అనువాదలహరి

విధేయత… ఎడిలేడ్ ఏన్ ప్రోక్టర్, ఇంగ్లీషు కవయిత్రి

ఏనాడో ఇచ్చిన వాగ్దానాన్ని
నువ్వు వెనక్కి తీసుకున్నావు;
ఇచ్చిన హృదయాన్నీ వెనక్కి తీసుకున్నావు-
నేను దానికి కూడా పోనీమని ఊరుకోవాలి.
నాడు ప్రేమ ఊపిరులూదినచోట, నేడు గర్వము నశించింది;
తొలుత గొలుసు తెగిపోకుండా ఉండడానికీ, తర్వాత,
తెగిన లంకెలు కలిపి ఉంచడానికీ
నేను ఎంతో ప్రయత్నించాను గాని, ప్రయోజనం లేదు.

పూర్వంలా నీ స్నేహాన్ని పరిపూర్ణంగా
నేను పునరుద్ధరించలేక పోవచ్చు,
నీ నుండి తీసుకున్న హృదయం
ఇకనుండి ఎల్లకాలమూ నా స్వంతమే.
ఏ పశ్చాత్తాపభావనా నిన్నిక స్పృశించదు,
భయపడకు, నీ మీద నా హక్కుని కోరనులే!
అలాగని, నన్ను నేను స్వతంత్రురాలిగా
భావిస్తున్న ఊహ నీలో కలుగనియ్యను.

నేను అప్పటి ప్రమాణానికి కట్టుబడి ఉన్నాను;
బంగారంలాంటి ఆ బంధాన్ని ఏది త్రెంచగలదు?
నే ననుభవించిన తీవ్రమైన బాధకే కాదు
నువ్వాడిన మాటలకి కూడా సాధ్యం కాదు;
ఈ రోజు నువ్వు నమ్మకాన్ని వమ్ముచేసావనీ,
ఇచ్చిన మాట వెనక్కి తీసుకున్నావనీ,
నేను నీకు సమర్పించిన నా హృదయంలోని
గాఢమైన ప్రేమ ఇసుమంతైనా తగ్గుతుందనుకున్నావా?

అది అలాగే ఉంటుంది. అది ఏ కంటికీ కనిపించకపోవచ్చు;
కాని నా హృదంతరాల్లో నిలిచే ఉంటుంది,
ఎవరికీ కనిపించకుండా. కానీ అది నిద్రలో
కలతచెందినపుడల్లా నాకు తెలుస్తూనే ఉంటుంది.
గుర్తుంచుకో! ఈ రోజు నువ్వు పనికిరాదనీ
విలువలేనిదనుకుంటున్న ఈ స్నేహం,
నువ్వు తిరిగి అది కావాలని కోరుకునేదాకా
ఆశతో, ఓరిమితో నిరీక్షిస్తూనే ఉంటుంది.

బహుశా ఏ జీవితసంధ్యాసమయంలోనో ,
మనం చూసిన చాలామంది వృద్ధులలాగే
గతస్మృతులనీడలు నిన్ను చుట్టుముట్టినపుడు
నేటి నీ స్నేహితులు నీపట్ల ఉదాసీనం వహించినపుడు
నువ్వు స్నేహానికై  నావైపు చెయ్యి జాచవచ్చు.
ఆహ్! నువ్వు జాస్తావు. కానీ ఎప్పుడు నేను చెప్పలేను.
అప్పటిదాకా నీ కోసం ఎంతో విధేయతతో,
నా ప్రేమని పరిరక్షించుకుని నిలబెట్టుకుంటాను.
.
ఎడిలేడ్ ఏన్ ప్రాక్టర్
(30 October 1825 – 2 February 1864)
ఇంగ్లీషు కవయిత్రి

.

http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/d/dc/Adelaide_Anne_Procter_by_Emma_Gaggiotti_Richards.jpg/220px-Adelaide_Anne_Procter_by_Emma_Gaggiotti_Richards.jpg
Image Courtesy: http://upload.wikimedia.org

.

Fidelis

.

You have taken back the promise
That you spoke so long ago;
Taken back the heart you gave me-
I must even let it go.
Where Love once has breathed, Pride dieth,
So I struggled, but in vain,
First to keep the links together,
Then to piece the broken chain.

But it might not be-so freely
All your friendship I restore,
And the heart that I had taken
As my own forevermore.
No shade of reproach shall touch you,
Dread no more a claim from me-
But I will not have you fancy
That I count myself as free.

I am bound by the old promise;
What can break that golden chain?
Not even the words that you have spoken,
Or the sharpness of my pain:
Do you think, because you fail me
And draw back your hand today,
That from out the heart I gave you
My strong love can fade away?

It will live. No eyes may see it;
In my soul it will lie deep,
Hidden from all; but I shall feel it
Often stirring in its sleep.
So remember that the friendship
Which you now think poor and vain,
Will endure in hope and patience,
Till you ask for it again.

Perhaps in some long twilight hour,
Like those we have known of old,
When past shadows gather round you,
And your present friends grow cold,
You may stretch your hands out towards me-
Ahl You will-I know not when-
I shall nurse my love and keep it
Faithfully, for you, till then.

Adelaide Anne Procter

పాఠకుడికి… డెనిస్ లెవర్టోవ్, బ్రిటిషు కవయిత్రి .

మీరు ఇది చదువుతుంటే, ధృవాలలో ఒక తెల్లని ఎలుగు
తెల్లని మంచుని కాషాయరంగులో ముంచుతూ
మూత్రాన్ని విసర్జిస్తుంది.

మీరిది చదువుతుంటే చాలామంది దేవతలు
వృక్షాలనల్లుకున్న లతలలో దాక్కుంటారు; గాజులామెరిసేకళ్లు
తరాల పచ్చని ఆకులని వీక్షిస్తుంటాయి.

మీరిది చదువుతుంటే
ఆ సముద్రం అలలు ఎగదోస్తుంటుంది
భీకరమైన తన అలల్ని
ఎగదోస్తుంటుంది.
.
డెనిస్ లెవర్టోవ్
(24 October 1923 – 20 December 1997)
బ్రిటిషు కవయిత్రి

 

Denise Levertov

British Poet

Photo Courtesy:

http://lithub.com/denise-levertov/

.

To the Reader

.

As you read, a white bear leisurely

 pees, dyeing the snow

 saffron,

 and as you read, many gods

 lie among lianas: eyes of obsidian

 are watching the generations of leaves,

 and as you read

 the sea is turning its dark pages,

 turning

 its dark pages.

.

Denise Levertov

(24 October 1923 – 20 December 1997)

British Poetess

poem Courtesy:

http://wonderingminstrels.blogspot.in/1999/09/to-reader-denise-levertov.html

వాన… ఎడ్వర్డ్ థామస్, ఇంగ్లీషు కవి

ఒకటే వాన, అర్థరాత్రి కురుస్తున్న వాన, ఈ పాకమీద
కుండపోతగా కురుస్తున్న వాన; నాకు మళ్ళీ
దగ్గరలోనే చనిపోతానేమోనని అనిపిస్తోంది, బహుశా
నేను మరోసారి వాన చప్పుడు వినలేకపోవచ్చు,
నేను ఒంటరిగా పుట్టినప్పటికంటే నిష్కల్మషంగా
నన్ను శుభ్రపరచినందుకు దానికి ఉచితరీతిలో
కృతజ్ఞతలు చెప్పుకోలేకపోవచ్చు. అద్భుతమైన ఈ వాన
తమమీద కురిసే విగతజీవులు ఎంతధన్యులో!
కానీ ఇప్పుడు నేను ఒకప్పుడు ప్రేమించినవారితో సహా
ఎవరూ ఈ రాత్రి మరణించకూడదనీ, ఒంటరిగా
వానపడటం వింటూ గాని, బాధతో గాని
ఎండిపోయిన చెట్లమధ్య ప్రవహించే నీరులా,
ఇంకా మేలుకోకూడదనీ, నిస్సహాయంగా సజీవులమధ్యగాని,
నిర్జీవుల మధ్యగాని ఉండకూడదని ప్రార్థిస్తున్నాను.
ఇక్కడ నిశ్చలంగా, శిధిలమై, బిర్రబిగిసిన కట్టెలు చాలా ఉన్నాయి.
ప్రేమ ఎరుగని నాలాగే, ఈ అదుపులేని వాన, అన్ని ప్రేమలనీ
తుడిచిపెట్టేసింది… ఒక్క మృత్యువుమీద ప్రేమతప్ప.
పరిపూర్ణమైన దానిని మనం ప్రేమించవలసీ మనం ప్రేమించ
లేమంటే, తుఫాను హెచ్చరిస్తోంది, నా నమ్మకం వమ్మవుతుందని.

.

ఎడ్వర్డ్ థామస్,
(3 March 1878 – 9 April 1917)
ఇంగ్లీషు కవి
( మొదటి ప్రపంచయుద్ధంలో పాల్గొన్న బ్రిటిషు సైనికుడూ కవీ ఐన ఎడ్వర్డ్ థామస్ యుద్ధం నిష్ప్రయోజనమని చెబుతూ 1916 లో యుద్ధభూమిలో వ్రాసిన కవిత. అతను భయపడినట్టుగానే, ఈ కవిత రాసిన ఏడాదిలోనే, Battle of Arras లో ఎడ్వర్డ్ చనిపోతాడు. )

Edward Thomas (3 March 1878 – 9 April 1917) British Poet
Edward Thomas
(3 March 1878 – 9 April 1917) British Poet                               photo courtesy: Wikipedia

.

Rain

.

Rain, midnight rain, nothing but the wild rain

On this bleak hut, and solitude, and me

Remembering again that I shall die

And neither hear the rain nor give it thanks

For washing me cleaner than I have been

Since I was born into solitude.

Blessed are the dead that the rain rains upon:

But here I pray that none whom once I loved

Is dying tonight or lying still awake

Solitary, listening to the rain,

Either in pain or thus in sympathy

Helpless among the living and the dead,

Like a cold water among broken reeds,

Myriads of broken reeds all still and stiff,

Like me who have no love which this wild rain

Has not dissolved except the love of death,

If love it be towards what is perfect and

Cannot, the tempest tells me, disappoint.

.

Edward Thomas

(3 March 1878 – 9 April 1917)

British Soldier, poet, essayist and novelist

Poem Courtesy: https://www.poetryfoundation.org/poems-and-poets/poems/detail/52315

Edward Thomas’s autobiographical poem ‘Rain’ was written in 1916, while Thomas, as soldier, was fighting in the trenches during the First World War.  He was training in the English countryside at the time of writing the poem and was  visualising his fate on the battlefield. The theme of the poem is the futility of war and death.  (Incidentally, Thomas would himself be killed at the Battle of Arras in 1917, a year after he wrote ‘Rain’.)

మధురక్షణం … మేరీ ఫ్రాన్సిస్ బట్స్, బ్రిటిషు రచయిత్రి

తీరుబాటులేని పనితో గడిచిన రోజు ముగిసింది
ఇంటిపనులు చక్కబెట్టుకోడం అయింది
పగలల్లా చికాకు పరిచిన బాధ్యతలు
సూర్యుడితోపాటే శలవుతీసుకున్నాయి
చీకటి చిక్కబడుతున్న సంధ్యవేళ
హాయిగా విశ్రాంతి తీసుకుంటూ కూచున్నాను
గులాబి పువ్వులాంటి నా చిన్నారి
నా గుండెమీద నిద్రపోతోంది.

తెల్లని కనురెప్పలు పట్టు పోగు అంచుతో
పల్చబదుతున్న వెలుగుని నిరోధిస్తున్నాయి
ఒక చిన్ని పిడికిలి గట్టిగా బిగిసి
అమ్మ చేతివేళ్ళని ఆసరాగా పట్టుకుంది
మెత్తని దుప్పటి ముడతల్లో
ఇంతసేపూ చురుకుగా ఉన్న పాదాలు
చివరికి ఎలాగైతేనేం విశ్రాంతి తీసుకుంటున్నాయి
గూటిలోని గువ్వపిట్టల్లా

విలువలేని ఆశలూ, ప్రేమలూ
ఈ మధురమైన క్షణంలో మాయమౌతాయి,
పవిత్రమూ, ఉదాత్తమైన కోరికలన్నీ
వాటి దివ్యమైన శక్తితో తిరిగి మొలకెత్తుతాయి
మన మాతృత్వాలను ఆశీర్వదించిన
మేరీ మాత తనయుడు
గుండేమీద నిద్రపోతున్న బిడ్డ రూపంలో
ప్రతి తల్లి చెంగటా ఉంటాడు.  
.

మేరీ ఫ్రాన్సిస్ బట్స్

(13 December 1890 – 5 March 1937)

బ్రిటిషు రచయిత్రి

.

The Happy Hour

The busy day is over,   

The household work is done; 

The cares that fret the morning        

Have faded with the sun;        

And in the tender twilight,      

I sit in happy rest,        

With my precious rosy baby  

Asleep upon my breast.

White lids with silken fringes 

Shut out the waning light;      

A little hand close folded,       

Holds mamma’s fingers tight;

And in their soft white wrappings,  

At last in perfect rest,   

Two dainty feet are cuddled,  

Like birdies in a nest.    

All hopes and loves unworthy

Fade out at this sweet hour;   

All pure and noble longings   

Renew their holy power;        

For Christ, who in the Virgin 

Our motherhood has blest,     

Is near to every woman

With a baby on her breast.

.

Mary Frances Butts

(13 December 1890 – 5 March 1937)

British Poet

The World’s Best Poetry.

Eds Bliss Carman, et al. 

Volume I. Of Home: of Friendship.  1904.

Poems of Home: I. About Children

http://www.bartleby.com/360/1/10.html

 

యవ్వనమూ – ముదిమీ… ఛార్ల్స్ కింగ్స్ లీ ఇంగ్లీషు కవి

కుర్రాడా! ప్రపంచం అంతా కొత్తగా ఉన్నప్పుడు
ప్రకృతి అంతా పచ్చగా కనిపిస్తున్నప్పుడు;
బాబూ! ప్రతి బాతూ హంసలాగానూ,
ప్రతి పిల్లా మహరాణిలానూ కనిపిస్తున్నప్పుడు;
బాలకా! అప్పుడు గుర్రాన్నీ బూటునీ వెతుక్కుని
దేశాటన చెయ్యడానికి పోవాలి;
పిల్లడా! యువరక్తం దాని దారి అది వెతుక్కోవాలి,
ప్రతి జీవికీ దాని రోజంటూ ఒకటి ఉంటుంది.

కుర్రాడా! ప్రపంచం అంతా పాతబడిపోయినప్పుడు
చెట్లన్నీ పచ్చదాన్ని కోల్పోయినపుడు;
బాబూ! ఏ క్రీడలోనూ ఉత్సాహం దొరకనప్పుడు
బండి చక్రాలన్నీ అరిగిపోయినప్పుడు;
ఇంటికి మెల్లగా చేరుకో; జీవితంలో అలిసి
చేవలుడిగిన వారిలో నీచోటు చూసుకో;
అక్కడి ముఖాలలో నువ్వు చిన్నప్పుడు ప్రేమించినది
ఒక్కటైనా దొరికేలా దేముడు నిన్ననుగ్రహించుగాక!
.
ఛార్ల్స్ కింగ్స్ లీ

12 June 1819 – 23 January 1875

English Poet

Charles Kingsley

Young and Old

.

When all the world is young, lad,    

And all the trees are green;   

And every goose a swan, lad, 

And every lass a queen;        

Then hey for boot and horse, lad,           

And round the world away; 

Young blood must have its course, lad,     

And every dog his day.        

When all the world is old, lad,

And all the trees are brown;        

And all the sport is stale, lad, 

And all the wheels run down:        

Creep home, and take your place there,    

The spent and maimed among:      

God grant you find one face there           

You loved when all was young.

.

Charles Kingsley

(1819–1875)

Poem Courtesy:

The Harvard Classics. 1909–14.

English Poetry III: From Tennyson to Whitman.

http://www.bartleby.com/42/655.html

క్రమశిక్షణ లేమి… కింగ్ క్రిమ్సన్, బ్రిటిష్ రాక్ బాండ్

నాకు మాత్రం ఇది గుర్తుంది.

దానితో గంటలు గంటలు దొర్లిపోయేవి

దానిమీద వ్యామోహం తగ్గే వేళకి,

నేను ఎంతగా అందులో లీనమయ్యేనంటే

మరొకటి చెయ్యడానికి పాలుపోలేదు. 

కొన్ని రోజులపాటు అలాగే కొనసాగేను

దానితో దాగుడుమూతలాడుతూ…

అంటే, రోజల్లా అటుచూడడం మానేసి

తర్వాత అటుచూడడం అన్నమాట

దానిమీద ఇంకా ఇష్టం మిగిలుందో లేదో చూడ్డానికి.

చిత్రం! నాకు ఇంకా ఇష్టం మిగిలే ఉంది.

.

కింగ్ క్రిమ్సన్ రాక్ బాండ్

ఇంగ్లండు

 

 King Crimson, 2003, L–R Trey Gunn,

Adrian Belew, and Robert Fripp

(Pat Mastelotto hidden)

Image Courtesy: Wikipedia

.

Indiscipline

.

I do remember one thing.

It took hours and hours,

But by the time I was done with it,

I was so involved,

I didn’t know what to think.

I carried it around with me for days and days,

Playing little games,

Like not looking at it for a whole day,

And then looking at it,

To see if I still liked it.

I did!

.

King Crimson Rock Band

(Robert Fripp, Adrian Belew, Bill Bruford and Tony Levin)

British

Lyric Courtesy:

http://wonderingminstrels.blogspot.in/search/label/Poet%3A%20King%20Crimson

మహా నగరం… హెరాల్డ్ మన్రో, ఇంగ్లండు

నేను సూర్యాస్తమయవేళ తిరిగి వచ్చేసరికి

సేవకురాలు సన్నగా ఏదో పాడుకుంటోంది.

చీకటిగా ఉండే మెట్లకిందా, ఇంటినిండా

వెన్నెలరేకలా సంధ్యవెలుగు చొరబడింది.

కాల స్పృహ ఎంతగా చచ్చుపడిందంటే

అది మధ్యాహ్నమో అర్థరాత్రోకూడా తెలియడంలేదు.

జలపాతపు నీటిలా పడుతూ, లేస్తూ, పడుతూ, ఉస్సురంటూ

నిశ్శబ్దపు శబ్దమొక్కటే శాశ్వతంగా కనిపిస్తోంది.

 

నేను నా గదిలో కూచున్నాను,

సూర్యాస్తమయాన్ని గమనిస్తున్నాను…

నక్షత్రాల వెలుగు చూశాను…

ఇంటిముఖం పట్టిన మనుషుల పాదాల చప్పుడు విన్నాను…

నిద్రపోబోతున్న కడసారి బిడ్డ చివరి మాట విన్నాను…

అప్పుడే ఒక ఒంటరి పిట్ట కూసింది…

ఒక్క సారిగా… ఇంటి కప్పులకి దూరంగా

పల్లెలో మైదానంలో గడ్డివాములమీద

అరవిరిసిన పూలమీదా… పరదాలా పొగమంచు తోచింది.

 

మెల్ల మెల్లగా లేస్తున్న చంద్రుడు…

తొలిఝాము రాతిరి కమ్మటి వాసన…

అస్పష్టమైన పాటలూ, వాటి ప్రతిధ్వనులు…

మొరుగుతున్న కుక్కలు…

మారనున్న తేదీ…

మత్తుగా కమ్ముకొస్తున్న నిద్ర…

తనివి తీరుతున్న విశ్రాంతి…

నగరంలోని దీపాలన్నీ వెలిగినతర్వాత

వీధుల్లోకి వెళ్ళి నగరాన్ని పరికించాను

చాలా హుషారుగా,  హాయిగా తిరిగాను

సగంరాత్రంతా వీధుల్లోనే తిరుగుతూ గడిపేను. 

.

హెరాల్డ్ మన్రో

(మార్చి 14, 1879 – మార్చి 16, 1932)

ఇంగ్లండు.

 

 Harold Monro

Image Courtesy:

 http://img.poemhunter.com/p/57/38957_b_3938.jpg

.

Great City

.

When I returned at sunset,              

The serving-maid was singing softly           

Under the dark stairs, and in the house       

Twilight had entered like a moon-ray.        

Time was so dead I could not understand          

The meaning of midday or of midnight,     

But like falling waters, falling, hissing, falling,        

Silence seemed an everlasting sound.          

I sat in my room,               

And watched sunset,                 

And saw starlight.             

I heard the tramp of homing men,

And the last call of the last child;  

Then a lone bird twittered,             

And suddenly, beyond the housetops,                  

I imagined dew in the country,      

In the hay, on the buttercups;         

The rising moon,               

The scent of early night,  

The songs, the echoes,             

Dogs barking,     

Day closing,        

Gradual slumber,              

Sweet rest.           

When all the lamps were lighted in the town                     

I passed into the street ways and I watched,

Wakeful, almost happy,  

And half the night I wandered in the street.

.

Harold Monro

(14 March 1879 – 16 March 1932)

British Poet

 

Poem Courtesy:

The New Poetry: An Anthology. 1917

Ed: Harriet Monroe, ed. (1860–1936)

 

http://www.bartleby.com/265/246.html

కడలి దృశ్యం (సానెట్ 83) … ఛార్లెట్ స్మిత్, ఇంగ్లీషు కవయిత్రి

కొండల మీద సంచరించే ఆ గొర్రెల కాపరి మేను వాల్చేడు

కొండశిఖరం వరకూ పరుచుకున్న మెత్తని గడ్డిమీద,

క్షితిజరేఖవద్ద ఆకాశంతో కలుస్తున్న కడలి అంచును చూస్తున్నాడో,

లేక, తన వియద్దృష్టిపరిధికి బాగా దిగువన,

పడమటి జలాల్లో నిప్పులు చెరుగుతూ

వాలుతున్న వేసవి సూర్యుణ్ణి చూసునాడో; ఆ విశాల దృశ్యం,

అద్భుతంగా, పరమ శాంతంగా, నలుదిక్కులా వ్యాపిస్తోంది,

ఆ గ్రామీణుడి గుండెమీదకూడా ఒక ప్రసన్న హర్షం

కానీ, దూరంగా, సముద్రజలాలపై, నల్లని మచ్చల్లా

మృత్యువునద్ది రాక్షసులు కురిపిస్తున్న రోగ శలాకల్లా,

యుద్ధాన్ని మోసుకెళ్తున్న నౌకలు; భీకరంగా, ఎర్రగా,

మెరుస్తున్న వినాశకర కీలలు; మాంసపుముద్దలైన హతులు,

పరిసరాల్ని కలుషితంచేస్తున్న విగత జీవులు. అయ్యో!

ఎంత దివ్యసృష్టినైనా రక్తసిక్తం చెయ్యగలడుగదా మనిషి!

.

ఛార్లెట్ స్మిత్

(4 May 1749 – 28 October 1806)

ఇంగ్లీషు కవయిత్రి.

 

.

Image Courtesy: http://upload.wikimedia.org
Image Courtesy: http://upload.wikimedia.org

The Sea View

The  upland shepherd as reclined he lies

On the soft turf that clothes the mountain brow,

Marks the bright Sea-line mingling with the skies;

Or from his course celestial, sinking slow,

The  Summer-Sun in purple radiance low,

Blaze on the western waters; the wide scene,

magnificent, and tranquil, seems to spread

Even over the Rustic’s breast a joy serene,

When, like dark plague-spots by the Demons shed,

Charged deep with death, upon the waves, far seen,

Move the war-freighted ships; and fierce and red,

Flash their destructive fires— The mangled dead,

And dying victims then pollute the flood.

Ah! thus man spoils Heaven’s glorious works with blood!

.

Charlotte Smith

(4 May 1749 – 28 October 1806)

English Poetess

Poem Courtesy:  page 41, Elegiac Sonnets and Other Poems by Charlotte Smith

https://archive.org/stream/elegiacsonnetsa01smitgoog#page/n40/mode/1up

 

 

 

వియోగవేళ… ఆలివ్ ఎలినార్ కస్టాన్స్, బ్రిటిషు కవయిత్రి

లేదు, ప్రియతమా! లేదు, సూర్యుడింకా నెత్తిమీదే ఉన్నాడు,

నిన్న రాత్రి నువ్వు, “సూర్యాస్తమయం తర్వాత” కదా వెళతా నన్నావు.

తోటలోకి రా, అక్కడ పూలు వాడిపోతుంటే

నోటమాట రాదు;  బహుశా అదే మంచిది:

అబ్బా! ఎంత భరింపరానిది “వీడ్కోలు” అన్న మాట!

విను! పక్షులు ఎంత మధురంగా వసంతగీతాలాలపిస్తున్నాయో!

త్వరలో అవి గూళ్ళు కట్టుకుంటాయి, ఆ శ్రమలో మౌనం ఆవహిస్తుంది

మనం కూడా వయసువస్తున్నకొద్దీ ఉల్లాసాన్ని మరిచిపోతాం

జీవితపు బాధ్యతలు నెత్తిమీద పడి… వాటితో పాటే

బాధాకరమైన “వీడ్కోలు” అన్న మాట కూడా.

నీ పాదాల క్రింద సువాసనలు వెదజల్లడానికి పూలు ఆరాటపడుతున్నాయి

పసిడి రంగు ఎండ దివి నుండి నీ కురులపై వాలుగా పడుతోంది;

నాకు ఏ పువ్వూ వద్దు; నీ అధరాలే అన్నిటికన్నా మధురం,

నా పెదాలు అక్కడ తచ్చాడుతున్నప్పుడు,

ప్రేమకి శాపమైన “వీడ్కోలు ” అన్నమాట మరిచిపోవుగాక.

అప్పుడే సూర్యాస్తమయం అయిందా? అంతసేపు కూర్చున్నామా?

చెప్పవలసినవి ఇంకా చాలా ఉన్నాయి, అప్పుడే వియోగవేళ అయిందా?

తోట ఎలా మూగపోయిందో! పాట ఎక్కడా వినిపించడం లేదు,

మన విషాదం మనల్ని ఒక ఆకస్మిక భయంతో కలవరపెడుతోంది

అబ్బా! ఎంత భరింపరానిది “వీడ్కోలు ” అన్న మాట!

.

ఆలివ్ ఎలినార్ కస్టాన్స్

(7 February 1874 – 12 February 1944)

బ్రిటిషు కవయిత్రి

.

 

Olive Eleanor Custance

.

The Parting Hour

.

Not yet, dear love, not yet; the sun is high,

You said last night,”At sunset I will go.”

Come to the garden, where when blossoms die

No word is spoken; it is better so :

Ah! bitter word “Farewell.”

Hark! how the birds sing sunny songs of spring!

Soon they will build, and work will silence them,

So we grow less light-hearted as years  bring

Life’s grave responsibilities— and then

The bitter word “Farewell.”

The violets fret to fragrance ‘neath your feet,

Heaven’s gold sunlight dreams aslant your hair:

No flower for me, your mouth is far more sweet.

O, let my lips forget, while lingering there,

Love’s bitter word “Farewell.”

Sunset already! have we sat so long?

The parting hour and so much left unsaid!

The garden has grown silent— void of song,

Our sorrow shakes us with a sudden dread

Ah! bitter word “Farewell.”

.

Olive Eleanor Custance

(7 February 1874 – 12 February 1944)

British Poet

 

Poem Courtesy:

The Homebook of Verse, American and English, 1580-1918

https://archive.org/stream/homebookofversea00stev#page/985/mode/1up

 

 

మిసెస్ థాచర్… స్యూ టౌన్ సెండ్, బ్రిటిష్

నువ్వు నిజంగా రోదిస్తావా, మిసెస్ థాచర్, రోదిస్తావా?

నువ్వు మేల్కొంటావా, మిసెస్ థాచర్, నిద్రలో ఉలిక్కిపడి ఎన్నడైనా?

ఎండి మోడై విచారగ్రస్తమైన చెట్టులా?

ఖరీదైన నీ “మార్క్స్ & స్పెన్సర్” తలగడ మీద?

నీ కన్నీళ్ళు మరుగుతున్న ఉక్కులా ఉంటయా?

అసలు నీకు అసలు ఎప్పుడైనా ఏడుపొస్తుందా?

నీ  మనసులో “3 మిలియన్లు” అన్న ఆలోచనతో ఎప్పుడన్నా నిద్రలేస్తావా?

వాళ్ళకి చెయ్యడానికి పని లేదని నీకెప్పుడైనా నిజంగా బాధకలుగుతుందా?

నువ్వు నీ అధికారదుస్తులు వేసుకుంటున్నప్పుడు,

ఉద్యోగంకోసం క్యూలో నిరీక్షిస్తున్నవారు నీ కంటికి కనిపిస్తారా?

నువ్వు రోదిస్తావా, మిసెస్ థాచర్, నిజంగా రోదిస్తావా?”

.

స్యూ టౌన్ సెండ్,

ఏప్రిల్ 2, 1946.

బ్రిటిషు నవలా కారిణి, నాటక రచయితా.

అధికారంలోకి రావడానికీ, ఉన్న అధికారాన్ని నిలుపుకోడానికీ రాజకీయ నాయకులు ఇవ్వని వాగ్దానాలు ఉండవు. కాని, ఒక సారి అధికారంలోకి వచ్చిన తర్వాత,  చిన్నపార్టీలను లాలించో, బుజ్జగించో, భయపెట్టో, చీల్చో, ఎలాగైనా అధికారాన్ని నిలుపుకోవడమే వాళ్ల ఏకైక లక్ష్యం.

తమకి అధికారాన్నిచ్చిన ప్రజలని మరచి, అధికారగణంతో కుమ్మక్కై, ప్రజలనెత్తిమీద అలవి మాలిన భారాన్ని మోపుతూ, పారిశ్రామికవేత్తలకు, దోపిడీదార్లకూ కొమ్ముకాయడం మనం చూస్తూనే ఉన్నాం. వాళ్లకి ప్రజల నిత్య జీవిత సమస్యలు సమస్యలు కావు… నిరుద్యోగం సమస్య కాదు.  ఎందుకంటే ఏ పార్టీ గెలిచినా వాళ్ళు అధికారాన్ని హస్తగతం చేసుకోగలరు. దరిద్రాన్ని తగ్గించలేనపుడు వాళ్లు చెయ్యగలిగింది దారిద్ర్యరేఖని ఇంకా కిందకి దించడం. దేశ రక్షణ, తనకి రెండుపూటలా తిండిలేకున్నా, దేశానికి తిండిపెడుతున్న రైతు రక్షణ, నిజాయితీ పరులైన అధికరుల రక్షణ, ప్రజలకు కనీసావసరాల పరికల్పన… ఇవేవీ వాళ్ళ సమస్యలు కావు.

సామాన్యుడి జీవితం బ్రిటనులో స్థితి మనకంటె భిన్నంగా లేదు.  Iron Lady గా పేరుపొందిన థాచర్ ని సంబోధిస్తూ ఈ కవిత రాసినా,  ఆ పేరుకు బదులు, ఇంకొకపేరుని  అభివృద్ధిచెందుతున్న దేశాలలోని దేశాధినేతల పేర్లు ఎవరికివారు ప్రతిక్షేపించుకోవచ్చు.  అందుకే, “నీ కన్నీళ్ళు ఉక్కులా ప్రవహిస్తాయా?” అని అడిగింది.   “నా ఆఖరి బొట్టువరకు దేశానికి సేవ చేస్తానని” చాలా మంది వాగ్దానాలిస్తారు. కాని ఆఖరి బొట్టుదాకా చేసేది వాళ్ళ అధికారాన్ని నిలబెట్టుకోవడం, తర్వాత తమ సంతానం అధికారంలోకి రావడానికి ఎదురులేకుండా చెయ్యడం.  తొత్తుల్ని, తాబేదార్లనీ, నైతికంగా దిగజారిన మేధావి వర్గాన్ని వాళ్లు అందలం ఎక్కించి వాళ్లచేత ఊడిగం చేయించుకోవడం.

చిన్న కవిత అయినా, చాలా ప్రతిభావంతమైన కవిత.

మన కాలానికి అక్షరాలా సరిపోయే కవిత.

ప్రజలు మేలుకోవలసిన కవిత.

.

Mrs. Thatcher

.

Do you weep, Mrs Thatcher, do you weep?

Do you wake, Mrs Thatcher, in your sleep?

Do you weep like a sad willow?

On your Marks and Spencer’s pillow?

Are your tears molten steel?

Do you weep?

Do you wake with ‘Three million’ on your brain?

Are you sorry that they’ll never work again?

When you’re dressing in your blue, do you see the waiting queue?

Do you weep, Mrs Thatcher, do you weep?

.

Sue Townsend

born 2 April 1946

English novelist and playwright, best known as the author of the Adrian Mole books

Mrs Margaret Thatcher (13 October 1925 – 8 April 2013) was the only lady British Prime Minister of UK and to hold office for the longest term  between 1979 – 1990.

%d bloggers like this: