అనువాదలహరి

అరవై నిండినపుడు… పో చూ-యి, చీనీ కవి

ముప్ఫై కి – నలభై కి మధ్య ఇంద్రియభోగాలు మనసు చంచలం చేస్తాయి

డెబ్భై కీ – ఎనభై కీ మధ్య మనిషి చెప్పలేనన్ని రోగాలకు లోనౌతాడు

కానీ, యాభైకీ – అరవై కీ మధ్య ఈ రకమైన బాధలకి దూరంగా ఉంటాడు.

ఏ చాంచల్యాలకూ లోనుగాక మనసు నిశ్చలమై, విశ్రాంతి తీసుకుంటుంది.

ప్రేమల్నీ, లాలసలనీ విడిచిపెట్టేసేను. చాలు!

లాభనష్టాల, కీర్తిప్రతిష్ఠల ధ్యాస వదిలేసేను.

ఇప్పటికి ఆరోగ్యంగా, ముదిమికి దూరంగా ఉన్నట్టే

తీర్థయాత్రలకీ, పర్వతారోహణకీ కాళ్లలో ఇంకా సత్తువ ఉంది

నా మనసు ఇప్పటికీ వేణు,వీణా నాదాలని ఆశ్వాదించగలుగుతోంది.

తీరుబాటుచిక్కినపుడు మద్యాన్ని ఎన్ని కప్పులైనా సేవించగలను.

ఆ మత్తులో పాతపద్యాలు గుర్తొస్తే ఏకధాటిగా పుస్తకాన్ని ఏకరువు పెట్టగలను.

మిత్రుడు మెంగ్-తె ఒక కవిత కోరేడు, అరవై నిండినందుకు విచారించవద్దనీ,

అది “అన్నీ ప్రశాంతంగా వినవలసిన” సమయమనీ దీనితో ఉత్సాహపరుస్తాను .

.

పో చూ-యి,

(3rd March 772 – 8th Sept 846)

చీనీ కవి.

.

On Being Sixty

.

Between thirty and forty, one is distracted by the Five Lusts;

Between seventy and eighty, one is prey to a hundred diseases.

But from fifty to sixty, one is free from all ills;

Calm and still- the heart enjoys rest.

I have put behind me Love and Greed;

I have done with Profit and Fame;

I am still short of illness and decay and far from decrepit age.

Strength of limb I still possess to seek the rivers and hills;

Still my heart has spirit enough to listen to flutes and strings.

At leisure I open new wine and taste several cups;

Drunken I recall old poems and sing a whole volume.

Meng-te has asked for a poem and herewith I exhort him

Not to complain of three-score, “the time of obedient ears.”

.

(Translation: Arthur  Waley.)

Po Chü-i    (aka Bai Juyi or Bo Juyi /  Courtesy name Letian)

(3rd March 772 – 8th Sept 846)

Chinese Poet and an official of Tang dynasty .

There is a  story that he was in the habit of reading his poems to an old peasant woman and altering any expression which she could not understand. The poems of his contemporaries were mere elegant  diversions which enabled the scholar to display his erudition, or the literary juggler his dexterity. No poet in the world can ever have enjoyed greater contemporary popularity than Po.

                                                                                                                            Arthur Waley

Poem Courtesy:

https://archive.org/details/anthologyofworld0000vand/page/28/mode/1up

కొడుకు పుట్టిన సందర్భంలో… సూ తుంగ్ పో, చీనీ కవి

ఈ కవితలోని వ్యంగ్యం/ అధిక్షేపణ విప్పి చెప్పనవసరంలేదు.

******

 

 

సాధారణంగా కుటుంబాల్లో బిడ్డ పుట్టినపుడు

వాళ్ళు తెలివైన వాళ్ళు కావాలని కోరుకుంటారు.

నేను, నా తెలివితేటలవల్లనే

నా జీవితాన్ని నాశనంచేసుకోవడం వల్ల

వాడు అజ్ఞానీ, మూర్ఖుడూ

కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను.

అప్పుడు వాడు రాజదర్బారులో మంత్రిపదవి అలంకరించి

ఏ చీకూ చింతాలేక ప్రశాంతంగా జీవించగలడు.

.

సూ తుంగ్ పో,

8 January 1037 – 24 August 1101

చీనీ కవి.

.

.

The satire in the poem is too obvious.

.

On the Birth of His Son

.

Families, when a child is born

Want it to be intelligent.

I, through intelligence,

Having wrecked my whole life,

‘Only hope the baby will prove

Ignorant and stupid.

Then he will crown a tranquil life

By becoming a Cabinet Minister.

.

Translation: Arthur Waley

.

Su Tung-P’o (aka Po Su Shi/  Su Shih/ Su Dongpo / Dongpo Jushi) 

( 8 January 1037 – 24 August 1101) 

Chinese Poet

Su Tung-Po (1037–1101) was a Chinese poet, writer, artist, and statesman during China’s Song era. Born to a family of literati in the present-day Sichuan province, he is also known as Po Su Shi, Su Shih, and Su Dongpo. He published under the pseudonym Dongpo Jushi.

Poem Courtesy:

https://archive.org/details/anthologyofworld0000vand/page/33/mode/1up

ఋతుచక్రం … తావో చిన్, చీనీ కవి

చంక్రమణం చేస్తున్న ఋతువులు స్వేచ్ఛగా పరిభ్రమిస్తున్నాయి.

ప్రాభాత సమయపు అద్భుతమైన ప్రశాంతత నలుదెసలా ఆవరిస్తోంది

వసంతఋతు సూచకములైన దుస్తులు ధరించి

నేను తూరుపు పొలాలను కలయతిరుగుతున్నాను.

హేమంతపు తుది మొయిళ్ళు పర్వతాగ్రాలను తుడిచిపోతున్నై.

సాలెగూడువంటి సన్నని తెలిమంచు అకసాన్ని మరుగుపరుస్తోంది.

ఇక కొద్దిరోజుల్లో, దక్షిణగాలి తగలడమే ఆలస్యం,

పాలుపోసుకున్న గింజ  రెక్కలు అలలుగా విచ్చుకుంటుంది.

.

తావో చిన్

(365 – 427)

చీనీ కవి

.

Turning Seasons

.

Turning Seasons turning wildly

Away, morning’s majestic calm

Unfolds. Out in spring clothes,

I roam eastern fields. Lingering

Clouds sweep mountains clean.

Gossamer mist blurs open skies.

And soon, feeling south winds,

Young grain ripples like wings.

.

T’ao Ch’ien

(365 – 427)

Chinese Poet

Poem Courtesy:

https://archive.org/details/mountainhome00davi/page/12/mode/1up

ఇంటితోవ పట్టినపుడు… చాంగ్ ఫాంగ్ షెంగ్, చీనీ కవి

అంతరాయంలేకుండా వేల అడుగులు ఎత్తునున్న కొండశిఖరాల్లారా!

ఒక్క అలకూడా లేకుండా వందలమైళ్ళు పరుచుకున్న సరస్సులారా!

ఏడాది పొడుగునా ఒక్క నీడకూడా లేకుండా తెల్లగా ఉండే ఎడారులారా!

వేసవిలోనూ, హేమంతంలోనూ పచ్చగా ఉండే పైన్ వనసీమలారా!

విరామమెరుగకనిరంతరం పరుగులుతీసే సెలయేళ్ళలారా!

వేల యేళ్లబట్టి మీ మాట నిలబెట్టుకుంటున్న మహావృక్షాల్లారా!

మీరు ఒక్కసారిగా ఈ దేశదిమ్మరి బాధలకు ఉపశమనము కలిగించారు

అతని కలం కొత్తగీతాలను వ్రాయడానికి ప్రేరణనిచ్చారు>.

.

చాంగ్ ఫాంగ్ షెంగ్,

4వ శతాబ్దము

చీనీ కవి

.

Sailing Homeward

.

Cliffs that rise a thousand feet without a break,

Lake that stretches a hundred miles without a wave,

Sands that are white through all the year without a stain,

Pine-tree woods winter, and summer ever green

Streams that for ever flow and flow without a pause,

Trees that twenty thousand years your vows kept,

You have suddenly healed the pain of a traveler’s heart,

And moved his brush to write a new song.

(Translated by Arthur Waley)

Chang Fang-Sheng

Chinese Poet

4th Century

Poem Courtesy:

https://archive.org/details/anthologyofworld0000vand/page/18/mode/1up

స్త్రీ…. ఫ్యూ హ్యువాన్, చీనీ కవి

స్త్రీగా పుట్టడ మెంత దుఃఖభాజనమో కదా!

ప్రపంచంలో అంతకంటే విలువతక్కువది మరొకటి ఉండదు.

కుర్రాళ్ళు తలుపుకి చేరబడి నిలుచుంటారు

దివినుండి దిగివచ్చిన దేవతల్లా.

వాళ్ళ హృదయాలు నాలుగు సముద్రాలకీ,

వేలమైళ్ళ దుమ్మూ ధూళీ, పెనుగాలులకీ వెరువరు.

ఆడపిల్ల పుట్టినపుడు ఎవరూ ఆనందంగా ఉండరు.

ఆమె వల్ల ఆ వంశవృద్ధి జరగదు.

ఆమె పెరిగి పెద్దయ్యేక తనగదిలోనే దాగుంటుంది.

మగవాళ్ళని ముఖాముఖీగా చూసే ధైర్యంలేక.

ఆమె అత్తవారింటికి పోయినపుడు ఎవరూ ఏడవరు

వర్షం వెలిసిన తర్వాత నెలకొన్న మేఘాల ప్రశాంతతలా.

ఆమె పళ్ళబిగువున క్రింది పెదవి అదిమిపెట్టి

తలవాల్చుకుని తనను తాను సంబాళించుకుంటుంది

తను చెప్పలేనన్ని సార్లు మోకాళ్లపై వాలి దండాలు పెడుతుంది

ఆమె తన సేవకుల దగ్గరకూడా వినయంగా ఉంటుంది

అతని ప్రేమ ఆకాశంలోని నక్షత్రాల్లా అందనంతదూరం.

అయినా సూర్యముఖి సూర్యుడివైపే వాలుతుంది.

నిప్పూ, నీరూకంటే ఎక్కువగా వాళ్ళ హృదయాలు ముక్కలై ఉంటాయి

వాళ్ళకి వెయ్యి శాపనార్ధాలు పెడుతుంటారు.

వయసుతోపాటే వాళ్ల ముఖమూ మార్పుకి లోనవుతుంది

ఆమె భర్త కొత్త సుఖాలకై అర్రులుజాస్తుంటాడు.

ఒకప్పుడు వస్తువూ-నీడా లా కలిసున్న వాళ్ళిద్దరూ

ఇప్పుడు కాశీ- రామేశ్వరమంత దూరాన ఉంటారు.

అయినా హూ – చిన్ త్వరలో కలవకపోరు

విస్ఫోటనంలో విడివడ్డ రెండు నక్షత్రాల్లా .

.

ఫ్యూ హ్యువాన్,

(217- 278) CE 

చీనీ కవి

FU HSÜAN.

Woman

.

How sad it is to be a woman!!

Nothing on earth is held so cheap.

Boys stand leaning at the door

Like Gods fallen out of Heaven.

Their hearts brave the Four Oceans,

The wind and dust of a thousand miles.

No one is glad when a girl is born:

By her the family sets no store.

When she grows up, she hides in her room

Afraid to look at a man in the face.

No one cries when she leaves her home —

Sudden as clouds when the rain stops.

She bows her head and composes her face,

Her teeth are pressed on her red lips:

She bows and kneels countless times.

She must humble herself even to the servants.

His love is distant as the stars in Heaven,

Yet the sunflower bends towards the sun.

Their hearts are more sundered than water and fire —

A hundred evils are heaped upon her.

Her face will follow the years changes:

Her lord will find new pleasures.

They that were once like the substance and shadow

Are now as far from Hu as from Ch’in [two distant places]

Yet Hu and Ch’in shall sooner meet

That they whose parting is like Ts’an and Ch’en [two stars]

.

FU HSÜAN or Fu Xuan

217–278 CE

Chinese historian, poet and politician.

Fu Xuan (217–278), courtesy name Xiuyi, was a Chinese historian, poet, and politician who lived in the state of Cao Wei during the Three Kingdoms period and later under the Jin dynasty. He was one of the most prolific authors of fu poetry of his time. He was a grandson of Fu Xie (傅燮), a son of Fu Gan (傅幹), and the father of Fu Xian (傅咸). (From Wikipedia)

సందులో విద్వాంసుడు… సో సూ, చీనీ కవి

పంజరంలో బంధించబడ్డ పక్షి టపటపామని

తన రెక్కల్ని నాలుగుపక్కలా కొట్టుకుంటోంది.

ఆ ఇరుకు వీధిలోని విద్వాంసుడు నిరాశా నిస్పృహలతో ఉన్నాడు

నీడని అప్పళించుకుని ఆ ఖాళీ ఇంట్లో ఉంటున్నాడు.

అతను బయటకి వెళ్ళాలంటే వెళ్ళడానికి గమ్యం ఏదీ లేదు,

అతని త్రోవనిండా ముళ్లకంపలూ, విరిగిన కొమ్మలూ.

అతనొక స్మృతికావ్యం రాస్తాడు, ఎవరూ చదవరు, ఆదరించరు.

ఎండిన చెఱువులో చేపలా ఉన్నచోటే చిక్కుపడిపోయాడు.

బయట… దమ్మిడీ సంపాదన లేదు

లోపల… వంటగదిలో గింజ ధాన్యం లేదు.

అతని అసమర్థతకి చుట్టాలు నిందిస్తుంటారు

స్నేహితులూ, కలుసుకునేవాళ్ళూ రోజురోజుకీ తరుగుతున్నారు.

సూ చిన్ బోధించడానికి ఉత్తరానికి వెళ్ళేవాడు

లీ సూ పడమటికి దరఖాస్తులు పెట్టుకున్నాడు.

ఒకప్పుడు జీవితమందిచ్చే ఫలాలందుకుందామనుకున్నాను,

లాభంలేదు, ఇపుడవన్నీ ఎండి, వాడివత్తలైపోయాయి.

నదిలోకి వెళ్ళి తాగినా కడుపు పట్టినన్నే నీళ్ళు ఎవడైనా తాగ గలడు;

ఎంత సరిపోతే అంతే చాలు, తనివితీరేదాకా అంటే ఉపయోగం లేదు.

అడవిలోనిపక్షి లక్షకొమ్మలున్నా ఒక్కదానిమీదే వాలగలదు.

తెలివైనవాడు ఎవడైనా నడుచుకోవలసిన పద్ధతి ఇదే.

.

సో సూ

చీనీ కవి

3వ శతాబ్దం

.

.

The Scholar in the Narrow Street  

.

Flap, flap, the captive bird in the cage

Beating its wings against the four corners.

Depressed, depressed the scholar in the narrow street:

Clasping a shadow, he dwells in an empty house.

When he goes out, there is nowhere for him to go:

Bunches and brambles block up his path.

He composes a memorial, but it is rejected and unread,

He is left stranded, like a fish in a dry pond.

Without— he has not a single farthing of salary:

Within— there is not a peck of grain in his larder.

His relations upbraid him for his lack of success:

His friends and callers daily decrease in number.

Su Ch’in used to go preaching in the North

And Li Ssu sent a memorandum to the west.

I once hoped to pluck the fruits of life:

But now alas, they are all withered and dry.

Though one drinks at a river, one cannot drink more than bellyful;

Enough is good, but there is no use in satiety.

The bird in the forest can perch but on one bough,

And this should be the wise man’s pattern.

.

Tso Ssu

Chines poet

3rd Century AD

Poem Courtesy:

https://archive.org/details/anthologyofworld0000vand/page/17/mode/1up

చెట్టునుండి రేగుపళ్ళు రాలుతున్నాయి…అజ్ఞాత చీనీ కవి.

చాలా కాలం క్రిందట ఒక కథ చదివేను. పేరు గుర్తు రావటం లేదు. అందులో కథానాయకుడికి ఒక అమ్మాయిమీద మనసుంటుంది. దగ్గర చుట్టం కూడా. అమ్మాయి వాళ్ల దగ్గరనుండి సంబంధం కలుపుకుందామని కబుర్లు వస్తుంటాయి. ఇష్టం లేనపుడు ‘నాకప్పుడే పెళ్లి వొద్దు అనడం ఒక ఆనవాయితీ’. అబ్బాయి వాళ్లింట్లో తల్లీ, వదినా, అన్నా ఒక్కొక్కరే కథానాయకుడి అభిప్రాయం కనుక్కుందికి ప్రయత్నిస్తారు వేర్వేరు సందర్భాలలో. సిగ్గుకొద్దీ ‘నాకప్పుడే పెళ్లి వొద్దు’ అని అనేవాడు వాళ్లతో. దానితో, చివరకి మన కథానాయకుడుకి ఆ అమ్మాయి అంటే ఇష్టంలేదేమోననుకుని విరమించుకుంటారు. చివరకి,  వాళ్ళెప్పుడు ఈ ప్రస్తావన తీసుకువస్తారా, ఒప్పుకుందామా అని అతను చూస్తుంటాడు.

దీనికే, ‘ఇష్టం ఉన్నా బెట్టు పోవడం’ అంటాం. దీన్నే జూలియస్ సీజర్ లో,  షేక్స్పియర్ Casca పాత్రద్వారా చాలా చక్కగా చెప్పిస్తాడు. Antony సీజర్ కి కిరీటాన్ని పెట్టజూసినపుడు he put it by thrice, every time gentler than other మూడూసార్లూ వద్దని నిరాకరించాడట.  కానీ, ‘మొదటిసారి కంటే రెండో సారి, రెండో సారి కంటే మూడవసారీ ఆ వద్దనడంలోని తీవ్రత తగ్గుతూ వచ్చింది’ అని అనిపిస్తాడు. 

ఒకోసారి ఈ బెట్టు పోవడం ఎలా పరిణమిస్తుందంటే, వద్దన్న వస్తువుకోసమే, తర్వాత కావాలని ప్రాకులాడవలసి వస్తుంది. ఈ మనస్తత్వాన్ని ఈ కవిత చాలా చక్కగా పట్టిస్తుంది.

* * *

 

చెట్టునుండి రేగుపళ్ళు రాలుతున్నాయి.

పదిలోనూ ఇంకా ఏడు మిగిలున్నాయి.

మీలో ఎవరైనా నన్ను పెళ్ళిచేసుకుందామనుకుంటే

యువకులూ, ఓ మంచిరోజు చూసుకుని రండి.

చెట్టునుండి రేగుపళ్ళు రాలుతున్నాయి.

పదిలోనూ ఇంకా మూడు మిగిలున్నాయి.

మీలో ఎవరైనా నన్ను పెళ్ళిచేసుకుందామనుకుంటే

యువకులూ, ఇవాళే మంచిరోజు.

చెట్టునుండి రేగుపళ్ళు రాలుతున్నాయి.

మీ బుట్టనిండా పళ్ళు నింపుకోవచ్చు.

మీలో ఎవరైనా నన్ను పెళ్ళిచేసుకుందామనుకుంటే

యువకులూ, ఆ మాట చెప్పండి చాలు!

.

అజ్ఞాత చీనీ కవి

 

.

Fruit Plummets from the Plum Tree

.

Fruit plummets from the plum tree

But seven of ten plums remain;

You gentlemen who would court me,

Come on a lucky day.

Fruit plummets  from the plum tree

But three of ten plums still remain;

You men who want to court me,

Come now, today is a lucky day!

Fruit plummets from the plum tree.

You can fill up your baskets.

Gentlemen if you want to court me,

Just say the word.

.

Anonymous

Translated by: Tony Barnstone and Chou Ping

Poem Courtesy:

https://archive.org/details/worldpoetryantho0000wash/page/66/mode/1up

World Poetry Anthology

Part I: Poets of The Bronze and Iron Ages.

China: The Chou Dynasty and Warring States Period

From  The Book of Songs (800- 500 BCE)

తనివి … లూ చీ, చీనీ కవి

రచయిత అనుభూతించే ఆనందం పూర్వం ఋషు లనుభవించినదే.

నిరాకారంనుండి ఆకార మావిర్భవిస్తుంది;

నిశ్శబ్దం నుండి కవి పాట పుట్టిస్తాడు.

ఒక గజం పొడవు పట్టుదారంలో అనంతమైన రోదసి దాగి ఉంది;

భాష గుండె మూలలనుండి పెల్లుబికే వరద ప్రవాహం.

ప్రతీకల వలల వలయాలు యథేచ్ఛగా విశాలంగా విరజిమ్మి ఉన్నవి.

ఆలోచనలు మరింతలోతుగా అధ్యయనంచేస్తున్నవి.

లెక్కలేనన్ని పూల, అరవిరిసినమొగ్గల నెత్తావులు కవి వెదజల్లుతున్నాడు

పిల్లగాలులు నవ్వుతూ ఉత్ప్రేక్షిస్తున్నాయి:

వ్రాయు కుంచియల వనభూమినుండి మేఘాలు మింటిదారి నధిరోహిస్తున్నాయి.

.

లూ చీ

(261 -303) CE

చీనీ కవి

From The Art of Writing

Satisfaction

.

The pleasure a writer knows is the pleasure all sages enjoy.

Out of non-being, being is born; out of silence, the writer produces a song.

In a single yard of silk, infinite space is found; language is a deluge from one corner of the heart.

The net of images is cast wider and wider; thoughts search more and more deeply.

The writer spreads the fragrance of new flowers, an abundance of sprouting buds.

Laughing winds lift up the metaphor; clouds rise from a forest of writing brushes.

.

Lu Chi

(261 -303) CE

Tr:   Sam Hamill

Poem Courtesy:

https://archive.org/details/worldpoetryantho0000wash/page/228/mode/1up

పదాలపొందిక… లూ చీ, చీనీ కవి

కవి తన ఆలోచనలని

సొగసైన పదాలలోకి ఒడుపుగా ఒదిగిస్తున్నప్పుడు

ప్రకృతిలో కనిపించే అనేకానేక ఆకారాలవలె

సాహిత్యంకూడ అనేక రూపాలు, శైలులు సంతరించుకుంటుంది.

కనుక కనులకింపైన చిత్రంలోని ఐదు రంగుల వలె

ఐదు ధ్వని* స్థాయిలను అంచెలంచెలుగా వాడుకోవాలి.

వాటి రాకపోకలు ఒక నిర్దిష్టక్రమంలో లేకపోయినా

తారస్థాయిని అందుకోవడం కొంచెం కష్టంగా అనిపించినా

మీకు స్థాయీభేదాల క్రమం, తేడాల మౌలిక లక్షణాలు పట్టుబడితే

పంటకాలువల్లో పరిగెత్తే నదిలా మీ ఆలోచనలూ పరిగెడతాయి.

కానీ, మీరు ఉపయోగించే పదాల గతి తప్పిందా

తలను నడిపించడానికి తోకపట్టుకున్నట్టు అవుతుంది.

నల్లరంగు నేపధ్యంమీద పసుపువేస్తే ఏమవుతుందో, అలా

మీరు వ్రాసిన అంతస్పష్టమైన రచనా బురదమయం అవుతుంది.

.

లూ చీ

(261-  303) CE

చీనీ కవి

Note:

* (వయో, లింగ, మానసిక భేదాలనుబట్టి వ్యక్తిగతమైన ఇష్టాయిష్టాలు, సాంస్కృతిక వారసత్వాలు, సందర్భోచితమైన వ్యాఖ్యలు, కవి చూసే కోణంలో కనిపించే దృశ్యాదృశ్యాలు, చివరగా, లౌకికమైన లేదా ఆ సమయానికి అందిన అలంకారాలూ, విశేషణాలూ మొదలైనవి. ) .

The Music of Words

.

Like shifting forms in the world

Literature takes on many shapes and styles

As the poet crafts ideas

Into elegant language.

Let the five tones be used in turn

Like five colours in harmony,

And though they vanish and reappear inconstantly

And though it seems a hard path to climb

If you know the basic laws of order and change

Your thoughts like a river will flow in channels.

But if your words misfire

It’s like grabbing the tail to lead the head:

Clear writing turns to mud

Like painting yellow on base of black.

.

Lu Chi

(261-  303) CE

Chinese Poet and Critic

Note:

Harmony of Colours

Wherein color harmony is a function (f) of the interaction between color/s (Col 1, 2, 3, …, n) and the factors that influence positive aesthetic response to color: individual differences (ID) such as age, gender, personality and affective state; cultural experiences (CE); contextual effects (CX) which include setting and ambient lighting; intervening perceptual effects (P); and temporal effects (T) in terms of prevailing social trends.

Poem Courtesy:

https://archive.org/details/worldpoetryantho0000wash/page/228/mode/1up

Translation:

Tony Barnstone and Chou Ping

Read the Poetical Theories of Lu Chi  (in his Wen Fu)  and its comparison with Horace’s Ars Poetica at:

https://www.jstor.org/stable/429384?read-now=1&refreqid=excelsior%3A91a890973da07820152eea79b01c1e3b&seq=1#page_scan_tab_contents

by Sister Mary Gregory Knoerle.

పనలమీద ప్రయాణం … లూ చీ, చీనీ కవి

ఒక్కోసారి మీ రచన రసభరితమైన ఆలోచనల సమాహారమైనప్పటికీ

అవి ఒకదాన్నొకటి ఒరుసుకుంటూ ఇతివృత్తాన్ని మరుగుపరచవచ్చు.

మీరు శిఖరాగ్రానికి చేరుకున్న తర్వాత అధిరోహించగల వేరు చోటు ఉండదు.

మీరు రాసినదాన్ని ఇంకా మెరుగుపరచాలని ప్రయత్నిస్తే అది తరుగుతుంది.

సరియైన సందర్భంలో వాడిన అద్భుతమైన పదబంధం,

రచనపై కొరడాఝళిపించి గుఱ్ఱంలా దౌడుతీయిస్తుంది.

తక్కిన పదాలన్నీ ఉండవలసిన చోట ఉన్నప్పటికీ

పాలుపోసుకున్న చేను రాజనాలకై ఎదురుచూసినట్టు ఎదురుచూస్తాయి.

కొరడా ఎప్పుడైనా చెడుకంటే మంచే ఎక్కువ చేస్తుంది.

ఒకసారి సరిగా దిద్దిన తర్వాత, ఇక దిద్దుబాట్లు చెయ్యవద్దు.

.

లూ చీ

(261 – 303)

చీనీ కవి.

.

The Riding Crop

.

Sometimes your writing is a lush web of fine thoughts

That undercut each other and muffle the theme;

When you reach the pole there’s nowhere else to go,

More becomes less if you try to improve what’s done.

A powerful phrase at the crucial point

Will whip the writing like a horse and make it gallop;

Though all the other words are in place

They wait for the crop to run a good race.

A whip is always more help than harm;

Stop revising when you’ve got it right.

.

Lu Chi

(261 – 303)

Cinese Poet and Critic

Tr. Tony Barnstone and Chou Ping

Poem courtesy:

https://archive.org/details/worldpoetryantho0000wash/page/229/mode/1up

An Anthology of Verse From Antiquity to Our Time

Katharine Washburn and John S Major, Editors; Clifton Fadiman (General Editor)

Published by W. W. Norton & Company ISBN 0-393-04130-1

Part III: Post Classical World

2. China: The Three Kingdoms Period Through the T’ang Dynasty; Korea: Early Poetry in the Chinese Style.

%d bloggers like this: