అనువాదలహరి

పిచ్చుక తొలి జాడ… చార్లెట్ స్మిత్, ఇంగ్లీషు కవయిత్రి

పోడు మీద ముళ్లపొదలు పచ్చగా కనిపిస్తున్నై

చెరువుగట్ల నీలిపూలు ఆనందంతో లాస్యంచేస్తున్నై

సిందూర వృక్షాలు పూతకొచ్చాయి, వాటి మొదళ్ళలో

ముళ్ళగోరింటలు త్వరలోనే మాలలు అల్లనున్నాయి,

మే నెల ఎండలో కనిపించే పూమాలలు.

చిక్కబడిన వసంతఋతువు తొలి చుట్టం

పిచ్చుక కూడ చివరకి అడుగుపెట్టింది.

సరిగ్గా సూర్యాస్తమయవేళ, పిట్టలు కూసే వేళ

అది తుర్రుమంటూ పరిగెత్తుకు రావడం చూసేను

ఎప్పటిలాగే దానికి స్వాగతం పలికేను.

ఓ వేసవి చుట్టమా! రా! రా!

నా రెల్లుగడ్డి ఇంటిచూరుకు నీ మట్టిగూడు అల్లుకో

ఇక ప్రతిరోజూ తెల తేలవారే వేళ

నా పర్ణశాల చూరుక్రింద నువ్వుపాడే

సంగీతాన్ని నన్ను చెవులారా విననీ!

.

ఛార్లెట్ స్మిత్

(4 May 1749 – 28 October 1806)

ఇంగ్లీషు కవయిత్రి.

.

Image Courtesy: http://upload.wikimedia.org

.

The First Swallow

.

The gorse is yellow on the heath,

The banks with speedwell flowers are gay

The oaks are budding, and, beneath,

The hawthorn soon will bear the wreath,

The silver wreath, of May.

The welcome guest of settled Spring,

The swallow, too, has come at last;

Just at sunset, when thrushes sing,

I saw her dash with rapid wing,

And hail’d her as the past.

Come, summer visitant, attach

To my reed roof your nest of clay,

And let my ear your music catch,

Low twittering underneath the thatch

At the grey dawn of day.

.

C. Smith

(4 May 1749 – 28 October 1806)

English Poet 

Poem courtesy:

https://archive.org/details/childrensgarlan01unkngoog/page/n336

వలస పిచ్చుక… ఛార్లెట్ స్మిత్ ఇంగ్లీషు కవయిత్రి

Image Courtesy: https://www.birdlife.org/worldwide/news/spring-alive-swallows-spring

.

పోడుమీద ముళ్ళచెట్టు పచ్చగా పూసింది

గట్లమీద వెరోనికలు నీలంగా నవ్వుతున్నాయి

ఓక్ చెట్లు పూతకొచ్చాయి, వాటిక్రింద

త్వరలో తెల్లని హాదార్న్ ఘుమఘుమలాడుతూ

మే నెలలకి రజతహారాన్ని వేయబోతోంది.

మధుమాసం కుదురుకున్నాక వచ్చే అతిథి

స్వాలో (వలస పిచ్చుక*) కూడా చివరకి విచ్చేసింది.

సరిగ్గా సూర్యుడు గ్రుంకే వేళ, పికాలు రాగాలందుకునే వేళ,

తుర్రుమనుకుంటూ శరవేగంతో రెక్కలార్చుకుని

నాముందునుండి పరిగెడితే ఒకసారి పలకరించేను.

ఓ వేసవి అతిథీ! నీకు స్వాగతం!

రా, నా రెల్లుపాక లోకప్పుకి నీ మట్టిగూడు అల్లుకో.

ఆ చూరుక్రింద ప్రతిరోజూ

తూరుపు ఎర్రబారుతుంటే కిచకిచమంటూ

నీ ప్రాభాత రాగాలను నా చెవులు ఆలకించనీ!

ఎక్కడో కథలో చెప్పినట్టు, ఒక భారతీయ ఋషి

అక్కడ అడవుల్లో తపస్సుచేసుకుంటూ

తన నిర్మానుస్జ్యమైన ఆశ్రమంలో

నీ పాటని ఏదో పుస్తకంలో వ్రాసినట్టు

అక్షరం అక్షరం అనువాదం చేశాడట.

అటువంటి శక్తులు నాకుకూడా ఉంటే ఎంత బాగుణ్ణు.

ఓ తుర్రు పిట్టా! అప్పుడు, నీ దగ్గరనుండి,

ఇప్పటిలా వ్యర్థంగా ఊహించడానికి బదులు

నువ్వు నిజంగా ఏ దూర సముద్రాలు దాటుకుని

ఏ ఏడారులు దాటుకుని వచ్చేవో తెలుసుకోగలను.

నీ రెక్కలజోరుని ఒక లిప్తపాటు ఆపి,

నువ్వు వర్షాన్ని మోసుకొచ్చే మేఘాలమీద

ఎగిరివచ్చేవో, లేక పడమటి సముద్రన్ని

తరచివచ్చేవో, లేక గాలితరగల రథంపై

ఊరేగివచ్చేవో తెలుసుకుని ఉండేదాన్ని.

ఇంతకీ ఆఫ్రికాలో, సువాసనలు వెదజల్లే

లతానికుంజాల్లోంచీ, ఖర్జూరపు తోటలలోంచీ

దూసుకుపోయే వేడి గాలి కోకిలపాటలు ఇంకా మోస్తోందా?

సతత సంచారులు ‘రెయిల్ ‘ (Rail)పక్షులూ,

దేశదిమ్మరులైన పావురాలూ ఒక్క క్షణమైనా ఆగుతాయా?

ఎప్పుడైనా అసియా ఖండానికి వెళ్ళేవా?

అక్కడ ప్రసిద్ధికెక్కిన నీ సోదరి శోకంలో మునిగి,

తన బాధల్ని దీనంగా ఆలపిస్తోందేమో చెప్పు;

లేక గులాబితో తన శోభనోత్సవాన్ని

ఆనందంగా ఆలపిస్తోందేమో చెప్పవూ?

ఇంతింత దూరాలు, దారీ తెన్నూ లేని

మహాసముద్రాలు,విశాలమైన భూభాగాలు తరచినా,

క్రితంసారి వచ్చిన చోటుకే వచ్చి, దానికి

కొనసాగింపుగా కొత్త గూడుకట్టడానికి ఇంకా

నీ చిన్ని రెక్కల్లో శక్తి ఎక్కడిదో అడగాలని ఉంది.

కానీ, వత్సరానికి వీడ్కోలు వేళ వచ్చిందనడానికి 

సూచనగా, చలిగాలులతీవ్రత ముదిరినపుడు

తొలిచిన కొండశిఖరాల బొరియలలోనో

లేక ఇక్కడే చలికి కొంకర్లుపోతూ ఎక్కడో,

ఎలానో ఎవరికీ తెలియకుండా దాక్కున్నపుడు,

అలా జీవవ్యాపారాలకి దూరంగా నిద్రలో మునిగినపుడు

సంతోషగడియలు వచ్చేయని నిన్నేకలలు నిద్రలేపుతాయి?

వెలుగు కిరణాలపై నృత్యంచేస్తూనో, సెలయేటిపై

వెలుగువాకలై తూగాడుతూనో, సరసుపై

మే-మక్షిక (May-fly) ఉనికిని నీకెవరు చెబుతారు?

రానున్న ఆహారపు కొరత అంతర్దృష్టివల్ల

నువ్వు తెలుసుకో గలిగే వనుకున్నా,నువ్వు

ఎక్కడెక్కడి లంకలూ, తిప్పలూ తిరుగుతావు,

కిక్కిరిసి వాలినన కొమ్మలపై నువ్వూ వాలి, వాటితోపాటు

కొమ్మలతోపాటు తిన్నెలలోకి ఒంగుతావు;

తెలియక అడుగుతాను, లోతైన, చెమ్మదేరిన నీగూటిపైన

చలిగాలులు భీకరంగా చప్పుడుచేస్తూ విహరిస్తున్నప్పుడు

వసంత ఋతువువస్తోందనీ పూలు పూస్తాయనీ,

నీ తాత్కాలిక సమాధిలోంచి వెలుగులోకి, చైతన్యం

నవ జీవనంలోకి, మేల్కోవాలని ఎలా గ్రహిస్తావు?

అరే! ప్రకృతి తన అగోచరమైన ముసుగుని ఎక్కడ ఎలా

పరుస్తుందో మనం కొంచెమైనా గ్రహించలేము కదా!

అబ్బురపడిన శాస్త్రశోధన దాన్ని పరిశోధించి

స్వంతం చేసుకోనీ; కానీ ఆ రహస్యాలన్నీ ప్రకృతికి

ఆ సూత్రాలనుగ్రహించిన ఒక్క దైవానికే మాత్రమే ఎరుక!

.

ఛార్లెట్ స్మిత్

(4 May 1749 – 28 October 1806) 

ఇంగ్లీషు కవయిత్రి

.

Notes and Legends:

1.      Swallow ని, తెలుగులో పిచ్చుకకి సమానపదంగా వ్యవహరిస్తున్నప్పటికీ, రెండూ వేరు. Cuckoo, Rail, Dove ల మాదిరి           కేవలం వసంతంలో మాత్రం కనిపించే దేశదిమ్మరి పక్షి ఇది.

2.      Primrose, Cowslip, Daisy లలా ఎక్కువ ప్రాచుర్యంలో లేకపోయినప్పటికీ, Veronica chamoedrys చాలా అందమైన              ప్రాంతీయ కుసుమం. దీన్ని వెరోనికలు అని సరదాకి తెలుగుచెయ్యడం జరిగింది.

3.     పక్షులభాష తెలిసినట్టుగా చెప్పబడుతున్న ఋషుల కథనాలు భారతీయ సాహిత్యంలో చాలా ప్రచారంలో ఉన్నాయి.          ఆ విషయాన్నే ఆమె ఉటంకిస్తోంది.

4.     ప్రముఖ గ్రీకు కవి Ovid రచించిన Metamorphoses పురాణగాథ ప్రకారం, Procne, Philomela ఇద్దరూ ఏథెన్సు                          ప్రభువైన Pandion కుమార్తెలు. Thrace కి ప్రభువైన Tereus తో Procne వివాహం జరుగుతుంది. పెళ్ళైన 5                                  సంవత్సరాలకి Procne  తనని ఇంటికైనా పంపమనీ లేకుంటే చెల్లెలు Philomela ని అక్కడకు తీసుకురమ్మనైనా                  తీసుకురమ్మని భర్తని కోరుతుంది. Athens వెళ్ళి ఆమెని రాజ్యానికి తీసుకువస్తూ, ఆమెను అంతకుముందే కామించి              ఉండడంతో, Teres తన రాజ్యానికి వచ్చేక అత్యాచారం చేసి మౌనంగా ఉండమని ఆదేశిస్తాడు. ఆమె దానికి ఎదురు              తిరగడంతో  ఆమె ఎవరితోనూ చెప్పుకోలేకుండా, నాలిక కోసేస్తాడు. ఆమె ప్రతీకారంతో, జరిగిన వృత్తాంతాన్ని తన                మెయికప్పు వస్త్రంపైవ్రాసి తన అక్కకు ప్రదర్శిస్తుంది. ఆమె కోపంతో, Teres ద్వారా తనకు కలిగిన కుమారుణ్ణి చంపి            అతనికి ఆహారంగా  వడ్డిస్తుంది. అతను భోజనం పూర్తిచేసిన తర్వాత, అతనికి కుమారుడి శిరస్సు చూపించి తమపగ          ఎలా  తీర్చుకున్నారో చెబుతారు. దానికి ఆగ్రహించి అతను వాళ్ళను చంపబోతాడు. అతనినుండి తప్పించుకుని                పారిపోతూ, ఇక తప్పించుకోలేమని గ్రహించిన వేళ వాళ్ళు దేవతలని ప్రార్థిస్తే, వాళ్ళు Procne ని Swallow గానూ,                  Philomela ని Nightingale గానూ మారుస్తారు.

5.    కొందరు ప్రముఖ Birdwatchers అభిప్రాయం ప్రకారం వలసపక్షులలో చాలా వరకు తాము అంతకు ముందు                         సంవత్సరం వచ్చిన చోటికే వచ్చి, అంతకు ముందు అల్లిన గూటికే మరమ్మత్తులు చేస్తాయిట.

6.   మరికొందరి అభిప్రాయం: వాటికి అనుకూలంగా లేని ఋతువుల్లో కొన్ని పక్షులు వలసపోకుండా, కొండ గుహల్లో, చెట్టు          తొర్రలూ పాడుబడిన ఖాళీ ప్రదేశాల్లో దాగుని,(ప్రఛ్ఛన్నంగా) ఉంటాయని.

7.   ఇంకొందరి అభిప్రాయం ప్రకారం, Swallows ఋతువు ముగిసిన వేళ, నదులూ, సరస్సులూ ఉన్న ప్రాంతాలకుపోయి,          చాలవరకు కొన్ని చెట్లకొమ్మలమీద వాలి, వంగిన ఆ చెట్టుకొమ్మలతోపాటే ఆ నీటి అడుగున మళ్ళీ వసంతం                          వచ్చేదాకా  నిద్రాణమైన అవస్థలో ఉంటాయని. ఇంత వైరుధ్యం ఉన్న సిద్ధాంతాలగురించి మరిన్ని వివరాలు                      తెలుసుకోగోరే వారు “White’s History of Selbourne.”చూడొచ్చు. (కవయిత్రి వివరణ)

 

.

THE SWALLOW.

The gorse is yellow on the heath,

The banks with speedwell flowers are gay,

The oaks are budding; and beneath,

The hawthorn soon will bear the wreath,

The silver wreath of May.

The welcome guest of settled Spring,

The Swallow too is come at last;

Just at sun-set, when thrushes sing,

I saw her dash with rapid wing,

And hail’d her as she pass’d.

Come, summer visitant, attach

To my reed roof your nest of clay,

And let my ear your music catch

Low twittering underneath the thatch

At the gray dawn of day.

As fables tell, an Indian Sage,

The Hindostani woods among,

Could in his desert hermitage,

As if ’twere mark’d in written page,

Translate the wild bird’s song.

I wish I did his power possess,

That I might learn, fleet bird, from thee,

What our vain systems only guess,

And know from what wide wilderness

You came across the sea.

I would a little while restrain

Your rapid wing, that I might hear

Whether on clouds that bring the rain,

You sail’d above the western main,

The wind your charioteer.

In Afric, does the sultry gale

Thro’ spicy bower, and palmy grove,

Bear the repeated Cuckoo’s tale?

Dwells there a time, the wandering Rail

Or the itinerant Dove?

Were you in Asia? O relate,

If there your fabled sister’s woes

She seem’d in sorrow to narrate;

Or sings she but to celebrate

Her nuptials with the rose?

I would enquire how journeying long,

The vast and pathless ocean o’er,

You ply again those pinions strong,

And come to build anew among

The scenes you left before;

But if, as colder breezes blow,

Prophetic of the waning year,

You hide, tho’ none know when or how,

In the cliff’s excavated brow,

And linger torpid here;

Thus lost to life, what favouring dream

Bids you to happier hours awake;

And tells, that dancing in the beam,

The light gnat hovers o’er the stream,

The May-fly on the lake?

Or if, by instinct taught to know

Approaching dearth of insect food;

To isles and willowy aits you go,

And crouding on the pliant bough,

Sink in the dimpling flood:

How learn ye, while the cold waves boom

Your deep and ouzy couch above,

The time when flowers of promise bloom,

And call you from your transient tomb,

To light, and life, and love?

Alas! how little can be known,

Her sacred veil where Nature draws;

Let baffled Science humbly own,

Her mysteries understood alone,

By Him who gives her laws.

.

Charlotte  (Turner) Smith

(4 May 1749 – 28 October 1806) 

English Poetess

Poem Courtesy:

Beachy Head : With Other Poems pp 79-83

https://oac.cdlib.org/view?docId=kt609nc030&brand=oac4&doc.view=entire_text

కడలి దృశ్యం (సానెట్ 83) … ఛార్లెట్ స్మిత్, ఇంగ్లీషు కవయిత్రి

కొండల మీద సంచరించే ఆ గొర్రెల కాపరి మేను వాల్చేడు

కొండశిఖరం వరకూ పరుచుకున్న మెత్తని గడ్డిమీద,

క్షితిజరేఖవద్ద ఆకాశంతో కలుస్తున్న కడలి అంచును చూస్తున్నాడో,

లేక, తన వియద్దృష్టిపరిధికి బాగా దిగువన,

పడమటి జలాల్లో నిప్పులు చెరుగుతూ

వాలుతున్న వేసవి సూర్యుణ్ణి చూసునాడో; ఆ విశాల దృశ్యం,

అద్భుతంగా, పరమ శాంతంగా, నలుదిక్కులా వ్యాపిస్తోంది,

ఆ గ్రామీణుడి గుండెమీదకూడా ఒక ప్రసన్న హర్షం

కానీ, దూరంగా, సముద్రజలాలపై, నల్లని మచ్చల్లా

మృత్యువునద్ది రాక్షసులు కురిపిస్తున్న రోగ శలాకల్లా,

యుద్ధాన్ని మోసుకెళ్తున్న నౌకలు; భీకరంగా, ఎర్రగా,

మెరుస్తున్న వినాశకర కీలలు; మాంసపుముద్దలైన హతులు,

పరిసరాల్ని కలుషితంచేస్తున్న విగత జీవులు. అయ్యో!

ఎంత దివ్యసృష్టినైనా రక్తసిక్తం చెయ్యగలడుగదా మనిషి!

.

ఛార్లెట్ స్మిత్

(4 May 1749 – 28 October 1806)

ఇంగ్లీషు కవయిత్రి.

 

.

Image Courtesy: http://upload.wikimedia.org
Image Courtesy: http://upload.wikimedia.org

The Sea View

The  upland shepherd as reclined he lies

On the soft turf that clothes the mountain brow,

Marks the bright Sea-line mingling with the skies;

Or from his course celestial, sinking slow,

The  Summer-Sun in purple radiance low,

Blaze on the western waters; the wide scene,

magnificent, and tranquil, seems to spread

Even over the Rustic’s breast a joy serene,

When, like dark plague-spots by the Demons shed,

Charged deep with death, upon the waves, far seen,

Move the war-freighted ships; and fierce and red,

Flash their destructive fires— The mangled dead,

And dying victims then pollute the flood.

Ah! thus man spoils Heaven’s glorious works with blood!

.

Charlotte Smith

(4 May 1749 – 28 October 1806)

English Poetess

Poem Courtesy:  page 41, Elegiac Sonnets and Other Poems by Charlotte Smith

https://archive.org/stream/elegiacsonnetsa01smitgoog#page/n40/mode/1up

 

 

 

సానెట్ LXVII … ఛార్లెట్ స్మిత్, ఇంగ్లండు.

.

ఆకాశంలో నల్లమబ్బులు ఎగిరెగిరి పడుతున్నాయి,

కమ్ముకొస్తున్నతుఫానుకి నేల భయంతో వణుకుతున్నట్టుంది;

కేవలం నాలాంటి ఏ దిక్కూలేని వాళ్ళం మాత్రమే

రివ్వున వీస్తున్న ఈ రొజ్జగాలి తాకిడికి తలఒగ్గి ఉన్నాం;

నలుచెరగులా కూలుతున్నగోడలకి వెరచి, ఆకలేస్తున్నా

గుడ్లగూబ తన సాయంత్రపు తిండి వేట విరమించుకుంది;

దట్టమైన చిట్టడవిలో గుంటనక్కొకటి గుహలో దాక్కుని

ఈ రాత్రి తుఫానుబారి నుండి తన్నుతాను కాపాడుకుంటోంది;

కాని, నేను విసర్జించిన ఈ ప్రపంచానికి నన్ను

 కనపడనీని ఈ చీకటి నా మనసుకి ఎంతో నచ్చింది…

చివికి మన్నైపోతున్న సమాధి విధ్వంశానికి గురైన దృశ్యంలా  

దౌర్భాగ్యుడి విషాదానికి సరిగ్గా అతికినట్టు పోలి ఉంది సందర్భం…

ఈ చిక్కని నీడలా, కత్తిలాకోస్తున్న గాలిలా,

వక్రించిన నా విధి లా, ఆశతొడగని నా నిరుత్సాహంలా.

.

ఛార్లెట్ స్మిత్

(4 May 1749 – 28 October 1806)

ఇంగ్లండు

.

English: Portrait of Charlotte Turner Smith (1...
English: Portrait of Charlotte Turner Smith (1749-1806, frontispiece to an 1827 publication of her Elegiac Sonnets) (Photo credit: Wikipedia)

.

SONNET LXVII.

(On passing over a dreary tract of country, and near the ruins of a deserted chapel, during a tempest.)

Swift fleet the billowy clouds along the sky,

Earth seems to shudder at the storm aghast;

While only beings as forlorn as I,

Court the chill horrors of the howling blast.

Even round yon crumbling walls, in search of food,

The ravenous Owl foregoes his evening flight,

And in his cave, within the deepest wood,

The Fox eludes the tempest of the night.

But to my heart congenial is the gloom

Which hides me from a World I wish to shun;

That scene where Ruin saps the mouldering tomb

Suits with the sadness of a wretch undone.

Nor is the deepest shade, the keenest air,

Black as my fate, or cold as my despair.

,

Charlotte Smith

(4 May 1749 – 28 October 1806)

Poem Courtesy:

http://digital.lib.ucdavis.edu/projects/bwrp/Works/SmitCElegi.htm

నిరాశాస్తుతి … ఛార్లెట్ స్మిత్, ఆంగ్ల కవయిత్రి

దిక్కులేని హృదయాలకీ, దైన్యపు చూపులకీ రాజువై

నీ ప్రభావంతో నామమాత్ర వివేకమూ నశింపజేసి  

మనుషులను మతిభ్రష్టులుగా మార్చగల 

భీకరాకారిణీ! భూత స్వరూపిణీ! 

భయద ముఖీ, నిరాశా! నేను సంసిద్ధం,

రా! నన్ను ఆవహించి బలితీసుకో!

నీ నిరంకుశత్వాన్ని, నాపై అనుగ్రహంగా భావిస్తాను!  

.

ఉల్లాసపు తూలికలతో ఆనందపుచిత్రాలుగీసి

వెంటనే అవి కనపడకుండా మాయంచేసే

ఓ నయ వంచకీ, ఇచ్చకపుబుచ్చీ ఆశా! 

ఇక నీ ముఖం నాకెన్నడూ చూపించకు !

నీ కల్పనలకు విరుధ్ధంగా, నా కళ్ళముందు

వాటి ఆభాసలు భయంకరంగా నర్తిస్తున్నాయి..

.

ఛార్లెట్ స్మిత్

4 May 1749 – 28 October 1806

ఆంగ్ల కవయిత్రి

(Note: ఇచ్చకపుబుచ్చీ: మా ప్రాంతాల్లో(ఉత్తరాంధ్ర) ఊరికే పొగిడి ఉబ్బేసే వాళ్లని  ఇలా పిలుస్తారు)

వర్థమాన కవులు ముఖ్యంగా గమనించవలసింది: ఒక నెగెటివ్ లక్షణాన్ని (negative trait) వర్ణించి కవిత వ్రాస్తున్నప్పుడు, కవిత చివరలో పాఠకుడు అర్థం చేసుకోడేమో అన్న ఆదుర్దాతో, కొందరు కవులు తమ సందేశాన్ని వాచ్యం చేసి రసాభాస చేస్తారు. చివరలో పోజిటివ్ లక్షణాన్ని(positive trait) కూడా ఔచిత్యభంగం లేకుండా తెగనాడి, కవయిత్రి ఎంత జాగ్రత్తగా శిల్పాన్ని నిర్వహించిందో గమనించగలరు.  

English: Charlotte Turner Smith
English: Charlotte Turner Smith (Photo credit: Wikipedia)

.

Ode to Despair

.

Thou spectre of terrific mien,
Lord of the hopeless heart and hollow eye,
In whose fierce train each form is seen
That drives sick Reason to insanity!
“Grim visag’d, comfortless Despair:”
Approach; in me a willing victim find,
Who seeks thine iron sway and calls thee kind!

Ah! hide for ever from my sight
The faithless flatterer Hope whose pencil, gay,
Portrays some vision of delight,
Then bids the fairy tablet fade away;
While in dire contrast, to mine eyes,
Thy phantoms, yet more hideous, rise.

(From the Novel Emmeline)

.

Charlotte Turner Smith

4 May 1749 – 28 October 1806

English Poetess

Poem Courtesy: http://cdrh.unl.edu/ctsmithsite/smi.00003/smi.00003.66.html

సానెట్ LXII … ఛార్లెట్ స్మిత్, ఇంగ్లీషు కవయిత్రి

జీవితంలో విఫలమై, నిరాసక్తతో నే నలా దేశాలు తిరుగుతూ

మారుతున్న స్థలంతో కేవలం వేదనలలోనే మార్పు గమనించేను;

నేను ఎంతకాలంనుండో వెతుకుతున్న ప్రశాంతతను వా రనుభవిస్తూ

ఆ పల్లె శ్రామికులు కలతలేని నిదురలో హాయిగా విశ్రమిస్తున్నారు!

ఊరు ఇప్పుడు పూర్తిగా మాటుమణిగింది; చూరు దిగువగా ఉన్న

ఆ తాటాకు గుడిశ కిటికీలోంచి చలికాచుకుందికి వేసుకున్న నెగళ్ళు

మంటతగ్గి బుసి ఆరుతున్నాయి; పాలిపోయిన చంద్రకిరణాలు

మెరుస్తున్న మంచుమీద పడి దానికి కొత్త సొబగు ఇస్తున్నాయి. 

గడ్డకట్టుకుపోతున్న ఈ రాత్రి, ఆ చలి బీడులలో

నే నెక్కడ, ఎలా,  ఏ తోడూలేక తిరిగినా చింత లేదు;

ఓ కళతప్పిన జాబిలీ! నాకు నీ మసక వెలుతురు

ఏ సుఖకరమైన గడపకీ దారితీయదు; బడలిన నా త్రోవ

దురదృష్టవశాత్తూ బాధ్యతల సుఖదుఃఖాలదగ్గరే అంతమౌతుంది.

నేను సందేహాలనుండి పారిపోయి… నిరాశను చేరుకుంటాను!
.

ఛార్లెట్ స్మిత్

(4 May 1749 – 28 October 1806)

ఇంగ్లీషు కవయిత్రి, నవలాకారిణి.

అపురూపమైన సానెట్లు వ్రాసి 18వ శతాబ్దం లో వాటికి పునర్జీవనం ఇవ్వడమే గాక, రొమాంటిక్ మూవ్ మెంట్ కి రూపశిల్పులైన  వర్డ్స్ వర్త్ (Wordsworth) కోలరిడ్జ్ (Coleridge) లను ఆమె కవిత్వం ప్రభావితం చేసింది. ధనిక కుటుంబంలో పుట్టినా, భర్త వ్యసనాలవల్ల, జులాయి తిరుగుళ్ళవల్ల అప్పులు తీర్చలేక జైలుపాలయి, జైలులోనే తన కవిత్వానికి నాంది పలికి, అనతికాలంలో నే పేరూ ప్రఖ్యాతీ సంపాదించి, స్వశక్తిమీద జీవితాన్ని నిలదొక్కుకున్న సాహసవంతురాలైన స్త్రీ స్మిత్. ఆమె వ్రాసిన కొన్ని సానెట్లలోని భావాలనే వర్డ్స్ వర్త్ తన కవితలలో ప్రతిఫలించేడని, వర్డ్స్ వర్త్ ఆమెని కలిసినతర్వాత, ఆమె కొన్ని కవితలకు వర్డ్స్ వర్త్ వ్రాసుకున్న వ్యాఖ్యలను పేర్కొంటూ కొంతమంది పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఆమె 10 నవలలు కూడా వ్రాసింది. 

English: Charlotte Turner Smith in Charlotte T...

.

Sonnet LXII … Charlotte Smith

.

WHILE thus I wander, cheerless and unblest,
And find in change of place but change of pain;
In tranquil sleep the village labourers rest,
And taste that quiet I pursue in vain!
 Hush’d is the hamlet now, and faintly gleam
The dying embers, from the casement low
 Of the thatch’d cottage; while the Moon’s wan beam
Lends a new lustre to the dazzling snow —
o’er the cold waste, amid the freezing night,
Scarce heeding whither, desolate I stray;
For me, pale Eye of Evening, thy soft light
Leads to no happy home; my weary way
Ends but in sad vicissitudes of care:
I only fly from doubt — to meet despair!

.

Charlotte Smith

(4 May 1749 – 28 October 1806)

English Poet and Novelist

(WRITTEN ON PASSING BY MOON-LIGHT THROUGH A VILLAGE, WHILE THE GROUND WAS COVERED WITH SNOW.) 

.

Poem Courtesy: http://cdrh.unl.edu/ctsmithsite/smi.00004/smi.00004.6.html.

 

ధూళికణానికి… ఛార్లెట్ స్మిత్, ఇంగ్లీషు కవయిత్రి

.

కంటికి కనరాని ఓ చిన్ని వ్యోమగామీ!

ఒక సన్నని గాలితీగకు వేలాడుతూ,

సూర్యకిరణాలమీద తేలియాడే చైతన్య అణుపదార్థమా!

నీ గాలివాటు ప్రయాణానికి గమ్యం ఏది? ఏ ఆలోచనతో

నువ్వు ఈ ఈథర్ లో నీ సూక్ష్మ శరీరాన్ని ప్రవేశపెట్టావు?

కంటిచూపుని ఎగతాళిచెయ్యడానికా?

పాపం! దట్టమైన నీలిమేఘాల మేలిముసుగు నిను దాచేలోగానే

వెంటాడే సుడిగాలి నీ ఖగోళయానానికి తెరదించుతుందే.

అయ్యో! అచ్చం అలాగే, ఊహాకల్పిత పసిడితీగెలమీద

ఆశల ఊపిరులూదే బూటకపుముఖస్తుతులకు పొంగిపోయి

ఏడుపొరల ఇంద్రధనుస్సులు తన కళ్ళలో నడయాడుతుండగా

గొప్పభావుకతగల కోడెవయసులోని కవికిశోరాలు

చేదు జీవిత సత్యాలని విస్మరించి నడుస్తాయి.   పాపం!

త్వరలోనే, చింతలు తాకి ఆ పగటికలలు కరగిపోతాయిగదా!


.

ఛార్లెట్ స్మిత్

ఇంగ్లీషు కవయిత్రి, నవలాకారిణి 

ఇంగ్లీషు సాహిత్యంలో కవయిత్రులలో ఛార్లెట్ స్మిత్ ది ఒక దయనీయ గాధ, అయినా సాహసోపేతమైనది. బాగా డబ్బున్న కుటుంబంలో పుట్టినా, భర్త వ్యసనాలవల్ల, అప్పులుతీర్చలేని అతనితోపాటు జైలుపాలై, అక్కడ మొదటిసారిగా కవిత్వ రచనకు పూనుకుంది. ఆమె వ్రాసిన Elegiac Sonnets బహుళ జందరణ పొందడమే గాక, రొమాంటిక్ సాహిత్యోద్యమానికి రూప శిల్పులైన వర్డ్స్ వర్త్, కోలరిడ్జ్ లకు ప్రేరణకూడా. ఆమె వ్రాసిన కొన్ని సానెట్లలోని భావాలను, వర్డ్స్ వర్త్ తన కవితలలో పొందుపరచేడని పెద్ద వివాదము కూడా  ఉంది.

సైన్సులో అద్బుతమైన అలోచనలకూ, ఆవిష్కరణలకూ తెరతీసిన 18వ శతాబ్దములో ధూళికణం ఒక ప్రాణమున్న జీవిగా అనుకునేవారేమో తెలీదు. కాని, ధూళికణపు ప్రయాణంతో కొత్తగా కవితలురాసేవారి సాహిత్య ప్రయాణాన్ని పోల్చడం ఒక్క కొత్త భావన అనడంలో ఎంతమాత్రం సందేహం లేదు.    

.

English: Charlotte Turner Smith in Charlotte T...
English: Charlotte Turner Smith in Charlotte Turner Smith, Elegiac sonnets Fifth edition. London: Published by Thomas Cadell, 1789. (Photo credit: Wikipedia)

.
 Sonnet: To the Insect of the Gossamer
.
 Small viewless aeronaut, that by the line
 Of Gossamer suspended, in mid air
 Float’st on a sun-beam—Living atom, where
 Ends thy breeze-guided voyage? With what design

In æther dost thou launch thy form minute,
 Mocking the eye? Alas! before the veil
 Of denser clouds shall hide thee, the pursuit
 Of the keen Swift may end thy fairy sail!

Thus on the golden thread that Fancy weaves
 Buoyant, as Hope’s illusive flattery breathes,
 The young and visionary Poet leaves
 Life’s dull realities, while sevenfold wreaths

Of rainbow light around his head revolve.
 Ah! soon at Sorrow’s touch the radiant dreams dissolve.

.

 Charlotte Smith

4 May 1749 – 28 October 1806

English Romantic poet and Novelist.

సానెట్ LXVI: రాత్రి వరద భీభత్సం… ఛార్లెట్ స్మిత్

Image Courtesy: http://1.bp.blogspot.com

.

శిలలతో నిండిన సముద్రపుటొడ్డున
రాత్రి-వరద భీభత్సం సృష్టిస్తోంది:
అలుపులేక పోటెత్తిన తన కెరటాలక్రింద
సమాధికాబడ్డవాటికోసం
రంపపుపళ్ళలాంటి కొండకొనలమీదా,
చలువరాయి గుహల్లోనూ
బొంగురుగొంతుతో సముద్రం శోకిస్తోంది.

తవ్విపోస్తున్న తన కరకుకెరటాలతాకిడికి
ఎత్తైనమిట్టకొనకొమ్ము మీంచి
పచ్చికతోసహా ఒక శాలిబండ దొర్లుకుంటూ
అఖాతంలోకి దబ్బుమని నిలువుగాపడింది
నిశానిశ్శబ్దశ్రవణాలపై పిడుగుపడ్డట్టు.
దానిప్రతిధ్వనులకి ఒడ్డు ఒణికింది.

మనిషిజాడలేని ఈ తుఫాను రాత్రి
ఆకాసంలో తేలుతున్న మబ్బుతెరలమాటున
చంద్రుడు కళావిహీనంగా వెలుగుతున్నాడు;
యువతా, బడలిన శరీరాలూ హాయిగా కలతలేనిద్రిస్తుంటే,
నేనొకడినే లక్ష్యంలేకుండా తిరుగాడుతున్నాను.
నిట్టూర్పులతో ఎగసిన నా హృదయాన్ని ఉపేక్షించడమేగాక,
ఏడవడానికే మేలుకున్నకళ్ళనుకూడా తప్పించుకు తిరుగుతోంది నిద్ర!.

.

Image Courtesy: http://upload.wikimedia.org

ఛార్లెట్ స్మిత్ 

(4 May 1749 – 28 October 1806)

ఛార్లెట్ స్మిత్ జీవితం చాలాచిత్రమైనది. సంపన్నకుటుంబంలో పుట్టినా, తల్లి చిన్నతనంలోనే చనిపోవడంతో, ఆమెఎడబాటులో తండ్రి వ్యసనపరుడై దేశాలుపట్టిపోతే, పినతల్లి సంరక్షణలో పెరగడం, 15 ఏళ్ళకే ధనవంతుడేకాని చదువు అంతగాలేని, తాగుబోతు, వ్యభిచారితో వివాహం, చేసిన అప్పులుతీర్చలేని భర్తతో జైలుశిక్ష అనుభవించడం, అందులోనే మొదటిసారి సానెట్ లువ్రాయడం, అవి జనాదరణ పొందడమేగాక, డబ్బుగూడ తెచ్చిపెట్టడంతో జైలునుండి విముక్తి, ఇక తిరుగులేని రచనా వ్యాసంగం ఆమె ప్రత్యేకతలు.  ఆ కాలపు మేటి కవులు వర్డ్స్ వర్త్, కాలరిడ్జ్, రాబర్ట్ సదే లతొ స్నేహం నెరపింది. సుమారు 10 నవలలూ, 3 కవితాసంకలనాలూ, పిల్లలకు కథలూ, ఒక నాటకం, ఇలా అనేక ప్రక్రియలలో సాహితీవ్యాసంగం, తనదైనగొంతుక, తననిజజీవితాన్ని నవలలలో ప్రతిఫలింపజేయగలశక్తీ, రొమాంటిక్  ఇతివృత్తం నుండి, సెంటిమెంటుప్రథానంగాగల ఇతివృత్తాలవైపు నవలను మలచిన తీరు, సానెట్ లను తిరిగి  ఇంగ్లీషు సాహిత్యం లోకి ప్రవేశపెట్టిన తీరూ బ్రిటిషు రొమాంటిక్ మూవ్ మెంట్ లో ఆమెకు ఒక ప్రత్యేక  స్థానాన్ని కల్పించేయి.  Beachy Head and Other Poems, Elegiac Sonnets, The Old Manor House, ఆమెకు శాశ్వతమైన కీర్తి తెచ్చిపెట్టాయి.

.

Sonnet LXVI: The Night-Flood Rakes

.

The night-flood rakes upon the stony shore;
Along the rugged cliffs and chalky caves
Mourns the hoarse Ocean, seeming to deplore
All that are buried in his restless waves—
.

Mined by corrosive tides, the hollow rock
Falls prone, and rushing from its turfy height,
Shakes the broad beach with long-resounding shock,
Loud thundering on the ear of sullen Night;
.

Above the desolate and stormy deep,
Gleams the wan Moon, by floating mist opprest;
Yet here while youth, and health, and labour sleep,
Alone I wander—Calm untroubled rest,
.

“Nature’s soft nurse,” deserts the sigh-swoln breast,
And shuns the eyes, that only wake to weep!

.

Charlotte Turner Smith

(4 May 1749 – 28 October 1806)

Charlotte Smith is recognised as one of the leading voices of English Romantic Movement. And there is literary evidence that Wordsworth studied her and made elaborate notes on her Sonnets, before he embarked upon the joint venture Lyrical Ballads with Coleridge. She is reputed for the revival of Sonnet. She had a very chequered life due to the careless living of her father, her early marriage to another spendthrift, her having to take to writing when she was in debtor’s prison with her insolvent husband, her phenomenal success as a poet and novelist and finally, her dying … neglected and uncared for. During her long literary career she produced Ten Novels, (one of them “Desmond” called very radical for supporting French Revolution, and some others very popular for their autobiographical shades) Three volumes of poetry, some collections of short stories for children, a play and few other works. Remarkable is her courage amidst odds and equally remarkable her unflinching flair for writing to the last.  The “Elegiac Sonnets” and posthumous publication “Beachy Head and Other Poems (1807)”, The Old Manor House” and “Emmeline”(novels) have brought her a lasting fame.

%d bloggers like this: