
కవితలు రాస్తున్నకొద్దీ… ఛార్ల్స్ బ్యుకోవ్స్కీ, అమెరికను కవి
రాసిన కవితల సంఖ్య వేలలోకి వెళ్తున్నకొద్దీ
నీకు అర్థం అవుతుంది
నువ్వు చెప్పుకోదగ్గంత రాయలేదని.
చివరకి వానా, ఎండా,
రోడ్డుమీదవాహనాలూ, రాత్రుళ్ళూ
పగళ్ళూ, ముఖాలూ కవితావస్తువులౌతాయి.
వాటిని భరించడం కంటే విడిచిపెట్టడం
ఉత్తమం. రేడియోలో ఎవరిదో పియానో వాద్యం
వినిపిస్తుంటే మరో కవిత రాస్తున్నాను.
గొప్పకవులు రాసింది
చాలా తక్కువ
చెత్తకవులు
మరీ ఎక్కువ రాసేరు.
.
చార్ల్స్ బ్యుకోవ్స్కీ
August 16, 1920 – March 9, 1994
అమెరికను కవి
As The Poems Go
.
as the poems go into the thousands you
realize that you’ve created very
little.
it comes down to the rain, the sunlight,
the traffic, the nights and the days of the
years, the faces.
leaving this will be easier than living
it, typing one more line now as
a man plays a piano through the radio,
the best writers have said very
little
and the worst,
far too much.
.
Charles Bukowski
August 16, 1920 – March 9, 1994
German-American Poet
Poem courtesy:
http://famouspoetsandpoems.com/poets/charles_bukowski/poems/12978

అల్లర్లు … ఛార్ల్స్ బ్యుకోవ్ స్కీ, అమెరికను కవి
నా జీవితకాలంలో ఈ నగరం
తగలడిపోవడం రెండుసార్లు చూశాను.
అందులో ముఖ్యంగా చెప్పుకోవలసిన విషయం
అన్నీ అయిపోయాక
రాజకీయనాయకులు
రంగం మీద కనిపించడం,
వ్యవస్థలోని లోపాలు ఏకరవుపెట్టి
దానిని మార్చడానికి
పేదలకి అనుకూలంగా
కొత్త చర్యలు చేపట్టాలని
వాదించడం.
మొదటిసారి
ఏ మార్పులూ జరగలేదు.
ఈ సారీ ఏ మార్పులూ
జరగబోవు.
బీదలు బీదలుగానే కొనసాగుతారు
నిరుద్యోగులు
నిరుద్యోగులుగానే కొనసాగుతారు.
ఇల్లులేనివాళ్ళు
ఇల్లులేనివాళ్ళుగానే మిగులుతారు.
కానీ రాజకీయనాయకులుమాత్రం
భూమ్మీద బాగా బలిసి,
చక్కగా హాయిగా బ్రతుకుతారు.
.
ఛార్ల్స్ బ్యుకోవ్స్కీ
August 16, 1920 – March 9, 1994
జర్మన్-అమెరికను కవి,నవలాకారుడు, కథకుడు
The riots
I’ve watched this city burn twice
in my lifetime
and the most notable thing
was the arrival of the
politicians in the
aftermath
proclaiming the wrongs of
the system
and demanding new
policies toward and for the
poor.
nothing was corrected last
time.
nothing will be corrected this
time.
the poor will remain poor.
the unemployed will remain
so.
the homeless will remain
homeless
and the politicians,
fat upon the land, will live
very well.
..
Charles Bukowski
August 16, 1920 – March 9, 1994
German-born American poet, novelist, and short story writer.
Poem Courtesy: https://bukowski.net/poems/the_riots.php
మనమేం చేయ్యగలం?… చార్ల్స్ బ్యుకోవ్స్కీ , అమెరికను కవి
మహా అయితే మానవత్వంలో ఉన్నదేమిటి కాస్తంత మార్దవత్వం తప్ప.
కాసింత అవగాహన, అప్పుడప్పుడు
సాహసోపేతమైన పనులు.
కానీ స్థూలంగా చూసినపుడు అది ఏ మాత్రం సరుకులేని
శూన్యమైన గోళాకారపు ముద్ద.
నిద్రలో మునిగిన భీకరమైన జంతువులాంటిదది.
దాన్ని ఎవరూ ఒకపట్టాన నిద్రలేపలేరు.
పొరపాటున నిద్రలేపినా, అది స్వార్థం, హత్యలూ, అన్యాయమైన తీర్పులూ
క్రౌర్యం ప్రదర్శించడంలోనూ మాత్రమే బాగా పనిచేస్తుంది.
ఇలాంటి మానవత్వంతో మనకేమిటి ఉపయోగం?
ఏమీ లేదు.
ఎంత వీలయితే అంత దానికి దూరంగా ఉండడం మంచిది.
అర్థంలేనిదీ, దుర్మార్గమూ, విషతుల్యమైనదాన్ని
ఎలా చూస్తారో అలా దాన్ని చూడాలి.
కానీ జాగ్రత్త! దాన్ని మీనుండి పరిరక్షించుకుందికి
అప్పుడే చట్టాలు చేసే ఉంది.
అది మిమ్మల్ని ఏ కారణం చూపించకుండా చంపొచ్చు.
దానినుండి పారిపోవాలంటే మీకు చాలా చతురత కావాలి.
కొద్దిమందే దాన్ని తప్పించుకోగలరు.
ఏ ప్రణాళిక వేస్తారన్నది మీరు ఆలోచించుకోవలసిందే.
దాన్ని తప్పించుకున్నవాణ్ణి నేనింతవరకు చూడలేదు.
నేను చాలా చాలా ప్రముఖుల్నీ,గొప్పవాళ్ళనీ కలిసేను
గానీ, వాళ్ళూ దాన్ని తప్పించుకోలేకపోయారు, కారణం
వాళ్ళు మానవత్వం పరిథిలోనే గొప్పవాళ్ళూ
ప్రముఖులూ అవగలిగేరు.
నేనూ తప్పించుకోలేకపోయాను.
గానీ తప్పించుకుందికి కసారి తప్పితే
మరొకసారి ప్రయత్నించడం మానలేదు.
ప్రాణం పోయే లోపు, నేను నా జీవితాన్ని
అందుకోగలనని ఆశిస్తున్నాను.
.
చార్ల్స్ బ్యుకోవ్స్కీ
August 16, 1920 – March 9, 1994
అమెరికను కవి
.
What can we do?
At their best, there is gentleness in Humanity.
Some understanding and, at times, acts of
courage
But all in all it is a mass, a glob that doesn’t
have too much.
It is like a large animal deep in sleep and
almost nothing can awaken it.
When activated it’s best at brutality,
selfishness, unjust judgments, murder.
What can we do with it, this Humanity?
Nothing.
Avoid the thing as much as possible.
Treat it as you would anything poisonous, vicious
and mindless.
But be careful. It has enacted laws to protect
itself from you.
It can kill you without cause.
and to escape it you must be subtle.
Few escape.
It’s up to you to figure a plan.
I have met nobody who has escaped.
I have met some of the great and
famous but they have not escaped
for they are only great and famous within
Humanity.
I have not escaped
but I have not failed in trying again and
again.
Before my death I hope to obtain my
life.
.
Charles Bukowski
August 16, 1920 – March 9, 1994
German-born American Poet, Novelist and Short Story Writer
Poem Courtesy:
https://bukowski.net/poems/what.php
పురికొసను పోలిన క్రూరత్వం … చార్ల్స్ బ్యుకోవ్ స్కీ, అమెరికను
[గమనిక:
వ్యవహారంలో జనపనారతో పేనిన తాడుని కూడా పురికొస అంటారు. కానీ, ఇక్కడ అదికాదు.
విశాఖపట్నం, విజయనగరం ప్రాంతాల్లో అచ్చం సాలీడుని పోలి, కుట్టినపుడు మనిషికి విషం ఎక్కే పురుగుని పురికొస అంటారు.]
.
మంచి మధ్యాహ్న వేళ
వాళ్ళు నిన్ను
యురోపులో ఏ కాఫీ హోటల్లోనైనా
ముందువరుస టేబిళ్ళదగ్గర
కూచో నివ్వరు.
నువ్వుగాని అలా కూచున్నావో
ఎవడో ఒకడు పక్కనుండి
వాహనం నడుపుకుంటూ వచ్చి
నీ గొంతులో, సబ్ మెషీన్ గన్ తో
తూటాలు దించి పోతాడు.
వాళ్ళు నిన్నెక్కడా
నాలుగురోజులపాటు
హాయిగా సుఖంగా
ఉండనీరు.
నువ్వు ప్రశాంతంగా కూచునీ
నాలుగు చోట్లకీ కులాసాగా తిరుగుతూ
ఉందామంటే ఆ శక్తులు ఉండనీవు.
నువ్వు వాళ్ళు చెప్పినట్టు
నడుచుకోవలసిందే.
అసంతుష్టులూ, క్రూరులూ,
ప్రతీకారంతోరగిలేవారూ
వీళ్ళందరికీ
ఆ ఆవేశం తీర్చుకుందికి
ఒక లక్ష్యం కావాలి.
అది నువ్వు కావచ్చు,
మరొకరు కావచ్చు
లేదా బాధలో ఉన్న ఎవరైనా కావొచ్చు
అంతకంటే మెరుగైనది
శవాలై ఏ కన్నంలోకో
విసిరేసినవాళ్ళు
కావొచ్చు.
ఈ భూమ్మీద మనుషులు
తిరుగాడుతున్నంత కాలం
ప్రశాంతత అన్నది
ఏ మనిషికీ
ఎక్కడా దొరకదు.
ఇక్కడే కాదు
వాళ్లు ఇంకే ప్రదేశానికి
పారిపోయినా.
మహా అయితే
మీరు చెయ్యగలిగింది
ఇక్కడ
ఒక పది నిముషాలో
అదృష్టం బాగుంటే
అక్కడ ఒక గంటో
గడిపెయ్యవచ్చు.
ఈ క్షణంలో
మీకు వ్యతిరేకంగా
ఏదో పనిచేస్తోంది.
నేను ఎవరిగురించో
చెప్పడం లేదు
మీ గురించే.
మీరంటే, అక్షరాలా మీరే.
.
చార్ల్స్ బ్యుకోవ్ స్కీ
August 16, 1920 – March 9, 1994
అమెరికను.
.
Relentless as the tarantula
.
they’re not going to let you
sit at a front table
at some cafe in Europe
in the mid-afternoon sun.
if you do, somebody’s going to
drive by and
spray your guts with a
submachine gun.
they’re not going to let you
feel good
for very long
anywhere.
the forces aren’t going to
let you sit around
fucking-off and
relaxing.
you’ve got to go
their way.
the unhappy, the bitter and
the vengeful
need their
fix – which is
you or somebody
anybody
in agony, or
better yet
dead, dropped into some
hole.
as long as there are
humans about
there is never going to be
any peace
for any individual
upon this earth or
anywhere else
they might
escape to.
all you can do
is maybe grab
ten lucky minutes
here
or maybe an hour
there.
something
is working toward you
right now, and
I mean you
and nobody but
you.
.
Charles Bukowski
August 16, 1920 – March 9, 1994
American
Poem Courtesy:
https://bukowski.net/poems/relentless_as_the_tarantula.php
అయితే, నువ్వు రచయితవి కావాలనుకుంటున్నావన్న మాట!… ఛార్ల్స్ బ్యుకోవ్ స్కీ, అమెరికను కవి
ఇన్ని జరిగినప్పటికీ,
అది నీలోంచి విస్ఫోటనం చెందుతూరాకపోతే
నువ్వు రాయకు.
నువ్వు అడక్కుండనే నీ
గుండెలోంచీ, మనసులోంచీ, నోటిలోంచీ
నీ గొంతులోంచీ రాకపోతే,
నా మాటవిని రాయకు!
దానికోసం నువ్వు గంటలతరబడి
నీ కంప్యూటరు తెరవంక తేరిపారచూస్తూనో,
లేక, నీ టైపురైటరు మీద వాలిపోయో
మాటలకోసం వెతుక్కుంటూ
కూచోవలసి వస్తే
రాయకు!
నువ్వు డబ్బు కోసమో,
కీర్తికోసమో రాస్తుంటే
దయచేసి ఆ పని చెయ్యకు.
స్త్రీల పొందు దొరుకుందని ఆశించి
నువ్వు రాద్దామనుకుంటే,
రాయొద్దు.
నువ్వు అక్కడ కూచుని
పదే పదే చెరిపిరాయవలసి వస్తే
నా మాటవిని రాయొద్దు.
దాని గురించి ఆలోచించడమే పెద్ద శ్రమ అనుకుంటే
రాయవద్దు.
నువ్వు మరొకరిలా రాద్దామని
ప్రయత్నిస్తుంటే
ఆ విషయం మరిచిపోవడం మంచిది.
అది నీలోంచి ఉరుముతున్నట్టు రావడానికి
నిరీక్షించాల్సి వస్తే,
దానికోసం ఎంతకాలమైనా నిరీక్షించు.
అదెప్పటికీ నీలోంచి ఉరుముతూ రాకపొతే
మరోపని మొదలెట్టు.
నువ్వు రాసింది ముందుగా నీ భార్యకో
ప్రేయసికో, నీప్రియుడికో,
తల్లిదండ్రులకో, అసలెవరికో ఒకరికి
చూపించడం తప్పనిసరి అయితే
నువ్వు రాయడానికి ఇంకా సిద్ధంగా లేవు.
నువ్వుకూడా అందరు రచయితల్లాగే ఉండకు
నువ్వుకూడా తాము రచయితలమని చెప్పుకునే
వేలాదిమందిలో ఒకడివి కావద్దు
నీరసంగా, విసిగెత్తిస్తూనో
లేనిది ఉన్నట్టు నటిస్తూనో,
నీమీద నువ్వు జాలిపడుతూనో ఉండకు.
ఇప్పటికే ప్రపంచంలోని
గ్రంధాలయాలన్నీ
ఇలాంటి రాతలతో నిండి
ఆవులిస్తూ
నిద్దరోతున్నాయి.
వాటికి మరొకటి జోడించకు.
అది నీ చైతన్యంలోంచి
రాకెట్టులా దూసుకుంటూ రాకపోతే,
రాయకుండా ఉండడం
నీకు పిచ్చెక్కించడమో
ఆత్మహత్యకో, హత్యకో
నిన్ను పురికొల్పేలా లేకపోతే
రాయొద్దు.
నీలోని అగ్నిజ్వాలలు
నీ గొంతు దహిస్తూ ఉండకపోతే,
రాయకు.
ఆ సమయం నిజంగా వచ్చినపుడు
అది నిన్ను ఎంచుకున్నపుడు,
దానంతట అదే
వస్తుంది. అంతే కాదు,
అది నువ్వు మరణించేదాకానో
అది నీలో మరణించేదాకానో
వస్తూనే ఉంటుంది.
అంతకంటే వేరే మార్గం లేదు.
ఇంతకు మునుపూలేదు.
.
ఛార్ల్స్ బ్యుకోవ్ స్కీ
August 16, 1920 – March 9, 1994
అమెరికను కవి
.
.
So You Want To Be A Writer
.
if it doesn’t come bursting out of you
in spite of everything,
don’t do it.
unless it comes unasked out of your
heart and your mind and your mouth
and your gut,
don’t do it.
if you have to sit for hours
staring at your computer screen
or hunched over your
typewriter
searching for words,
don’t do it.
if you’re doing it for money or
fame,
don’t do it.
if you’re doing it because you want
women in your bed,
don’t do it.
if you have to sit there and
rewrite it again and again,
don’t do it.
if it’s hard work just thinking about doing it,
don’t do it.
if you’re trying to write like somebody
else,
forget about it.
if you have to wait for it to roar out of
you,
then wait patiently.
if it never does roar out of you,
do something else.
if you first have to read it to your wife
or your girlfriend or your boyfriend
or your parents or to anybody at all,
you’re not ready.
don’t be like so many writers,
don’t be like so many thousands of
people who call themselves writers,
don’t be dull and boring and
pretentious, don’t be consumed with self-
love.
the libraries of the world have
yawned themselves to
sleep
over your kind.
don’t add to that.
don’t do it.
unless it comes out of
your soul like a rocket,
unless being still would
drive you to madness or
suicide or murder,
don’t do it.
unless the sun inside you is
burning your gut,
don’t do it.
when it is truly time,
and if you have been chosen,
it will do it by
itself and it will keep on doing it
until you die or it dies in you.
there is no other way.
and there never was.
.
Charles Bukowski
American.
చెత్తబుట్ట… చార్లెస్ బ్యుకోవ్ స్కీ, అమెరికను కవి
ఇది గొప్పవిషయం. నేను ఇప్పుడే రెండు కవితలు
రాసేనుగాని, రెండూ నచ్చలేదు.
ఈ కంప్యూటర్లో
ఒక చెత్తబుట్టఉంది.
ఆ కవితల్ని అలా తీసుకువచ్చి
చెత్తబుట్టలో
పడేసేను.
ఇక శాశ్వతంగా కనుమరుగైపోయాయి
కాగితం లేదు, చప్పుడు లేదు,
కోపమూ లేదు, అనుబంధమూ లేదు,
ఇప్పుడు
కేవలం శుభ్రంగా ఉన్న తెర
నీకోసం ఎదురుచూస్తుంటుంది.
ఎప్పుడూ ఇదే మేలైనది
సంపాదకులు దాన్ని తిరస్కరించేకంటే
మనమే దాన్ని తిరస్కరించడం.
ముఖ్యంగా ఇలాంటి వర్షపు రాత్రి
రేడియోలో
చెత్త సంగీతం వినిపిస్తున్నపుడు.
నాకు తెలుసు
మీరేమని
ఆలోచిస్తున్నారో:
“అతను డొంకతిరుగుడుగా
వచ్చిన ఈ కవితని కూడా
చెత్తబుట్టలో పడెస్తే బాగుండేది” అని.
హా! హా! హా!!
హా!!!
ఛార్లెస్ బ్యుకోవ్ స్కి
August 16, 1920 – March 9, 1994
అమెరికను కవి
.
Charles Bukowski
Courtesy: Wikipedia
.
the trash can
this is great, I just wrote two
poems I didn’t like.
there is a trash can on this
computer.
I just moved the poems
over
and dropped them into
the trash can.
they’re gone forever, no
paper, no sound, no
fury, no placenta
and then
just a clean screen
awaits you.
it’s always better
to reject yourself before
the editors do.
especially on a rainy
night like this with
bad music on the radio.
and now–
I know what you’re
thinking:
maybe he should have
trashed this
misbegotten one
also.
ha, ha, ha,
ha.
.
Charles Bukowski
August 16, 1920 – March 9, 1994
American Poet
Courtesy:
http://wonderingminstrels.blogspot.in/search?q=charles+bukowski
అవును… చార్ల్స్ బ్యుకోవ్స్కీ, అమెరికను
ఒంటరితనాన్ని మించిన
బాధాకరమైన విషయాలు
అనేకం ఉన్నాయి.
కానీ,
అది గ్రహించే లోపున
దశాబ్దాలు గడిచిపోతాయి.
తీరా తెలుసుకునే వేళకి
కాలాతీతమైపోతుంది.
సమయం మించిపోవడాన్ని
మించిన
బాధాకరమైన విషయం
మరొకటి లేదు.
.
చార్ల్స్ బ్యుకోవ్స్కీ
August 16, 1920 – March 9, 1994
అమెరికను
.
oh yes
.
there are worse things than
being alone
but it often takes decades
to realize this
and most often
when you do
it’s too late
and there’s nothing worse
than
too late.
.
Charles Bukowski
August 16, 1920 – March 9, 1994
American Poet , Novelist and short story writer
Poem Courtesy:
http://wonderingminstrels.blogspot.com/search/label/Poet%3A%20Charles%20Bukowski
కట్టు కథ… చార్ల్స్ బ్యుకోవ్ స్కీ, అమెరికను కవి
నీ చిన్ని నీలి నీలి చేతులతో చిమ్మనగ్రోవిదగ్గర
నీళ్ళు త్రాగడం ఊహించగలను; కాకపోతే నీ చేతులు
మరీ చిన్నవి కావు, చిమ్మనగ్రోవి ఫ్రాన్సులో ఉంది;
నువ్వు అక్కడినుండే నీ ఆఖరి ఉత్తరాన్ని రాసేవు.
నేను సమాధానం ఇచ్చేనుగాని నువ్వు తిరిగి జవాబివ్వలేదు.
నువ్వు ఏవో చాలా పిచ్చి పిచ్చి కవితలు రాస్తుండేదానివి
పెద్ద అక్షరాలలో దేచీ దేవతలంటూ;
నీకు చాలా మంది పెద్ద పెద్ద కళాకారులు తెలుసు
అందులో చాలా మంది నీ ప్రేమికులు. ఫర్వాలేదు, నీ ఇష్టమొచ్చినట్టు
ఉండమని నేన్నీకు ఉత్తరం రాసేను, మనమెప్పుడూ కలవలేదనీ
కనుక నువ్వంటే నాకు అసూయ లేదనీ. మనమిద్దరం
న్యూ ఆర్లీన్స్ లో నాలుగిళ్ళ దూరంలో ఉన్నాం, అయినా
కలుసుకోలేదు. కనుక నువ్వు గొప్పగొప్పవాళ్ళతోటే తిరిగేవు
గొప్పగొప్పవాళ్లగురించే వ్రాసేవు. కాకపోతే,
నీకు చివరికి తెలిసొచ్చిందేంటంటే
గొప్పవాళ్ళకి వాళ్ళ పేరుగురించే ధ్యాస తప్ప
ఒక అందమైన అమ్మాయి తమతో ఉండనిగాని
వాళ్ళకి కావలసినవన్నీ అందిస్తూ, మర్నాడు ఎప్పట్లా లేచి
దేముడూ, దేవతలంటూ పెద్దక్షరాలతో
ఏదో రాసుకోవడం పట్టదని.
మనకి తెలుసు దేముడు లేడని. వాళ్ళు అదే చెప్పారు.
కాని, నాకు నిన్ను వింటుంటే నాకు సందేహం కలుగుతుంది.
దాన్ని తాటికాయంత అక్షరాలతో చెప్పాలేమో!
నాకు తెలిసి నువ్వే ఉత్తమోత్తమ కవయిత్రివి
అదే సంపాదకులకీ, ప్రచురణకర్తలకీ చెప్పాను:
“.. ఆమెవి ప్రచురించండి. ఆమెకు కొంచెం తిక్క ఉంది.
కాని ఆమె మాటల్లో మంత్రశక్తి ఉంది.
ఆమె ప్రేమలో అసత్యం లేదు,” అని.
నేను నిన్ను ప్రేమించాను…
ఒక పురుషుడు కేవలం ఉత్తరాలు మాత్రమే రాస్తూ,
ఆమె ఫొటోలు దగ్గరుంచుకోవడం తప్ప,
అన్నడూ కలుసుకోని స్త్రీని ఎలా ప్రేమిస్తాడో
అలా నేను నిన్ను ప్రేమించాను. బహుశా మనిద్దరం
ఒక చిన్న గదిలో ఉంటూ, నేను సిగరెట్టు చుట్టుకుంటూ
ఉంటుంటే, నిన్ను ఇంకా ఎక్కువ ప్రేమించేవాడినేమో.
కానీ, అది అలా జరగలేదు. నీ ఉత్తరాలు రాను రాను
వేదనాభరితమవ సాగేయి. నీ ప్రేమికులు నిన్ను మోసగించేరు.
“ఓ పిల్లా! ప్రేమికులందరూ మోసగిస్తారే, ” అని రాసేన్నేను.
దానివల్ల ప్రయోజనం కనిపించలేదు.
నువ్వు రాసేవు… నువ్వెప్పుడూ ఏడవడానికి
ఒక బెంచిమీద కూర్చుంటావనీ, అది ఓ వంతెనమీద ఉందనీ
ఆ వంతెన నదిమీద ఉందనీ. ప్రతి రాత్రీ
ఆ బెంచీ మీద కూచుని నిన్ను మరిచి, నీ మనసు
గాయం చేసిన ప్రేమికులను తలుచుకుని ఏడుస్తావని.
నేను ఉత్తరం రాసేను గాని సమాధానం రాలేదు.
నువ్వు ఆత్మహత్య చేసుకున్నావని, అది జరిగిన
మూడు నాలుగు నెలల తర్వాత ఒక మిత్రుడు నాకు రాసేడు.
ఒక వేళ మనిద్దరం కలిసినా నేను నీకో
నువ్వు నాకో అన్యాయం చేసి ఉండేవాళ్లమేమో!
ఇది ఇలాగే ఉండడం మంచిదయింది.
.
చార్ల్స్ బ్యుకోవ్ స్కీ
అమెరికను కవి
.
.
An Almost Made Up Poem
I see you drinking at a fountain with tiny
blue hands, no, your hands are not tiny
they are small, and the fountain is in France
where you wrote me that last letter and
I answered and never heard from you again.
you used to write insane poems about
ANGELS AND GOD, all in upper case, and you
knew famous artists and most of them
were your lovers, and I wrote back, it’ all right,
go ahead, enter their lives, I’ not jealous
because we’ never met. we got close once in
New Orleans, one half block, but never met, never
touched. so you went with the famous and wrote
about the famous, and, of course, what you found out
is that the famous are worried about
their fame –– not the beautiful young girl in bed
with them, who gives them that, and then awakens
in the morning to write upper case poems about
ANGELS AND GOD. we know God is dead, they’ told
us, but listening to you I wasn’ sure. maybe
it was the upper case. you were one of the
best female poets and I told the publishers,
editors, “ her, print her, she’ mad but she’
magic. there’ no lie in her fire.” I loved you
like a man loves a woman he never touches, only
writes to, keeps little photographs of. I would have
loved you more if I had sat in a small room rolling a
cigarette and listened to you piss in the bathroom,
but that didn’ happen. your letters got sadder.
your lovers betrayed you. kid, I wrote back, all
lovers betray. it didn’ help. you said
you had a crying bench and it was by a bridge and
the bridge was over a river and you sat on the crying
bench every night and wept for the lovers who had
hurt and forgotten you. I wrote back but never
heard again. a friend wrote me of your suicide
3 or 4 months after it happened. if I had met you
I would probably have been unfair to you or you
to me. it was best like this.
.
Charles Bukowski
చవకబారు సత్రం….ఛార్లెస్ బ్యుకోవ్స్కీ, అమెరికను కవి
చవకబారు సత్రంలో
నువ్వు ఎన్నడైనా ఉండి ఉండకపోతే
నీకు జీవితం అంటే ఏమిటో తెలియనట్టే…
అక్కడ ఒక్కటే బల్బూ
56 మంది మనుషులూ
మంచాలమీద ఇరుక్కుంటూ…
అందరూ ఒకేసారి గురకపెడుతూ;
అందులో కొందరి గురక
నమ్మలేనంత
దీర్ఘంగా,
గట్టిగా
ఘోరంగా
అమానుషంగా ఉండి
సాక్షాత్తూ
నరకంనుండి
వస్తున్నాయా అనిపిస్తుంది.
ఆ మృత్యుఘోషని
మరపించే గురకకి
దానితో కలగలిసిన
దుర్గంధానికీ
నీకు మతిపోయినంత
పనిజరుగుతుంది:
ఎన్నడూ
ఉతికి ఎరగని మేజోళ్ళూ
మలమూత్రాల
వాసన పట్టెసిన
లో దుస్తులూ
వాటిమీదనుండి
మూతలేని
పెంటబుట్టలమీద నుండి
వచ్చే దుర్వాసనలా
అక్కడక్కడే
తిరుగుతున్న గాలి;
చీకట్లో
కొన్ని సన్నగా
కొన్ని లావుగా
కొన్ని వంగీ,
చేతుల్లేనివీ,
కాళ్ళు లేనివీ
మతిలేనివీ
శరీరాలు,
అన్నిటికీ మించి
వాటిలో
ఎక్కడా
ఏ కోశానా
ఆశ అన్నఊసులేకుండా
కప్పి ఉన్న నిరాశ.
వాటిని
భరించడం కష్టం.
నువ్వులేచి
బయటకి పోతావు
వీధుల్లో
కాలిబాటల్లో
అటూ ఇటూ
పచార్లు చేస్తూ,
సందు మలుపులోని
భవనాలు దాటీ
తిరిగిన వీధే
తిరుగుతావు
ఆ మనుషుల గురించి
ఆలోచిస్తూ:
వీళ్ళంతా ఒకప్పుడు
పిల్లలే గదా
వీళ్ళకేమయింది?
అసలు నాకేమయింది?
అక్కడ అంతా
చీకటిగా
చలిగా
ఉంటుంది.
.
ఛార్లెస్ బ్యుకోవ్స్కీ
August 16, 1920 – March 9, 1994
అమెరికను కవి
Note: Read about Flophouse(చవకబారు సత్రం) here
Charles Bukowski
.
Flophouse
.
You haven’t lived
until you’ve been in a
flophouse
with nothing but one
light bulb
and 56 men
squeezed together
on cots,
with everybody
snoring
at once;
and some of those
snores
so
deep and
gross and
unbelievable-
dark
snotty
gross
subhuman
wheezings
from hell
itself.
Your mind
almost breaks
under those
death-like
sounds
and the
intermingling
odors:
hard
unwashed socks
pissed and
shitted
underwear
and over it all
slowly circulating
air
much like that
emanating from
uncovered
garbage;
and those
bodies
in the dark
fat and
thin
and
bent
some
legless
armless
some
mindless
and worst of
all:
the total
absence of
hope
it shrouds
them
covers them
totally.
It’s not
bearable.
You get
up
go out
walk the
streets
up and
down
sidewalks
past buildings
around the
corner
and back
up
the same street
thinking
those men
were all
children
once
what has happened
to
them?
and what has
happened
to
me?
it’s dark
and cold
out
.
Charles Bukowski
August 16, 1920 – March 9, 1994
German-born American poet, novelist and short story writer.
కొన్ని జీవితాలంతే! … ఛార్ల్స్ బ్యుకోవ్ స్కీ, అమెరికను
పొద్దు పొడవబోతోంది.
టెలిఫోను తీగలమీద కాకులు
నిరీక్షిస్తున్నాయి
నిన్న నే మరిచిపోయిన
సాండ్ విచ్ ని
ప్రశాంతమైన ఈ ఆదివారం
ఉదయం 6 గంటలకి తింటుంటే.
ఆ మూలని ఒక జోడు
నిటారుగా నిలబడి ఉంది
రెండవది దానిపక్కనే
ఒత్తిగిలి పడుంది.
నిజం! కొన్ని జీవితాలంతే!
వృధా అవడానికే ఉంటాయి.
.
ఛార్ల్స్ బ్యుకోవ్ స్కీ
August 16, 1920 – March 9, 1994
అమెరికను.
.
.
It was just a little while ago
.
almost dawn
blackbirds on the telephone wire
waiting
as I eat yesterday’s
forgotten sandwich
at 6 a.m.
on a quiet Sunday morning.
one shoe in the corner
standing upright
the other laying on its
side.
Yes, some lives were made to be
wasted.
.
Charles Bukowski.
August 16, 1920 – March 9, 1994
American
Poem Courtesy: Page 60 of
Click to access charles_bukowski_.pdf