Mr Bhaskar Kondreddy hails from Kanigiri of Prakasam District Andhra Pradesh. He is a Science Teacher by profession. He is an active blogger (bhaskar321.blogspot.in) and an enthusiastic translator.
.
అధిభౌతికం
1
అలా ఈడ్చుకుపోతున్నప్పుడు కాలికో తాడు కట్టి, అభావంగా ఆ మట్టిరోడ్డు, కంకర రాళ్లమీద వెనుకపడుతున్న ఆ పిల్లల ఆకలి చూపుల దాహాన్ని తీర్చడానికి, ఏ స్తన్యం సిద్దపడుతుంది.
2
నిన్నటి దాకా మరి ఆ తల్లి పక్కనేకదా,
ఆ తల్లి కాళ్లమధ్యనే కదా అవి
విసిగించి, విసిగించి, మాతృత్వపు ప్రేమపైబడి,
వెచ్చని, రొమ్ముల మధ్యనే కదా, అవి,
అరమోడ్పు కన్నులతో, పాలు కుడిచి,..
మంచుకురుస్తూ చీకటి వణికే వేళ
రేపటి శీతాకాలపు కాళరాత్రి
ఎన్నెన్ని భయాలమూటలను, పారద్రోలి
ఇక ఎలా ప్రశాంతంగా నిద్రిస్తాయో మరి.
3
దేహాంత నిర్జీవత్వాల ప్రశ్నల పరంపరల్లో దేని సమాధానాలు, దానివే అయినా సరే, వెంట నడవడంలో, ఉపశమించే వేదన అలా అనుసరిస్తుందేమో.
నీరు కార్చడం తెలియని స్వచ్ఛమైన కళ్లుకల ఆ కుక్కపిల్లలు మరి, అలా ఆ తల్లి కోసం… ?