అనువాదలహరి

మితభాషికి నిర్లక్ష్యం అంటగడతారు… భర్తృహరి, సంస్కృతకవి

మితభాషికి నిర్లక్ష్యాన్నీ,

భక్తితో ప్రవర్తించే వానికి కపటత్వాన్నీ

నిర్మల మనస్కునికి వంచననీ

వీరునికి క్రూరత్వాన్నీ

లోకాన్ని త్యజించినవానికి శత్రుత్వాన్నీ

సరససంభాషికి  నక్కవినయాలనీ

హుందాగా ఉండేవ్యక్తికి అహంకారాన్నీ,

మంచి వక్తకి వాచాలత్వాన్నీ

విశ్వాసంగా ఉండేవారికి వ్యక్తిత్వలేమినీ 

లోకం ఆపాదిస్తూనే ఉంటుంది.

దుర్బుద్ధితో ఆలోచించే వారి

దూషణని తప్పించుకోగల

సుగుణం లోకంలో, అసలు, ఉందా

.

భర్తృహరి

 

సంస్కృత కవి

 

Apathy is Ascribed to the Modest Man

.

Apathy is ascribed to the modest man

Fraud to the devout

Hypocrisy to the pure

Cruelty to the hero

Hostility to the anchorite

Fawning to the courteous man

Arrogance to the majestic

Garrulity to the eloquent

Impotence to the faithful.

Does there exist any virtue

Which escapes

The slander of wicked men?

.

Bhartrihari

(CE 650)

Sanskrit Poet

Tr. Barbara Stoler Miller

https://archive.org/details/worldpoetryantho0000wash/page/220/mode/1up

విధి ఒక దయలేని కుమ్మరి… భర్తృహరి, సంస్కృత కవి

నాకు ఈ సంకలనంలో బాగా నచ్చిన విషయం భర్తృహరిని (ఇంకా, అమర సింహుడు మొదలుగా సంస్కృత కవుల్ని, చాలమంది చీనీ కవుల్ని) ఇంగ్లీషులోకి ఎంతో అందంగా అనువాదం చెయ్యడం.

.

విధి ఒక నిపుణుడైన,

దయలేని కుమ్మరి.

మిత్రమా! ఆరాటాల సారెను

బలంగా తిప్పి వదలి

దురదృష్టమనే పనిముట్టు

అందుకుంటుంది ఆకారాన్ని దిద్దడానికి.

నా హృదయమనే రేగడిమట్టిని

ఇపుడది పిసికి మర్దించి సాగదీసి

తన సారెమీద ఉంచి

గట్టిగా ఒక తిప్పు తిప్పింది.

న న్నేవిధి మలచ సంకల్పించిందో

నేను చెప్పలేను.

.

భర్తృహరి

సంస్కృత కవి

5వ శతాబ్దం

 

 

.

Fate is a cruel and Proficient Potter

.

Fate is cruel

And proficient potter,

My friend!  Forcibly

Spinning the wheel

Of anxiety, he lifts misfortune

Like a cutting tool. Now,

Having kneaded my heart

Like a lump of clay,

He lays it on his

Wheel and gives a spin.

What he intends to produce

I cannot tell.

.

Bhartrihari

Sanskrit Poet

Tr. Andrew Schelling

https://archive.org/details/worldpoetryantho0000wash/page/222/mode/1up

 

An Anthology of Verse From Antiquity to Our Time

Katharine Washburn and John S Major, Editors; Clifton Fadiman (General Editor)

Published by W. W. Norton & Company ISBN 0-393-04130-1

 

Part III: Post Classical World

1. India: The Golden Age of Court Poetry

%d bloggers like this: