అనువాదలహరి

రహస్యాలు…. లెన్ క్రిసాక్, అమెరికను కవి

(… ఏంథొనీ లొంబార్డీ స్మృతిలో )

కొందరనుకుంటున్నట్టు అతను చాలా మెల్లిగా పనులుచేస్తాడనో,

లేదా చాలా సామాన్య విషయాలకే అతిగా నవ్వుతాడనో

అతన్ని మూర్ఖుడిగా జమకట్టవచ్చు. కానీ అది నిజం కాదు.

ఉత్తరాలు తీసుకువచ్చే అతనికోసం ఎంతలా ఎదురుచూస్తామో

అంతలా అతని అడుగులచప్పుడుకోసం ఎదురుచూసేవాళ్ళం.

తలుపుకి తగిలించిన ఓవర్ కోటు మాకు నాలుగైదేళ్ళప్పుడు

అందులో వెళ్ళిన మనిషి తిరిగివచ్చేడని సూచించేది.

మమ్మల్ని ఎగరేసి ఎత్తుకోవడం, గుర్రం ఆడటం ఒక్కటే

కాకుండా అతనికి చాలా విషయాలలో ప్రావీణ్యం ఉంది.

చాలా తెలివైన వాడు, ఎవరేమన్నా పట్టించుకోని

మా నాన్న ఏ కాలేజీలోనో పెద్దగా చదువుకున్నవాడు కాదు.

అయినప్పటికి అతని కొద్దిపాటి చదువే నాకు వెలుగైందని తెలుసు.

నీళ్ళు త్రాగడానికి వంగిన పక్షిలా ప్రతిరాత్రీ వంగి అతను

నన్ను ముద్దుపెట్టుకున్నపుడు అతని ముదురుగడ్డం నన్ను తాకేది.

.

లెన్ క్రిసాక్

జననం 1948

అమెరికను కవి.

.

.

Intelligences

 (—for Anthony Lombardy)

.

Because it seemed to some that he was slow,

Or smiled too much at many simple things,

One might have thought him dumb.  It was not so.

The way one waits for what the mailman brings,

We listened for his step and watched that door

That said his overcoated form was back

From where he went when we were five and four.

We saw that he had more than just a knack

For lifting us aloft or playing horse.

Both broad of back and smarter than a whip,

My father never took a college course.

And yet, I learned his learning was my light

By kissing, like a bird who bent to sip,

The stubbled cheek he’d turn to me each night.

 .

Len Krisak

Born 1948

American Poet

Poem Courtesy:

http://www.poemtree.com/poems/Intelligences.htm

Notes:  (Idiom)

To have a broad back: Not easily hurt by criticism; To be able to help others with their problems without being tired or upset.

Smart as a whip: Very Intelligent or Clever.

 

చేతికి అంటిన ఆనవాళ్ళు … లెన్ క్రిసాక్, అమెరికను కవి

ఇది మనకి బాగా పరిచయమైన సాయంసంధ్యా చిత్రంతో పాటు, ప్రకృతిలోని ఒక సంఘటనని చమత్కారంగా కవితలోకి మలుచుకోవడంలో కవి ప్రతిభ కనిపిస్తుంది. మా మిత్రుడు శ్రీ యెరికలపూడి సుబ్రహ్మణ్య శర్మగారు (సమవర్తి పేరుతో ఈమాటలో పద్యాలు వ్రాస్తుంటారు) ఒక సందర్భంలో రాత్రి ప్రకృతిని వర్ణించి వర్ణించి, ముగింపుగా, దానికి “ప్రాతః సూర్యదీపాంజలి” సమర్పిస్తున్నానని సూర్యోదయాన్ని పేర్కొంటూ ముగిస్తారు. అది గుర్తొచ్చింది ఈ కవిత చదవగానే.

***

నేల చదునుచెయ్యడం పూర్తయి, కోసినగడ్డి బస్తాకెత్తి
గట్టుమీదపెట్టి, నొప్పెడుతున్న వీపుని చేరవెయ్యడానికి
అతను అనువైన ప్రదేశమూ, వాలుకుర్చీకోసం వెతుకుతున్నాడు.
వేసవిపొద్దు సంధ్యచీకట్లు నెమ్మదిగా కమ్ముకుంటుంటే
అతని దృష్టి ఆ రోజు తన శ్రమకి మంగళం పాడడానికి
పశ్చిమ ఆకాశాన, ఎర్రగా మండుతున్న సూర్యుడివైపు మళ్ళింది
ఆ రోజుకి అతను పని ముగించి విశ్రాంతి తీసుకుంటున్నా
అతని చేతులకి పనిముట్ల స్పర్శ ఇంకా అంటుకునే ఉంది.
అతను తన పానీయాన్ని ఇంకా ‘పార’ను పట్టుకున్నట్టే పట్టుకుంటూ
ఆ చెయ్యి చేసిన పనిని గుర్తు చేసుకుంటున్నాడు.
సూర్యాస్తమయం అవుతూంటే, అతను తాగుతున్న లెమనేడ్
గ్లాసుచుట్టూ నీటిబిందువులు పేరుకున్నాయి. ఒక్క తియ్యని గుక్క
మిగిలి ఉంది. ఆ రేయికీ, తను తప్పిన శ్రమకీ శుభాకాంక్షా
పూర్వకంగా దాన్ని మద్యం గ్లాసులా పైకి ఎత్తి సేవించాడు.
.

లెన్ కిసాక్
జననం 1948
అమెరికను .

.

Held

.

The raking done, the cut grass bagged and set

Upon the curb, he looks to clear a space

To rest where aching back and deck chair meet.

The twilight settles down at summer’s pace

And draws his eye where western sky and sun

Conspire to paint his working day an end

Of gaudy purple fire.  And though retired,

He feels the heft of tools still in his hand.

He holds his drink as if it were a haft

Of ash, and thinks of what that hand has done.

The frosted glass of lemonade perspires

As dusk comes on.  One sugared swallow left,

He lifts it, like a chalice, in a toast

To night and all the toil he misses most.

Len Krisak

 Born 1948

American Poet

Poem Courtesy:

http://www.poemtree.com/poems/Held.htm

%d bloggers like this: