అనువాదలహరి

స్వీట్ ఛారియట్ అంత్యక్రియల సంఘం ప్రకటన… మెరిలీన్ టేలర్, అమెరికను

[ముందుగా ఊహించినట్టు సమాధులలో ఖాళీజాగా కొరత కారణంగా ఒక సరికొత్త సేవ అందుబాటులోకి తీసుకువచ్చాము. ఇందులోని ప్రత్యేకత వ్యక్తుల భౌతిక అవశేషాలను జాగ్రత్తగా ఒక అంతరిక్ష నాళికలో ప్రోదిచేసి, భద్రపరచి చివరకు భూకక్ష్యలో శాశ్వతంగా ఉండేటట్టు ప్రవేశపెట్టడం…. డిస్కవర్ మేగజీన్ ]

***

మిత్రమా!
మేము మా సామర్థ్యాన్ని
మించి పనిచేస్తున్నాం.
ఇక మేము మీ సమాధికై
పచ్చని పచ్చిక స్థలాన్ని
కేటాయించలేము.
ఖాళీ జాగా అలభ్యం. 

మా ఖాతాదారులకు వినతి: బదులుగా,
మీరు మీ చితా భస్మాన్ని
మాదగ్గర భద్రపరచే అవకాశం ఇస్తున్నాం
ఈ ఆధునిక అంతరిక్షయుగ ‘ఉత్తరక్రియల నిర్వాహకులు’
దానిని తుప్పుపట్టని ఉక్కు గొట్టాల్లో భద్రపరుస్తారు
(న్యూటను తదనంతర ఖగోళ విజ్ఞాన ఫలితం)

ఆ పైన మీరూ
(మీతో పాటు మీ ఆత్మీయులందరూ కూడా)
ప్రత్యేకంగా ఎర్పాటుచేసిన వ్యోమనౌకను
అధిరోహించి
స్వర్గానికి అతిసమీపంలో
చిరస్థాయిగా ఉండవచ్చు.
.

మెరిలీన్ టేలర్
జననం అక్టోబరు 2, 1939
అమెరికను.

.

.

Notice from the Sweet Chariot Funeral Parlor

.

(Due to predicted overcrowding in or cemeteries, a new service is available which will see to packing and storing one’s remains in a space capsule for eventual launching into Earth’s orbit.

 —Discover Magazine)

Dear Friend: we

     are operating at capacity

and cannot

     supply a green and grassy spot

for your tomb,

     as there is no more room.

Instead, you are invited to entrust

     your dust

to our space-age morticians, who seal

     in stainless steel

(thanks to post-Newtonian science)

     our clients.

Whereupon you

     (and all your shiny loved ones, too)

shall ascend

     via chartered rocketship, to spend

eternity

     very near where Heaven used to be.

    .

Marilyn L. Taylor

Born 2 October   1939

American

 

Poem Courtesy:

http://www.poemtree.com/poems/NoticeFromTheSweetChariot.htm

స్థానికురాలు… మెరిలీన్ టేలర్, అమెరికను కవయిత్రి

టోక్యోలోనో, లేదా, నాగసాకీ లోనో
మీకు “మీ విధేయురాలి” ఫోటో కనిపించవచ్చు
గెరాల్డ్ ఫొర్డ్ ప్రెసిడెంటుగా ఉన్న తొలిరోజుల్లో
మిల్వాకీ లోని వోల్స్కీ టావెర్న్ దగ్గర తీయించుకున్నదది.

నేను పొట్టి నిక్కరూ, కాటన్ టీ-షర్టూ
వేసుకుని(గులాబిరంగు టై వెలిసి ఆకుపచ్చగా మారుతోంది)
బహుశా జేమ్స్ డీన్ కి బాగా నచ్చే విధంగా,
ఒంటిమీద చిరుగుపడ్డ స్వెట్టరుతో ఉంటాను.

నా వెనకే ఒక పర్యాటకుల బస్సు ఒకటి ఆగి ఉంది
జపానునుండి యాత్రికులు తలుపు తెరుచుకుని బయటకి దూకారు
వాళ్ల చేతికెమేరాల ఫ్లాష్ లైట్ల వెలుగులకి మూసుకుపోయిన
నా కళ్ళు … మరింత శాశ్వతంగా ఆ ఫోటోలో నన్ను నిలబెడతాయి.

ఇప్పుడు, ఇన్నేళ్ళు గడిచేక, వాళ్ళ ఆ నాటి అమెరికా
ప్రయాణం గురించి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నపుడు
ఈ ఫోటోను జాగ్రత్తగా పరీక్షించి, వాళ్ళవెనక
స్థానిక దుస్తుల్లో ఉన్న ఈ స్త్రీ ఎవరా అని ఆశ్చర్యపోతారు.

.

మెరిలీన్ టేలర్

జననం అక్టోబరు 2, 1939

అమెరికను కవయిత్రి .

.

The Native

.

In Tokyo, or maybe Nagasaki,

you’ll find a photo of Yours Truly, taken

down at Wolski’s Tavern in Milwaukee,

early in the Ford administration.

I was wearing short-shorts, and a cotton

T-shirt (tie-dyed pink, running to green),

plus a sweater—carefully flea-bitten

in the manner favored by James Dean.

A chartered bus was idling right behind me

as tourists from Japan leapt out the door,

their flashbulbs blasting bright enough to blind me,

preserving me on film forevermore.

And now, years later, when they wax nostalgic

about their thrilling trip to the U.S.,

they’ll peer and gape again at that authentic

outback woman, in her native dress.

.

Marilyn L. Taylor

(born October 2, 1939)

American Poetess

Note:

Read here about James Dean 

The poem subtly, and powerfully records the economic depression during the presidency years of Gerald Ford. Please note the title “Native” and the way she described her attire.

Poem Courtesy:

http://www.poemtree.com/poems/Native.htm

 

%d bloggers like this: