మీద వ్రాసిన పంక్తులు ఆధారంగా, తనపేరుకీ, నదిపేరుకీ ఉన్న శబ్దసామ్యాన్ని గుర్తించి అందుకే బహుశా పో నదిపెరు ప్రస్తావించి ఉండడని ఒక ఆలోచన లేవనెత్తాడు.  ‘పో’ అన్న పేరుగల నది ఉత్తర ఇటలీలో తూర్పుగా సుమారు 250 మైళ్ళ పొడవు  ప్రవహించే నది.

2. ఆల్బెర్టో కూతురు: ఈ ఆల్బెర్టో కూతురు ఎవరా అని చాలా ఊహాగానాలున్నాయి. కొందరు ప్రముఖ ఇటాలియన్ రచయిత Boccaccio వ్రాసిన  డెకమెరోన్ (పదిరాత్రులు) అన్న కథల సమాహారంలో,  మొదటి రాత్రి చెప్పబడే కథలో వచ్చే డాక్టరు ఆల్బెర్టో,  ప్రేమగా కూతురులా భావించే అందమైన బాలవితంతువు అని అంటే, ఈ కవితలో ప్రశంసిస్తున్న స్ఫటికంవంటి శీలం ఆధారంగా, ఎలిజబెత్ 1 మహారాణి కాలంలోని ప్రముఖ నాటకకర్తల జంట… బ్యూమాంట్  మరియు ఫ్లెచర్ లు వ్రాసిన  “The Fair Maid of the Inn” అన్న నాటకంలోని Biancha గా మరి కొందరు గుర్తిస్తున్నారు. ]

.

English: Edgar Allen Poe, poet and writer, com...

.

To The River…

.

Fair river! in thy bright, clear flow
 Of crystal, wandering water,
 Thou art an emblem of the glow
 Of beauty- the unhidden heart-
 The playful maziness of art
 In old Alberto’s daughter;

But when within thy wave she looks-
 Which glistens then, and trembles-
 Why, then, the prettiest of brooks
 Her worshipper resembles;
 For in his heart, as in thy stream,
 Her image deeply lies-
 His heart which trembles at the beam
 Of her soul-searching eyes.
.
 Edgar Allen Poe

[Interesting Sidelights:
 1. The Poet did not mention the name of the river in any version of this poem. Mr Richard J Lord, in 1945, observed that the poet deliberately avoided mentioning the name of the river just by playing on the pun its name rersembling his. (The PO, Padus or Eridanus in Latin, is a river flowing eastwards across North Italy. Lord Byron Wrote a poem on the River Po…titled … “Stanzas To The PO.”

2. Alberto’s daughter: Some believe this could refer to Biancha, the fair maid of the Elizabethan Play “The Fair Maid of the Inn” by Beaumont and Fletcher. The reason could be the reference of purity of the girls. However, some others think, it is from Boccaccio’s Decameron (Ten Nights), refering to the beutiful young widow whom an elderly physician Alberto treats as his daughter. The story appears in the first night.

సరోవరం జ్ఞాపకంలో … ఎడ్గార్ ఏలన్ పో, అమెరికను కవి

యౌవనం తొలినాళ్ళలో

ఈ విశాలవిశ్వంలో

అన్నిటికంటే ఇష్టమైన  ప్రశాంతంగా ఉండే జాగా కోసం

వెతుక్కోవడం నాకో అలవాటుగా ఉండేది.

.

చుట్టూ నల్లని రాళ్లతో,

అంబరాన్ని తాకే  పైన్(pine) చెట్లతో

ఈ ప్రకృతిసిధ్ధమైన సరోవరపు ఏకాంతం

ఎంత హాయిగా ఉండేదో చెప్పలేను.

.

కాని, చీకటిపడిన తర్వాత

నిశాసుందరి మనఅందరిమీద కప్పినట్టే

ఈ ప్రదేశం మీద కూడా

తన నల్లని ముసుగుకప్పిన తర్వాత

మార్మికపు పిల్లతెమ్మెర ఏవో రహస్యాలాలపిస్తూ

పక్కనుండి పరిగెత్తుతున్నప్పుడు చూడాలి,

అబ్బ!

ఈ సరోవరపు గభీరత

అప్పుడు తెలిసొస్తుంది నాకు.
.

అలాగని అదేమీ భయపెట్టే  గాంభీర్యం కాదు,

చిరు చలిలో వణికేటి, తొణికిసలాడే ఆనందం…

ఆ అనుభూతి ఎన్ని రత్నరాశులిచ్చినా

చెప్పగలిగేదీ, నిర్వచించగలిగేదీ కాదు,

ప్రేమకూడా కాదు, ప్రేమలాంటిజ్వరమైనా.

తన ఒంటరితనపుటాలోచనల్లో

ఈ నిశాపరివ్యాప్తమైన సరస్సునే

స్వర్గధామంగా ఊహించగల వ్యక్తికి

ఆ విషమ నులితరగల్లో మృత్యువు దాగుంది

ఆ అగాధంలోనే శాశ్వతమైన సమాధిశయ్య కూడా.

.

Carte de Visite of Edgar Allan Poe
Carte de Visite of Edgar Allan Poe (Photo credit: Wikipedia)

ఎడ్గార్ ఏలన్ పో

January 19, 1809 – October 7, 1849

(పో కవితలు కొన్ని చాలా గహనంగా, మార్మికతో అనేకమైన వ్యాఖ్యానాలకు అనువుగా ఉంటాయి. అందులో ఇది ఒకటి. ఇక్కడ చెప్పిన విషయాలన్నీ సరస్సు నేపధ్యానికి సరిగా సరిపోయినా, దీని వెనుక చెప్పదలుచుకున్న అంతరార్థం వేరే ఉందని తెలుస్తుంది. చాలామంది చాలా రకాలుగా చెప్పినా నామట్టుకు  ఇది మనిషిలోని వెదుకులాట గురించి, అందులోనూ తనకేతెలియని ఎదుకులాట. మనిషికికూడా తనకు ఇష్టమైన వ్యక్తిగురించీ, వ్యాపకం గురించీ వెదుకులాడుతుంటాడు. తనకు ఇష్టమైన అనేక వృత్తిప్రవృత్తులో ఏది అత్యంతప్రీతిపాత్రమో తనే నిర్ణయించుకోలేడు ఒకంతట. అందులో కొన్ని(నల్లరాళ్లవంటివి, సేదదీరడానికి)  నిబంధనలు పెట్టుకుంటాడు, ఉదాత్తమైన ఆలోచనలుగాని, ఆశయాలుగాని అందులో భాగమే. అవే Pineచెట్లలా ఆ లక్ష్యంచుట్టూ పరివ్యాప్తమైనవి. ఒకసారి అటువంటి వ్యక్తో, వ్యాపకమో దొరికితే అందులో లీనమైపోవడం లోనే అతనికి ముక్తీ, ఆనందమూ ఉంటాయి. ఏ లక్ష్యం కోసం తను ఇన్నాళ్ళూ తపించేడో అది దొరికినతర్వాత అతని అంతరంగం కలిగించే ప్రేరణే … చిరుగాలి చెవిలో ఊదే మార్మిక గీతాలు. ఇక్కడ మృత్యువు నెగెటివ్ సెన్స్ లో వాడలేదనిపిస్తుంది. ఇక్కడ మృత్యువంటే లీనమవడం, మనం అందరం మృత్యువులో లీనమయినట్టు. సమాధి అన్నది శాశ్వతత్వానికి ప్రతీక.

పో జీవిత విశేషాలకు ఈ క్రింది లింకు చూడండి:

http://en.wikipedia.org/wiki/Edgar_Allan_Poe    )

.

To The Lake

In spring of youth it was my lot
To haunt of the wide world a spot
The which I could not love the less
So lovely was the loneliness
Of a wild lake, with black rock-bound,
And the tall pines that towered around.
But when the Night had thrown her pall
Upon that spot, as upon all,
And the mystic wind went by
Murmuring in melody
Then–ah then I would awake
To the terror of the lone lake.
Yet that terror was not fright,
But a tremulous delight
A feeling not the jewelled mine
Could teach or bribe me to define
Nor Love–although the Love were thine.
Death was in that poisonous wave,
And in its gulf a fitting grave
For him who thence could solace bring
To his lone imagining
Whose solitary soul could make
An Eden of that dim lake

Edgar Allan Poe.

హేమనగరి (Eldorado) … ఎడ్గార్ ఏలన్ పో

http://www.filesfeed.com/upload/images/heroturko/3/5/9/7b5c05092ac38834b50ab03144fe8ba2.jpg
Image Courtesy: http://www.filesfeed.com

.

ఒక సాహస ఆశ్వికుడు

ఆహ్లాదకరమైన ఆహార్యాన్ని ధరించి,

రాత్రనక పగలనక,

ఆడుతూ పాడుతూ దౌడుతీస్తూ

చాలాకాలం ప్రయాణించాడు

“హేమనగరి”ని (Eldorado) అన్వేషిస్తూ.

.

వయసు పైబడింది.

కాని ఈ సాహస ఆశ్వికునికి ఎంతవెతికినా,

హేమనగరిని పోలిన నేల కనిపించకపోయేసరికి,

అతని మనసులో

విషాదఛ్ఛాయ అలముకుంది.

.

చివరికి

జవసత్త్వాలుడిగినవేళకి

అతనికొక  యాత్రికఛాయ కనిపించింది.

దాన్ని ఉద్దేశించి:

“ఓ సఛ్ఛాయమా!

హేమనగరి ఎక్కడుంటుందో తెలుసా?” అని అడిగేడు.

అపుడానీడ అందికదా:

“తెలియకేం? అదిగో,

ఆ హిమమయూఖపర్వతసానువుల్లో,

నీడల లోయల దాపున ఉంది.

హేమనగరి చేరాలంటే,

ముందుకి సాగిపో! ధైర్యంగా! ” 

.
ఎడ్గార్ ఏలన్ పో.

.  వివరణ: 

EldoradO ( Or El Dorado)అన్నది 16 వ శతాబ్దం లో అమెజాన్ అడవులలో  బంగారమూ


సిరిసంపదలూ, అవకాశాలూ పుష్కలంగా ఉన్నాయని భావించిన ఒక ఊహాజనిత నగరానికి పెట్టిన పేరు.


అయితే ఈ కవితకి విశేషమైన ఆదరణ ఉండడానికి కారణం Eldorado ని ఎన్నోరకాలైన భావాలకు

ప్రతీకగా ఊహించగల అవకాశం. ఉదాహరణకు దీనిని, సామాన్యుడు వెదికే ఎండమావులకీ, ప్రేమికుడు

ఆశించే నిశ్చల ప్రేమకీ, భక్తుడు వెతికే భగవత్స్వరూపానికీ… ప్రతీకగా వివరణ ఇచ్చుకోవచ్చు.

Eldorado

.

Gaily bedight,

A gallant knight,

In sunshine and in shadow,

Had journeyed long,

Singing a song,

In search of Eldorado.

But he grew old-

This knight so bold-

And o’er his heart a shadow

Fell as he found

No spot of ground

That looked like Eldorado.

And, as his strength

Failed him at length,

He met a pilgrim shadow-

“Shadow,” said he,

“Where can it be-

This land of Eldorado?”

“Over the Mountains

Of the Moon,

Down the Valley of the Shadow,

Ride, boldly ride,”

The shade replied-

“If you seek for Eldorado!”

.

Edgar Allan Poe

ఒంటరిగా … ఎడ్గార్ ఏలన్ పో

Image Courtesy: http://fsa.zedge.net/content/3/3/8/9/1-3541755-3389-t.jpg

.

శైశవం నుండీ ఇతరుల్లా నేను లేను…

అందరు చూసినట్టుగా నేను చూడలేదు…

నా ఆవేశాలు అందరిలా ఒక చెలమనుండే చేదుకోలేకపోయాను…

నా దుఃఖాల్ని ఒక చోటునుండి అనుభవించలేదు…

నా హృదయాన్ని అదే శృతిలో ఆనందానికి తట్టిలేపలేకపోయాను..

నేను ప్రేమించినదల్లా ఒక్కటే… నా ఒంటరితనాన్ని.

.

నా చిన్నతనం లో, అత్యంత సంక్షుభితమైన

నా జీవనపు తొలిసంధ్యలో,

మంచీ చెడుల అన్ని లోతులనూ ఎలా స్పృశించానో

ఆ  రహస్యం  ఇప్పటికీ నాకు అంతు పట్టనిది:

ఆ ‘బుగ్గ’ నుండి, ఆ వరద ఉధృతినుండి,

అరుణారుణ పర్వత శిఖరాగ్రమునుండి

నా చుట్టూ పరిభ్రమించిన

శరత్కాల సూర్యుని స్వర్ణరోచిస్సులనుండి

ఆకాశము నుండి క్రిందకు నా ప్రక్కనుండే

పరిగెత్తుకుంటూ పోయిన మెరుపుతీగలనుండి

పిడుగుపాటులనుండి, తుఫానులనుండి,

ఆకసమంతా వినీలమై శోభిస్తున్నపుడు

నా చూపులకి  రాక్షసాకృతిబూనినట్టున్న మేఘాలనుండి…
,

ఎడ్గార్ ఏలన్ పో

.

Alone
.

From childhood’s hour I have not been

As others were; I have not seen

As others saw; I could not bring

My passions from a common spring.

From the same source I have not taken

My sorrow; I could not awaken

My heart to joy at the same tone;

And all I loved, I loved alone.

Then- in my childhood, in the dawn

Of a most stormy life- was drawn

From every depth of good and ill

The mystery which binds me still:

From the torrent, or the fountain,

From the red cliff of the mountain,

From the sun that round me rolled

In its autumn tint of gold,

From the lightning in the sky

As it passed me flying by,

From the thunder and the storm,

And the cloud that took the form

(When the rest of Heaven was blue)

Of a demon in my view

.

Edgar Allan Poe

(Please give me your feedback about the FONT COLOR  of the text whether it is good, tolerable or bad)

కలలో కల – ఎడ్గార్ ఏలన్ పో

Image Courtesy: http://www.google.com/imgres?q=beach+sands+in+fist&hl=en&biw=1200&bih=613&gbv=2&tbm=isch&tbnid=5CMThoVyvkLNlM:&imgrefurl=http://jiangxidreaming.blogspot.com/&docid=Zj5afB6oWCd7zM&w=1600&h=1200&ei=Nb0xTurVHsbQrQfDh_XLCw&zoom=1&chk=sbg&iact=hc&vpx=889&vpy=167&dur=6647&hovh=194&hovw=259&tx=114&ty=103&page=19&tbnh=134&tbnw=179&start=288&ndsp=16&ved=1t:429,r:15,s:288

(Image Courtesy: http://2.bp.blogspot.com

.

నీ కనుబొమ మీద నను చుంబించనీ!

నీ నుండి ఎడమయే  ఈ తరుణంలో

ఇది మాత్రం నిశ్చయంగా చెప్పగలను.

నా ఈ రోజులన్నీ ఒక కలగా నువ్వు ఎంచినది అబధ్ధం కాదు;

అయినప్పటికీ,

ఒక రాత్రిలోనో, పగటిపూటో, ఒక స్వప్నం లోనో, ఏమీ లేకుండానో

ఆశలెగిరిపోయినంత మాత్రాన,  ఎగిరిపోవడం మిధ్యా?

మనం చూసేదీ, చూసినట్టగుపించేదీ అంతా ఒక కలలో కల.

.

నేను ఫేనామృదంగతరంగాఘాత తీరంలో నిలుచున్నాను.

నా పిడికిలిలో స్వర్ణరేణువుల ఇసుక.

అవనగా ఎన్ని?

అయినా అవి నే శోకిస్తుండగానే

నా వ్రేళ్ళ సందులలోనుండి క్రిందకి ఎలా జారిపోతున్నాయో!

.

ఓ భగవంతుడా! నేను వాటిని గట్టిగా బంధించలేనా?

ఓ దైవమా! ఒక్క రేణువునైనా

నిర్దాక్షిణ్యమైన కెరటపు బారినుండి రక్షించలేనా?

మనం చూచేదీ, చూసినట్టగుపించేదీ అంతా కలేనా?
.

ఎడ్గార్ ఏలన్ పో

.

A Dream Within Dream

Take this kiss upon the brow!
And, in parting from you now,
Thus much let me avow-
You are not wrong, who deem
That my days have been a dream;
Yet if hope has flown away
In a night, or in a day,
In a vision, or in none,
Is it therefore the less gone?
All that we see or seem
Is but a dream within a dream.

I stand amid the roar
Of a surf-tormented shore,
And I hold within my hand
Grains of the golden sand-
How few! yet how they creep
Through my fingers to the deep,
While I weep- while I weep!
O God! can I not grasp
Them with a tighter clasp?
O God! can I not save
One from the pitiless wave?
Is all that we see or seem
But a dream within a dream?

.Edgar Allan Poe

ఒక స్వప్నం – ఎడ్గార్ ఏలన్ పో

Morning Star

                                    (Image Courtesy: http://religiousreading.bestmoodle.net)

.

చీకటి రాత్రి నీలి నీడల్లో

గతించిన సుఖాన్ని కలగన్నాను

కాని, పగటి కలయైన జీవితపు వెలుగు

మనసు విరిచేసింది.

.

అసలు

కనిపించే ప్రతి వస్తువులోనూ,

గతకాలపు వెలుగులు వాసనలు వెతుక్కునేవాడికి

పగటికలకానిదేది?

.

ఆ మధురమైన కల, రసప్లావితమైన కల,

లొకం ఛీత్కరించినా, నా వెన్నుతట్టి

ఏకైక వెన్నెలకిరణమై   ప్రోత్సహించి  నడిపించింది

దూరాన్నుండే వణికించే చీకట్లలోనూ …  తుఫాన్లలోనూ …

నిజానికి,  వేగుచుక్కను మించిన

స్వఛ్ఛమైన కాంతిపుంజమేముండగలదు?

.

ఆంగ్ల మూలం:  ఎడ్గార్ ఏలన్ పో

.

A Dream – Edgar Allan Poe

.

In visions of the dark night

I have dreamed of joy departed-

But a waking dream of life and light

Hath left me broken-hearted.

Ah! what is not a dream by day

To him whose eyes are cast

On things around him with a ray

Turned back upon the past?

That holy dream- that holy dream,

While all the world were chiding,

Hath cheered me as a lovely beam

A lonely spirit guiding.

What though that light, thro’ storm and night,

So trembled from afar-

What could there be more purely bright

In Truth’s day-star?

.

%d bloggers like this: