Tag: Austrian Poet
-
ఓ గులాబీ! నువ్వొక అచ్చపు వైరుధ్యానివి! … రిల్కే, ఆస్ట్రియను కవి
ఓ గులాబీ! నువ్వొక అచ్చపు వైరుధ్యానివి! అన్ని రేకలున్నా ఆ నీడన ఎవరూ ఆనందంగా నిద్రించ కాంక్షించరు. . రిల్కే 4 December 1875 – 29 December 1926 ఆస్ట్రియను కవి ఇది రిల్కే స్వయంగా రాసుకున్న మృత్యుల్లేఖనము (epitaph). జర్మనులో Lust అంటే బాధ. ఇక్కడ వైరుధ్యము గులాబికి ఎన్నో రేకులున్నాయి. కానీ వాటినీడన ముళ్ళున్నాయి. కనుక అవి చూసి ఎవరూ ప్రశాంతంగా నిద్రించ సాహసించరు. [మరొక అన్వయం: ఇక్కడ రేకలు ఎర్రని పెదాలకు […]
-
శరత్తు… రిల్కే, ఆస్ట్రియను కవి
ప్రభూ, అనువైన సమయం! పెను వేసవి వేంచేసింది. కాలంపై ఇక నీ క్రీనీడలు ప్రసరించు, హరితవనాలపై పిల్లగాలిని స్వేచ్ఛగా వీవనీ. చెట్లకీ, లతలకీ పళ్ళు వేలాడమని ఆనతివ్వు; వాటికి మరికొన్ని నులిచెచ్చని, స్వచ్ఛమైన రోజులనుగ్రహించు అవి ఫలవంతమయేట్టు ప్రోత్సహించి, ప్రోత్సహించి, చివరగా పళ్ళబరువుతో వాలిన తీగెల్లో తియ్యదనాన్ని నింపు. ఇప్పుడు ఇల్లుకట్టుకోలేనివాడు ఇంకెప్పుడూ కట్టలేడు. ఎవడు ఒంటరిగా ఉంటాడో వాడు ఒంటరిగానే మిగులుతాడు. కూచుని చదువుకుంటూ; కాళ్ళకింద ఎండుటాలు ఎగురుతుంటే తోటలంటా, దొడ్లంటా అటూ ఇటూ అశాంతితో […]
-
దైవానికి ప్రేమగీతాలు… రిల్కే, ఆస్ట్రియన్ కవి
నువ్వే భవిష్యత్తువి, ప్రభాత సంధ్యల విశాల కాలమైదానాల విరిసే అరుణారుణ గగనానివి నువ్వు. నిశాంతాన్ని సూచిస్తూ కూసే తొలికోడి కూతవి, తుహిన బిందువువీ, ప్రాభాత భేరీవీ, కన్నియవీ, అపరిచితుడివీ, తల్లివీ, మృత్యువువ్వీ నువ్వే. మేము కనీ వినీ ఎరుగని కారడవిలా… మేము కీర్తించక, శోకించక, వర్ణించక గడిపే మా దైనందిన జీవితాలలోంచి ప్రభవించే అనేకానేక రూపాలుగా నిన్ను నువ్వు సృజించుకుంటావు వస్తువులలోని అంతరాంతర ప్రకృతివి నువ్వు, ఎన్నడూ నిర్థారించి చెప్పలేని తుది పలుకువి నువ్వు. మాకొక్కరికీ ఒక్కొక్కలా నువ్వు […]