అనువాదలహరి

భవిష్యవాణి …ఆర్థర్ డేవిసన్ ఫికే, అమెరికను కవి

ఒక వేసవి సాయంవేళ పచ్చికమీద మేను వాల్చేను.
పసిడిచాయల జుత్తుగల అందమైన పాప అటుగా వచ్చి,
నన్నొకసారి పరికించి, దాటిపోడానికి ఇష్టంలేక
వదలని సందేహాలు కళ్ళలో తొంగిచూస్తుండగా

నిలబడి, సంకోచిస్తూనే నా ముందుకు వచ్చి
(ఓహ్! ఆమె తలచుట్టూ ఎంత లేత బంగరు పరివేషమో!)
నా భుజం మీదనుండి తొంగిచూస్తూ అడిగింది:
“మీరు చదువుతున్నదేమిటి?” అని.

“నే నొక ప్రాచీన కవి కవిత్వం చదువుతున్నాను,
తన జీవితకాలమంతా అతను తన కవిత్వంకంటే
అందమైన ఈ పుడమి సౌందర్యాన్నీ
ఈ సెలయేళ్ళనీ, పువ్వుల్నీ, నక్షత్రాల్నీ గానంచేసేడు.

“నేనిపుడు అతన్నెందుకు చదువుతున్నానంటే
ఇంతసుందరమైన విషయాలని మనుషులు మరిచిపోతారుగనుక;
అతనికీ నాకూ పొర్లి ప్రవహించే వాగులన్నా
అరుణోదయాలన్నా, తేనెటీగలూ, రెక్కల రెపరెపలన్నా ఇష్టం. “

కళ్లలో నవ్వుతో, ఆమె నావంక చూసి,
నా మోకాళ్ళపై తనచేతులుంచి ఇలా అంది:
“ఇవన్నీ పుస్తకాల్లో చదవడం చిత్రంగా ఉంది.
నన్నడిగితే ఇవన్నీ చెప్పేదాన్ని గదా!”
.
ఆర్థర్ డేవిసన్ ఫికే
(10 Nov 1883 – 30 Nov 1945)
అమెరికను కవి, నాటకకర్త.

.

.

The Oracle

.

I lay upon the summer grass.

A gold-haired, sunny child came by,

And looked at me, as loath to pass,

With questions in her lingering eye.

She stopped and wavered, then drew near,

(Ah!the pale gold around her head!)

And over my shoulder stopped to peer.

“Why do you read/” she asked.

“I read a poet of old-time,

Who sang through all his living hours –

Beauty of earth,  the streams, the flowers –

And stars, more lovely than his rhyme.

“And now I read him, since men go,

Forgetful of these sweetest things;

Since he and I love brooks that flow,

And dawns, and bees, and flash of Wings!”

She stared at me with a laughing look,

Then clasped her hands upon my knees:

‘How strange to read it in a book!

I could have told you all of these!”

.

Arthur Davison Ficke  

(November 10, 1883 – November 30, 1945)

American poet, Playwright and expert of Japanese art.

ఒక ముసలమ్మ పదచిత్రం… ఆర్థర్ డేవిసన్ ఫికే, అమెరికను

ఆమె అతికష్టం మీద కుంటుతూ నడుస్తోంది
ఆగి, సంకోచిస్తూ, మళ్ళీ మెల్లిగా కదుల్తోంది
కళావిహీనమైన ఆ ముఖంతో ప్రశ్నార్థకంగా చూస్తూ …
కోరికలూ, బాధలూ, భయాలూ అన్నీ హరించుకుపోయి.

సాగిపోయిన ముడుతల్లో పాలిపోయిన బుగ్గలు వేలాడుతున్నాయి
అందులో రక్తం ప్రవహిస్తున్న జాడ ఎక్కడా కనిపించదు.
వరికంకులు కట్టగట్టినట్టున్న ఆమె చేతులు
మాసి, చిరుగుపాతైపోయిన శాలువాని పట్టుకున్నాయి

రొమ్ము ఉండవలసినచోట ఎముకలు ముడుచుకుపోయి ఉన్నాయి
ఆమె పిరుదులు ఒక ముడిలా అటూఇటూ కదులుతున్నాయి
తాడులాంటి గొంతులోనుండి శ్వాశ అతికష్టం మీద
బిగుసుకున్న పెదాలవరకూ వగర్చుకుంటూ వస్తోంది.

నగర వైభవం అంతా ఇక్కడ పరుచుకుని ఉంది
ఆమె నిస్తేజంగా, పాలుపోక, నిలబడింది. మనిషిలా లేదు.
నిత్యసంతోషియైన దైవం నిష్క్రమించిన తర్వాత
శూన్యంగా మిగిలిపోయిన దేవళంలా ఉంది ఆమె.

అతను మరో దేవాలయం కట్టుకున్నాడు,
అక్కడ అతని తేజస్సు, ఇనుమడించి ప్రకాశిస్తోంది
వాడిపోయిన ఆమె కనుబొమలు కళతప్పి
చరమరాత్రికి ఎదురుచూడమని పరిత్యజించబడ్డాయి.
.
ఆర్థర్ డేవిసన్ ఫికే

November 10, 1883 – November 30, 1945

అమెరికను కవి

 

.

Portrait of an Old Woman

.

She limps with halting painful pace,

  Stops, wavers, and creeps on again;

Peers up with dim and questioning face

  Void of desire or doubt or pain.

 

Her cheeks hang gray in waxen folds

  Wherein there stirs no blood at all.

A hand like bundled cornstalks holds

  The tatters of a faded shawl.

 

Where was a breast, sunk bones she clasps;

  A knot jerks where were woman-hips;

A ropy throat sends writhing gasps

  Up to the tight line of her lips.

 

Here strong the city’s pomp is poured …

  She stands, unhuman, bleak, aghast:

An empty temple of the Lord

  From which the jocund Lord has passed.

 

He has builded him another house,

  Whenceforth his flame, renewed and bright,

Shines stark upon these weathered brows

  Abandoned to the final night.

.

Arthur Davison Ficke

November 10, 1883 – November 30, 1945

American Poet, Playwright and expert on Japanese Art.

The New Poetry: An Anthology.  1917.

Harriet Monroe, ed. (1860–1936).

http://www.bartleby.com/265/108.html

కటుత్వానికి అలసిపోయాను… ఆర్థర్ డేవిసన్ ఫికే, అమెరికను కవి

నేను తెలివిగా, కటువుగా ఉండి ఉండి అలసిపోయాను,

చిరకాలం తర్వాత వాటి ఆహార్యాలూ, తెరలూ తొలగిపోయాయి 

ఏడ ద్వీపాలు ప్రశాంతంగా ఉంటాయో, జలధిలో సూర్యుడుదయిస్తాడో

అక్కడికిపోయి సంగీతం ప్రసాదించే వివేకంలో వాటిని లయించుకుంటాను.

సంగీతంలో ఋషులకుకూడా తెలియరాని మహిమలున్నాయి

రహః తనూరుహాలపై అచ్చపు వింతశక్తులు మనప్రక్కనుండే ఎగురుతాయి;

నిస్సందేహంగా స్తబ్ద పూర్వ యుగాల నీరవ నిశ్శబ్దంలోంచి

రోదసిని వెలుగుతో నింపి అస్థవ్యస్థ ప్రకృతికి జీవంపోసింది సంగీతమే.

మనకి తెలిసినదంతా నిష్ప్రయోజనం; మనం వెంపర్లాడేవీ నిష్ఫలములే

పొగడ్తలతో అధిక భారాన్ని మోసే మానసిక శక్తి కూడా నశ్వరమే.

ఎందుకంటే, చివరకి ఈ జ్ఞానమూ, ఈ శక్తులూ, బరువులూ అన్నీ నశిస్తాయి.

నశించకుండా మిగిలేది ఒకే ఒక్కటి… అది సంగీతం మాత్రమే.

.

ఆర్థర్ డేవిసన్ ఫికే

November 10, 1883 – November 30, 1945

అమెరికను కవి

.

.

I am Weary of Being Bitter

.

I AM weary of being bitter and weary of being wise,       

  And the armor and the mask of these fall from me, after long. 

I would go where the islands sleep, or where the sea-dawns rise,         

  And lose my bitter wisdom in the wisdom of a song.     

There are magics in melodies, unknown of the sages;       

  The powers of purest wonder on secret wings go by.     

Doubtless out of the silence of dumb preceding ages        

  Song woke the chaos-world—and light swept the sky.   

All that we know is idle; idle is all we cherish;        

  Idle the will that takes loads that proclaim it strong.        

For the knowledge, the strength, the burden—all shall perish:    

  One thing only endures, one thing only—song.

.

Arthur Davison Ficke

November 10, 1883 – November 30, 1945

American Poet, Playwright and expert of Japanese art.

Poem Courtesy:

The New Poetry: An Anthology.  1917.

 Harriet Monroe, ed. (1860–1936). 

http://www.bartleby.com/265/109.html

%d bloggers like this: