అనువాదలహరి

కేవలం ఒక సామాన్య సైనికుడు … లారెన్స్ వెయిన్ కోర్ట్, కెనేడియన్ కవి

.

అతను బాన పొట్టతో, జుత్తు రాలిపోతూ త్వరగా ముసలివాడైపోయాడు

అతను మందిచుట్టూ చేరి, గతాన్ని కథలు కథలుగా చెప్పేవాడు…

అతను పాల్గొన్న యుద్ధాలగురించీ, అతని సాహసకృత్యాలగురించీ,

సాటి సైనికులతోఆటు సాధించిన విజయాలగురించీ, అందులో అందరూ వీరులే.

అప్పుడప్పుడు అతని చుట్టుప్రక్కలవాళ్ళకి అవి హాస్యాస్పదంగా కనిపించేవి

కానీ అతనితో పనిచేసినవాళ్లందరూ వినేవారు అతనేం మాటాడుతున్నాడో తెలుసు గనుక

ఇకనుంచి మనం అతని కథలు వినలేము, కారణం బిల్ చచ్చిపోయాడు

ప్రపంచం ఒక సైనికుని మరణం వల్ల కొంత నష్టపోయింది.

అతని మరణానికి శోకించేవరు ఎక్కువమంది లేరు: అతని భార్యా, పిల్లలూ అంతే!

ఎందుకంటే అతను అతి సామాన్యమైన జీవితం గడిపాడు, పెద్ద విశేషాలేమీ లేవు.

అతనికి ఉద్యోగం ఉండేది, సంసారం చేశాడు, తనమానాన్న తను బ్రతికాడు.

ఈ రోజు ఒక సైనికుడు మరణించినా, అతని మరణాన్ని దేశం గుర్తించదు.

 

అదే రాజకీయ నాయకులు మరణిస్తే, శరీరాన్ని ప్రజల దర్శనార్థం

ఉంచుతారు, వేలమంది అతని మరణానికి విచారించి గొప్పవాడని కీర్తిస్తారు.

పత్రికలు సైతం బాల్యంనుండీ వాళ్ళ జీవిత సంగ్రహాన్ని ప్రచురిస్తాయి,

కానీ ఒక సైనికుడి మరణం ఏ గుర్తింపుకీ, పొగడ్తలకీ నోచుకోదు.

ఈ దేశ శ్రేయస్సుకి అమూల్యమైన సేవని ఎవరు చేశారు

ఇచ్చిన వాగ్దానాల్ని నిలబెట్టుకోక ప్రజల్ని మోసగించిన వాడా?

లేక, సామాన్యమైన జీవితం గడుపుతూ, విపత్కర సమయం వచ్చినపుడు

ఈ దేశానికి సేవచెయ్యడానికి తన జీవితాన్ని సైతం సమర్పించేవాడా?

ఒక రాజకీయనాయకుడికి వచ్చే జీతం అతని జీవన శైలీ

ఒక్కోసారి అతను దేశానికి చేసే సేవకి అనులోమానుపాతంలో ఉండవు.

తన సర్వస్వాన్నీ అర్పించే ఒక సామాన్య సైనికుడికి దక్కేది

మహా అయితే ఒక ప్రశంసా పతకమూ, పిసరంత పింఛనూ.

వాళ్ళని మరిచిపోవడం సహజం, ఎందుకంటే వాళ్ళెప్పుడో పనిచేశారు

ఆ ముసలి “బిల్” లాంటి సైనికులు ఎప్పుడో యుద్ధంలో పాల్గొన్నారు. కానీ

మనకు తెలుసు, ఈనాడు దేశం అనుభవిస్తున్న స్వాతంత్య్రాన్ని తెచ్చిపెట్టింది

తమ కూహలూ, రాజీలు పన్నాగాలు పన్నే రాజకీయనాయకులు కాదని.

ఎదురుగా శత్రువు మోహరించి, మీరు ఆపదలో చిక్కుకున్నప్పుడు, ఎన్నడూ

ఒక అభిప్రాయం మీద నిలబడని రాజకీయనాయకుడి సాయం కోరుతారా?

లేక తన నేలనీ, జాతిపౌరుల్నీ, దేశాన్నీ రక్షించడానికి కడదాకా

పోరాడుతానని ప్రతిజ్ఞచేసిన సైనికుడి సహాయం అర్థిస్తారా?

అతనొక సామాన్య సైనికుడు. అతనిలాంటివాళ్ళు క్రమంగా సన్నగిలుతున్నారు.

కానీ అతని సమక్షం అలాంటివాళ్లు మనకి కావాలని గుర్తుచెయ్యాలి.

దేశాలు యుద్ధంలో చిక్కినపుడు రాజకీయనాయకులు ప్రారంభించిన

సమస్యలకి పరిష్కారం కనుక్కోవలసిన బాధ్యత సైనికుడిదే.

మన మధ్య ఉన్నప్పుడు అతన్ని తగినవిధంగా గౌరవించలేకపొయినా

మరణించిన తర్వాతనైనా మనం అతనికి శ్రద్ధాంజలి ఘటిద్దాం.

కేవలం, ప్రతి వార్తాపత్రికలోనూ మొదటిపేజీలో చిన్న మకుటం :

ఒక సైనికుడు ఈ రోజు మరణించినందుకు దేశం దుఃఖంలో మునిగి ఉంది. 

.

లారెన్స్ వెయిన్ కోర్ట్,

(1923   –  20th April 2009)

కెనేడియన్ కవి

read the full poem here:

A. Lawrence Vaincourt

.

Just a Common Soldier

(A Soldier Died Today) 

.

He was getting old and paunchy and his hair was falling fast,

And he sat around the Legion, telling stories of the past.

Of a war that he had fought in and the deeds that he had done,

In his exploits with his buddies; they were heroes, every one.

deliberately left blank  for copyright reasons

He will not be mourned by many, just his children and his wife,

For he lived an ordinary and quite uneventful life.

Held a job and raised a family, quietly going his own way,

And the world won’t note his passing, though a soldier died today.

When politicians leave this earth, their bodies lie in state,

While thousands note their passing and proclaim that they were great.

Papers tell their whole life stories, from the time that they were young,

But the passing of a soldier goes unnoticed and unsung.

…. deliberately left blank  for copyright reasons

A politician’s stipend and the style in which he lives

Are sometimes disproportionate to the service that he gives.

While the ordinary soldier, who offered up his all,

Is paid off with a medal and perhaps, a pension small.

… deliberately left blank  for copyright reasons

Should you find yourself in danger, with your enemies at hand,

Would you want a politician with his ever-shifting stand?

Or would you prefer a soldier, who has sworn to defend

His home, his kin and Country and would fight until the end?

...

deliberately left blank  for copyright reasons

If we cannot do him honor while he’s here to hear the praise,

Then at least let’s give him homage at the ending of his days.

Perhaps just a simple headline in a paper that would say,

Our Country is in mourning, for a soldier died today.

.

 

 A. Lawrence Vaincourt

1923  – 20th April 2009

Canadian Poet

Read the complete Poem here

సాగరసుమాలు… ఇ.జె.ప్రాట్, కెనేడియన్ కవి.

అవి విహరిస్తూ ఒక క్షణంలో చేసిన విన్యాసాన్ని
వివరించడానికి భాషలో తగిన ఉపమానాలు లేవు…
రజతము, స్ఫటికము, దంతము
అన్నీ కళతప్పేయి. వినీలాకాశం మీద చెక్కినట్టున్న
లిప్తపాటు కదలికలేని ఆ దృశ్యానికి సాటిలేదు,
ఆ రెక్కల కదలిక, తేలి తేలి ఎగిరే తీరూ ముందు
ఉష్ణమండలంలో నీలి నేపథ్యంలో తేలిపోయే చుక్కలూ
పర్వతాగ్రాలమీద కురిసిన మంచూ దిగదుడుపే.
సూర్యుడి ఏడురంగుల్ని పట్టుకున్న కొండకొమ్ముల్లోనో
మధ్యలో ఎక్కడో లంకల్లో కనిపించిన పచ్చికమైదానాల్లోనో
ఒకదాని వెనక ఒకటి ఇపుడు క్రిందకి వాలుతూ
ఒక్కసారిగా వేల రెక్కలు ముడుచుకున్నాయి.
మట్టిలోంచి విచ్చిన ఏ తెల్లకలువలూ
ఇంతస్వేఛ్ఛగా విహరించలేవు
ఈ సర్వస్వతంత్ర సాగరసుమాలు విహరించినట్టుగా
.
ఇ.జె. ప్రాట్

February 4, 1882 – April 26, 1964

కెనేడియన్ కవి

 

.

Sea-Gulls

.

For one carved instant as they flew,

The language had no simile —

Silver, crystal, ivory

Were tarnished. Etched upon the horizon blue,

The frieze must go unchallenged, for the lift

And carriage of the wings would stain the drift

Of stars against a tropic indigo

Or dull the parable of snow.

Now settling one by one

Within green hollows or where curled

Crests caught the spectrum from the sun,

A thousand wings are furled.

No clay-born lilies of the world

Could blow as free

As those wild orchids of the sea.

.
E J Pratt (Edwin John Dove Pratt)

February 4, 1882 – April 26, 1964

Canadian Poet

 

http://wonderingminstrels.blogspot.in/2001/05/sea-gulls-e-j-pratt.html

జాతి గుర్తు… ఎఫ్. ఆర్. స్కాట్, కెనేడియన్ కవి

కొన్ని కవితలు సునిశితమైన వ్యంగ్యంతో చెంప చెళ్ళుమనేలా కొట్టి నిజాన్ని తెలియజేస్తాయి. ఒక దేశపు శతాబ్ది ఉత్సవాల కార్యనిర్వాహక సంఘం ముఖపత్రం మీద ఆ దేశానికి చెందిన ఏ చిహ్నమూ కాకుండా మరొక దేశపు వ్యాపారసంస్థ పేరు ఉండడం హాస్యాస్పదమైన విషయం అనుకుంటే, పేరు మార్పులు తప్ప, మనదేశంలో చిత్రం ఇంతకంటే భిన్నంగా ఉందా అనిపిస్తుంది. దౌర్భాగ్యం కొద్దీ ఎప్పుడూ సమకాలీన అవసరాలదృష్టితోనే చారిత్రకపురుషుల విశ్లేషణ జరుగుతోంది తప్ప వాళ్ళు జాతికి చేసిన సేవనీ, అందించిన ఉత్కృష్టమైన వారసత్వపరంపర ఆధారంగా అంచనావెయ్యడంలో మనం ఎప్పుడూ వెనకబడే ఉన్నాం అంటే అతిశయోక్తి కాదేమో!

*

కెనడా శతాబ్ది సంఘం
Le Reine Elizabeth[1] హోటల్లో సమావేశమైంది
తమ గొప్పదనాన్ని తమకు తెలియజేస్తూ,
అపరిమితంగా ప్రతిస్పందనలు కలుగజేస్తూ
ప్రజలందరి హృదయాలలోనూ
కెనడా అనే ఒక దేశం నిజంగా ఉందని ఋజువుచేసే
జాతీయ చిహ్నాలు వెతకడానికి.
కార్యక్రమం ప్రారంభానికి ముందు
హాజరైన ప్రతి ప్రతినిధికీ
ఒక దస్త్రాన్ని అందించింది.

దాని ముఖ పత్రం మీద మెరుస్తున్న
బంగారు అక్షరాలతో కనిపిస్తున్నది

“సముద్రం నుండి సముద్రం వరకూ”[2]
అన్న కెనడా జాతీయ ధర్మసూత్రం కాదు;

“దైవదత్తమైన నా హక్కు”[3]
అన్న బ్రిటిషు రాజసూత్రం కాదు;

“నాకు గుర్తుంది”[4]
అన్న క్విబెక్ రాష్ట్ర ఆదర్శవాక్యమూ కాదు;

“అన్నిటిలోంచీ — ఒక్కటి”[5]
అన్న అమెరికా సంయుక్తరాష్ట్ర సంప్రదాయవాక్యమూ కాదు.

ఉన్నదల్లా
కోకోకోలా కంపెనీ సౌజన్యంతో… అని.

.

ఎఫ్. ఆర్. స్కాట్

August 1, 1899 – January 30, 1985

కెనేడియన్ కవి

 

 

 

.

National Identity

.

The Canadian Centenary Council

Meeting in Le Reine Elizabeth [1]

To seek those symbols

Which will explain ourselves to ourselves

Evoke unlimited responses

And prove that something called Canada

Really exists in the hearts of all

Handed out to every delegate

At the start of proceedings

A portfolio of documents

On the cover of which appeared

In gold letters not

A Mari Usque Ad Mare [2]

not

Dieu Et Mon Droit [3]

not

Je Me Souviens [4]

not

E Pluribus Unum [5]

but

COURTESY OF COCA-COLA LIMITED.

.

[Notes:

[1] Posh hotel in Montreal.

[2] ‘From sea to sea’. The official motto of Canada

[3] ‘God and my right’. Motto of the British Sovereign – on the British coat of arms

[4] ‘I remember’.  Motto of Quebec; it’s even on their licence plates.

[5] ‘Out of many, One’. American motto. ]

.

F R Scott

August 1, 1899 – January 30, 1985

Canadian Poet

Poem Courtesy:

http://wonderingminstrels.blogspot.in/2001/05/national-identity-f-r-scott.html

భల్లూకపు కౌగిలి … మైకేల్ ఓండాట్షీ, కెనేడియన్ కవి

తనదగ్గరకి వచ్చి గుడ్ నైట్ చెప్పి ముద్దివ్వమంటాడు గ్రిఫిన్.

అలాగేలే అని నేను అరుస్తాను. చేస్తున్నపని పూర్తిచేసి,

తర్వాత మరొకటి, మరొకటి పూర్తిచేసి

మెల్లిగా నడుచుకుంటూ మా కుర్రాడి గదివేపు తిరుగుతాను.

వాడు నవ్వుతూ రెండుచేతులూ చాచుకుని నేనివ్వబోయే

భల్లూకపు కౌగిలివంటి  గాఢాలింగనానికి ఎదురుచూస్తుంటాడు.

అయినా, నా ఆనురాగానికి ఆ అమానవీయమైన పేరేమిటి?

గట్టిగా హత్తుకుంటే మృత్యువు చూపిస్తుందది.

నేను హత్తుకుంటే, వాడి లేత ఎముకలూ

వెచ్చని మెడా నన్ను అతుక్కుంటాయి.

ఆ పైజమాలోని సన్నని బిగువైన శరీరం నన్ను

రక్తానికి అతుక్కునే సూదంటురాయేమోన్నట్టు పెనవేసుకుంటుంది.

ఇంతకీ వాడు పాపం ఎంతసేపటినుండి  అలా

నేను వస్తానని ఎదురుచూస్తున్నాడో?

.

మైకేల్  ఓండాట్షీ

కెనేడియన్ కవి

.

Michael Ondaatje

.

Bear-hug

.

Griffin calls to come and kiss him goodnight

I yell ok. Finish something I’m doing,

then something else, walk slowly round

the corner to my son’s room.

He is standing arms outstretched

waiting for a bear-hug. Grinning.

Why do I give my emotion an animal’s name,

give it that dark squeeze of death?

This is the hug which collects

all his small bones and his warm neck against me.

The thin tough body under the pyjamas

locks to me like a magnet of blood.

How long was he standing there

like that, before I came?

.

Michael Ondaatje 

September 12, 1943

Srilankan-born Canadian Poet and Novelist.

సమాధి మృత్తికలు … జాన్ మెక్రీ, కెనెడియన్ కవి

http://t2.gstatic.com/images?q=tbn:ANd9GcQVjFuhtfdTJMV_ZJIltEOZ1CM-_IwIMGydqbQikqCMxOMCltHF
Image courtesy: http://t2.gstatic.com

.

సమాధి మృత్తికలపై  వరుస మీద వరుస

కావిరంగు సుమాలు పూస్తున్నై మా ఉనికి తెలపడానికి;

పైన ఆకాశంలో భరతపక్షులు పాడుకుంటూ ఎగురుతున్నాయి

క్రింది తుపాకుల గౌరవవందనంలో వినిపించకపోయినా

.

మేమిపుడు విగతజీవులం. అయితేనేం? మొన్నటివరకూ

బ్రతుకు రుచి ఎరిగినవాళ్ళం; సూర్యోదయం చూసేం,

అస్తమయసంధ్య కని పరవశించేం; ప్రేమించి, ప్రేమింపబడిన వాళ్లం.

ఇప్పుడీ అశ్రాంతవిడుదులలో విశ్రాంతితీసుకుంటున్నాం

.

శతృవుపై పోరాటాన్ని కొనసాగించండి. మా వాలుతున్నచేతులతో

అందిస్తున్న దివిటీలను అందుకోండి; వాటిని నిలబెట్టే పూచీ ఇక మీదే;

మాటతప్పేరో, మేము ప్రశాంతంగా నిద్రపోం,

ఎన్నిపూలు ఈ మృత్యువాటికలలో విరబూచినా సరే!

.

జాన్ మెక్రీ  (November 30, 1872 – January 28, 1918)

కెనెడియన్ కవీ, రచయితా, వైద్యుడూ, కళాకారుడూ, సైనికుడూ అయిన, లెఫ్టినెంట్ కల్నల్ (డా.) జాన్ అలెగ్జాండర్ మెక్రీ  ఈ కవిత రాయడానికి ప్రేరణ మొదటిప్రపంచ సంగ్రామంలో Ypres వద్ద జరిగిన యుధ్ధంలో అతని స్నేహితుడూ, పూర్వ విద్యార్థీ అయిన లెఫ్టినెంట్  అలెక్సిస్ హెల్మర్ మరణం. ఈ కవిత అతను  1915 మే 3 వ తేదీన  వ్రాసినా, అదే సంవత్సరం డిశంబరు నెలలో మొదటిసారిగా పంచ్ అన్న పత్రికలో అజ్ఞాతం గా ప్రచురించబడింది.)

.

In Flanders Fields

.

In Flanders fields the poppies blow
Between the crosses, row on row,
That mark our place; and in the sky
The larks, still bravely singing, fly
Scarce heard amid the guns below.

We are the Dead. Short days ago
We lived, felt dawn, saw sunset glow,
Loved and were loved, and now we lie,
In Flanders fields.

Take up our quarrel with the foe:
To you from failing hands we throw
The torch; be yours to hold it high.
If ye break faith with us who die
We shall not sleep, though poppies grow
In Flanders fields


Lt. Col. ( Dr.) John Alexander McCrae 

Canadian Poet

(November 30, 1872 – January 28, 1918)

(This poem was inspired by the burial of his friend and a former student of  McCrae, Lt. Alexis Helmer, who was killed in the Second battle of Ypres, and was written on May 3, 1915 at Belgium and appeared anonymously in magazine Punch on Dec 8th same year)

%d bloggers like this: