అనువాదలహరి

దిగువన… కార్ల్ శాండ్ బర్గ్, అమెరికను

Today is Carl Sandburg’s Birthday.

 

మీ అధికార కెరటాల దిగువన

ఉన్నత శాసనయంత్రాంగపు

పునాది స్తంభాలను నిత్యం తాకుతూ

వ్యతిరేకదిశలో ప్రవహించే తరంగాన్ని నేను

నేను నిద్రపోను

నెమ్మదిగా అన్నిటినీ సంగ్రహిస్తాను

అందనంతలోతుల్లో

మీరు భద్రంగా దాచుకున్న వస్తువులకు

తుప్పునూ, తెగులునూ

కలుగజేసేది నేనే

మీ కంటే

మిమ్మల్ని కన్నందుకు గర్వపడే

వారికంటే పురాతనమైన శాసనాన్ని నేను

మీరు “ఔ”నన్నా

“కా”దన్నా

ఎప్పటికీ

నే వినిపించుకోను.

నేను అన్నిటినీ కూలదోసే

రేపుని.

.

కార్ల్ శాండ్ బర్గ్

(January 6, 1878 – July 22, 1967)

అమెరికను కవి

.

Under

.

I am the undertow

Washing the tides of power,

Battering the pillars

Under your things of high law.

I am sleepless

Slowfaring eater,

Maker of rust and rot

In your bastioned fastenings,

Caissons deep.

I am the Law,

Older than you

And your builders proud.

I am deaf

In all days,

Whether you

Say “yes” or “no!”.

I am the crumbler:

To-morrow.

.

Carl Sandburg

 (January 6, 1878 – July 22, 1967)

American

Poem Courtesy:

https://archive.org/details/poetry01assogoog/page/n115

నే నెవర్ని?… కార్ల్ సాండ్బర్గ్, అమెరికను కవి

నా తల నక్షత్రాలకి తగులుతుంది.

నా పాదాలు మహాపర్వతాల శిరసుల్ని తాకుతాయి.

నా చేతి కొసలు విశ్వజీవన తీరాల్లో, లోయల్లో తిరుగాడుతాయి

ఆదిమ పదార్థాల తొలిశబ్దప్రకంపనల హేలలో చేతులు సారించి

గులకరాళ్లవంటి నా విధివ్రాతతో  ఆడుకుంటాను.

నేను నరకానికి ఎన్నిసార్లు పోయి వచ్చానో!

నాకు స్వర్గంగురించి క్షుణ్ణంగా తెలుసు,

ఎందుకంటే నేను స్వయంగా దేముడితో మాటాడేను.

జుగుప్సాకరమైన రక్తమాంసాదులని చేతులతో కెలికాను.

అందం ఎంతగా సమ్మోహపరుస్తుందో కూడా తెలుసు

“ప్రవేశం లేదు” అన్న బోర్డు చూసిన ప్రతి మనిషి

హృదయంలో రగిలే అద్భుతమైన ధిక్కారధోరణీ నాకు ఎరుకే.

నేను సత్యాన్ని. సృష్టిలో ఎవరికీ అందకుండా

తప్పించుకు తిరిగే దొంగని నేనే.

.

కార్ల్ సాండ్బర్గ్

(January 6, 1878 – July 22, 1967)

అమెరికను కవి

Who Am I

.

My head knocks against the stars.

My feet are on the hilltops.

My finger-tips are in the valleys and shores of

universal life.

Down in the sounding foam of primal things I

reach my hands and play with pebbles of destiny.

I have been to hell and back many times.

I know all about heaven, for I have talked with God.

I dabble in the blood and guts of the terrible.

I know the passionate seizure of beauty

And the marvelous rebellion of man at all signs

reading “Keep Off.”

My name is Truth and I am the most elusive captive

in the universe.

.

Carl Sandburg

(January 6, 1878 – July 22, 1967)

American Poet

Poem Courtesy:

https://100.best-poems.net/who-am-i.html

చివరికి అంతా ఇంతేనా?… కార్ల్ సాండ్ బర్గ్, అమెరికను

చివరికి అంతా ఇంతేనా?

ఇక ఈ ద్వారాలు ఎన్నటికీ తెరుచుకోవా?

తుప్పుపట్టిన తలుపుకమ్ములచుట్టూ ధూళీ- గాలీ

దొంగాటాడుతూ, శరద్గీతికలు నిట్టూర్పులు విడువవలసినదేనా?

 

నువ్వు పర్వతాలను వీక్షిస్తుంటావు

పర్వతాలు నిన్ను చూస్తుంటాయి

నువ్వు “నేను మహాపర్వతాన్నైతే బాగుండును” అనుకుంటావు

మహా పర్వతం ఏమీ ఊహించుకోదు

చివరకి ఇంతేనా?

ఈ ద్వారాలు ఎన్నటికీ- ఎప్పటికీ తెరుచుకోవా?

అంతా దుమ్మూ, గాలీ

తుప్పుపట్టిన తలుపు కమ్ములూ ఓహ్, ఓహ్ అంటూ

ఎండుటాకుల్లో నిట్టూర్పులు విడిచే శరద్గీతికలూ,

అంతేనా?

గాలిలో శోకగీతికలు తప్ప మరొకటి వినిపించవా?

గాయకులు కనిపించరా? పాటలను ఆలపించే పెదాలు కనిపించవా?

హృదయం గాయపడిన స్త్రీ ఇలా నీకు చెబుతోందని చెబుతున్నావా?

చివరకి అంతా ఇంతేనా?

.
కార్ల్ సాండ్ బర్గ్
January 6, 1878 – July 22, 1967
అమెరికను కవి

carl-sandburg

.

And this will be all?

.

And this will be all?

And the gates will never open again?

And the dust and the wind will play around the rusty door

hinges and the songs of October moan, Why-oh, why-oh?

And you will look to the mountains

And the mountains will look to you

And you will wish you were a mountain

And the mountain will wish nothing at all?

This will be all?

The gates will never-never open again?

The dust and the wind only

And the rusty door hinges and moaning October

And Why-oh, why-oh, in the moaning dry leaves,

This will be all?

Nothing in the air but songs

And no singers, no mouths to know the songs?

You tell us a woman with a heartache tells you it is so?

This will be all?

.

Carl Sandburg

American

లాయర్లకి మరీ ఎక్కువ తెలుసు… కార్ల్ సాండ్ బర్గ్, అమెరికను

బాబ్! లాయర్లకి చాలా ఎక్కువ తెలుసు.
వాళ్ళు జాన్ మార్షల్ పుస్తకాలు ఆపోసన పట్టిన వారు.
వాళ్లకంతా తెలుసు, చచ్చినవాడు ఏమిటి రాసాడో,
అందులోనూ, మృతుడి బిరుసెక్కిన చేతులు,
కణుపులు పట్టుతప్పుతుంటే, చేతి వేళ్ళ ఎముకలు
సున్నంలా రాలిపోతుంటే ఏం రాసారో. లాయర్లకి
బాగా తెలుసు, చనిపోయినవాడి ఆలోచనలేమిటో.

బేరసారాలు చేసే లాయర్ల అడుగు జాడల్లో, బాబ్!
తప్పించుకుందికి అనువుగా మరీ ఎక్కువ “అనుమానా”లు,
“ఐనప్పటికీ”లు, “ఇంతకుముందెన్నడూ”లు, “అలా అయితేనే”లు,
“అలా కాకుండా”లు, చాలా ద్వారాలుంటాయి
రావడానికైనా పోవడానికైనా వీలుగా.

లాయర్లు వాదించడం పూర్తిచేసిన తర్వాత
బాబ్! అసలేమైనా మిగిలింటుందంటావా?
ఒక చిట్టెలుక దాన్ని కొరికితే
దానిపంటికి ఏదైనా నాటుతుందంటావా?
ఒక లాయరు మరణిస్తే రహస్యంగా
ఎందుకు పండగచేసుకుంటారనుకుంటావు?
అతని శవపేటికని లాగుతున్న గుర్రం
ఎందుకు నవ్వుకుంటుందనుకుంటున్నావు?

ఇటుకలు కాల్చేవాడిపని ఇటుకలు చల్లారేదాకా ఉంటుంది.
గోడలునిలబెట్టేవాడి పని మహా అయితే నెల్లాళ్ళుంటుంది
ప్లాస్టింగ్ చేసేవాడు గదిని ఒద్దికగా నిలబెడతాడు.
రైతుపనిచేసే నేల అతను పదే పదే రావాలని కోరుతుంది.
పాటలు పాడే వాళ్ళూ, నాటకాలు వేసే వాళ్ళూ కట్టే ఇళ్ళని
ఎంతటి సుడిగాలైనా కూలగొట్టలేదు.
కానీ లాయర్ల విషయంలో, నాకు తెలియక అడుగుతాను
వాళ్ల శవాన్నిలాగే గుర్రం ఎందుకు ముసిముసి నవ్వులు నవ్వుతుందంటావు?
.
కార్ల్ సాండ్ బర్గ్
(January 6, 1878 – July 22, 1967)
అమెరికను కవి

 carl-sandburg

.

The Lawyers Know Too Much

.

The lawyers, Bob, know too much.

They are chums of the books of old John Marshall.

They know it all, what a dead hand Wrote,

A stiff dead hand and its knuckles crumbling,

The bones of the fingers a thin white ash.

    The lawyers know

      a dead man’s thoughts too well.

In the heels of the higgling lawyers, Bob,

Too many slippery ifs and buts and howevers,

Too much hereinbefore provided whereas,

Too many doors to go in and out of.

    When the lawyers are through

    What is there left, Bob?

    Can a mouse nibble at it

    And find enough to fasten a tooth in?

    Why is there always a secret singing

    When a lawyer cashes in?

    Why does a hearse horse snicker

    Hauling a lawyer away?

The work of a bricklayer goes to the blue.

The knack of a mason outlasts a moon.

The hands of a plasterer hold a room together.

The land of a farmer wishes him back again.

    Singers of songs and dreamers of plays

    Build a house no wind blows over.

The lawyers—tell me why a hearse horse snickers hauling a lawyer’s bones.

  .

Carl Sandburg

 

American

(January 6, 1878 – July 22, 1967)

http://www.bartleby.com/273/91.html

The Dial, January 1920

సిద్ధసత్యాలు… కార్ల్ సాండ్బర్గ్, అమెరికను

ప్రతి ఏడూ ఎమిలీ డికిన్సన్ ఒక మిత్రుడికి
తనతోటలో పూసిన తొలి “ఆర్బ్యుటస్”  మొగ్గల్ని పంపేది.

ఆండ్రూ జాక్సన్ తన మరణశాసనంలో
ఒక మిత్రుణ్ణి గుర్తుచేసుకుని జార్జి వాషింగ్టన్
వాడిన దూర్భిణి” ని అతనికి బహూకరించేడు.

నెపోలియన్ కూడా, తన వీలునామాలో, ఫ్రెడరిక్ ది గ్రేట్
పడకగదిలోంచి తను సంగ్రహించిన వెండి వాచీని
ఫలానా మిత్రుడికి దాన్ని అందజెయ్యవలసిందిగా ఆదేశించాడు.

ఓ హెన్రీ తనకోటుకి తగిలించుకున్న ఎర్రని పువ్వుని తీసి
కూరగాయలదుకాణంలో పనిచేస్తున్న పల్లెయువతికి ఇచ్చి
“ఎర్రనైన మొగ్గలు ఈ నగరాలలోని దుమ్మూధూళికి
ఎర్రగా మిగలొచ్చు, మిగలకపోవచ్చు” అని రాసేడుట.

అలా చెపుతుంటారు చాలా. కొన్ని నమ్ముతాం. కొన్ని నమ్మం.

టాం జెఫర్సర్ తన ముల్లంగికి మురిసిపోయేవాడట.
అబ్రహాం లింకన్ తనజోళ్ళు తనే పాలిష్ చేసుకునే వాడట,
బిస్మార్క్ బెర్లిన్ ని “ఇటుకలతో, వార్తాపత్రికలతో నిండిన నిర్జనప్రదేశం” అన్నాడట.

అలా అంటూనే ఉంటారు. ఇవన్నీ సిద్ధసత్యాలు: 
అలా అలా అలా ఎగిరిపో కొత్త లోకాల్లోకి
ఎన్నడూ విని ఎరగని సముద్రాలు దాటిపో, ఈ భూమిని చుట్టిరా!
నీ చంక్రమణం పూర్తయి తిరిగి వచ్చేక ఏ పూచెట్టునీడనో కూచోవచ్చు
గోళీలకై కుర్రాళ్ళు తగువులాడుకోవడం వినొచ్చు.
మనకి మిడతే అందంగా కనిపించవచ్చు.

అదంతే…

.
కార్ల్ శాండ్బర్గ్

అమెరికను

.

Accomplished Facts

.

Every year Emily Dickinson sent one friend

the first arbutus bud in her garden.

In a last will and testament Andrew Jackson

remembered a friend with the gift of George

Washington’s pocket spy-glass.

Napoleon too, in a last testament, mentioned a silver

watch taken from the bedroom of Frederick the Great,

and passed along this trophy to a particular friend.

Henry took a blood carnation from his coat lapel

and handed it to a country girl starting work in a

bean bazaar, and scribbled: “Peach blossoms may or

may not stay pink in city dust.”

So it goes. Some things we buy, some not.

Tom Jefferson was proud of his radishes, and Abe Lincoln

blacked his own boots, and Bismarck called Berlin a wilderness of brick and newspapers.

So it goes. There are accomplished facts.

Ride, ride, ride on in the great new blimps—

Cross unheard-of oceans, circle the planet.

When you come back we may sit by five hollyhocks.

We might listen to boys fighting for marbles.

The grasshopper will look good to us.

So it goes….

 .

Carl Sandburg

(January 6, 1878 – July 22, 1967)

American Poet.

Courtesy: http://www.bartleby.com/273/81.html

 

మా కృతజ్ఞతలు … కార్ల్ సాండ్ బర్గ్, అమెరికను కవి .

ప్రభూ!

సాయంవేళ నదీతీరాన కలుపుమొక్కలమీదకూడా సూర్యుడు మెరుస్తూ కలిగిస్తున్న ఇక్కడి ఆహ్లాదానికి
నీకు మా కృతజ్ఞతలు
.
ప్రభూ!

వేసవిలో బోసికాళ్ళతో, బోసితలల్తో గడ్డిలోకి గుమికే పిల్లల కేరింతలకి
కృతజ్ఞతలు.

ప్రభూ,
సూర్యాస్తమయానికీ, తారల వెలుగులకీ, మమ్మల్ని పొదువుకునే స్త్రీలకూ, వాళ్ళ తెల్లని చేతులకూ
నీకు మా కృతజ్ఞతలు.

ప్రభూ!

నీకు చెముడూ, అంధత్వమూ వచ్చి మా కృతజ్ఞతలు నీకు అందకపోతే,

ఊరి చివర శ్మశానాల్లో మృతులు తమ శవపేటికల్లోనూ, లేదా, యుద్ధంలో చనిపోయినవారు అజ్ఞాతంగా ఏ గోతిలోనో పూడ్చబడి, ఆ మృతులు శాశ్వతంగా అంధులూ బధిరులై చరిత్రకు అందక అజ్ఞాతంగా మిగిలిపోతే …
నీకు మా కృతజ్ఞతలు.

ప్రభూ!

ఇదంతా నీ క్రీడ. … ఆ రహస్యాలూ, సంకేతాలూ, ప్రక్రియలూ సర్వమూ నువ్వు ఏర్పరచుకున్నవే; కనుక నీ ఆటకు విరామం ఇస్తూ, ఎప్పుడూ ఈ నాటకంలో మొదలూ, చివరా మాత్రమే కొనసాగిస్తున్నందుకు
నీకు మా కృతజ్ఞతలు.

.
కార్ల్ సాండ్ బర్గ్
January 6, 1878 – July 22, 1967
అమెరికను కవి

.

.

Our Prayer of Thanks

.

GOD,

For the gladness here where the sun is shining at evening on the weeds at the river,

Our prayer of thanks.

 

God,

For the laughter of children who tumble barefooted and bareheaded in the summer grass,

Our prayer of thanks.

 

God,

For the sunset and the stars, the women and their white arms that hold us,

Our prayer of thanks.

 

God,

If you are deaf and blind, if this is all lost to you,

God, if the dead in their coffins amid the silver handles on the edge of town, or the reckless dead of war days thrown unknown in pits, if these dead are forever deaf and blind and lost,

Our prayer of thanks.

 

God,

The game is all your way, the secrets and the signals and the system; and so, for the break of the game and the first play and the last,

Our prayer of thanks.

.

Carl Sandburg

January 6, 1878 – July 22, 1967

American Poet

The New Poetry: An Anthology.  1917.

Harriet Monroe, ed. (1860–1936).

http://www.bartleby.com/265/325.html

పదచిత్రం… కార్ల్ సాండ్బర్గ్, అమెరికను కవి

దిక్కుల చివర లేత నీలిరంగు ఆకసపు వెలుగులో
బద్ధకంతో నెమ్మదిగా వెనక్కి మరలుతున్న
కెరటాల అంచున
ఓడల నీడలు తేలియాడుతున్నాయి.

ఆకసం వాలిన చోట పొడవాటి  గోధుమరంగు గీత ఒకటి
జానెడు ఉప్పు కయ్యల్లో చేతులకొద్దీ ఇసుక మేటలు వేస్తోంది.

స్పష్టంగా కనిపించే ఆ అంతులేని ముడతలు,
భంగపడి,లోపలికి ముడుచుకుని, నిష్క్రమిస్తున్నాయి.
చిరుకెరటాలు ముక్కలై, సముద్రపు ఒడ్డును
పగులుతున్న తెల్లని నురగలతో కడుగుతున్నాయి.

కెరటాల అంచున
లేత నీలపు వెలుగులో
ఓడల నీడలు తేలియాడుతున్నాయి.
.
కార్ల్ సాండ్బర్గ్

January 6, 1878 – July 22, 1967

అమెరికను కవి

 

 Carl Sandburg

.

Sketch

The Shadows of the ships

Rock on the crest

In the low blue lustre

Of the tardy and the soft inrolling tide.

A long brown bar at the dip of the sky

Puts an arm of sand in the span of salt.

The lucid and endless wrinkles

Draw in, lapse and withdraw.

Wavelets crumble and white spent bubbles

Wash on the floor of the beach.

Rocking on the crest

 In the low blue lustre

Are the shadows of the ships.

.

Carl Sandburg

January 6, 1878 – July 22, 1967

American Poet

Poem Courtesy:

The New Poetry: An Anthology.  1917.

Harriet Monroe, ed. (1860–1936).

http://www.bartleby.com/265/310.html

కిటికీ దగ్గర… కార్ల్ సాండ్ బర్గ్, అమెరికను కవి

హాయిగా కూచుని ప్రపంచానికి
ఉత్తర్వులిచ్చే దేవతలారా!
నాకు ఆకలి, బాధా, లేమీ ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి;
కీర్తీ, సంపదల దర్వాజాలనుండి నన్ను
పరాజయ, పరాభవాలతో వెలివేయదలుచుకుంటే వెలివెయ్యండి;
ఎంత దీనమూ, కఠినమైన దారిద్ర్యాన్నివ్వాలనుకుంటే ఇవ్వండి.
కానీ, కొంచెం ప్రేమని మాత్రం నాకు మిగల్చండి.
రోజు ముగిసిన పిదప మాటాడుకుందికి మరో మనిషినివ్వండి,
మేరలేని ఏకాంతాన్ని పారదోలుతూ
చీకట్లో నన్ను అనునయంగా తడమగల ఒక హస్తాన్నివ్వండి.
సూర్యాస్తమయ దృశ్యాలు
సంధ్యాచిత్రాన్ని మసకపరుస్తున్న వేళ
దారితప్పి తిరుగుతున్న ఒక చిన్ని పడమటి చుక్క
క్రీనీడల అంచుల్లోంచి తొంగి చూస్తోంది.
మనసా! పద, కిటికీ పక్కకి నడుద్దాం.
సంజవెలుగుల్లో జీరాడుతున్న పొద్దు నీడల్ని
అక్కడనుండి గమనిస్తూ
ఒక చిన్నపాటి ప్రేమ రాకకై
ఆశగా ఎదురుచూద్దాం.
.
కార్ల్ సాండ్ బర్గ్

January 6, 1878 – July 22, 1967
అమెరికను కవి

.

 

.

At A Window

.

O you gods that sit and give

The world its orders.

Give me hunger, pain and want,

Shut me out with shame and failure

From your doors of gold and fame,

Give me your shabbiest, weariest hunger!

But leave me a little love,

A voice to speak to me in the day end,

A hand to touch me in the dark room

Breaking the long loneliness.

In the dusk of day-shapes

Blurring the sunset,

One little wandering, western star

Thrust out from the changing shores of shadow.

Let me go to the window,

Watch there the day-shapes of dusk,

And wait and know the coming

Of a little love

.

Carl Sandburg

January 6, 1878 – July 22, 1967

American

 

Poem Courtesy:

The New Poetry: An Anthology. 1917

Ed. Harriet Monroe (1860–1936).

http://www.bartleby.com/265/313.html

 

పొగ మంచు…. కార్ల్ సాండ్ బర్గ్, అమెరికను

20 వ శతాబ్దం రెండవదశకంలో ఎజ్రా పౌండ్, HD, Amy Lowell మొదలైన వాళ్ళు, కొద్దికాలమే అయినా,  బాగా ప్రాచుర్యంలోకి తీసుకువచ్చిన  “ఇమేజిస్టు” ఉద్యమపు భావపరంపరలో చూడాలి.   అవసరానికి మించిన మాటలూ, అలంకారాలతో చెప్పదలుచుకున్న వస్తువుకప్పడిపోయిన ఆనాటి విక్టోరియన్ సంప్రదాయాలకి తిరుగుబాటుగా వచ్చింది ఈ ఉద్యమం.  ఏ అలంకారాలూ, వాచాలతా లేకుండా, సరియైన పదాలు వాడుతూ (దగ్గరగా ఉండే పదం కూడా వాళ్ళు నిరసించారు) కవి తను చెప్పదలుచుకున్నది శిల్పం చెక్కినంత శ్రద్ధగా చెప్పాలి. ఈ కోణంలో చూసినపుడు పొగమంచుకీ, పిల్లికీ పోలికలు, రంగులోనూ, మెల్లమెల్లగా అడుగులేసుకుంటూ రావడంలోనూ, ఎవరైనా చూస్తున్నప్పుడు వెనక కాళ్ళమీద,  కూచున్నట్టు ఆగిపోవడంలోనూ కనిపిస్తుంది.  

.

పొగమంచు

పిల్లిపిల్లలా వస్తుంది.

ఓడరేవు మీదా, నగరం మీదా

ఏ చప్పుడూ చెయ్యకుండా ఆగి

పిర్రలమీద కూచుని చూసినట్టు చూసి

మళ్ళీ  ముందుకి సాగిపోతుంది.

.

కార్ల్ సాండ్ బర్గ్

January 6, 1878 – July 22, 1967

అమెరికను.

.

.

This Imagist poem of Carl Sandberg should be viewed in the spirit of that movement.  At the outset, it may not look interesting. The imagist movement avows for delineating a clear visual image through the poem without  excessive usage of language (using exact word, to be precise) or decorations and embellishments of any kind to impress upon the reader.  Same time, the exactitude of words should convey to the reader what the poet intends.This movement is a rebellion against the flowery language of the Victorian era.

.

Fog

.

The fog comes

on little cat feet.

It sits looking

over harbor and city

on silent haunches

and then moves on.

.

Carl Sandburg

January 6, 1878 – July 22, 1967

American

పద చిత్రం… కార్ల్ సాండ్ బర్గ్, అమెరికను కవి

ఓడల నీడలు

లేత నీలిరంగు జిలుగుతో

తీరుబాటుగా కదలి వస్తున్న మెత్తని

కెరటాల శీర్షాలపై ముందుకీ వెనక్కీ ఊగుతున్నై.

దిగంతాల అంచున పొడవుగా వంగిన ఆకాశపు 

కపిలవర్ణం ఉప్పునీటిలో ఇసుకను కలుపుతున్నట్టుంది.

సాగరదేహం మీద అంతులేని స్పష్టమైన అలల ముడుతలు

ముందుకు వచ్చీ,  ముగిసిపోయీ, వెనక్కిపోతూ ఉన్నాయి.

చిన్ని అలలు భగ్బమై, పేలిపోతున్న బుడగలు

సాగరతీరన్ని అలుకుతున్నాయి.

ఓడల నీడలు

లేత నీలిరంగు జిగిగల

కెరటాల శీర్షాలపై ముందుకీ వెనక్కీ ఊగుతున్నై.

.

కార్ల్ సాండ్ బర్గ్

(January 6, 1878 – July 22, 1967)

అమెరికను కవి.

.

Carl Sandburg

.

Sketch

.

 

The shadows of the ships

Rock on the crest

In the low blue lustre

Of the tardy and the soft inrolling wave.

 

A long brown at the dip of the sky

Puts an arm of sand in the span of salt.

 

The lucid and endless wrinkles

Draw in, lapse, and withdraw.

Wavelets crumble and white spent bubbles

Wash on the floor of the beach.

 

Rocking on the crest

In the low blue lustre

Are the shadows of the ships.

.

Carl Sandburg

(January 6, 1878 – July 22, 1967)

American

 

Poem Courtesy:

 

Poetry, A Magazine of Verse October 1915,

Volume VII No.1 Page 1

http://www.poetryfoundation.org/poetrymagazine/browse/7/1#!/20570545/0

%d bloggers like this: