అనువాదలహరి

చివరకి… గవిన్ ఏవార్ట్, బ్రిటిష్ కవి

ఎన్నటికీ ముగింపు ఉందదనుకున్న ప్రేమ
గడ్డకట్టిన మాంసపు ముక్కలా చల్లారుతోంది.

కూరలా వేడి వేడిగా ఉన్న ముద్దులు
ఇప్పుడు తొందరలో తీసుకునే చిలక్కొట్టుడులు.

విద్యుచ్ఛక్తిని పట్టుకున్న ఈ చేతులు, నాలుగుదిక్కులా
లంగరు వేసిన నావలా అచేతనంగా పడి ఉన్నాయి

ప్రేమికను కలవడానికి పరిగెత్తిన కాళ్ళు
ఇప్పుడు నెమ్మదిగా, ఆలశ్యంగా నడుస్తున్నాయి

ఒకప్పుడు మెరుపులా మెరిసి, నిత్యం విచ్చుకున్న కళ్ళే
ఇప్పుడు అశక్తతకు బానిసలు.

ఎప్పుడూ ఆనందాన్ని వెదజల్లిన శరీరం
ఇప్పుడు బిడియంతో, సిగ్గుతో, ఉదాసీనంగా ఉంది

కడదాకా తోడుంటుందనుకున్న ఊహాశక్తి
“టా…టా” అని చీటీపెట్టి నిష్క్రమించింది.
.

గవిన్ ఏవార్ట్

4 February 1916 – 25 October 1995)

బ్రిటిష్ కవి

Gavin Ewart

Ending

The love we thought would never stop

Now cools like a congealing chop

The kisses that were  hot as curry

Are bird-pecks taken in a hurry

The hands that held electric charges

Now lie inert as four moored barges

The feet that ran to meet the date

Are running slow and running late

The eyes that shone and seldom shut

Are victims of power cut.

The parts that then transmitted joy

Are now reserved and cold and coy

Romance, expected once to stay

Has left a note saying GONE AWAY.

.

(From ‘The Collected Ewart’ Century New Editions, 1982)

Gavin Ewart

(4 February 1916 – 25 October 1995)

British Poet

Poem Courtesy: https://www.poetryarchive.org/poem/ending

ఛైర్మన్ టామ్ తో ఏమన్నాడు?… బాసిల్ బంటింగ్, బ్రిటిషు కవి

కవిత్వం రాస్తావా? అది ఖాళీగా ఉన్నప్పుడు చేసె వ్యాసంగం.
నేను బొమ్మ ట్రెయిన్లు నడుపుతాను.
ఆ “షా” ని చూడు. అతను పావురాలు పెంచుతాడు.

కవిత్వం పనేమీ కాదు. ఒక్క చెమటచుక్క కారదు.
దానికెవడూ డబ్బులివ్వడు.
అంతకంటే నువ్వు సబ్బులకి ప్రచారం చెయ్యడం మెరుగు.

కళ, అంటే సంగీతం; లేదా నాటకం,
The Desert Song సంగీత రూపకంలో
నాన్సీ కోరస్ లో పాడింది తెలుసా.

ఏమిటీ? వారానికి 12 పౌండ్లు కావాలా…
నీకు పెళ్ళయింది. అవునా.
నీకు నిజంగా గుండెధైర్యం ఉంది.

నీకు పన్నెండు పౌండ్లు ఇస్తే
నేను ఏ ముఖం పెట్టుకుని
బస్సు కండక్టరుని చూడగలను?

ఇంతకీ, దీన్ని కవిత్వం అని ఎవడన్నాడు?
ఇంతకంటే నా పన్నెండేళ్ళ బిడ్డ
అనుప్రాసతో బాగా రాయగలదు.

నాకు దారి ఖర్చులుకాక 3 వేలు ఇస్తారు
కారూ, వోచర్లూ అదనం.
కానీ, నేను ఎకౌంటెంటుని.

నేను ఏం చెబితే వాళ్ళు ఆ పని చేస్తారు.
అది నా కంపెనీ.
నువ్వేం చేస్తావట?

పనికిమాలిన మాటలు, దీర్ఘ సమాసాలు తప్ప
ఇందులో పనికొచ్చే దొక్క ముక్క లేదు.
కవుల్ని కలిసేనంటే నేను తలస్నానం చేస్తాను.

పనికిమాలిన మాటలు, దీర్ఘ సమాసాలు తప్ప
ఇందులో పనికొచ్చే దొక్క ముక్క లేదు.
కవుల్ని కలిసేనంటే నేను తలస్నానం చేస్తాను.

ఆమాట హెయిన్సే అన్నాడు. అతనొక బడిపంతులు.
దీని విలువ అతనికే బాగా తెలియాలి
ఫో! ఫో! ఎక్కడైనా పని చూసుకో!
.

బాసిల్ బంటింగ్

బ్రిటిషు కవి

.

What the Chairman Told Tom

Poetry? It’s a hobby.
I run model trains.
Mr. Shaw there breeds pigeons. 

It’s not work. You don’t sweat.
Nobody pays for it.
You could advertise soap. 

Art, that’s opera; or repertory –
The Desert Song.
Nancy was in the chorus. 

But to ask for twelve pounds a week –
married, aren’t you? –
you’ve got a nerve. 

How could I look a bus conductor
in the face
if I paid you twelve pounds? 

Who says it’s poetry, anyhow?
My ten year old
can do it and rhyme. 

I get three thousand and expenses,
a car, vouchers,
but I’m an accountant. 

They do what I tell them,
my company.
What do you do? 

Nasty little words, nasty long words,
it’s unhealthy.
I want to wash when I meet a poet. 

They’re Reds, addicts,
all delinquents.
What you write is rot. 

Mr. Hines says so, and he’s a schoolteacher,
he ought to know.
Go and find work. 

Basil Bunting

British Poet

Poem Courtesy:

https://www.poetryfoundation.org/poems/47715/second-book-of-odes-6-what-the-chairman-told-tom

భరతవాక్యం … బాసిల్ బంటింగ్, బ్రిటిషు కవి

జీవిత చరమాంకంలోకి వచ్చిన వాళ్ళకి మిగిలేది తమజీవితం గురించిన పునశ్చరణ, మూల్యాంకనం చేసుకోవడమూను. ఎక్కువ శాతం అందులో సంతృప్తికంటే అసంతృప్తే ఉంటుంది. అందుకే (వ్యక్తిగత ప్రమాణాలననుసరించి) ఎవరికి వారు జీవితంలో సఫలత సాధించిన వారి గురించి వినడానికి ఇష్టపడతారు. ఇక్కడ “నిశ” చీకటి గాని రాత్రి గాని కాదు. మృత్యువు; మదిర … అమృతసేవనానికి అర్రులుజాచడం. ఎవరు ఎన్ని సాధించినా సాధించకపోయినా, లేక సాధించామనో సాధించలేకపోయామనో అనుకున్నా, వాళ్ళగురించి ఏదీ మిగలదు. వాళ్ళు పోగొట్టుకున్నదీ లేదు. మిగిల్చిపోయిందీ లేదు. కేవలం ఆత్మసంతృప్తి మినహా. శ్రీశ్రీ అన్నట్టు,

                    “ఇక్కడికి ఎందుకొచ్చామో,

                     ఇక్కడ ఎన్నాళ్ళుంటామో

                     …

                    ఎవరూ

                     చెప్పలేరంటే నమ్ము.

                      చెబితేమాత్రం, నమ్మకు.”

ఈ కవిత పరోక్షంగా చెబుతున్న సందేశం ఇదేనని నాకు అనిపిస్తోంది.

***

మంచిపాటకోసం వాచిపోయిన చెవులకి

గొప్ప సంగీతం వినబడితే, మనసుని ఎటో లాక్కుపోతుంది.

మనం గుడ్డిగా దాని వెంటబడతాం,

తుంపరలై కురిసినా, జల్లై తడిపినా,

ఎన్నడూ ఎరుగని లోకాలకి అనుసరిస్తాం.

ఓ నిశాదేవీ! మమ్మల్ని తేలిపోనీ.

 సాగరతరంగాలనుండి వచ్చే పవనమా! గర్జించు!

ఆ సముద్రాన్ని ప్రశ్నించు

పోగొట్టుకున్న దేది, మిగిలినదేది? అని.

ఏ కొమ్ము మునిగిందో,

ఏ కిరీటం ఒడ్డుజేరిందో.

మనం ఉన్నచోట ఎవరికి తెలుసు

ఏ రాజులు చీకటిపడగానే

మదిరకై చెయ్యిజాచుతారో?

ఎవరు పరశువు ఊచుతూ

రాజుల కుత్తుకలుత్తరిస్తారో?

మనం ఎక్కడికిపోతామో చెప్పగలరో?

.

బాసిల్ బంటింగ్

1 March 1900 – 17 April 1985

బ్రిటిషు కవి

.

Basil_Bunting_

c1980s_photo_by_Jonathan_Williams.jpg

Courtesy: Wikipedia

.

Coda

.

A strong song tows

us, long earsick.

Blind, we follow

rain slant, spray flick

to fields we do not know.

Night, float us.

Offshore wind, shout,

ask the sea

what’s lost, what’s left,

what horn sunk,

what crown adrift.

Where we are who knows

of kings who sup

while day fails? Who,

swinging his axe

to fall kings, guesses

where we go?

.

Basil Bunting

1 March 1900 – 17 April 1985

British Modernist PoetA

 

 

Poem Courtesy: https://www.poetryfoundation.org/poems/47708/coda-56d2285ab4d58

 

Notes:

Coda: In Music, Ballet, or literature, it is a summing up of earlier themes, motifs etc (the concluding part of the work) in an independent way that signifies the conclusion of the work of art.

అందరూ పాడిన పాట… సీ ఫ్రై ససూన్, ఇంగ్లీషు కవి

అందరూ ఒక్కసారి పాట అందుకున్నారు;
నాలో ఎంత ఉత్సాహం పొంగిపొరలిందంటే
పంజరంలో బంధించబడిన పక్షులు విముక్తులై
తెల్లని పూదోటలమీద రెక్కలల్లార్చుకుంటూ
పచ్చనిపొలాలమీదుగా విహరిస్తూ విహరిస్తూ
కంటికి కనిపించనంతదూరంవెళ్లినంతగా.

అందరిగొంతుకలూ ఒక్కసారి తారస్థాయికి చేరుకున్నాయి;
సూర్యాస్తమయవేళ సౌందర్యం అందర్నీ ఆవహించింది,
నా మనసు కన్నీటితో పులకించిపోయింది;
భయం పటాపంచలయింది… ఓహ్! కానీ అందరూ
పక్షుల్లాగే… పాటలో పదాలు లేవు; పాట ఇక ఎవరూ పాడలేరు.
.
సీ ఫ్రై ససూన్

(8 September 1886 – 1 September 1967)

ఇంగ్లీషు కవి, సైనికుడు

Siegfried Sassoon
Siegfried Sassoon
Image Courtesy: http://www.spartacus.schoolnet.co.uk/Jsassoon.htm

.

Everyone Sang

Everyone suddenly burst out singing;

And I was filled with such delight

As prisoned birds must find in freedom,

Winging wildly across the white

Orchards and dark-green fields, on- on- and out of sight.

 

…… deliberately edited… copyrighted poem…. ….

 

Siegfried Sassoon CBE MC

(8 September 1886 – 1 September 1967)

English Poet, Soldier

please Read the  Original Copyrighted poem here

 

చిత్రపటంతో … ఆర్థర్ సైమన్స్, ఇంగ్లీషు కవి

బీరువాలోంచి విచార వదనం
ఒకటి నన్ను పరికిస్తోంది…
గతించిన ప్రేమకు అవశేషం
నా ప్రేతాత్మకి సగ భాగం.

నాకు ఇష్టమైన ఆ నిరీక్షించే కళ్ళు
నన్ను పరిశీలిస్తూ ఎంతగా అభిమానించేవని…
ఏమిటో ఇప్పుడు బరువైన జ్ఞాపకాల దొంతరలు
ఆమె నిరీక్షించే చూపులు.

ఓ నా ప్రేమ చిహ్నమా, నీకు అన్యాయం జరిగింది, 
తిరిగి రా: అలనాటి ప్రేమలోని బాధలన్నీ, 
అప్పుడు భరించి, ఇపుడు మరుగుపడినా,
మళ్ళీ తిరిగిరా!

వాటిని మరిచిపోకు, కానీ మన్నించు!
ప్చ్! సమయం మించిపోయింది! ఏడ్చిప్రయోజనం లేదు.
మనిద్దరం రెండు ప్రేతాత్మలం. జీవించడానికి
అవకాశం వచ్చినా చేజార్చుకున్నాం, నువ్వూ— నేనూ.

.

ఆర్థర్ సైమన్స్

28 February 1865 – 22 January 1945

ఇంగ్లీషు కవి

.

.

To a Portrait

A pensive photograph

  Watches me from the shelf—

Ghost of old love, and half

  Ghost of myself!

How the dear waiting eyes

  Watch me and love me yet—

Sad home of memories,

  Her waiting eyes!

Ghost of old love, wronged ghost,

  Return: though all the pain

Of all once loved, long lost,

  Come back again.

Forget not, but forgive!

  Alas, too late I cry.

We are two ghosts that had their chance to live,

  And lost it, she and I.

.

Arthur Symons

 28 February 1865 – 22 January 1945

British Poet and Critic

Poem Courtesy:

The World’s Best Poetry.

Eds.  Bliss Carman, et al.

Volume III. Sorrow and Consolation.  1904.

  1. Disappointment in Love

http://www.bartleby.com/360/3/15.html

 

పురాతనోద్యానం… రిచర్డ్ ఆల్డింగ్టన్, ఇంగ్లీషు కవి

(మొదటి ప్రపంచ సంగ్రామంతో ప్రపంచంలో నిరాశా నిస్పృహలు కమ్ముకున్న వాతావరణంలో, ఆంగ్లసాహిత్యంలో ఇమేజిజం అన్న ఒక సాహిత్యోద్యమాన్ని, లేవనెత్తినవాళ్ళలో ప్రథముడు… రిఛర్డ్ ఆల్డింగ్టన్.
ప్రతీకలద్వారా కళ్ళెదుట ఉన్నవస్తువుని పాఠకుడికళ్ళముందు రూపుకట్టేటట్టు ప్రయత్నించడం వీళ్ళ ఆదర్శమైనా, ఈ ఉద్యమంలోని కవులు సందర్భానికి పనికిరాని ప్రతీకలూ, అవసరానికి మించి, ఒక్క మాట అయినా ఎక్కువ వాడకూడదన్న నియమం కలిగిన వారు; కవి ఉన్నదున్నట్టు చెప్పినా విషయాన్ని మాత్రం వాచ్యం చెయ్యడు.
ఈ కవితలో ఎత్తుగడ Romanticism బాటలో ప్రకృతితో ప్రారంభించినా, ముగింపులో, చెప్పిన తెల్లదనం, పువ్వులూ, రాళ్ళూ, మృత్యువుకీ, సమాధులకీ ప్రతీకలు. ఇంత అందమైన ప్రకృతీ అనుకోకుండా కమ్ముకున్న ప్రపంచ యుద్ధమేఘాల తాకిడికి నిర్జీవమై మానవాళికంతటికీ ఒక పెద్ద శ్మశానమై మిగిలిపోతుందికదా అన్న భావన ఆపుకున్న ఏడుపుకి కారణంగా కవి చిత్రిస్తాడు.)

.

నేను ఈ తోటలో హాయిగా కూచున్నాను

నిలకడగా ఉన్న చెరువునీ, రెల్లుగడ్డినీ…

వేసవి చివరలో పొదరిళ్ళలోని

పలువర్ణాల ఆకులుని చెదరగొట్టినట్టుగా

ఆకాశంలో అలముకున్న నల్లని మేఘాలని

చెదరగొడుతున్న సుడిగాలినీ చూస్తూ;

కానీ, ఇవీ, వీటితోబాటు చెరువులోని కలువలూ

ఎంత ఆనందాన్ని కలుగజేసినా,

నాకు ఏడుపు తెప్పించినంత పని చేసినవి

గులాబులూ… మనుషులు నడుచుకుంటూ పోయే

తెల్లని నాపరాయి పలకలూ,

వాటి మధ్య రంగు వెలిసిన పచ్చగడ్డి మొక్కలూను.

.

రిఛర్డ్ ఆల్డింగ్టన్

ఇంగ్లీషు కవి.

.

.

Au Vieux Jardin

(The Old Garden)

.

I have sat here happy in the gardens,  

Watching the still pool and the reeds  

And the dark clouds       

Which the wind of the upper air         

Tore like the green leafy boughs         

Of the divers-hued trees of late summer;      

But though I greatly delight      

In these and the water-lilies,      

That which sets me nighest to weeping         

Is the rose and white color of the smooth flag-stones,      

And the pale yellow grasses      

Among them.

.

Richard Aldington

8 July 1892 – 27 July 1962

English Writer and Poet;  Architect of Imagism movement in 20th century literature  along with  Ezra Pound and HD (Hilda Dolittle)  

Poetry: A Magazine of Verse.  1912–22.

Ed: Harriet Monroe,  (1860–1936). 

http://www.bartleby.com/300/12.html]

మిత్రులు… జేమ్స్ మన్ గమ్ రీ, ఇంగ్లీషు కవి

ఒకరి తర్వాత ఒకరుగా మిత్రులు నిష్క్రమిస్తారు:
స్నేహితుడ్ని పోగొట్టుకోనివాడు ఎవడు?
ఇక్కడే ముగింపు చూడని
మనసుల కలయిక ఎక్కడా కనిపించదు.
ఈ నశ్వరమైన ప్రపంచమే మన విశ్రాంతి అనుకుంటే
బ్రతికినా, చచ్చినా, ధన్యుడైనవాడెవ్వడూ లేనట్టే

కాల ప్రవాహానికి అతీతంగా ,
మృత్యు లోయకి ఆవల,
ఖచ్చితంగా ఒక దివ్యమైన లోకం ఉంది
అక్కడ జీవితం క్షణికం కాదు;
జీవితంలోని అనుబంధాలు నిమిత్తమైన
నిప్పురవ్వల్లా ఎగిరి, జ్వలించి ఆరిపోయేవి కావు.

పైన ఒక ప్రపంచం ఉంది,
అక్కడ వియోగమన్న మాట తెలీదు;
కాలాతీతమైన ప్రేమ,
కేవలం మంచికొరకే సృష్టించబడ్డది;
ఇక్కడ చనిపోయిన వాళ్ళు
అక్కడకి కొనిపోబడతారని నమ్మకం.

అలా చుక్క తర్వాత చుక్క రాలిపోతుంది,
చివరికి అందరూ మరణించేదాకా ;
ఉదయం ఎలా ప్రవర్థమానమౌతూ
స్వచ్ఛమైన రోజుగా పరిణమిస్తుందో,
ఈ చుక్కలు శూన్యమైన రాత్రిలోకి గ్రుంకకుండా,
అవి స్వర్లోకపు ప్రకాశంలో దాక్కుంటాయి, అంతే!

.

 జేమ్స్ మన్ గమ్ రీ

(4 November 1771 – 30 April 1854)

ఇంగ్లీషు కవి

.

.

Friends

.

Friend after friend departs:        

Who hath not lost a friend? 

There is no union here of hearts,   

Which finds not here an end.

Were this frail world our only rest,       

Living or dying, none were blest.  

 

Beyond the flight of time,     

Beyond the vale of death,     

There surely is some blessèd clime  

Where life is not a breath;           

Nor life’s affections, transient fire, 

Whose sparks fly upwards and expire. 

  

There is a world above,         

Where parting is unknown;  

A whole eternity of love,              

Form’d for the good alone;  

And faith beholds the dying here   

Translated to that glorious sphere.

 

Thus star by star declines,    

Till all are pass’d away;               

As morning high and higher shines         

To pure and perfect day:      

Nor sink those stars in empty night,        

They hide themselves in heaven’s own light.

.

James Montgomery 

(4 November 1771 – 30 April 1854)

British Poet and Editor

 

Poem Courtesy:

The Sacred Poets of the Nineteenth Century. 1907.

Ed. Alfred H. Miles.

http://www.bartleby.com/294/7.html

ముదిమి – వయసు… ఫ్రాన్సిస్ విలియం బూర్డిలాన్, ఇంగ్లీషు కవి.

చాలాకాలం క్రిందట, ఒక వేసవి ఉదయాన

ఆడుకుంటున్న పాప పక్కనించి వెళ్ళాను;

అలా పక్కకి రాగానే, చిన్నతనపు ఉత్సాహంతో

“దా! మనిద్దరం ఆడుకుందాం!” అని పిలిచింది.

 

కానీ నా చూపులు దూరానున్న శిఖరం మీద ఉన్నాయి

చీకటిపడేలోగా అదెక్కగలిగితే సంతోషమే.

అందుకని కొంత అసహనంతో అన్నాను: ” లేదు!

నేను నీతో ఆడడానికి మరీ ముసలివాడిని” అని.

 

చాలా ఏళ్ళు గడిచిపోయేక, శీతకాలంలో

నా కాళ్ళలో కొండలెక్కగల సత్తా సన్నగిలేక

చక్కని పచ్చికబయల్లో ఒక పాపని దాటిపోతూ,

ఆమెని పిలిచి,”దా! మనిద్దరం ఆడుకుందాం!” అన్నాను.

 

ఆమె దృష్టంతా కథల పుస్తకం మీద ఉంది;

ఆశ్చర్యంతో విప్పారిన కళ్ళని ఎత్తైనా చూడకుండా

పిల్లలకి సహజమైన చికాకుతో సమాధానం ఇచ్చింది,

“లేదు! నేను ఆడడానికి మరీ చిన్నపిల్లని కాను.” అని.

.

ఫ్రాన్సిస్ విలియం బూర్డిలాన్

22 మార్చి 1852 – 13 జనవరి 1921

ఇంగ్లీషు కవి, అనువాదకుడు

 

.

Francis William Bourdillon

.

Old And Young

.

Long ago, on a bright spring day,

I passed a little child at play;

And as I passed, in childish glee

She called to me, “Come and play with me!”

 

But my eyes were fixed on a far-off height

I was fain to climb before the night;

So, half-impatient, I answered, “Nay!

I am too old, too old to play.”

 

Long, long after, in Autumn time—

My limbs were grown too old to climb—

I passed a child on a pleasant lea,

And I called to her, “Come and play with me!”

 

But her eyes were fixed on a fairy-book;

And scarce she lifted a wondering look,

As with childish scorn she answered, “Nay!

I am too old, too old to play!”

.

Francis William Bourdillon

22 March 1852 – 13 January 1921

British poet and translator

%d bloggers like this: