అనువాదలహరి

తన దృష్టిలోపం మీద… జార్జ్ లూయీ బోర్హెస్, అర్జెంటీనా కవి

నా ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా, అవిచ్ఛిన్నమైన

వెలుగుపుంజమొకటి కాలక్రమంలోనన్నావహించింది,

అది సమస్త వస్తువుల్నీ విశ్లేషించి విశ్లేషించి కడకు, నా ముందు

వర్ణ,రూపరహితమైన వస్తువుగా నిలబెట్టేది,కేవల భావనగా.

జనప్రవాహంతో పొరలిప్రవహించే మౌలికమైన దివారాత్రాలు కూడా

ప్రాభాతసమయాన అరుణోదయానికి ఎదురుచూస్తూ

చిక్కగా, స్థిరంగా, నిలకడగా కనిపించే ఉషః కాంతిలా

మారిపోయేవి. నాకు ఒక్కటంటే ఒక్కటైనా మనిషిముఖం

చూడగలిగితేబాగుణ్ణనిపించేది. నాకు తెలియకుండానే,

చేత్తోపట్టుకోడం తప్ప మరేమీచెయ్యలేని ఆ మూసిన విజ్ఞానసర్వస్వ

సంపుటాలలోంచి చిన్నచిన్న పక్షులూ, వెన్నెల చందమామలూ ఎగిరిపోయేవి.

మంచికో చెడుకో, తక్కినవాళ్ళందరికీ ఈ ప్రపంచం దక్కితే దక్కనీ

నాకు మాత్రం ఈ మసకవెలుతురూ, కవిత్వప్రయాసలూ చాలు.

.

జార్జ్ లూయీ బోర్హెస్

(24th Aug 1899 – 14th June 1986)

అర్జెంటీనా కవి

 

 

.

Jorge Luis Borges
Argentine Poet

On His Blindness

.

In the fullness of years, like it or not,

A luminous mist surrounds me, unvarying,

That breaks things down into a single thing,

Colorless, formless. Almost into a thought.

The elemental, vast night and day

Teeming with people have become a fog

Of constant, tentative light that does not flag,

And lies in wait at dawn. I longed to see

Just once a human face. Unknown to me

The closed encyclopedia, the sweet play

In volumes I can do no more than hold,

The tiny soaring birds, the moons of gold.

Others have the world, for better or worse;

I have this half-dark, and the toil of verse.

.

Jorge Luis Borges

(24th Aug 1899 – 14th June 1986)

Argentine Poet

Poem Courtesy: https://www.poetryfoundation.org/poetrymagazine/browse?contentId=38927

పాత చెప్పులు … రోబెర్తో ఫర్రోజ్, అర్జెంటీనా కవి

నేనిపుడు పాత చెప్పులు మాత్రమే తొడుక్కోగలను.

నేను నడిచే త్రోవ

తొలి అడుగునుండే చెప్పుల్ని అరగదీస్తుంది.

పాత చెప్పులైతే

నా త్రోవని అసహ్యించుకోవు.

అవి మాత్రమే నా రోడ్డు ఎక్కడికి వెళితే

అక్కడికి వెళ్ళగలవు.

ఆ తర్వాత

నువ్వు ఉట్టికాళ్లతో నడవ వలసిందే.
.

రోబెర్తో ఫర్రోజ్

అర్జెంటీనా కవి

 

 

.

Poem 3

.

Now I can only wear old shoes.

The road I follow

wears shoes out from the first step.

….

….

For complete poem  visit the link below

Roberto Juarroz

1925–1995

Argentine Poet

Image and Poem Courtesy:

http://pgrnair.blogspot.in/2012/09/vertical-poetry.html

ఆత్మహత్య… హార్హి లూయిస్ బోర్హెస్, అర్జెంటీనా కవి

రాత్రి ఇక ఒక్క నక్షత్రమూ మిగలదు.

ఆమాటకొస్తే, అసలు రాత్రే మిగలదు

నేను మరణిస్తాను, నాతో పాటే

దుర్భరమైన ఈ సమస్త విశ్వమూను.

నేను పిరమిడ్లని తుడిచిపెట్టెస్తాను. ధనాన్నీ,

ఖండాలనీ, అక్కడి అన్నిరకాల ముఖాలనీ,

పోగుపడ్డ గతాన్నీ నేను చెరిపెస్తాను.

చరిత్రనీ, పాటు, మట్టినీ మట్టిలో కలిపెస్తాను.

నేనిపుడు కడపటి సూర్యాస్తమయాన్ని చూస్తున్నాను.

చిట్టచివరి పక్షి పాట వింటున్నాను.

నే నెవరికీ ఏదీ వారసత్వంగా మిగల్చను.

.

హార్హి లూయిస్ బోర్హెస్

24 August 1899 – 14 June 1986

అర్జెంటీనా కవి

.

Jorge Luis Borges

.

Suicide

.

Not a star will remain in the night.

The night itself will not remain.

I will die and with me the sum

Of the intolerable universe.

I’ll erase the pyramids, the coins,

The continents and all the faces.

I’ll erase the accumulated past.

I’ll make dust of history, dust of dust.

Now I gaze at the last sunset.

I am listening to the last bird.

I bequeath nothingness to no-one.

.

(Translated  from Spanish by : AS Kline @ 2008)

Jorge Luis Borges

24 August 1899 – 14 June 1986

Argentinian Poet, Translator, Short-story Writer

Poem Courtesy:

http://www.poetryintranslation.com/PITBR/Spanish/Borges.htm#_Toc192667909

 

మిల్టనూ- ఒక గులాబీ… జార్జ్ లూయిస్ బోర్హెస్, అర్జెంటీనా కవి

కాల మాళిగలలో కనుమరుగైపోయిన

వేల తరాల గులాబులలోంచి

ఒక్క పువ్వుని విస్మృతినుండి వెలికితీస్తాను

ఒకే ఒక్క నిష్కల్మషమైన గులాబి…

అలాంటిదంటూ ఒకటి ఉంటే. విధీ! అనుగ్రహించు!

అటువంటి గులాబిని ఎంచుకోగల శక్తి నాకొకసారి …

మిల్టను తన ఎదురుగా ఉంచుకున్నదీ,

మౌనంగా కాలగర్భంలో కలిసిన దానిని.

సింధూరవర్ణమో, పసుపురంగో

నాశమైన తోటలోని తెల్ల గులాబియో;

చిత్రంగా దాని గతం ఈ కవితలో దేదీప్యంగా

వెలుగుతూ శాశ్వతంగా మిగిలే ఉంటుంది.

బంగారు వర్ణమో, రక్తవర్ణమో, తెలుపో, నలుపో

విధి చేతిలో కనిపించకుండా నిలిచిన గులాబిలా.

.

జార్జ్ లూయిస్ బోర్హెస్

(24 August 1899 – 14 June 1986)

అర్జెంటీనా కవి

 

Jorge Luis  Borges

.

A Rose and Milton

.

From the generations of roses

That are lost in the depths of time

I want one saved from oblivion,

One spotless rose, of all things

That ever were. Fate permits me

The gift of choosing for once

That silent flower, the last rose

That Milton held before him,

O vermilion, or yellow

Or white rose of a ruined garden,

Your past still magically remains

Forever shines in these verses,

Gold, blood, ivory or shadow

As if in his hands, invisible rose.

.

Jorge Luis Borges

(24 August 1899 – 14 June 1986)

Argentine Poet

Translated by AS Kline

 

http://www.poetryintranslation.com/PITBR/Spanish/Borges.htm#_Toc192667905

 

%d bloggers like this: