Tag: Czeslaw Milosz
-
మరపు… చెస్లావ్ మిహోష్, పోలిష్ అమెరికను కవి
నువ్వు ఇతరులకి కలిగించిన బాధను మరిచిపో ఇతరులు నీకు కలిగించిన బాధనుకూడా మరిచిపో సెలయేళ్ళూ, నదులూ ప్రవహిస్తూనే ఉంటాయి వాటితుంపరలమెరుపులు మెరిసిమాయమౌతాయి నువ్వు నడుస్తున్న నేల నువ్వు మరిచిపోతావు. ఒకోసారి ఏ దూరతీరాన్నుండో పాట ఒకటి వినిపిస్తుంది దానర్థం ఏమిటి, ఎవరుపాడుతున్నారు? అని నిన్నునువ్వు ప్రశ్నించుకుంటావు. బాలభానుడు, మధ్యాహ్నమయేసరికి నిప్పులుకురుస్తుంటాడు నీకు మనవలూ మునిమనవలూకూడా పుడతారు. మళ్ళీ నిన్ను చెయ్యిపట్టుకుని ఎవరో ఒకరు నడిపిస్తారు. నదులపేర్లు నీకు గుర్తుండిపోతాయి. ఎంత నిరంతరాయంగా పారుతున్నట్టు కనిపించేవని! నీ భూములుమాత్రం […]
-
నిరంకుశుడు… చెస్లా మీవోష్, పోలిష్ కవి
[ప్రజల్ని ఎంత అణగదొక్కినప్పటికీ, దయారహితమైన మితిలేని ద్వేషం మనుషుల మనసుల్నీ, జీవనస్ఫూర్తినీ చిదిమెయ్యలేరు. చెస్లావ్ మీహోష్ ప్రత్యక్షంగా అటువంటిది అనుభవించినవాడు. 1951లో దేశాన్ని విడిచి ముందు ఫ్రాన్సుకీ తర్వాత అమెరికాకీ వెళ్ళకముందు రెండవ ప్రపంచ సంగ్రామ కాలంలో వార్సవాలో పోలిష్ ప్రతిఘటన ఉద్యమం లో పనిచేశాడు. ] *** దురాక్రమణకీ, సర్వభక్షణకీ మారుపేరు నువ్వు అల్లకల్లోలంచేసి, ఆవేశాలు రెచ్చగొట్టి కుళ్ళిపోయావు నువ్వు. నువ్వు వివేకుల్నీ, ప్రవక్తల్నీ, నేరగాళ్ళనీ, కార్యశూరుల్నీ ఒకేగాటకట్టి, నజ్జునజ్జు చేస్తావు. నేను నిన్ను సంభోదించడం […]
-
కన్నులు… చెస్లా మీవోష్, పోలిష్ కవి
ఘనమైన నా కనులారా, మీరు అంత కుశలంగా ఉన్నట్టు లేదు, మీదగ్గరనుండి నాకు వస్తున్న ఆకారాలు అంత నిశితంగా ఉండడంలేదు, రంగుబొమ్మలయితే, మరీను , మసకగా అలికినట్లుంటున్నాయి. ఒకప్పుడు మీరు రాజుగారు వేటకి తీసుకెళ్ళే వేటకుక్కల్లా ఉండేవారు, మీతో నేను ప్రతిరోజూ ఉదయాన్నే షికారుకి వేళ్ళేవాడిని. అద్భుతమైన చురుకుదనం కల నా కనులారా! మీరు చాలా విషయాలు చూసేరు, నగరాలూ, ప్రదేశాలూ, దీవులూ, మహాసముద్రాలు. అప్పుడే కరుగుతున్న మంచు జాడల్లో స్వచ్చమైన చిరుగాలి మనని పరుగులుతీయిస్తుంటే జతగా మనం […]
-
కళ్ళు… చెస్లా మీవోష్, పోలిష్ కవి
చక్కని నా కనులారా, ఒకప్పుడున్న నిపుణత మీలో లేదు మునపంటి కంటే వస్తువుల స్పష్టత వాసి తగ్గింది, అవే రంగువయితే, మసక మసకగా ఉన్నాయి, ఒకప్పుడు మీరు రాజుగారి వేటకుక్కల్లా చూసేవారు అప్పుడు నేను ఉదయాన్నే మీతో వ్యాహ్యాళికి వెళ్ళేవాడిని చురుకైన నా చూపులారా మీరు చాలా వస్తువుల్ని చూశారు: నేలలూ, నగరాలూ, ద్వీపాలూ, మహా సముద్రాలూ మనం జోడుగా అద్భుతమైన సూర్యోదయాల్ని చూసేము అప్పుడే కురిసిన మంచు గట్టిపడుతున్నవేళల్లో చిరుగాలి అడుగుజాడల్లో మనం పరిగెత్తాము. అప్పుడు […]
-
ఇమడలేనితనం… చెస్లా మీవోష్, పోలిష్ కవి
. నేను స్వర్గంలో తప్ప ఇంకెక్కడా బ్రతకలేను. అది కేవలం నా జన్యువుల్లో ఉన్న బలహీనత. అంతే! ఈ భూమ్మీద గులాబిముల్లు గుచ్చుకున్న ప్రతిసారీ పుండయింది. సూర్యుడిని మేఘాలుకమ్ముకున్నప్పుడల్లా, నేను బాధపడ్డాను. ఉదయంనుండి సాయంత్రం దాకా మిగతావాళ్ళలా పనిచేస్తున్నట్టు నటిస్తాను కాని అగోచరమైన దేశాలకి అంకితమై, నా మనసు ఇక్కడ ఉండదు. మనః శాంతికి ఊర్లోని ఉద్యానాలకి పోతాను అక్కడున్న చెట్లూ పూలూ ఉన్నవి ఉన్నట్టు పరిశీలిద్దామని, కానీ, అవి నా చెయ్యి తగలగానే, నందనోద్యానాలైపోతాయి. నా […]