అనువాదలహరి

అనుభవశాలి … డొరతీ పార్కర్, అమెరికను కవయిత్రి

22nd August is 125th Birth Anniversary of Dorothy Parker

వయసులో ఉన్నపుడు బలిష్ఠంగా, ధైర్యంగా ఉండేదాన్ని,

ఓహ్, ఆ రోజుల్లో … తప్పు తప్పే, ఒప్పు ఒప్పే!

నా రెక్కలు విప్పుకుని, నా జెండా ఎగురేసుకుంటూ

ప్రపంచంలోని అన్యాయాన్ని సరిదిద్దడానికి పరిగెత్తేను.

“ఒరేయ్ కుక్కల్లారా, దమ్ముంటే వచ్చి పోరాడండి!” అనేదాన్ని

అయ్యో చావడానికి ఒక్కబ్రతుకే ఉందని విలపించేదాన్ని.

ఇప్పుడు వయసు వాటారింది. మంచీ చెడూ

పిచ్చిగా ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయాయి.

ఇప్పుడు ప్రశాంతంగా కూచుని అంటుంటాను:

“ప్రపంచం తీరే అంత. దాన్ని అలా వదిలినవాడే ధన్యుడు.

ఒక యుద్ధం ఓడినా, మరొక యుద్ధం గెలిచినా,

బిడ్డా! రెండిటిమధ్యా తేడా …అతి స్వల్పం!”

జడత్వం నన్నావహించి సందేహాల్లో ముంచుతుంది.

దాన్నే తత్త్వచింతన అని పిలుస్తారు.

.

డొరతీ పార్కర్

22 August 1893 –  7 June  1967

అమెరికను కవయిత్రి

.

The Veteran

.

When I was young and bold and strong,

Oh, right was right, and wrong was wrong!

My plume on high, my flag unfurled,

I rode away to right the world.

“Come out, you dogs, and fight!” said I,

And wept there was but once to die.

But I am old; and good and bad

Are woven in a crazy plaid.

I sit and say, “The world is so;

And he is wise who lets it go.

A battle lost, a battle won–

The difference is small, my son.”

Inertia rides and riddles me;

The which is called Philosophy.

.

Dorothy Parker

August 22, 1893 – June 7, 1967

American Poet

Poem Courtesy: https://hellopoetry.com/dorothy-parker/

మగాళ్ళు… డొరతీ పార్కర్, అమెరికను కవయిత్రి

నువ్వు నీ వ్యక్తిత్వాన్ని ప్రదర్శించినందుకు

వాళ్ళు నిన్ను “వేగుచుక్క”వని పొగుడుతారు.

అదే సుకుమార భావనతో వాళ్ళని తిరిగి మన్నిస్తే

వాళ్ళు, నీ గురించి వేరే అర్థాలు తీస్తారు;

వాళ్లకి రూఢిగా, చింతలేని నీ పొందు దొరికిందా

వాళ్ళు నిన్ను అన్నిరకాలుగానూ మార్చడానికి ప్రయత్నిస్తారు.

నీ నడతమీద, అవేశాలమీదా ఆంక్షలు పెడతారు

వాళ్ళు నిన్ను నువ్వుకాని వేరే వ్యక్తిగా మార్చివేస్తారు.

నువ్వు నడిచేరీతిలో నిన్ను నడవనివ్వరు

వాళ్ళు తమప్రభావం చూపించి అన్నీ నేర్పుతారు.

వాళ్ళు పూర్వం పొగిడినవే, అయినా, అన్నీ మార్చెస్తారు.

ఇహ చెప్పకు! తల్చుకుంటే రోతపుడుతోంది. విసుగేస్తోంది.

.

డొరతీ పార్కర్

 (August 22, 1893 – June 7, 1967)

అమెరికను కవయిత్రి

 

Men

.

They hail you as their morning star

Because  you are the way you are.

If you return the sentiment,

They will try to make you different;

And once they have you, safe and sound,

They want to change you all around.

Your moods and ways they put curse on;

They’d make of you another person.

They cannot let you go your gait;

They influence and educate.

They’d alter all that they admired.

They make me sick. They make me tired.

.

Dorothy Parker

 (August 22, 1893 – June 7, 1967)

American Poet

 

 

 

స్త్రీ-పురుషుల మానసిక స్థితి… డొరతీ పార్కర్, అమెరికను

స్త్రీ ఒక పురుషుడినే భర్తగా కోరుకుంటుంది
మగవాడికి ఎప్పుడూ కొత్తదనం కావాలి.
స్త్రీకి ప్రేమే వెలుగూ, వెన్నెలా;
మగాడు సరదాలు తీర్చుకునే మార్గాలు వేవేలు
స్త్రీ తన భర్తతోనే జీవిస్తుంది
ఒకటినుండి పది లెక్కపెట్టు… మగాడికి విసుగేస్తుంది.
వెరసి, ఈ సారాంశము గ్రహించేక
ఇందులో ఇక ఏమి మంచి జరుగనుంది ?
.

డొరతీ పార్కర్

22nd Aug- 6 Jun 1967

అమెరికను కవయిత్రి

Image Courtesy: http://upload.wikimedia.org

.

General Review of the Sex Situation

.

Woman wants monogamy;

Man delights in novelty.

Love is woman’s moon and sun;

Man has other forms of fun.

Woman lives but in her lord;

Count to ten, and man is bored.

With this the gist and sum of it,

What earthly good can come of it?

.

Dorothy Parker

(22 Aug 1893 – 6 Jun 1967) 

American Poet

From: Enough Rope (1926)

Poem Courtesy: http://www.unive.it/media/allegato/download/Lingue/Materiale_didattico_Coslovi/0607_Lingua_inglese/Dorothy_Parker.pdf

పొద్దుపొడుపు వేళ… డొరతీ పార్కర్, అమెరికను కవయిత్రి

కొందరు మగాళ్ళు,
ఒక పుస్తకాల షాపుని
దాటి పోలేరు.
(ఓ ఇల్లాలా, మనసు రాయి చేసుకో, జీవితకాలం నిరీక్షించు)

కొందరు మగాళ్ళు
చెత్త ఆటలు
ఆడకుండా ఉండలేరు.
(“ఏదీ చీకటిపడే వేళకు రానూ?” అన్నాడు, అప్పుడే సూర్యోదయం కావస్తోంది)

కొందరు మగాళ్ళు
పానశాలను
దాటి రాలేరు.
(నిరీక్షించు, ఎదురుచూడు… చివరకు అదే మిగులుతుంది)

కొందరు మగాళ్ళు
అందమైన స్త్రీని
దాటి పోలేరు.
(భగవంతుడా! అలాంటి వాళ్ళని నాదగ్గరకు పంపకు)

కొందరు మగాళ్ళు
గాల్ఫ్ మైదానం
దాటి రాలేరు.
(పుస్తకం చదువు, కుట్టు కుట్టుకో…  వస్తే ఒక కునుకు తియ్యి)

కొందరు మగాళ్ళు
బట్టలకొట్టు
దాటి రాలేరు.
(నీ జీవితమంతా ఎవరో ఒక మగాడికోసం ఎదురుచూడ్డంతో సరిపోతుంది)
.
డొరతీ పార్కర్
22 August 1893 – 6 June 1967
అమెరికను కవయిత్రి

.

Image Courtesy: http://upload.wikimedia.org

.

Chant For Dark Hours

Some men, some men

Cannot pass a

Book shop.

(Lady, make your mind up, and wait your life away.)

Some men, some men

Cannot pass a

Crap game.

(He said he’d come at moonrise, and here’s another day!)

Some men, some men

Cannot pass a

Bar-room.

(Wait about, and hang about, and that’s the way it goes.)

Some men, some men

Cannot pass a

Woman.

(Heaven never send me another one of those!)

Some men, some men

Cannot pass a

Golf course.

(Read a book, and sew a seam, and slumber if you can.)

Some men, some men

Cannot pass a

Haberdasher’s.

(All your life you wait around for some damn man!)

.

Dorothy Parker

22 August 1893 – 6 June 1967

American

అర్థ రాత్రి… డొరతీ పార్కర్, అమెరికను కవయిత్రి

తారకలు పువ్వుల్లా మెత్తగానూ, అంత చేరికలోనూ ఉన్నాయి;

కొండలు నెమ్మదిగా వడికిన క్రీనీడల వలల్లా ఉన్నాయి;

ఇక్కడ ఆకునీ, గడ్డిపరకనీ విడిగా చూడలేము

అన్ని ఒకటిగా కలిసిపోయి ఉన్నాయి.

ఏ వెన్నెల తునకా గాలిని చొచ్చుకుని రాదు, ఒక నీలి

వెలుగు కిరణం బద్ధకంగా దొరలి అంతలో ఆరిపోయింది.

ఈ రాతిరి ఎక్కడా పదునైన వస్తువేదీ కనరాదు

ఒక్క నా గుండెలో తప్ప.

.

డొరతీ పార్కర్

ఆగష్టు 22, 1893 – జూన్ 7, 1967

అమెరికను కవయిత్రి

.

Image Courtesy: http://upload.wikimedia.org
Image Courtesy: http://upload.wikimedia.org

.

Midnight

The stars are soft as flowers, and as near;
The hills are webs of shadow, slowly spun,
No separate leaf or single blade is here
All blend to one.

No moonbeams cuts the air, a sapphire light
Rolls lazily and slips again to rest.
There is no edged thing in all this night,
Save in my breast.

.
Dorothy Parker
August 22, 1893 – June 7, 1967
American Poet, critic and short story writer

వెరసి… డొరతీ పార్కర్, అమెరికను కవయిత్రి

కత్తులు నొప్పెడతాయి

నదులు బాగా చలివేస్తాయి

ఏసిడ్ లు మరకలు వేస్తాయి

మందులకి ఒళ్ళు బిగుసుకుంటుంది

తుపాకులు చట్టవిరుద్ధం

ఉరితాళ్ళు తెగిపోవచ్చు

గేస్ భరించలేని వాసన

….

నువ్వు బతకడమే ఉత్తమం.
.
డొరతీ పార్కర్

August 22, 1893 – June 7, 1967

అమెరికను కవయిత్రి

Dorothy Parker

Resumé
.

Razors pain you;
Rivers are damp;
Acids stain you;
And drugs cause cramp.
Guns aren’t lawful;
Nooses give;
Gas smells awful;
You might as well live.
.
Dorothy Parker

August 22, 1893 – June 7, 1967

American Poetess

లక్షణాల ఏకరువు … డొరతీ పార్కర్, అమెరికను

నాకు నా మానసిక స్థితి నచ్చదు;
ఎప్పుడూ కఠినంగా, నిర్దయగా, చాడీలు చెబుతూ ఉంటాను.
నాకు నా కాళ్లు నచ్చవు, నా చేతులంటే  అసహ్యం,
నాకు చక్కని ప్రదేశాలకు వెళ్ళాలని ఉండదు.

నాకు ఒకేలా వెలుగుచిమ్మే ఉదయవేళ నచ్చదు;
నాకు రాత్రి పడుక్కోవాలంటే చికాకు.
సీదాసాదా అమాయకపు మనుషులంటే ముఖం చిట్లిస్తాను.
నేను చిన్నపాటి జోకు కూడా సహించలేను.

నాకు బొమ్మలువెయ్యడంలో, రాసుకోడంలో మనశ్శాంతి లేదు.
నా ప్రపంచం అంతా ఎందుకూ పనికిరానిది.
నా కలలన్నీ కరిగిపోయాయి; గుండె బండబారిపోయింది.
నా ఆలోచనలుగాని పసిగడితే, నన్ను జైల్లో పెడతారు.

నాకు ఏ అనారోగ్యం లేదు. అలాగని బాగోనూ లేను.
ఒకనాటి నా కలలన్నీ కల్లలైపోయాయి.
నా ఆత్మ చితికిపోయింది, నా ఉత్సాహం సన్నగిలింది.
ఇక ఏమాత్రం నన్ను నేను నచ్చుకోలేను
 
నేను తప్పులు వెతికి, తగవులాడుతూ, సణుగుతూ, ఆక్షేపిస్తుంటాను
ఇరుకుగా కనిపిస్తున్న ఇంటిగురించే ఆలోచిస్తుంటాను,
మొగాళ్ళ పేరెత్తితే చాలు నాకు హడలు పట్టుకుంటుంది…
అయినా, మళ్ళీ నేను ప్రేమలో పడే సమయం ఆసన్నమయింది.

.

డొరతీ పార్కర్

August 22, 1893 – June 7, 1967

అమెరికను కవయిత్రి

 

 

 

.

Image Courtesy: http://upload.wikimedia.org

Dorothy Parker

Image Courtesy: http://upload.wikimedia.org

Symptom Recital

.

I do not like my state of mind;

I’m bitter, querulous, unkind.

I hate my legs, I hate my hands,

I do not yearn for lovelier lands.

I dread the dawn’s recurrent light;

I hate to go to bed at night.

I snoot at simple, earnest folk.

I cannot take the gentlest joke.

I find no peace in paint or type.

My world is but a lot of tripe.

I’m disillusioned, empty-breasted.

For what I think, I’d be arrested.

I am not sick, I am not well.

My quondam dreams are shot to hell.

My soul is crushed, my spirit sore;

I do not like me any more.

I cavil, quarrel, grumble, grouse.

I ponder on the narrow house.

I shudder at the thought of men….

I’m due to fall in love again.

.

Dorothy Parker

August 22, 1893 – June 7, 1967

American

 

ప్రియురాలి స్మృతికి… డొరతీ పార్కర్, అమెరికను కవయిత్రి.

ఆమె జీవితం అంతా బంగారపు ఇసుకని

తెలివితక్కువగా చక్రాలుగా, ముగ్గులుగా

అరచేతి వేళ్లసందుల్లోచి జారనిస్తూ

ఇసుకకోటలు కట్టడానికే సరిపోయింది.

హరివిల్లులు ఒకదానివెనకఒకటివచ్చినట్టు

మంచిరోజులు కట్టగట్టుకుని వచ్చినా

వాటినన్నిటినీ ఆమె తృణప్రాయంగా విసిరేసింది

కుళ్ళు కాలవలో సుడులుతిరుగుతూ పోయేట్టు.

ఆమె కొరకు ఒక కొత్త గులాబీ మొగ్గని వదిలి

మీ మానాన్న మీరు వెళ్ళండి; జాలి పడొద్దు;

ఆమె హాయిగానే జీవించింది; ఆమెకి తెలుసు, తను

మట్టిలోకలిసినా, అదీ అందంగా ఉంటుందని.

.

డొరతీ పార్కర్.

August 22, 1893 – June 7, 1967

అమెరికను కవయిత్రి.

.

Image Courtesy: http://upload.wikimedia.org
Dorothy Parker                               Image Courtesy: http://upload.wikimedia.org

.

Epitaph for a Darling Lady

.

All her hours were yellow sands,

Blown in foolish whorls and tassels;

Slipping warmly through her hands;

Patted into little castles.

Shiny day on shiny day

Tumbled in a rainbow clutter,

As she flipped them all away,

Sent them spinning down the gutter.

Leave for her a red young rose,

Go your way, and save your pity;

She is happy, for she knows

That her dust is very pretty.

.

Dorothy Parker

August 22, 1893 – June 7, 1967

American Poetess

విచికిత్స .. డొరతీ పార్కర్, అమెరికను కవయిత్రి

నేనే మెత్తనిదాన్నై ఉండి,  అందంగా ఉండి

నా మనసు నీ పాదాలముందు పరిచితే;


నా మనసులోని ఆలోచనలన్నీ నీతో చెప్పుకుని


నువ్వు తేలికగా చెప్పే అబద్ధాలన్నీ నిజమని పొగిడితే;


“నిజం సుమీ” అని నెమ్మదిగా మనసులోనే అనుకుని


“ప్రియా! ఎంత నిజం చెప్పావు,” అని పదేపదే చెపుతూ;


సందర్భానికి తగ్గట్టు కళ్ళువాల్చుకుని


నీ నొసలుచిట్లింపులకు ముఖంపాలిపోయేలా భయపడుతూ,


నా మాటల్లో నిన్నెక్కడా ప్రశ్నించనంతవరకు


ప్రియతమా, అప్పుడు నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తావు.

అదే నేను బలహీనురాల్నై, పిచ్చి దానిలా

నా మనసు ప్రతి కుర్రాడితో పంచుకుంటే,


నువ్వు నా గడపదాటిన ప్రతిసారీ


అడుగుల్ని తలకద్దుకుంటే ఫర్వాలేదు;


కానీ, నేను నిను అనుమానించినా, నిను చీదరించుకున్నా,


“నీకో నమస్కారం” అని గట్టిగా అరిచి, నా కాళ్లమీద నిలబడినా


నీ ఆనందానికి విఘాతం కలిగించి, నమ్మకాన్ని వమ్ముచేసినా


బ్రతికుండగా నువ్వు నా వంక చూడవు.


.


డొరతీ పార్కర్

(August 22, 1893 – June 7, 1967)

అమెరికను

.

American writer Dorothy Parker (1893-1967)
American writer Dorothy Parker (1893-1967) (Photo credit: Wikipedia)

.

Dilemma

.

If I were mild, and I were sweet,
And laid my heart before your feet,
And took my dearest thoughts to you,
And hailed your easy lies as true;
Were I to murmur “Yes,” and then
“How true, my dear,” and “Yes,” again,
And wear my eyes discreetly down,
And tremble whitely at your frown,
And keep my words unquestioning
My love, you’d run like anything!

Should I be frail, and I be mad,
And share my heart with every lad,
But beat my head against the floor
What times you wandered past my door;
Were I to doubt, and I to sneer,
And shriek “Farewell!” and still be here,
And break your joy, and quench your trust
I should not see you for the dust!

.

Dorothy Parker

(August 22, 1893 – June 7, 1967)

American Poetess

చీకటిలో నామస్మరణ … డొరతీ పార్కర్, అమెరికను

కొందరు మగాళ్లు, అవును మగాళ్ళు

ఒక పుస్తకాలషాపును

దాటి రాలేరు.

(తల్లీ! ఇప్పుడే నిశ్చయించుకో, జీవితకాలం ఎదురుచూడడానికి) 

 

కొందరు మగాళ్ళు, అవును మగాళ్ళే

ఆ దిక్కుమాలిన ఆట

ఆడకుండా ఉండలేరు.

(ఏదీ, చీకటిపడేలోగా రానూ అన్నాడు, తేదీ మారిపోయింది)

 

కొందరు మగాళ్ళు, మ..గా..ళ్ళు

మధుశాలను

దాటి రాలేరు.

(నిరీక్షించు,  ప్రాధేయపడు, వాళ్లతత్త్వం మారదు.)

 

కొందరు పురుషులు, మహా పురుషులు

ఏ ఆడదాన్నైనా

చూడకుండా ఉండలేరు.

(భగవంతుడా! నాకు అటువంటివాణ్ణి భర్తగా చేయకు)

 

కొందరు మగరాయుళ్ళు, అవును రా…యుళ్ళు

గా…ల్ఫ్ మైదానాన్ని

దాటి రాలేరు.

(ఒక పుస్తకం పూర్తిచేసి, ఓ కుట్టు కుట్టుకుని, వీలయితే ఓ నిద్రకూడా తియ్యొచ్చు)

 

కొందరు మానవులు, అవును మానవులు

ఒక బట్టలషాపుని

దాటి రాలేరు.

(నీ జీవితకాలం అలాంటి మానవుడుకోసం ఎదురు చూడడమే!)

.

డొరతీ పార్కర్. 

August 22, 1893 – June 7, 1967

అమెరికను

.

American writer Dorothy Parker (1893-1967)
American writer Dorothy Parker (1893-1967) (Photo credit: Wikipedia)

.
Chant for Dark Hours

.

Some men, some men
Cannot pass a
Book shop.
(Lady, make your mind up, and wait your life away.)

Some men, some men
Cannot pass a
Crap game.
(He said he’d come at moonrise, and here’s another day!)

Some men, some men
Cannot pass a
Bar-room.
(Wait about, and hang about, and that’s the way it goes.)

Some men, some men
Cannot pass a
Woman.
(Heaven never send me another one of those!)

Some men, some men
Cannot pass a
Golf course.
 (Read a book, and sew a seam, and slumber if you can.)

Some men, some men
Cannot pass a
Haberdasher’s.
(All your life you wait around for some damn man!)

.
Dorothy Parker

August 22, 1893 – June 7, 1967

American Poet, Short story writer

%d bloggers like this: