అనువాదలహరి

పాఠకుడికి… డెనిస్ లెవర్టోవ్, బ్రిటిషు కవయిత్రి .

మీరు ఇది చదువుతుంటే, ధృవాలలో ఒక తెల్లని ఎలుగు
తెల్లని మంచుని కాషాయరంగులో ముంచుతూ
మూత్రాన్ని విసర్జిస్తుంది.

మీరిది చదువుతుంటే చాలామంది దేవతలు
వృక్షాలనల్లుకున్న లతలలో దాక్కుంటారు; గాజులామెరిసేకళ్లు
తరాల పచ్చని ఆకులని వీక్షిస్తుంటాయి.

మీరిది చదువుతుంటే
ఆ సముద్రం అలలు ఎగదోస్తుంటుంది
భీకరమైన తన అలల్ని
ఎగదోస్తుంటుంది.
.
డెనిస్ లెవర్టోవ్
(24 October 1923 – 20 December 1997)
బ్రిటిషు కవయిత్రి

 

Denise Levertov

British Poet

Photo Courtesy:

http://lithub.com/denise-levertov/

.

To the Reader

.

As you read, a white bear leisurely

 pees, dyeing the snow

 saffron,

 and as you read, many gods

 lie among lianas: eyes of obsidian

 are watching the generations of leaves,

 and as you read

 the sea is turning its dark pages,

 turning

 its dark pages.

.

Denise Levertov

(24 October 1923 – 20 December 1997)

British Poetess

poem Courtesy:

http://wonderingminstrels.blogspot.in/1999/09/to-reader-denise-levertov.html

ఏడం ఫిర్యాదు … డేనిస్ లెవెర్టోవ్, బ్రిటిష్ అమెరికను కవయిత్రి

కొంతమంది మనుషులకి

నువ్వు ఎన్ని ఇవ్వు; చాలదు.

ఇంకా కావాలనే అడుగుతుంటారు.

 

ఉప్పూ

పప్పూ

పంచభక్ష్య పరమాన్నాలు పెట్టినా

ఇంకా ఆకలే అంటారు.

 

పెళ్ళి చేసుకున్నా

పిల్లలని కన్నా

ఇంకా దేహీ అంటూనే ఉంటారు

 

అఖండభూదానం చెయ్యండి

వాళ్లకాళ్లకిందభూమినే వాళ్ళకి ఇచ్చెయ్యండి

అయినా ఛాలలేదని వీధినపడతారు.     

 

వాళ్ళకి లోతెరుగని నూతిని తవ్వించండి నీళ్ళకి

అయినా వాళ్ళకి దాని లోతు చాలదు

వాళ్ళు చంద్రుణ్ణికూడా తాగెయ్యాలి.

.

 

డెనిస్ లెవెర్టోవ్

(October 24, 1923 – December 20, 1997)

బ్రిటిష్ అమెరికను కవయిత్రి  

.

"I am Essex born.." the story of Den...
“I am Essex born..” the story of Denise Levertov (Photo credit: O.F.E.)

.

Adam’s Complaint

 

 

 Some people,

 no matter what you give them,

 still want the moon.

 

 The bread,

 the salt,

 white meat and dark,

 still hungry.

 

 The marriage bed

 and the cradle,

 still empty arms.

 

 You give them land,

 their own earth under their feet,

 still they take to the roads.

 

 And water: dig them the deepest well,

 still it’s not deep enough

 to drink the moon from.

 

.

Denise Levertov

(October 24, 1923 – December 20, 1997)
British-born American Poetess

For an excellent Bio visit:
http://www.poemhunter.com/denise-levertov/biography/

%d bloggers like this: