Tag: Christina Rossetti
-
వసంతఋతు ప్రశాంతత … క్రిస్టినా రోజేటి, ఇంగ్లీషు కవయిత్రి
హేమంతము ఇలా గతించింది వసంతం అలా అడుగుపెట్టింది నేనొక రహస్యప్రదేశంలో దాక్కుని అక్కడి కలకూజితాలు వింటాను. అక్కడ మావి చిగురుల్లో కోయిల మనోహరంగా పాడుతుంది అక్కడ పూల పొదల్లో మైనా కమ్మగా ఆలపిస్తుంటుంది ఆ చల్లని ఇంటికప్పుమీదకి దట్టంగా ఎగబాకిన లతలు గుబురుపొదలై మొగ్గతొడుగుతూ నెత్తావులు పరుచుకుంటున్నాయి సుగంధాలు నింపుకున్న అల్లరిగా తిరిగే చిరుగాలి మెల్లగా గుసగుసలాడుతోంది: “ఇక్కడ ఏ ఉచ్చులూ పన్నలేదు; “ఇక్కడ క్షేమంగా వసించు ఒంటరిగా నివసించు స్వచ్ఛంగా పారుతున్న సెలయేరు నాచుపట్టిన బండరాయీ […]
-
పేరులేని ప్రతిపాదన (Sonnet 2) … క్రిస్టినా రోజేటి, ఇంగ్లీషు కవయిత్రి
నేను నిన్ను కలుసుకున్న మొట్ట మొదటి రోజు, మొదటి గంట, మొదటి క్షణం గుర్తు తెచ్చుకోగలిగితే బాగుణ్ణు, అది వసంతమో, హేమంతమో, వేసవో, శిశిరమో ఏమీ చెప్పలేను; జ్ఞాపకం ఏ మాత్రం నమోదవకుండా ఆ క్షణం జారుకుంది, చూపూ, ముందుచూపూ లేని గుడ్డిదాన్ని, చిగురిస్తున్న నా తనులతని పోల్చుకోలేనిదాన్ని … అప్పటికి ఎన్నో వసంతాలు పూత ఎరుగని దాన్ని. దాన్నే గనుక గుర్తుతెచ్చుకోగలిగితేనా! ఎటువంటి రోజది! నిరుడు కురిసిన హిమసమూహంలా దాని జాడలేకుండా కరిగిపోనిచ్చాను; నా కప్పుడు […]
-
గాలి నెవరు చూసేడు?… క్రిస్టినా రోజెటి, ఇంగ్లీషు కవయిత్రి
గాలి నెవరు చూసేడు? నువ్వూ లేదు, నేనూ లేదు. కానీ, ఆకులు కదుల్తూ వేలాడుతుంటే గాలి వాటిలోంచి వెళుతోందని అర్థం. . గాలి నెవరు చూసేడు? నువ్వూ లేదు, నేనూ లేదు. కాని చెట్లు తమ తలలు వాల్చేయంటే గాలి వాటిమీంచి పోతోందని లెఖ్ఖ. . క్రిస్టినా రోజెటి (5 December 1830 – 29 December 1894) ఇంగ్లీషు కవయిత్రి. మనకి కపిల మహర్షిచే ప్రచారంలోకి తీసుకురాబడిన సాంఖ్యము అనబడే దర్శనములో, వేటిని ప్రమాణాలుగా తీసుకోవాలి […]
-
పునరుత్థానము … క్రిస్టినా రోజేటి … ఆంగ్ల కవయిత్రి
. ఓ ప్రభూ! నన్ను త్వరగా తీసుకుపో! నాకు వివేకము శూన్యం, మాటలు రావు, కన్నీళ్ళింకిపోయాయి; నా మనసు శిలగా మారి ఎంత చైతన్యవిహీనమయినదంటే ఇపుడిక ఏ ఆశలూ, ఏ భయాలూ దాన్ని మేల్కొలపలేవు. కుడి ఎడమల ఎటుచూసినా తోడులేని ఒంటరి జీవిని; కళ్ళెత్తి చూతునా, దుఃఖపుపొరతో చూపుమందగిస్తుంది శాశ్వతమైన ఏ మహోన్నత శృంగాల్నీచూడలేను. నా జీవితమిపుడు పండుటాకులా రాలిపోతోంది. . ఓ ప్రభూ! నాలో నువ్వు తిరిగి ఉదయించు! నా జీవితం రంగువెలిసిన ఆకు పోలికలోనూ […]
-
ఆతిథ్యం… క్రిస్టినా రోజెటి
. నేను మరణించిన తర్వాత నా ఆత్మ ఎంతోకాలం నే మసలిన ఇల్లుచూడాలని వెళ్ళింది నేను ప్రాకారందాటి, నా మిత్రులందరూ పెరట్లో ఆకుపచ్చని నారింజచెట్లనీడన విందారగించడం చూసేను. ఒకరిచేతినుండి ఒకరికి మధుపాత్ర మారుతోంది; పళ్లలోని రసాన్ని చప్పరిస్తూ ఆస్వాదిస్తున్నారు. నవ్వుతూ, పాడుతూ, పరాచికాలాడుకుంటున్నారు, అవును మరి, ప్రతివారికీ తక్కినవాళ్లంటే ప్రేమ. . కపటంలేని వాళ్ళ మాటలు వింటున్నా: ఒకరన్నారు:”రేపు మనం సముద్రతీరం వెంబడి మైళ్లకి మైళ్ళు, ఒక దారీ తెన్నూ లేని ఇసకతిన్నెలమీద కాళ్ళీడ్చుకుంటూ నడవాలి.” మరొకరు:” […]
-
మరణించిన పిదప … క్రిస్టినా రోజెటి, ఇంగ్లీషు కవయిత్రి
. అతను నేను నిద్రిస్తున్నానేమో ననీ, వినిపించదనుకునీ నా మీదకి వాలి, “అయ్యో పాపం, చిన్న పిల్ల” అనడం విన్నాను. తర్వాత గాఢమైన నిశ్శబ్దం, నాకు అర్థమయింది అతను రోదిస్తున్నాడని. అతను తెరని తొలగించడంగాని, నా ముఖం మీది ముసుగు తియ్యడం గాని, నా చేయి తన చేతిలోకి తీసుకోవడం గాని, నా తలక్రింద ఉంచిన తలగడ సవరించడం గాని చెయ్యలేదు. అతను నేను బ్రతికుండగా ప్రేమించలేదు; కాని మరణించిన పిదప నా గురించి జాలి పడుతున్నాడు; […]