నా శ్రీమతికి… కాన్రాడ్ ఐకెన్,అమెరికను
ఈ సంగీతంలోగల ఆపాత మధురిమా
అందమైన వస్తువులపట్ల కలిగే ఆపేక్షా,
చీకటిలో చుక్కలనిచూడాలన్న తహతహ
నీరసించిన రెక్కలల్లాడించాలన్న ఆరాటమూ
వెలుగులకెగబ్రాకాలని గులాబి పడే తపనా
నల్లని మట్టిబెడ్డ హృదయపూర్వకమైన చిరునవ్వూ
వెన్నెలపట్ల సముద్రానికుండే అలవిమాలిన ప్రేమా
మంచిదనంనుండి దేవునివరకూ అన్నిటిపైగల మక్కువా
సుందరమైన అన్ని వస్తువులూ, ప్రేమికుని చూపుల్లా
కనులలో ఆర్ద్రతతో అందాన్ని తిలకించగలిగే సర్వమూ…
నీకే అంకితం; ఓ వెలుగురేకా!అవి నువ్వు అందించినవే;
ఈ తారలన్నీ నీకే; ఈ ఆకాశం నువ్వు ప్రసాదించినదే!
.
కాన్రాడ్ ఐకెన్
(August 5, 1889 – August 17, 1973)
అమెరికను కవి
.
To My Wife
Whatever loveliness is in this music,
Whatever yearning after lovely things,–
Whatever crying after stars, in darkness,
Whatever beating of impeded wings:
Whatever climbing of the rose to sunlight,
Sweet-hearted laugh from the dark blind sod:
Whatever madness of the sea for moonlight,
Whatever yearning of the good to God:
All that is beautiful, and all that looks on beauty
With eyes filled with fire, like a lover’s eyes:
All of this is yours; you gave it to me, sunlight!
All these stars are yours; you gave them to me, skies!
.
Conrad Aiken
(August 5, 1889 – August 17, 1973)
American
Poem Courtesy:
http://www.blackcatpoems.com/a/to_my_wife.html
రెస్టారెంటులోని సంగీతం… కాన్రాడ్ ఐకెన్, అమెరికను కవి
సిగరెట్టు పొగ పల్టీలు కొడుతూ మనమీదనుండి జారుకుంటుంది
వెయిటర్ కదలికలకి అనుగుణంగా క్రిందకి జారి సుళ్ళుతిరుగుతూ.
నువ్వొక అగ్గిపుల్ల వెలిగించి మంటవైపు తదేకంగా చూస్తావు.
ఆ చిన్ని వెలుగు నీ కళ్ళలో ఒక క్షణంసేపు కదలాడి
ఎంత నిశ్శబ్దంగా వచ్చిందో అంత నిశ్శబ్దంగానూ ఆరిపోతుంది.
ఈ స్వరమాధురి వెనుక కొన్ని గొంతులున్నాయని నువ్వంటావు…
వాళ్ళు జలకన్యల్లా ఏ నదిలోంచో అవతరించి, పాడుతూ,
వాళ్ళ వెన్నెల వదనాల్ని ఎత్తి చూపి, చీకటిలోకి మునిగిపోతారు.
నువ్వెక్కడికి వెళితే అక్కడికి ఈ నదిని నీతో మోసుకుపోతావు:
ఒక ఆకు రాలుతుంది; కొట్టుకుపోతుంది, మనసు ఎక్కడో కలుక్కుమంటుంది.
అని అంటుంది ఈ రాగం నీతో… మరి నా మాట ఏమిటి?
అతను అలా కాఫీ పోస్తుంటే ఈ వెయిటర్ తో ఏమంటుంది?
వాయులీనం మీద కమాను మనోజ్ఞంగా నడిపే వాద్యకారుడితో?
కాగితాలు మడతపెట్టే వ్యక్తి, దానిని యాదృచ్చికంగా వింటాడు.
కొన్ని వేల కలలు రేగి, ఎగసిపడి ప్రవహిస్తాయి…
అక్కడ ఎవరో ఒక కన్నియ పాలరాతి మెట్లదారిని
గులాబులు ముంచెత్తిన సమాధివైపు వెళ్ళడం చూస్తారు:
చివరినిముషంలో ఆమె తన జ్ఞాపకాలు నిండిన కనులు పైకెత్తుతుంది.
సుడిగాలికి పచ్చని ఆకులు చెల్లాచెదరౌతాయి, ఆ ప్రదేశమంతా
నీడలు ముసురుకుంటాయి, ఆకసంలో చాలసేపు ఉరుములు ఉరుముతాయి;
మోడులై నగ్నంగా నిలిచిన ఓక్ చెట్లు, మెరుపులకు పొగలుకక్కుతాయి;
ఉన్నతమైన పర్వత సానువుల్లో మేఘాలు పీలికలైపోతాయి,
మహాసముద్రం ఒకసారి తన కెరటాల గోడలు విదిలిస్తుంది,
ఒక్కసారి నిశ్శబ్దం కమ్ముకుంటుంది…. చాల నిశ్శబ్ద విరామం పిదప
ఈ సంగీతం మరొకసారి అందుకుంటుంది:
తుదలులేని ఆ మెట్లపరంపరపై మునపటిలా ఆమె మరొకసారి సాగిపోతుంది.
అని చెబుతుంది అతనికి ఈ స్వరవిన్యాసం… మరి నా సంగతేమిటి?
నాకు సాక్షాత్కరించే ప్రపంచాలేమిటి?
ఏ అద్భుత దృశ్యాలు, ఏ భయానక స్వప్నాలు కనుగొంటాను?
నేను ఎవరికంటా పడకుండా, గుప్తమార్గాల్లో పయనించాలి.
నాకు ఆదేశించిన కార్యం కనిపించినంత సుళువు కాదు.
.
కాన్రాడ్ ఐకెన్
August 5, 1889 – August 17, 1973
అమెరికను కవి
(Note: ఈ కవితలో ‘మెట్లు ‘అన్నపదం జాగ్రత్తగా గమనించండి)
.
Melody In A Restaurant
.
The cigarette smoke loops and slides above us,
Dipping and swirling as the waiter passes.
You strike a match and stare upon the flame.
The tiny firelight leaps in your eyes a moment
And dies away as silently as it came.
This melody, you say, has certain voices—
They rise like nereids from a river, singing,
Lift white faces, and dive to darkness again.
Wherever you go you bear this river with you:
A leaf falls, and it flows, and you have pain.
So says the tune to you—but what to me?
What to the waiter, as he pours your coffee?
The violinist who suavely draws his bow?
The man, who folds his paper, overhears it.
A thousand dreams revolve and fall and flow.
Someone there is who sees a virgin stepping
Down marble stairs to a deep tomb of roses:
At the last moment she lifts remembering eyes.
Green leaves blown down; the place is checked with shadows;
A long-drawn murmur of rain goes down the skies.
And oaks are stripped and bare, and smoke with lightning;
And clouds are blown and torn upon high forests;
And the great sea shakes its walls,
And then falls silence…And through a long silence falls
This melody once more:
Down endless stairs she goes, as once before.
So says the tune to him- but what to me?
What are the worlds I see?
What shapes fantastic, terrible dreams?
I go my secret way, down secret alleys.
My errand is not so simple as it seems.
.
Conrad Aiken.
August 5, 1889 – August 17, 1973
American Poet
Poem Courtesy:
Poetry August 1919
http://www.poetryfoundation.org/poetrymagazine/browse?volume=14&issue=5&page=3
పాపం! క్లియోపాత్రా!… కాన్రాడ్ ఐకెన్, అమెరికను కవి
అతి నేర్పుగల చేతులు పూతపూసి పదిలపరచగా
పాపం! జడమైన క్లియోపాత్రా గాజు గాజు పెట్టెలో నిద్రిస్తోంది.
ఆమె మెడకి వాళ్ళొక మేలిమి కంఠహారం తగిలించేరు
ఆమె పాద రక్షలు, ఎడారిలో అరిగిపోయాయని ప్రతీతి.
వాడి చూపులుగల ఈ దక్షిణాది యువరాణి
క్లియోపాత్రా ఒకప్పుడు ఈజిప్టులో గొప్ప మన్ననలందుకుంది
ఇప్పుడు ఆమె బాగా ముసలిదై, శుష్కించి, కళతప్పింది,
ఆమె నోరు ఇప్పుడు నల్లని తారుతో మూసీసేరు.
సమాధుల దొంగలు ఆమె చేతులనుండి బంగారు ఉంగరాలు లాగేసేరు.
ఆమె గుండెపై పవిత్రచిహ్నాలున్నా లక్ష్యపెట్టలేదు;
ఆమె మీద నిశ్శబ్దంగా స్వేచ్ఛగా తిరుగాడిన గబ్బిలాలని తరిమేసేరు
పాపం! ఆమెకు నిజంగా విశ్రాంతి లభించి ఎన్నేళ్ళయి ఉంటుందో!
కాలాన్ని ఎదిరించి పదిలపరచడానికి ఆమె శరీరానికి అంతగా
లేపనాలు పూసి, అందవికారంగా భద్రపరచి ఉండకపోతే బాగుణ్ణు కదా!
దాన్ని ముందుగా ఊహించి ఉంటే, ఆమె ప్రేమికుడు ఏమని ఉండేవాడు?
ఆనందంలో మునకలేసేవాడా? లేక, కన్నీళ్ళలోనా ?
పచ్చని గడ్డి పరకలు మొలిపింఛే చక్కని నా నేలతల్లీ!
నేనూ, నా ప్రియాతి ప్రియతమా మరణించిన తర్వాత,
మమ్మల్ని పూర్తిగా హత్తుకుని శాశ్వతమైన ఊరటనివ్వు,
ఆకాశమంత ఎత్తుగా గడ్డి పూలూ, పరకలూ మొలిపిస్తూ!
.
కాన్రాడ్ ఐకెన్
August 5, 1889 – August 17, 1973
అమెరికను కవి.
.
.
Dead Cleopatra
.
Dead Cleopatra lies in a crystal casket,
Wrapped and spiced by the cunningest of hands.
Around her neck they have put a golden necklace
Her tatbebs, it is said, are worn with sands.
Dead Cleopatra was once revered in Egypt—
Warm-eyed she was, this princess of the south.
Now she is very old and dry and faded,
With black bitumen they have sealed up her mouth.
Grave-robbers pulled the gold rings from her fingers,
Despite the holy symbols across her breast;
They scared the bats that quietly whirled above her.
Poor lady! She would have been long since at rest
If she had not been wrapped and spiced so shrewdly,
Preserved, obscene, to mock black flights of years.
What would her lover have said, had he foreseen it?
Had he been moved to ecstasy, or tears?
O sweet clean earth from whom the green blade cometh!—
When we are dead, my best-beloved and I,
Close well above us that we may rest forever,
Sending up grass and blossoms to the sky.
.
Conrad Aiken
August 5, 1889 – August 17, 1973
American Poet and Novelist
The New Poetry: An Anthology. 1917.
Ed. Harriet Monroe,. (1860–1936).
సంగతులు 18- కాన్రాడ్ ఐకెన్, అమెరికను కవి
సూర్యుడు పసిడికిరణాలని వడకడుతున్నాడు
సూర్యుడు నిశ్శబ్దాన్ని కూడా వడకడుతున్నాడు.
ఆకాశంలో మేఘాలు మిరిమిట్లుగొలుపుతున్నాయి.
తెమ్మెర వీస్తున్న పూదోటలో నడుస్తున్నాను
ఎండిపోయిన పండుటాకులను కాళ్లతో తొక్కుకుంటూ…
పాలరాతి పలకమీద ఆకులు చెల్లాచెదరుగా పడి ఉన్నాయి
దాని మీద ప్రేమికులు మౌనంగా కూచున్నారు;
ఆకులు ఖాళీ బల్లమీద చెదురుమదురుగా పడి ఉన్నై.
అదిగో అక్కడి తేటనీటికొలను, వణుకుతున్నట్టు,
సూర్యుడి వేడి కిరణాల్ని అలలతో జాడిస్తోంది.
దూరాన పొడవాటి ఒంటరి చెట్టు, అసహనంగా
ఆకాశంక్రింద ఎండలో ఊగుతోంది.
ప్రియతమా! నేను ఒంటరిగా నడుస్తున్నాను.
నా పాటతో స్వరం కలిపే ఈ కల ఏమిటి?
ఎప్పుడూ వెలుగులోనే ఎందుకు పాడుతుంది ?
ఇసుకమేటల మధ్యన అదిగో
ఆకాశం తెరలుతెరలుగా కనిపిసోంది.
వెలుగుచారలు పడ్డ నీలి కెరటాలు
నిప్పులా ఇసుకమేటల్లో చొచ్చి చప్పుడుచేస్తున్నాయి.
నురగలను తాకుతూ దిగంతాలకెగరడానికి
సీ-గల్ తన రెక్కలు బార్లాజాపింది,
దానితోపాటే ఒక నీలినీడకూడా వ్యాపింపజేస్తూ.
సీ గల్ తన రెక్కలు ముడుచుకుంటోంది
గాలిలో ఒకొక్క ఎత్తూ క్రిందికి దిగడానికి
ఎక్కడచూసినా ఆకాశమే కనిపిస్తోంది దానికి.
.
కాన్రాడ్ ఐకెన్
August 5, 1889 – August 17, 1973
అమెరికను కవి
.
.
Variations XVIII
.
The sun distills a golden light,
The sun distills a silence.
White clouds dazzle across the sky:
I walk in the blowing garden
Breaking the gay leaves under my feet …
Leaves have littered the marble seat
Where the lovers sat in silence:
Leaves have littered the empty seat.
Down there the blue pool, quiveringly,
Ripples the fire of the sun;
Down there the tall tree, restlessly,
Shivers beneath the sun.
Beloved, I walk alone …
What dream is this that sings with me,
Always in sunlight sings with me?
Out there the blue sea, glimmeringly,
Ripples among the dunes.
Blue waves streaked and chained with fire
Rustle among the dunes.
The sea-gull spreads his wings
Dizzily over the foam to skim,
And an azure shadow speeds with him.
The sea-gull folds his wings
To fall from depth to depth of air
And finds sky everywhere.
.
Conrad Aiken
August 5, 1889 – August 17, 1973
American Poet
(స్వర) సంగతులు- 1… కాన్రాడ్ ఐకెన్, అమెరికను
నెలఱేడు తెలినీలి వెన్నెల కురిపిస్తునాడు
నలుదిక్కులా నీరవము అలముకుంటోంది .
కరిమబ్బులు చుక్కల్ని మరుగుచేస్తూ కమ్ముకుంటున్నై
నిర్మానుష్యమైన ఈ ఉద్యానంలో
ఎండుటాకులను కాళ్ళక్రింద తొక్కుతూ నడుస్తున్నాను
ప్రేమికులు మౌనంగా కూచున్న ఈ పాలరాతి పలకపై
ఆకులు చెల్లాచెదరుగా పడి ఉన్నాయి.
ఖాళీ పలకలమీద ఎండుటాకులు పేరుకున్నాయి
క్రింద మురికిగుంటలోని నీరు, వణుకుతున్నట్టు
చంద్రుణ్ణి అలలపై తేలియాడిస్తోంది.
అల్లంతదూరంలో పొడుగాటి చెట్లు
చందమామక్రింద అసహనంగా కదులుతున్నాయి.
ప్రేయసీ! నేను ఒంటరిగా నడుస్తున్నాను…
నాతో పాటే ఎప్పుడూ నడిచే ఈ అస్పష్ట ఆకారం ఏమిటి?
ఎప్పుడూ చీకట్లో తోడుగా నడిచే ఆకారం ఏమిటి?
.
కాన్రాడ్ ఐకెన్
(August 5, 1889 – August 17, 1973)
అమెరికను .
.
Conrad Aiken
.
The moon distills a soft blue light,
The moon distills silence.
Black clouds huddle across the stars;
I walk in deserted gardens
Breaking the dry leaves under my feet …
Leaves have littered the marble seat
Where the lovers sat in silence …
Leaves have littered the empty seat …
Down there the black pool, quiveringly,
Ripples the floating moon …
Down there the tall trees, restlessly,
Shake beneath the moon …
Beloved, I walk alone …
What ghost is this that walks with me,
Always in darkness walks with me?
.
Conrad Aiken
(August 5, 1889 – August 17, 1973)
American Poet, Novelist, Playwright and Short Story writer.
Poem Courtesy: http://www.blackcatpoems.com/a/variations_i.html#AlFyQM5xKdJm2EqV.99
All Lovely Things … Conrad Aiken, American
అందమైన వస్తువులన్నిటికీ ఓ ముగింపు ఉంటుంది
ఎంత సుకుమారమైన వస్తువైనా ఓ రోజు వాడి, రాలిపోతుంది
ఈ రోజు అంత ధైర్యంగా ఖర్చుపెడుతున్న యువత,
రేపు ఒక్కొక్క పెన్నీని అడుక్కోవలసి వస్తుంది.
ఎంత అద్భుత సౌందర్యరాశులనైనా మరిచిపోతారు
ఎంత రారాజులైనా మరణించి మట్టిలో కలవాల్సిందే.
ఇంత మిసమిసలాడే శరీరమూ,పువ్వులూ,మురిగిపోవలసిందే
ఎంత మేధావి శిరసైనా సాలీడు గూడుకి నెలవుకావలసిందే.
ఒక్క సారి తిరిగా యవ్వనమా! ఓ ప్రియతమా, ఒక్కసారి!
కాలం ఏమాత్రం పట్టించుకోకుండా సాగిపోతుంటుంది
ఆశగా చేతులు చాచినా, కళ్ళు ఎదురుతెన్నులు చూసినా,
నిర్దాక్షిణ్యమైన రోజులు మనసు గాయపరుస్తూనే ఉంటాయి.
మరలిరా, ప్రియతమా! అందమైన యవ్వనమా, నిలిచిపోవా!
లాభంలేదు. స్వర్ణకమలాలూ, లిల్లీలూ వాడిపోవలసిందే,
వాటిమీద శ్రావణమేఘాలు కురిసీ కురిసీ
తోసుకుని తోసుకుని పోవలసిందే… ఏ తెలియని తీరాలకో!
.
కాన్రాడ్ ఐకెన్,
August 5, 1889 – August 17, 1973
అమెరికను
.

.
All lovely things will have an ending,
All lovely things will fade and die,
And youth, that’s now so bravely spending,
Will beg a penny by and by.
Fine ladies soon are all forgotten,
And goldenrod is dust when dead,
The sweetest flesh and flowers are rotten
And cobwebs tent the brightest head.
Come back, true love! Sweet youth, return!—
But time goes on, and will, unheeding,
Though hands will reach, and eyes will yearn,
And the wild days set true hearts bleeding.
Come back, true love! Sweet youth, remain!—
But goldenrod and daisies wither,
And over them blows autumn rain,
They pass, they pass, and know not whither.
.
Conrad Aiken
August 5, 1889 – August 17, 1973
American
Poem Courtesy: http://www.poetrysoup.com/famous/poem/2353/all_lovely_things
Related articles
- The Grasshopper, poem by Conrad Aiken (silverbirchpress.wordpress.com)
- Conrad Aiken ~ Discordants (zheleznaya.wordpress.com)
నేను విన్న సంగీతం … కాన్రాడ్ ఐకెన్, అమెరికను కవి
నేను నీతో కలిసి విన్న సంగీతం, కేవలం సంగీతం కాదు
నేను నీతో కలిసి పంచుకున్న రొట్టె … కేవలం రొట్టె కాదు,
నా ప్రక్కన ఇప్పుడు నువు లేవు… కనుక అంతా శూన్యమే,
ఒకప్పుడు సౌందర్యంతో దీపించినదంతా ఇపుడు జీవకళ కోల్పోయింది.
.
ఒకప్పుడు నీ చేతులు ఈ మేజానీ, ఈ పాత్రల్నీ స్పృశించేయి
నీ వేళ్ళు ఆ గాజుపాత్రని పట్టుకోగా చూడడం నాకింకా గుర్తే,
ప్రేయసీ! ఈ వస్తువులేవీ నిన్ను గుర్తుపెట్టుకోకపోవవచ్చు,
కానీ, వాటిపై నీ స్పర్శ ముద్ర ఎన్నటికీ మాసిపోదు సుమా!
.
ఓ వివేకవతీ! సుందరీ! నువ్వు వాటికి పాత పరిచయానివే.
కారణం, నువ్వు నా మదిలోనే వాటి మధ్య మసలిందీ
నీ చూపులతో, నీ కరస్పర్శతో వాటిని అనుగ్రహించినదీను;
నా మనసులోని పాత్రలు నిన్ను ఇక మరవమన్నా మరవవు.
.
కాన్రాడ్ ఐకెన్
(August 5, 1889 – August 17, 1973)
అమెరికను కవి

.
The Music I heard
.
Music I heard with you was more than music,
And bread I broke with you was more than bread.
Now that I am without you, all is desolate,
All that was once so beautiful is dead.
Your hands once touched this table and this silver,
And I have seen your fingers hold this glass.
These things do not remember you, beloved:
And yet your touch upon them will not pass.
For it was in my heart you moved among them,
And blessed them with your hands and with your eyes.
And in my heart they will remember always:
They knew you once, O beautiful and wise!
.
Conrad Aiken
Poem Courtesy: http://www.bartleby.com/265/1.html
చిరంజీవి క్లియోపాత్రా… కాన్రాడ్ ఐకెన్, అమెరికను కవి
చిరంజీవి క్లియోపాత్రా, ఒకప్పుడు ఈజిప్టులో ఆరాధ్య దేవత
ఈ దక్షిణాది* యువరాణి కన్నులు, సతత రాగరంజితాలు,
పాపం, నేడు, వయసుడిగి, వరుగై, కళావిహీనమై
ముద్దులొలికిన ఆమె నోరు నల్లని తారుముద్దతో మూయబడింది.
.
సమాధి-కొల్లరులు ఆమె చేతుల స్వర్ణాంగుళులు పెకలించేరు
ఆమె గుండెలమీది పవిత్రచిహ్నాలను సైతం లక్ష్యపెట్టకుండా;
ఆమె చుట్టూ ప్రశాంతంగా తిరుగుతున్న గబ్బిలాలను అదిలించేరు
పాపం మహరాణి! ఆమె ఆత్మ ఎప్పుడో ప్రశాంతంగా ఉండేది,
.
చిర’కాల’ కాలగమనాన్ని పరిహసించడానికి, నేర్పుగా చుట్టి,
లేపనాలు పూసి, దక్షతతో ఇలా అశ్లీలంగా భద్రపరచకుండి ఉంటే!
దీన్ని ముందుగా ఊహించి ఉంటే ఆమె ప్రియుడు ఏమి అని ఉండే వాడో?
ఆనందంతో మునకలేసే వాడా? కన్నీటిఝరులలో తడిసి ఉండే వాడా?
.
లేబచ్చని పచ్చిక మొలిచే స్వచ్ఛమైన ఓ ప్రియ మృత్తికా!
నేనూ, నా ప్రేమాతిశయమూర్తీ గతించిన పిదప,
మాకు నిద్రాభంగం కాకుండా మాపై దట్టంగా కమ్ముకో!
అంబరాన్ని అంటేలా పచ్చికనీ, పువ్వులనీ మాపై విరియనీ!
.
(Note:
*దక్షిణాది: అప్పటి రోమను సామ్రాజ్యానికి దక్షిణంగా ఉంది ఈజిప్టు. రోమను సామ్రాజ్యం లో భాగం మాత్రం కాదు. క్లియోపాత్రా VII చనిపోయిన తర్వాతే అందులో భాగం అయింది. )
కాన్రాడ్ ఐకెన్
(August 5, 1889 – August 17, 1973)
అమెరికను కవి
.
రాజీవ్ గాంధీ చనిపోయినపుడు, Indian Express పత్రిక అనుకుంటాను, ఒక అద్భుతమైన శీర్షిక పెట్టింది. “Fate denies him the dignity of Death” అని. ఆ మాటల వెనక ఎంత బాధ, ఎంత జాలి ఉన్నాయో శీర్షిక చదవగానే అర్థమవుతుంది. ఈ కవిత చదవగానే నాకు అదే గుర్తొచింది. జీవితకాలం ఒక వెలుగు వెలిగి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఈజిప్షియనుల చిట్టచివరి ఫారో క్లియోపాత్రా VII. చివరికి ఆమె సమాధి దోపిడీకి గురై, ఆమె పార్థివ శరీరం ముష్కరులచే అపవిత్రమవడం ఒక రకంగా శాపమే.
అటువంటి యోగం తమకు కలక్కుండా చూడమని కవి ప్రార్థిస్తున్నాడు, పంచభూతాలలో ఒకటైన నేల తల్లిని.
.

.
Dead Cleopatra
.
Cleopatra lies in a crystal casket,
Wrapped and spiced by the cunningest of hands.
Around her neck they have put a golden necklace
Her tatbebs*, it is said, are worn with sands.
.
Dead Cleopatra was once revered in Egypt
Warm-eyed she was, this princess of the south.
Now she is very old and dry and faded,
With black bitumen they have sealed up her mouth.
.
Grave-robbers pulled the gold rings from her fingers,
Despite the holy symbols across her breast;
They scared the bats that quietly whirled above her.
Poor lady! she would have been long since at rest
.
If she had not been wrapped and spiced so shrewdly,
Preserved, obscene, to mock black flights of years.
What would her lover have said, had he foreseen it?
Had he been moved to ecstasy, or tears?
.
O sweet clean earth from whom the green blade cometh!
When we are dead, my best-beloved and I,
Close well above us that we may rest forever,
Sending up grass and blossoms to the sky
.
Conrad Aiken
(August 5, 1889 – August 17, 1973)
American Poet
(Notes:
*Tatbeb: An ancient Egyptian Sandal ( a modification of Egypt tebtebti (two ) Sandals, soles of the feet. (Courtesy: Merriam – Webster Dictionary)
Poem Courtesy: http://www.bartleby.com/265/2.html
మిణుగురుల సయ్యాట… కాన్రాడ్ అయికెన్, అమెరికను కవి
మెరిసే వలలాంటి ఉలిపొర వలువల్లో నను చూడు
చీకటిలోంచి వెలుగులోకి అలవోకగా ఇట్టే ఎగురుతూ
చప్పుడు చెయ్యకుండా తిరిగి చీకట్లోకి జారుకుంటాను!
మిణుగురును నేను, ఎవరికీ పట్టుదొరకను
.
నువ్వు మిణుగురువా? ఎవరి పట్టుకీ దొరకవా?
నేనుమాత్రం నిన్ను చీకటిలా వెన్నాడుతా
నిన్ను ఎప్పుడూ పట్టి గుప్పిట్లో మూసి, కడకి
నిశ్శబ్దంలో లయించే పిలుపులా నువ్వు నశించేదాకా.
.
కడకి నిశ్శబ్దంలో లయించే పిలుపులా నే నశించేదాకా…ఊం!
అయితే నువ్వేనా అంత ప్రశాంతంగా నా వెంటబడుతున్నది?
నా మంటలు నిన్నుచుట్టి దహించివేస్తాయి, అలాంటపుడు
నీ వేళ్ళు నన్నెలా పట్టుకోగలవు? నేను ఊరిస్తా గాని దొరకను
.
నిన్ను నా వేళ్లెలా పట్టుకోగలవా? నువ్వు ఊరిస్తావుగాని దొరకవా?
ఒకటి నిజం నువు మంటవే; అయితే, నిన్ను ప్రేమతో చుట్టుముడతాను
నేను చల్లదనాన్ని, జీవరాశి గతించినా, నేను చిరంజీవిని
నా హృదిలోని నిశ్శబ్ద-శూన్యంలో నిన్ను పొదువుకుంటాను.
.
నీ హృదిలోని నిశ్శబ్ద-శూన్యంలో నన్ను పొదువుకుంటావా?
ఓహ్!నిలకడలేని జీవితానికి ఎంత ఊరట; ఎంత కమ్మని ముగింపు!
భ్రమణభ్రమ జీవితంతో కొట్టుమిట్టాడిన నేను ఈక్షణమే ఆగుతునా,
నిదురమీది ప్రేమతో,ఇదిగో నేను నీలో ఐక్యమవుతున్నా.
.
కాన్రాడ్ అయికెన్,
(August 5, 1889 – August 17, 1973)
అమెరికను కవి
