అనువాదలహరి

నేను నేనే… షున్ తారో తనికావా, జపనీస్ కవి

నే నెవరో నాకు తెలుసు
ఇప్పుడిక్కడున్నాను
నేను మరుక్షణంలో మాయమవొచ్చు
నేనిక్కడ మరి ఉండకపోయినా నేను నేనే
నిజం చెప్పొద్దూ, నేను నేనుగా ఉండక్కర్లేదు.

నేనో మొక్కని, కొంతవరకు
నేను చేపనుకూడా … చాలవరకు
నేనో కాంతిహీనమైన ఖనిజాన్ని…
దానిపేరైతే నాకు తెలియదుగాని.
ఆమాటకొస్తే, నేను అచ్చం మీలా ఉంటాను.

నన్ను మరిచిపోయినంతమాత్రంచేత పోలేను గనుక
నేను నాలుకమీద ఆదే పల్లవిలోని లయని
నేను సూక్ష్మమైన కెరటాన్నీ, కణాన్నీ కూడా
ఎలాగూ వచ్చేను గనుక, గర్వంగా చెప్పాలంటే,
కొన్ని కాంతి సంవత్సరాల దూరం నుండి
మీ గుండె లయమీద నాట్యం చేస్తున్నాను.

నేనెవరినో నాకు తెలుసు
కనుక మీరెవరోకూడా నాకు తెలుసు
మీ పేరేమిటో నాకు తెలియకపోయినా.
ఇక్కడ ఏ జనాభా లెక్కల వివరాలు లేకపోయినా
నేను సరిగ్గా మీమీదకే వాలుతున్నాను.

వర్షంలో తడిసినందుకు ఆనందిస్తున్నాను
చుక్కల ఆకాశంలో ఇంట్లో ఉన్నంతసుఖంగా ఉంది
మొరటు హాస్యపు మాటలకు పగలబడి నవ్వుతూ
నేను నేనే,
“నేను నే”నన్న పునరుక్తికి అతీతంగా.
.
షున్ తారో తనికావా
జపనీస్ కవి

Courtesy: Wikipedia.org
Courtesy:
Wikipedia.org

I AM ME, MYSELF

I know who I am

I am here now

but I may be gone in an instant

even if I am no longer here I am me, myself

but in truth I do not have to be me

I am a plant at least a little

I may be a fish more or less

I am also an ore with a dull sheen

though I don’t know its name

and of course I am almost you

Because I cannot disappear after being forgotten

I am a rhythm in a refrain

I am a subtle wave and a particle

having arrived, if I may be so conceited,

riding on your heart’s beating rhythm

from the light years of distance

I know who I am

so I know who you are

even if I don’t know your name

even if there is no census record

I am crowding out into you

Feeling happy being wet in rain

feeling at home with the starry sky

cackling at crude jokes

I am me

beyond the tautology of “I am me”

.

Shuntaro Tanikawa

Contemporary Japanese Poet

 

Poem Courtesy:

http://www.poetryinternationalweb.net/pi/site/poem/item/21408/auto/0/from-I-Myself-I-AM-ME-MYSELF

A Poem that’s not a Poem… Arudra

Tolerance of Truth (?)

.

Slogans are not religion

There is no more welfare in morals

What the people in power parrot to people like you and me

damn them, they reck not their own reed.

Who do you think rejoice

When you and I die?

Only the politicians who incite us.

Corrupted are the old morals…

They can no longer protect the current generation.

Oldies can’t read

The contemporary cues.

If you and I were to write the history of flowers,

There won’t be spines and sabres, but

They won’t alow us to write.

They don’t let truth to spin or weave.

Truth is always antagonistic to the Rulers.

.

1974

Arudra

(31 August 1925 – 4 June 1998)

(Bhagavatula Sadasiva Sastry, more popular by his pen name Arudra, is a well-known poet, and a literary Historian)

.

పద్యం కాని పద్యం… ఆరుద్ర

.

నినాదాలు మతం కాదు

నీతిలోన హితం లేదు

నీ కోసం నా కోసం

నేతలు చెప్పే మాటలు

అన్నా, అన్నన్నా, వాళ్ళు అనుసరించరు.

నువ్వూ నేనూ ఛస్తే

నవ్వుకొనేది ఎవరంటావ్?

నిన్నూ నన్నూ పురిగొల్పే నేతలు మాత్రమే.

పాతవి చివికిన నీతులు

ఈ తరాన్ని కాపాడవు.

నూతన సంకేతాలను

తాతలు గుర్తించ లేరు.

నువ్వూ నేనూ వ్రాస్తే

పువ్వుల చరిత్రలో  ముళ్ళుండవు, కత్తులుండవు.

నిన్నూ నన్నూ రాయనివ్వరు.

నిజం పేననివ్వరు, నేయనివ్వరు

నిజం నేతకు శత్రువు

.

1974

ఆరుద్ర

(భాగవతుల సదాశివ శంకర శాస్త్రి)

(31 August 1925 – 4 June 1998)

(Courtesy: http://www.bhuvanavijayam.blogspot.com)

(రామలక్ష్మీఆరుద్రగారికి క్షమాపణలతో, అనుమతి తీసుకోనందుకు.)

%d bloggers like this: