అనువాదలహరి

పిల్లులకి పిండంబెట్ట!… పీటర్ పోర్టర్, ఆస్ట్రేలియా

(ఇది చాలా అపురూపమైన కవిత. మనకి కొందరు వ్యక్తులపట్ల, కొన్ని జాతులూ, మతాలపట్లా నిష్కారణమైన ద్వేషం ఉంటుంది. ముందు మనం వాటిని ద్వేషించడం ప్రారంభిస్తాం గనుక ద్వేషించడానికి తగిన కారణాలు ఎంత అల్పమైనవైనా, అర్థంలేనివైనా  వెతుక్కోజూస్తాం. ప్రభుత్వాలైనా అంతే. ప్రతిపక్షం అంటే ప్రభుత్వం చేసేది ప్రతీదీ తప్పు అనడం తప్ప ప్రభుత్వనిర్ణయాలను దేశప్రయోజనాల దృష్టిలో వివేచించే ప్రసక్తి ఉండదు. ఎదుటవ్యక్తిమీద మనతీర్పులన్నీ అతనిచర్యలవల్ల మనకి కలిగే లాభనష్టాలమీద ఆధారపడి ఉంటాయి తప్ప, ఎదుటివ్యక్తికి మనం కోరుకున్నట్టుగానే, అతనికి ప్రయోజనకరమైనవి అతను ఎంపికచేసుకునే హక్కు ఉందని మనం అంగీకరించలేకపోవడం వల్ల కలిగే పర్యవసానం ఇది. ఈ మానసిక స్థితిని ఈ కవిత బాగా ప్రతిబింబిస్తుంది.)

***

ఇక పిల్లులు బ్రతికుండడానికి వీల్లేదు.
వాటివల్ల అంటువ్యాధులు ప్రబలుతాయి,
అవి వాతావరణం కలుషితం చేస్తాయి,
పిల్లులు వారానికి వాటి బరువుకు
ఏడురెట్లు తినెస్తుంటాయి
ఈజిప్టు, ప్రాచీన రోము వంటి
భ్రష్టుపట్టిన సమాజాల్లోనే
పిల్లుల్ని పూజించడం జరిగింది;
గ్రీకులకి పిల్లుల్తో పనిలేదు.
పిల్లులు కూచుని మూత్రవిసర్జనచేస్తాయని
(అని మన శాస్త్రజ్ఞులు ఋజువుచేశారు.)
వాటిని మైధునంకూడా ఘోరంగా ఉంటుంది;
వాటికి చంద్రుడంటే వల్లమాలిన వ్యామోహం.
వాటిరాజ్యంలో అయితే అవి ఫర్వాలేదేమో గాని
మనదేశంలో మాత్రం వాటి అలవాట్లు బొత్తిగా కొత్త.
పిల్లులు గొప్ప కంపుకొడతాయి, మరోలా ఉండలేవు,
పిల్లులు మెట్లెక్కుతుంటాయి,
టీవీ ఎక్కువ చూస్తుంటాయి,
తుఫానొచ్చినా కదలకుండా పడుక్కుంటాయి,
క్రిందటిసారి అవి మనకి వెన్నుపోటు పొడిచాయి,
గుర్తుందా. పిల్లుల్లో ఎక్కడా గొప్ప
కళాకారుడు పుట్టలేదు. అందరికీ తెలిసిందే.
పిల్లల అచ్చుపుస్తకాల్లో తప్ప పిల్లిలో “పి”
అన్న అక్షరాన్ని అంత ప్రశస్తంగా చూపెట్టనక్కరలేదు;
నాకు తరచు తలనొప్పిరావడానికీ
మా ఇంట్లో చెట్లు చచ్చిపోడానికీ కారణం ఎవరనుకున్నారు?
మా జిల్లానిండా అవే,
వాటివల్లే, స్థిరాస్థి విలువలు పడిపోతున్నాయి.
నాకు దేముడు కల్లోకొచ్చినపుడు
లోకంలో పిల్లుల్ని లేకుండా చూడమని కోరుకుంటాను.
నోరుమూసుకుని చెప్పినట్టు విని నడుచుకోవలసినదానికి
వాటికి వాటి భాషే మాటాడాలనీ, వాటి మతమే
ఆనుసరించాలనీ అంతమంకుపట్టు ఎందుకు?
పిల్లులు సర్వనాశనం అయిపో గాక!
కుక్కల పరిపాలన వెయ్యేళ్ళు వర్థిల్లుగాక!
.

పీటర్ పోర్టర్

(16 February 1929 – 23 April 2010)

ఆస్ట్రేలియను కవి.

 

Mort aux Chats

.

There will be no more cats.

Cats spread infection,

Cats pollute the air,

Cats consume seven times

their own weight in food a week,

Cats were worshipped in

decadent societies (Egypt

and Ancient Rome); the Greeks

had no use for cats. Cats

sit down to pee (our scientists

have proved it). The copulation

of cats is harrowing; they

are unbearably fond of the moon.

Perhaps they are all right in

their own country but their

traditions are alien to ours.

Cats smell, they can’t help it,

you notice it going upstairs.

Cats watch too much television,

they can sleep through storms,

they stabbed us in the back

last time. There have never been

any great artists who were cats.

They don’t deserve a capital C

except at the beginning of a sentence.

I blame my headaches and my

plants dying on cats.

Our district is full of them,

property values are falling.

When I dream of God I see

a Massacre of Cats. Why

should they insist on their own

language and religion, who

needs to purr to make his point?

Death to all cats! The Rule

of Dogs shall last a thousand years!

.

Peter Porter

(16 February 1929 – 23 April 2010)

British- based Australian poet.

ఒక సాయంత్రం … ఫ్రెడెరిక్ మానింగ్, ఆస్ట్రేలియన్ కవి

ఎవరూ చప్పుడు చెయ్యొద్దు, నా బాబు పడుకున్నాడు
రొదచేస్తున్న ఓ వడి గాలీ! నువ్వు కూడా హుష్!
ధారాపాతంగా కురుస్తున్న వర్షమా! నువ్వూ హుష్!
రేపు పొద్దుపొడిచేదాకా బిడ్డని నిద్రపోనీండి.

మీరందరూ నెమ్మది! ఇకనుండి జీవితమంతా
అతను మూటగట్టుకునేది దుఃఖమే;
నవ్వులుండాల్సిన చోట కన్నీరుంటుంది
కనీసం నిద్రలోనైనా అతనికి శాంతి నివ్వండి.

హుష్ అంటుంటే?! జబ్బుతో బలహీనంగా ఉన్నాడు
అతని ఏడుపులో కొంతపాలు వాళ్ళమ్మతో పోనీండి.
అదిగో వడిగాలీ, హుష్! నీ రొద కొంచెం ఆపు!
ఎవరూ చప్పుడు చెయ్యొద్దు, నా బాబు పడుకున్నాడు.

.

ఫ్రెడెరిక్ మానింగ్,

ఆస్ట్రేలియన్- బ్రిటిష్ కవి

 View the image of the poet here

 At Even

Hush ye! Hush ye! My babe is sleeping.

  Hush, ye winds, that are full of sorrow!

Hush, ye rains, from your weary weeping!

  Give him slumber until to-morrow.

Hush ye, yet! In the years hereafter,

  Surely sorrow is all his reaping;

Tears shall be in the place of laughter,

  Give him peace for a while in sleeping.

Hush ye, hush! he is weak and ailing:

  Send his mother his share of weeping.

Hush ye, winds, from your endless wailing;

  Hush ye, hush ye, my babe is sleeping!

.

Frederic Manning

22 July 1882 – 22 February 1935

Australian- British poet

The New Poetry: An Anthology.  1917.

Harriet Monroe, ed. (1860–1936).

Poem Courtesy:

http://www.bartleby.com/265/210.html

బాల-వధువు … ఊడ్గరూ నూనుక్కల్, ఆస్ట్రేలియను ఆదివాసీ కవయిత్రి

వాళ్ళు నన్నో ముసలాడికి ఇచ్చేరు.
ఏ ఆనందమూ లేని పండు ముసలి.
బ్రహ్మముడి నవ్వునుండి బొమముడిలోకి.
అతని గుడిశలో
నా బాల్యం సమాధి,
కన్నీరు ఆగకుండా ప్రవహిస్తోంది
నేను కోరుకున్నది ప్రేమ
నా ఈడువాడే జోడు కావాలని.
చామనచాయతో నవ్వుతూ తుళ్ళే
దున్వా నన్ను ఇష్టపడ్డాడు.
ఓహ్! నన్ను గుంజకి కట్టిపడేస్తున్న పాత ఆచారాలు.
అయ్యో! నాకోసం ఎదురుచూస్తున్న భవిష్యత్తు!
దుఃఖం నన్ను చుట్టుముడుతోంది.
కన్నీళ్ళు జలజలా రాలుతున్నాయి.
ఆ బుల్లి పిట్టలు ఎంతహాయిగా ఉన్నాయో
గూడుకట్టుకుని రమిస్తూ.
వాటి  కువకువలకేరింతలలో
ఏ బాధ అయినా సమసిపోయేలా.
కానీ ఈ ముదుసలి గుడిసే
ఇక నా జీవిత సర్వస్వం
మిగిలింది ఎప్పుడూ ఆశల్లో విహరించడమే
ఊహల్లో దున్వాను తలుచుకోవడమే,
ఇలా కన్నీళ్ళు కార్చడమే.

ఊడ్గరూ నూనుక్కల్ (కేత్ వాకర్ )

3rd November 1920 – 16th September 1993

ఆస్ట్రేలియను ఆదివాసీ కవయిత్రి.

.

OODGEROO NUNUCCAL Australian Aboriginal Poetess Photo Courtesy: http://www.aiatsis.gov.au/collections/exhibitions/iaaw/women.html
OODGEROO NUNUCCAL
Australian Aboriginal Poetess
Photo Courtesy: http://www.aiatsis.gov.au/collections/exhibitions/iaaw/women.html

.

The Child Wife

They gave me to an old man,
Joyless and old,
Life’s smile to frown.
Inside his gunya
My childhood over,
And the tears fall down.

It was love I longed for,
Young love like mine,
It was Dunwa wanted me,
The gay and brown.
Oh, old laws that tether me!
Oh, long years awaiting me!
And the grief comes over me,
And the tears fall down.
Happy the small birds
Mating and nesting,
Shrilling their gladness
No grief may drown.
But an old man’s gunya
Is my life for ever,
And I think for ever,
And I think of Dunwa,
And the tears fall down.

.

Oodgeroo Noonuccal (AKA  Kath Walker)

3rd November 1920- 16th September 1993

Australian Aboriginal Poet.

Poem Courtesy: Srinivas Vasudev (https://www.facebook.com/adarinandu?fref=nf)

పగటిపూట విమానప్రయాణం… జాక్ డేవిస్, ఆస్ట్రేలియను కవి

జెట్ లో కూచుని కళ్ళుమూసుకున్నాను.

నాతో పాటే ఒక వినీలాకాశపు తునకనీ,

ఒక చారెడు మైలుతుత్తంవంటి సముద్రపు చెలకనీ

తీసుకెళ్ళనిస్తుందేమోనని ఎయిర్ హోస్టెస్ ని అడిగేను

బాగా దిగువన నా దేశం తళతళలాడుతోంది

బక్క చిక్కుతున్న నదుల్తో, లేతనీలి సరస్సులతోనూ;

నేను కలగంటూ కోరున్నది నిద్రతోవాలిన తలక్రిందకీ

తలగడలా మడుచుకుందికీ, పైన కప్పుకుందికీ

ఉత్త ఎర్రటి ఎడారి చౌకాన్ని.

.

జాక్ డేవిస్,

ఆస్ట్రేలియను కవి

11 మార్చి 1917- 17 మార్చి 2000.

జాక్ డేవిస్, 20వ శతాబ్దపు ప్రముఖ ఆస్ట్రేలియను కవి, నాటక కర్త.  అతను ఆదిమ ఆస్ట్రేలియన్ నూంగర్ జాతికి చెందిన వాడు. అతని అనుభవాలనే అతను కవిత్వంలో బలంగా చెప్పాడు.అతని నాటకాలు ఆస్ట్రేలియన్ స్కూళ్లలో పాఠ్యాంశాలుగా ఉన్నాయి.  1976లో Order of British Empire (MBE)తోనూ, 1985లో Order of Australia (AM) తోనూ సత్కరించబడ్డాడు.

ఈ కవితలో దేశాన్ని (స్వంత ఊరిని) వదిలి వెళుతున్న ప్రతిసారీ మళ్ళీ ఇక్కడకి రాగలమో లేదోనని మనందరికీ కలిగే అనుభూతిని ఇక్కడ చెప్పాడు. మనతో తీసుకెళ్ళేవి, తీసుకెళ్ళగలిగేవి, ఆ జ్ఞాపకాల తలగడలనీ, దుప్పట్లనే.  ఆరుద్ర “నీటి గడియారం” అన్న కవితలో, జ్ఞాపకాల సందుగుల్నీ, అనుభవాల పరుపుల్నీ రోడ్డుమీద పారేకండి బాబ్బాబు, వచ్చేజన్మలో చూసుకుందాం … ” అని అంటాడు. ఎవరికైనా మట్టితో విడదీయరాని సంబంధం ఉంటుంది… చివరకి అక్కడికే చేరాలి కదా!

.

Day Flight

.

I closed my eyes as I sat in the jet
And asked the hostess if she would let
Me take on board a patch of sky
And a dash of the blue-green sea.

Far down below my country gleamed
In thin dry rivers and blue-white lakes
And most I longed for, there as I dreamed,
A square of the desert, stark and red,
To mould a pillow for a sleepy head
And a cloak to cover me.

Jack Davis

(11 March 1917 – 17 March 2000)

Australian Poet and Playwright

Biography:
http://en.wikipedia.org/wiki/Jack_Davis_(playwright)

%d bloggers like this: