అనువాదలహరి

గాలిపరగడ వచ్చేముందు… ఆర్థర్ సైమన్స్, వెల్ష్ కవి

సముద్రంమీద గాలి విసురు మెల్లగా పుంజుకుంటోంది,

వెలినురుగునర్తకీమణులు గాలివాటుకి నర్తిస్తున్నారు

అపారపారావారము నిద్రపోవాలని ఒత్తిగిలినా,

నిద్రరామికి అయిష్టంగా మూలుగుతోంది.

నేలమీద దరువువేస్తూ ఇసుకపొరల్ని ఎగరేసి,

తేమగాలితో చెల్లాచెదరుచేస్తున్న అదృశ్యహస్తాలేవో,

ఒకటొకటిగా పొడచూపుతున్న కొండశిఖరాలని

ఆ ఇసుకమేటుతోనే సమాధిచేస్తున్నాయి.

కనుచూపుచివర క్షితిజరేఖ సమీపంలో

ఆకాశం ఒంగినచోట గోడలా ఏదో కనిపిస్తోంది…

ధూళిదూసర వర్ణంలో ఉన్న అది బహుశా, రానున్న

గాలిపరగడ సూచించే తెరచాపల ఉబుకులేమో!

.

ఆర్థర్ సైమన్స్

(28 February 1865 – 22 January 1945)

వెల్ష్ కవి.

Arthur Symons

.

Before the Squall

.

The wind is rising on the sea,

The windy white foam-dancers leap;

And the sea moans uneasily,

And turns to sleep, and cannot sleep.

Ridge after rocky ridge uplifts,

Wild hands, and hammers at the land,

Scatters in liquid dust, and drifts

To death among the dusty sand.

On the horizon’s nearing line,

Where the sky rests, a visible wall,

Grey in the offing, I divine,

The sails that fly before the squall.

.

Arthur Symons

(28 February 1865 – 22 January 1945)

Welsh Poet, Critic and Magazine Editor

Poem Courtesy:

http://famouspoetsandpoems.com/poets/arthur_symons/poems/22239

దృక్పథంలో మార్పు … ఆర్థర్ సైమన్స్, వెల్ష్ కవి

నేను పువ్వులకంటే వాటి రంగుల్నీ,
రెక్కలకంటే, పిచ్చుకల గమకాలనీ ప్రేమించాను.
జీవితంలో సగానికి పైగా ఏ సహచరుని
తోడూ లేకుండా వృధాచేసుకున్నాను.

మరిప్పుడు నేను చెట్టూ పుట్టా ప్రక్కన
ఆడుకునే పిల్లల్నీ, రాత్రీ పగలూ కనిపించే
సూర్యచంద్రుల్నీ ప్రేమతో ఆశ్చర్యంతో,
ఆనందంతో ఎలా చూడగలుగుతున్నాను?

ఇప్పుడు రహదారుల్ని మునపటిలా
కోపంగా కాకుండా, తొలివేకువలో
చిరుకప్పల సమావేశస్థలిగా, మధ్యాహ్నవేళ
సీతాకోకచిలుకల సంతగా ఎలా చూస్తున్నాను?

ప్రతి కీటకపు అవ్యక్త ఝంకారం వెనుకా
అనాదిగా చిక్కుబడ్ద ప్రాణరేణువు దర్శిస్తున్నాను.
ఒక్కసారిగా, ఈ ప్రపంచం నాలో భాగమూ,
నేను అందులో భాగమూ అయిన అనుభూతి.

.

ఆర్థర్ సైమన్స్

(28 February 1865 – 22 January 1945)

వెల్ష్ కవి .

Arthur Symons

.

Amends to Nature

.

I have loved colours, and not flowers;

Their motion, not the swallows wings;

And wasted more than half my hours

Without the comradeship of things.

How is it, now, that I can see,

With love and wonder and delight,

The children of the hedge and tree,

The little lords of day and night?

How is it that I see the roads,

No longer with usurping eyes,

A twilight meeting-place for toads,

A mid-day mart for butterflies?

I feel, in every midge that hums,

Life, fugitive and infinite,

And suddenly the world becomes

A part of me and I of it.

.

Arthur Symons

(28 February 1865 – 22 January 1945)

Welsh Poet and Editor

Poem Courtesy:

http://famouspoetsandpoems.com/poets/arthur_symons/poems/22236

చిత్రపటంతో … ఆర్థర్ సైమన్స్, ఇంగ్లీషు కవి

బీరువాలోంచి విచార వదనం
ఒకటి నన్ను పరికిస్తోంది…
గతించిన ప్రేమకు అవశేషం
నా ప్రేతాత్మకి సగ భాగం.

నాకు ఇష్టమైన ఆ నిరీక్షించే కళ్ళు
నన్ను పరిశీలిస్తూ ఎంతగా అభిమానించేవని…
ఏమిటో ఇప్పుడు బరువైన జ్ఞాపకాల దొంతరలు
ఆమె నిరీక్షించే చూపులు.

ఓ నా ప్రేమ చిహ్నమా, నీకు అన్యాయం జరిగింది, 
తిరిగి రా: అలనాటి ప్రేమలోని బాధలన్నీ, 
అప్పుడు భరించి, ఇపుడు మరుగుపడినా,
మళ్ళీ తిరిగిరా!

వాటిని మరిచిపోకు, కానీ మన్నించు!
ప్చ్! సమయం మించిపోయింది! ఏడ్చిప్రయోజనం లేదు.
మనిద్దరం రెండు ప్రేతాత్మలం. జీవించడానికి
అవకాశం వచ్చినా చేజార్చుకున్నాం, నువ్వూ— నేనూ.

.

ఆర్థర్ సైమన్స్

28 February 1865 – 22 January 1945

ఇంగ్లీషు కవి

.

.

To a Portrait

A pensive photograph

  Watches me from the shelf—

Ghost of old love, and half

  Ghost of myself!

How the dear waiting eyes

  Watch me and love me yet—

Sad home of memories,

  Her waiting eyes!

Ghost of old love, wronged ghost,

  Return: though all the pain

Of all once loved, long lost,

  Come back again.

Forget not, but forgive!

  Alas, too late I cry.

We are two ghosts that had their chance to live,

  And lost it, she and I.

.

Arthur Symons

 28 February 1865 – 22 January 1945

British Poet and Critic

Poem Courtesy:

The World’s Best Poetry.

Eds.  Bliss Carman, et al.

Volume III. Sorrow and Consolation.  1904.

  1. Disappointment in Love

http://www.bartleby.com/360/3/15.html

 

%d bloggers like this: