అనువాదలహరి

ప్రార్థన (మేఘాల వెనుకనున్న సూర్యుడికి)… పీట్ హీన్, డేనిష్ కవి, శాస్త్రజ్ఞుడు.

సమస్తసృష్టికీ ఆధారభూతమైన ఓ సూర్యుడా!

భూమిమీద అన్ని వస్తువులమీదా కిరణాలు ప్రసరించు.

 

నేను మరీ గొంతెమ్మకోరిక కోరుకుంటున్నాననిపిస్తే

కనీసం నా దేశపు నేలమీద ప్రసరించు.

 

నీకు అదికూడా అత్యాశగా కనిపిస్తే,

సరే, ఎలాగోలా, నా మీదైనా ప్రసరించు !

.

పీట్ హీన్

16 December 1905 – 17 April 1996

డేనిష్ శాస్త్రజ్ఞుడు

Prayer (to the sun above the clouds)

Sun that givest all things birth
Shine on everything on earth!

If that’s too much to demand
Shine at least on this our land

If even that’s too much for thee
Shine at any rate on me

Piet Hein
16 December 1905 – 17 April 1996
Danish Scientist, Poet, Mathematician, Inventor, designer.

Poem Courtesy:

http://wonderingminstrels.blogspot.com/2002/04/prayer-to-sun-above-clouds-piet-hein.html

 

సమస్య… పీట్ హెయిన్, డేనిష్ కవి

మనకు బాగా నచ్చిన ప్రణాళికలు

ఎందుకూ కొరగాకుండా పోతాయి

మనం నిర్మించుకున్న అత్యున్నత ఆశాసౌధాలు

కుప్పకూలిపోతాయి

ఎందుకంటే

ముందు ఎంతో చక్కగా గీసిన గీతల్ని

తర్వాత అంత చక్కగానూ

పొరపాటని సరిదిద్దుతాము

.

పీట్ హెయిన్, (కలం పేరు కుంబెల్ (సమాధిరాయి))

16 డిశంబరు 1905- 17 ఏప్రిల్ 1996

డేనిష్ కవి, రచయిత, శాస్త్రజ్ఞుడు, గణితవేత్త,

.

.

On Problems ( A Grook*)

.

Our choicest plans

have fallen through

our airiest castles

tumbled over

 

because of lines

we neatly drew

and later neatly

stumbled over.

.

Piet Hein

16 December 1905 – 17 April 1996

Danish scientist, mathematician, inventor, designer, author, and poet, often writing under the Old Norse pseudonym “Kumbel” meaning “tombstone”.

[Notes:

* Grook : A grook is a form of short aphoristic poem. It was invented by the Danish poet and scientist Piet Hein. He wrote over 7,000 of them, most in Danish or English, published in 20 volumes]

%d bloggers like this: