అనువాదలహరి

మరో చిత్రప్రదర్శనశాలకు మార్గసూచి …డేనా జోయ్ యె

ఇది విరిగిపోయిన అవయవాలుంచే గది.
ఇక్కడ దేవదూతల చేతుల చెంతనే
ముక్కలైన పాలరాతి క్రీడాకారుల విగ్రహాలున్నాయి.
ఇక్కడ ఏవీ బయటపారవేయబడవు.

ఈ తుమ్మెదలు వరుసలో పేర్చబడి ఉన్నాయి.
చిన్నగా, లోపలి పదార్ధం ఎంత రంగువెలిసి ఉన్నాయంటే
అవన్నీ ఒక్కలాగే కనిపిస్తున్నాయి. బహుశా, మృత్యువు
అన్నిజీవుల్లోనూ సారూప్యత తీసుకువస్తుందేమో!

మూడు వరుసలలో అజ్ఞాత వ్యక్తుల చిత్తరువులు
ఒకదానిమీద ఒకటి ఇక్కడ వేలాడదీసి ఉన్నాయి.
పాపం, పేరుకోసం తపించిన ప్రతి ఆత్మా
అనామకంగా ఇక్కడ చిరస్థాయిగా పడిఉండవలసిందే.

ఇక్కడ ఇవిగో ఎన్నడూ చదవని పుస్తకాల అలమరలు.
లక్షలకొద్దీ పేజీలు రంగువెలిసిపోయి ఉన్నాయి.
సందర్శకులందరూ వీటిని చూస్తూ పోతుంటారు
గాని, ఒక్కరూ ఒక పుస్తకమూ వెంట తీసుకుపోరు.

నేను మెరుగైన మార్గదర్శకుడినయితే బాగుండును.
మీరిక్కడ చూడవలసిన వెన్నో ఉన్నాయి.
ఉత్త ఖాళీ సీసాలు ఎన్నో వరుసల్లో ఉన్నాయో!
ప్రదర్శనలో తాళాలులేని కప్పలు అనేకం ఉన్నాయి.

మీకు చూడాలని ఉందా?  చూస్తే బాగుంటుంది.
ఈ గదిలో ఎంత ప్రశాంతత ఉంటుందో చెప్పలేను.
చూడండి అతి పురాతనమైన కర్రతో చేసిన ఆ పెట్టె
దానిమీద ఏమీ రాసి లేదు. అది మీ కోసమే.

.

డేనా జోయ్ యె

Born December 24, 1950

అమెరికను కవి.

.

Guide to the Other Gallery

.

This is the hall of broken limbs

Where splintered marble athletes lie

Beside the arms of cherubim.

Nothing is ever thrown away.

 

These butterflies are set in rows.

So small and gray inside their case

They look alike now.  I suppose

Death makes most creatures commonplace.

 

These portraits here of the unknown

Are hung three high, frame piled on frame.

Each potent soul who craved renown,

Immortalized without a name.

 

Here are the shelves of unread books,

Millions of pages turning brown.

Visitors wander through the stacks,

But no one ever takes one down.

 

I wish I were a better guide.

There’s so much more that you should see.

Rows of bottles with nothing inside.

Displays of locks which have no key.

 

You’d like to go?  I wish you could.

This room has such a peaceful view.

Look at that case of antique wood

Without a label.  It’s for you.

.

Dana Gioia

Born December 24, 1950

American

Poem Courtesy: http://www.poemtree.com/poems/GuideToTheOtherGallery.htm 

 

ఆగష్టులో కాలిఫోర్నియా కొండలు… డేనా జోయ్ యె, అమెరికను కవి

మంచి ఎండవేళ ఎవరైనా ఈ కొండల్ని ఎక్కుతూ
కాలిక్రింద నలుగుతున్న కలుపుమొక్కల్నీ,
ధూళినీ తిట్టుకుంటూ చిరాకుపడుతున్నారంటే,
నీడనివ్వడానికి మరినాలుగు చెట్లుంటే బాగుణ్ణని
కోరుకుంటారంటే నేను అర్థం చేసుకోగలను.

ముఖ్యంగా తూరుపువైపు వాళ్ళు
వేసవిలో పల్చబడిపోయిన ప్రకృతినీ
ఎండి వంకరతిరిగిన నల్ల ఎల్మ్ చెట్లూ, ఓక్ పొదలూ
తుప్పలతో ఆగష్టునెలకే హరించుకుపోయిన
హరితాన్ని చూసి అసహ్యించుకుంటారు

ఒంటికీ, బట్టలకీ తగులుకొంటున్న
ముళ్ళ చెట్లూ, పొదలూ, ఏట్రింతలూ తప్పించుకు
నడిచే వాళ్ళకి, అవి కలుపుమొక్కలే అని తెలిసినా
ఈ మొక్కలకీ, అక్కడక్కడ కనిపించే ఎండుతుప్పలకీ
ఇంకా జీవం మిగిలి ఉందంటే నమ్మశక్యం కాదు.

వాళ్ళు ఎక్కడా కదలిక గాని, గాలి రివటగానీ లేక
నిశ్చలంగా ఉన్న మిరిమిట్లుగొలిపే ఎండని చూస్తే చిరాకుపడతారు;
తోడుగా మరొక్కటే ప్రాణి కనిపిస్తుంది:
ఎరకోసం వెతుకుతూ, దినకరుడి ప్రతాపంతో
రగిలిపోతున్న వినీలాకాశంలో ఎగురుతున్న డేగ.

ఐనప్పటికీ, వర్షాభావపు ప్రకృతిలో పుట్టి పెరిగినవారికి
నింగిని తాకుతున్న కొండలవరుసను చూడడానికి
వేళ్ళమీద లెక్కపెట్టగలచెట్లూ, గడ్డీతప్ప
ఏ అడ్డూ లేకుండా నిర్మలమైన ఆకాశమూ,
వర్షంకోసం ఎదురుచూపూ ఎంత బాగుంటాయి.
.

డేనా జోయ్ యె

Born December 24, 1950

అమెరికను కవి.

Dana Gioia

Photo Courtesy: Wikipedia

.

California Hills in August

I can imagine someone who found

these fields unbearable, who climbed

the hillside in the heat, cursing the dust,

cracking the brittle weeds underfoot,

wishing a few more trees for shade.

An Easterner especially, who would scorn

the meagerness of summer, the dry

twisted shapes of black elm,

scrub oak, and chaparral, a landscape

August has already drained of green.

One who would hurry over the clinging

thistle, foxtail, golden poppy,

knowing everything was just a weed,

unable to conceive that these trees

and sparse brown bushes were alive.

And hate the bright stillness of the noon

without wind, without motion.

the only other living thing

a hawk, hungry for prey, suspended

in the blinding, sunlit blue.

And yet how gentle it seems to someone

raised in a landscape short of rain—

the skyline of a hill broken by no more

trees than one can count, the grass,

the empty sky, the wish for water.

.

Dana Gioia

Born December 24, 1950

American Poet

Poem Courtesy:

http://www.poemtree.com/poems/CaliforniaHillsInAugust.htm

%d bloggers like this: