అనువాదలహరి

ప్రేమించకండి… కెరొలీన్ నార్టన్, ఇంగ్లీషు కవయిత్రి

ప్రేమించకండి, ప్రేమించకండి ఓ మట్టి బొమ్మల్లారా!
ఆశల మనోహరమైన పూల సరులు మట్టితో చేసినవే,
విరబూచి నిండా కొన్నిగంటలయినా గడవక ముందే
అవి వాడి కళావిహీనమై రాలిపోడానికి పుట్టినవే
ప్రేమించకండి!

ప్రేమించకండి! మీరు ప్రేమించే వస్తువు మారిపోవచ్చు;
గులాబివన్నె పెదవి మిముజూసి చిరునవ్వు నవ్వకపోవచ్చు,
ఇంతవరకు కరుణగా చూసిన కళ్ళు ఇపుడు నిర్లిప్తంగా, వింతగా చూడొచ్చు,
గుండె ప్రేమతో కొట్టుకోవచ్చు, కానీ అది నిజం కాకపోవచ్చు.
ప్రేమించకండి!

ప్రేమించకండి! మీరు ప్రేమించిన వ్యక్తి మరణించవచ్చు,
ఆనందదాయకమూ, ఆహ్లాదకరమైన భూమిపై నశించవచ్చు;
మౌనంగా నక్షత్రాలూ, చిరునవ్వులు చిందే వినీలాకాశమూ
పుట్టినప్పటి లాగే, ప్రేమిక సమాధిపై కాంతులు విరజిమ్మవచ్చు.

ప్రేమించకండి! అయ్యో, ఈ హెచ్చరిక వృధా అయిపోతుంది
ఈ కాలంలోనూ, గడచిన యుగాల్లోనూ ఒక్కలాగే!
ప్రేమిక తలపై ఒక కాంతివలయం చుడుతుంది ప్రేమ
అనంతంగా,లోపరహితంగా; మార్పో, మరణమో హరించేదాకా.
ప్రేమించకండి!

.
కెరొలీన్ ఎలిజబెత్ నార్టన్

(22 March 1808 – 15 June 1877)
ఇంగ్లీషు కవయిత్రి

.

Caroline Norton

.

 “Love not”

.

Love not, love not, ye hapless sons of clay!

Hope’s gayest wreaths are made of earthly flowers,—

Things that are made to fade and fall away

Ere they have blossomed for a few short hours.

                        Love not!

Love not! the thing ye love may change;

The rosy lip may cease to smile on you,

The kindly-beaming eye grow cold and strange,

The heart still warmly beat, yet not be true.

                        Love not!

Love not! the thing you love may die,—

May perish from the gay and gladsome earth;

The silent stars, the blue and smiling sky,

Beam o’er its grave, as once upon its birth.

                        Love not!

Love not! O warning vainly said

In present hours as in years gone by!

Love flings a halo round the dear one’s head,

Faultless, immortal, till they change or die.

                        Love not!

.

Caroline Elizabeth Sarah (Sheridan) Norton

(22 March 1808 – 15 June 1877)

English Poetess

Poem Courtesy:

The World’s Best Poetry.

Eds: Bliss Carman, et al.,

Volume III. Sorrow and Consolation.  1904.

  1. Disappointment in Love

http://www.bartleby.com/360/3/4.html

నిన్ను ప్రేమించడం లేదు… కెరొలీన్ నార్టన్, ఇంగ్లీషు కవయిత్రి

నిన్ను ప్రేమించడం లేదు__ నిజంగానే, నిన్ను ప్రేమించడం లేదు!

అయినా, నువ్వు కనిపించకపోతే నాకు బాధగా ఉంటుంది;

నీ నెత్తిమీది వినీలాకాశం అన్నా నాకు అసూయే,

అక్కడి నిశ్శబ్దతారకలు నిన్ను చూసి ఆనందిస్తాయని.

నేను నిన్ను ప్రేమించడం లేదు. అయినా, ఎందుకో కారణం తెలీదు,

నువ్వు ఏది చేసినా నాకు బాగున్నట్టే కనిపిస్తుంది, నాకు;

  తరచు, నేను ఒంటరిగా ఉన్నప్పుడు నిట్టూరుస్తుంటాను,

నేను ప్రేమిస్తున్నవాళ్ళు నీలాగ లేరే అని!

నేను నిన్ను ప్రేమించడం లేదు. అయినా, నువ్వు నిష్క్రమించేక

ఇతరులు, నాకు ఎంత ప్రేమాస్పదులైనా, మాటాడుతుంటే చిరాకు వేస్తుంది

ఎందుకంటే, నా చెవులపై నువ్వు విడిచిన తీయని మాటల సవ్వడి

పదే పదే చేసే ప్రతిధ్వనులకి అవి అడ్డుతగులుతుంటాయి.

 

నేను నిన్ను ప్రేమించడం లేదు!— అయినా, మాటాడే నీ కన్నులు,

చాల లోతుగా, కాంతివంతంగా, భావగర్భితంగా ఉండే ఆ కళ్ళు

నాకూ ఈ అర్థరాత్రి ఆకాశానికీ నడుమ తరచు మెరుస్తుంటాయి

నేను ఇంతవరకు ఎరిగిన ఏ కనులకన్నా భిన్నంగా. 

 

నాకు తెలుసు నిన్ను ప్రేమించడం లేదని. కాని చిత్రం!

ఎవరూ కపటంలేని నా మనసుని ఎంతమాత్రం నమ్మరు;

తరచు వాళ్ళు అలా పోతూ పోతూ నవ్వడం కనిపెడుతుంటాను,

ఎందుకంటే, వాళ్ళు నేన్నిన్ను తేరి చూడ్డం గమనిస్తుంటారు.

.

కెరోలీన్ నార్టన్

(22 March 1808 – 15 June 1877)

ఇంగ్లీషు కవయిత్రి.

.

.

I do not love Thee

.

I DO not love thee!—no! I do not love thee!

And yet when thou art absent I am sad;

   And envy even the bright blue sky above thee,

Whose quiet stars may see thee and be glad.

I do not love thee!—yet, I know not why,

Whate’er thou dost seems still well done, to me:

   And often in my solitude I sigh

That those I do love are not more like thee!

I do not love thee!—yet, when thou art gone,

I hate the sound (though those who speak be dear)

   Which breaks the lingering echo of the tone

Thy voice of music leaves upon my ear.

I do not love thee!—yet thy speaking eyes,

With their deep, bright, and most expressive blue,

   Between me and the midnight heaven arise,

Oftener than any eyes I ever knew.

I know I do not love thee! yet, alas!

Others will scarcely trust my candid heart;

   And oft I catch them smiling as they pass,

Because they see me gazing where thou art.

.

Caroline Elizabeth Sarah Norton

(22 March 1808 – 15 June 1877)

English feminist, social reformer

Poem Courtesy: http://www.bibliomania.com/0/0/frameset.html

 

 

పేరు … కేరొలీన్ నార్టన్

http://www.google.co.in/imgres?q=Angst+of+Love&start=12&num=10&um=1&hl=en&biw=960&bih=427&tbm=isch&tbnid=-0n09XXm0uyptM:&imgrefurl=http://operationobsession.wordpress.com/2011/07/14/a-lannister-always-pays-his-debts/&docid=HvwQG0bhvKL1pM&imgurl=http://operationobsession.files.wordpress.com/2011/07/game-of-thrones-arya-stark-31.png&w=500&h=282&ei=fdzTToH9CMLqrAfSnoHVDA&zoom=1
Image Courtesy: http://www.google.co.in

.

పేరులో ఏముంది?… షేక్స్పియర్

.

నీ పేరొకప్పుడు సమ్మోహనమంత్రం, ఆలోచనలన్నీ దాని చుట్టూతిరిగేవి.

తపించే కలలనుండీ, కోరికలనుండీ ఆ ధ్వని మేల్కొలిపేది.

కొత్తవాళ్ళెవరయినా నీ పేరు ఊరికే పొగడడానికో,  నిందించడానికో ఉఛ్ఛరించినపుడల్లా, 

నాకు శరీరం గగుర్పొడిచి, అంతరాంతరాలలో చెప్పనలవికాని ఆనందానుభూతి ఎగసిపడేది.

.

ఎన్ని సంవత్సరాలు… ఎన్ని సంవత్సరాలు దొర్లిపోయాయి; నువ్వూ మనిషి మారిపోయేవు;

ఒకప్పుడు సంతోషంగా కలుసుకునే మనం, ఇప్పుడు అపరిచితుల్లా కలుసుకోవాలి;

మన పాత స్నేహితులు నన్ను కలుస్తుంటారప్పుడప్పుడు, కానీ, ఇపుడు ఎవరూ నీ ఊసు ఎత్తరు;

అడిగికూడా ప్రయోజనం లేదిప్పుడు … అయినా నువ్వు నాకేమవుతావని?

.

కానీ నీ పేరు, నాకు పవిత్రమైన నీ పేరు, నా ఏకాంతహృదయంనిండా నిండి ఉంది…

సుదూరగిరినిచయంలో అంతరించిన  ప్రతిధ్వనిలా…

ఒకప్పుడు అది నాలో నినదించిన ఆనందస్వనాలు అంతరించినా…  శాశ్వతంగా సమసిపోయినా,

ఇప్పటికీ, మంద్రంగా, విషాదం పలికిస్తూ, లీలగా కదలాడుతూనే ఉంటుంది.

.

కేరొలీన్ నార్టన్ (22 March 1808 – 15 June 1877)

.

బ్రిటిషు కవయిత్రి, పేరొందిన అందగత్తె, తాడిత పీడిత జనోధ్ధరణకు ఆవిశ్రాంతంగా కృషిచేసిన సాహస స్త్రీ.

ఈమెను కోలెరిడ్జ్ కుమార్తె “స్త్రీమూర్తిలో ఉన్న బైరను” గా అభివర్ణించింది.

.

The Name

. “What’s in a name?’…. Shakespeare.

.

Thy name was once the magic spell, by which my thoughts were bound,

And burning dreams of light and love  were awakened by that sound

My heart beat quick  when stranger tongues, with idle praise or blame,

Awoke its deepest thrill of life, to tremble at that name.

.

Long years—long tears have passed away, and altered is thy brow;

And we met so gladly once, must meet as strangers now;

Friends of yore come round me still, but talk no more of thee;

‘Tis idle ev’n to wish it now —for what art thou to me?

.

Yet still thy name, thy blessed  name, my lonely bosom fills,

Like an echo that hath lost itself among the distant hills,

Which still, with melancholy note, keeps faintly lingering on,

When the jocund sound that once woke it once is gone—for ever gone.

.

Caroline Norton by Sir George Hayter in 1832 Image courtesy: http://upload.wikimedia.org/wikipedia

(1830)

Caroline Elizabeth Sarah Norton (22 March 1808 – 15 June 1877)

British Poet, Renowned beauty, Popular writer and a tireless crusader for the rights of the oppressed. Hartley Coleridge ( The H.C. fame of Wordsworth’s Poem) defined her as  “The Byron of the Poetesses” in the Quarterly Review, September 1840.

.

%d bloggers like this: