Tag: Eavan Boland
-
పోగొట్టుకున్న నేల… ఈవన్ బోలాండ్, సమకాలీన ఐరిష్ కవయిత్రి
. నా కిద్దరు ఆడపిల్లలున్నారు. నేను ఈ జన్మకి కోరుకున్నది ఆ ఇద్దరినే. బహుశా నేను అంతకుమించి కోరుకోలేదేమో! . హాఁ! నేను చారెడు జాగా కూడా కోరుకున్నాను: ఎప్పుడూ ఎవరిపని వారు చేసుకోగలిగే వాతావరణమున్న దీవి, చుట్టూ కొండలమధ్య ఒక నగరం, ఒక జీవ నది … ఉన్న చోట. ఆ నేల నాదని చెప్పుకోగలగాలి. నా స్వంతం. అక్షరాలా నా తాత్పర్యం అదే. వాళ్ళు పెద్దవాళ్ళయిపోయి దూరాభారాన ఉన్నారు. ఇప్పుడు జ్ఞాపకాలే వలస పోతున్నాయి. […]
-
ఇదీ స్త్రీ ప్రపంచం… ఈవన్ బోలండ్, ఐరిష్ కవయిత్రి
మన జీవన విధానం ఏమీ మారలేదు మొదటి సారి చక్రం కత్తికి పదునుపెట్టిననాటినుండి బహుశా దీపం వత్తి ఎక్కువ ప్రజ్వలిస్తుందేమో చక్రాలు నిలకడగా ఉంటాయేమో మనం మాత్రం అలాగే ఉన్నాము. మన జీవితాలని కొలుచుకుంటాం సంఘటనల కొండగుర్తులద్వారా మరిచిపోయినవీ కళ్ళెదుట కనిపించేవీ మిగిలిపోయిన రొట్టెముక్కా, జమాఖర్చుల పద్దులూ, వాషింగ్ పౌడరికి ఎంత ఇచ్చేము వాడు ఎంత కట్టేదూ ఇంకా ఆరెయ్యాల్సిన తడిగుడ్డలెన్ని… చారిత్రక వ్యక్తుల్లా మన అసంపూర్ణ కార్యాలనుబట్టి మనల్ని అంచనా వేస్తుంటారు మనం ఎన్నడూ కాలేము: […]