అనువాదలహరి

కాలమే నిర్ణయిస్తుంది… సుకాసా స్యహ్దాన్, ఇండోనీషియా కవి

కాలమే నిర్ణయిస్తుంది

ఎక్కడ నిజమైన యుద్ధం

ఆరంభమవుతుందో:

ప్రతి గుండెలోనూ.

కాలమే నిర్ణయిస్తుంది

తమని తాము గాయపరచుకోడంలో

ఎవరు కృతకృత్యులౌతారో:

ఎవ్వరూ గెలవరు.

కాలమే నిర్ణయిస్తుంది

మిత్రులలో

శతృవులెవరో:

రెంటిలో పెద్ద తేడా ఉండదు.

కాలమే నిర్ణయిస్తుంది

చివరకి, ఎవరు

చెప్పేది నిజమో:

ఎవరు చెప్పేదీ కాదు.

.

సుకాసా స్యహ్దాన్

జననం: 1968

ఇండోనీషియన్ కవి

.

Time Shall Tell 

.

Time shall tell 
where the real 
warfare befalls:
in every soul 

Time shall tell 
who triumphs 
in self-infliction:
no one shall

Time shall tell 
foes apart 
from friends:
no difference

Time shall tell 
who possesses 
the ultimate truth: 
no one.

.

Sukasah Syahdan

Born: 1968

Indonesian Poet

Poem Courtesy:

http://www.wikitime.net/literature/268-time-shall-tell-by-sukasah-syahdaneng

అనుసరణీయాలు… మైకేల్ యూంగ్, అమెరికను

రహదారి రద్దీ, జనసందోహం, ఒడ్డుకి దూసుకొస్తున్న కెరటం
ఆ మాటకొస్తే ఉధృతంగా ఎగసి చప్పున చల్లారేదేదైనా, ముందు మెల్లగా ప్రారంభమై
తర్వాత సమసిపోతుంది, ప్రతిక్షణాన్నీ, అది తీసుకువచ్చే సందర్భాల్నీ మరిచిపోతూ…
ఉదాహరణకి గాలి మేఘాల్ని తోసుకుపోతుంది, మేఘాలు రోజుని,
రాత్రి పోతూ పోతూ సూర్యుణ్ణి ఆహ్వానిస్తుంది,
జీవితమంత కల, ఒక్క క్షణంలో గడిచిపోతుంది,
ఇందులో ఏదీ పొగడ్తలనీ, తెగడ్తలనీ ఆశించి క్షణం ఆగదు,
కంటికి దొరికినంత చేదుకుని, చెయ్యి ఇవ్వగలిగినది ఇవ్వండి…
దానితో సరి … ఈ సత్యం మీకందరికీ తెలిసిందే, 
కనుక ఏదున్నా పోయినా, మేలుకున్నా, నిద్రలో ఉన్నా, మరిచిపోండి, ప్రాకులాడకండి.
.

మైకేల్ యూంగ్

జననం 1968
అమెరికను .

.

Examples to Follow

 .

Traffic, a crowd, the tide flooding the bay,

     whatever will rise and fall, will begin,

          then end, forgive each moment for what comes along,

like wind shoving the clouds, and clouds, the day,

     like the night calling the sun to come in,

          the dream where a brief second is lifelong,

where nothing waits for praises or regret,

     but takes as eyes take, gives with the ease of skin—

          only so much—yet real as all you know,

that leaves or stays, will sleep and wake, forget,

                              let go.

 .

Michael T. Young

Born 1968

American Poet

Poem Courtesy:

http://www.poemtree.com/poems/ExamplesToFollow.htm

%d bloggers like this: