అనువాదలహరి

11 వ కవిత, తావొ తే చింగ్ నుండి…

ముప్ఫై చువ్వలు చక్రానికున్న కన్నాలకు బిగించినపుడు

శూన్యమూ, పదార్థమూ జతకలుస్తాయి.

బండి నడుస్తుంది.

మట్టిని ఒక కూజా ఆకారంలోకి మలిచినపుడు

శూన్యమూ పదార్థమూ జతకలుస్తాయి.

కూజా పనిచేస్తుంది.

తలుపులూ కిటికీలూ గదికి దారి చేసినపుడు

శూన్యమూ పదార్థమూ జతకలుస్తాయి.

గది పనిచేస్తుంది.

నిజంగా అదంతే!

పదార్థం లాభపడుతుంది

శూన్యం దన్నుగా పనిచేస్తుంటే.

.

లావొ జు

చీనీ కవి

తావొ తే చింగ్ 

చీనీ గ్రంధము నుండి.

క్రీ. పూ. 4వ శతాబ్ది.

 

Poem Eleven from The Tao Te Ching

.

When thirty spokes join the wheel-hole

A void to matter paired.

The carriage functions.

When clay is thrown to form a vase:

A void to matter paired,

The vessel functions.

When door and window vent a room

A void to matter paired,

The chamber functions.

Surely is this so:

Materials avail,

Having void for function.

.

Lao-tzu

Chinese Poet 

Poem Courtesy:  https://archive.org/details/worldpoetryantho0000wash/page/71/mode/1up

V… లావొ జూ సంకలనం (చీనీ) నుండి

భూమీ ఆకాశమూ కనికరము లేనివి

అనేక జీవరాసుల్ని గడ్డిబొమ్మల్లా తొక్కిపడేస్తాయి.

మేధావులూ నిర్దాక్షిణ్యమైన వారే

మనుషులందరినీ గడ్డిబొమ్మలుగా జమకడతారు.

భూమికీ ఆకాశానికీ నడుమ

కొలిమి తిత్తిలా లేదూ?

అంతా శూన్యమే, కానీ ఎప్పుడూ ఖాళీ అవదు.

అది ఎంత పనిచేస్తుంటే, అంత బయటకి పోతుంటుంది.

అతిగా మాటాడడం చివరకి మౌనానికి దారి తీస్తుంది.

కనుక శూన్యాన్ని నమ్ముకుని ఉండడమే మంచిది.

.

V

 .

Heaven and earth are ruthless,

Trampling the myriad creatures like straw dogs.

The wise are ruthless,

Considering the people as straw dogs.

The space between earth and heaven,

Isn’t it like a bellows?

It’s empty but never exhausted.

The more it works the more flows out.

Much speech leads in the end to silence.

Better to hold fast to the Void.

.

(Translated by AS Kline)

 

Lao Tzu:

From Tao Te Ching

(The Book of The way and its Virtue)

Courtesy: http://www.poetryintranslation.com/PITBR/Chinese/TaoTeChing.htm

 

%d bloggers like this: