దీవులు… ఆర్చిబాల్డ్ మెక్లీష్, అమెరికను కవి
సాగర దీవుల్లోని గేలిక్ ప్రజల్లా
ముసలివాళ్ళు జీవితాల్ని వెలారుస్తారు,
సముద్రపుటొడ్డున పొలమూ, ఒక భార్యా,
కాసేపు కొడుకులనిపించుకునే పిల్లలూ;
కొంత కాలానికి భార్యా, సముద్రపుటొడ్డు పొలమూ
సముద్రపు హోరూ, దాని గురించిన ఆలోచనలూ,
పిల్లలూ … అందరూ
ఆ నీటిమీదనుండే ఎక్కడికో వెళ్ళిపోతారు.
చివరకి పెద్దకొడుకూ
ఆఖరి కూతురూ కూడా
ఆ నీటిబాటనే జీవితాన్ని వెతుక్కుంటూ
కనుమరుగైపోతారు.
కడకి ఆ ఇద్దరూ… ముసలాడూ, ముసల్దీ
మిగుల్తారు ఆ సాగర ద్వీపం మీద.
ముసలివాళ్ళు మాటాడుకునేట్టుగానే మాటాడుకుంటూ
తలూపుకుంటూ, నవ్వుకుంటూ ఉంటారు.
వాళ్ళబ్బాయిలగురించీ, వాళ్ళనవ్వులగురించీ ఆలోచిస్తారు.
ఆమె గట్టిగా అరిచి పిలుస్తుంది గాని వాళ్ళని కాదు.
“ఆమెకి పిల్లల్ని గుర్తుచేసుకునేకంటే
పెంచుకుందికి ఒక పిల్లి ఉంటే బాగుణ్ణ”నిపిస్తుంది.
మనిషి చాలా కాలం బ్రతకొచ్చు
అప్పటికి మగపిల్లలూ, ఆడపిల్లలూ
సముద్రాలు దాటుకుని వెళ్ళిపోతారు
భార్య నీళ్ళవంక అలా చూస్తూ కూర్చుంటుంది.
.
ఆర్చిబాల్డ్ మెక్లీష్
(May 7, 1892 – April 20, 1982)
అమెరికను కవి
.
.
Hebrides
Old men live in a life
As the Gaels in those ocean islands,
A croft by the sea and a wife
And sons for a while;
Afterward wife and croft
And the sound of the sea and the thought of it,
Children and all gone off
Over the water;
Even the eldest son,
Even the youngest daughter,
All of them vanished and gone
By the way of the water.
A man and his wife, those two,
Left on the ocean island:
They talk as the old will do
And they nod and they smile.
But they think of their sons, how they laughed,
And she calls but it’s not for them-
“she’d rather a kitten to have
Than a child to remember.”
You can live too long in life
Where the sons go off and the daughter
Off over the sea and the wife
Watches the water.
.
Archibald Macleish
(May 7, 1892 – April 20, 1982)
American Poet
Poem Courtesy:
Archibald Macleish
Collected Poems 1917- 1982 pages 18-19

మండువేసవిలో ఒక సూర్యోదయం… ఆర్చిబాల్డ్ మెక్లీష్, అమెరికను కవి
ఓ ఆకాశమా! విపుల వైశ్వానర స్వరూపమా! విను!
బ్రహ్మాండమైన సూర్యగోళపు గర్జనలు వినిపించకపోవచ్చు నేమో
గానీ, అవి వినలేనంత భీకర శబ్దాలు; వెలుగునే వేడెక్కించగలవవి.
ఓ మహానుభావా! సూర్యుడా! మా ఆత్మలని వెలిగించు, కోరికలు రగిలించు…
మా ఆత్మలకి ప్రేరణనివ్వు! మేము ఈ చీకటిని
చాలా కాలమై ప్రేమిస్తున్నాం. ఈ చీకటికి చితి రగిలించి,
వెలుగుని మరింత ప్రజ్వలనం చెయ్యి. ఎంతగా అంటే
ఆ వేడిలో నిస్తేజమైన ఈ రోజులు రగిలి, ఆ సెగలలో
సుషుప్తిలో మునిగి సగం నిర్జీవమైన మా మనసులు
తిరిగి జ్వలించి నిప్పుకణికల్లా కణకణ మండాలి.
.
ఆర్చిబాల్డ్ మెక్లీష్
(May 7, 1892 – April 20, 1982)
American Poet.
.
Midsummer Dawn
Listen! The sky! Vast conflagration!
Inaudible huge roaring of the sun
Too loud to hear, that sets the light on fire!
Kindle our souls, great sun, and our desire—
Kindle our souls! We’ve loved the night
Too long now. Set the dark alight,
The light ablaze, the blaze
To raging through the reek of these dim days
Until our souls,
Half-rotted into selves, burn clean as coals!
.
Archibald MacLeish
(May 7, 1892 – April 20, 1982)
American Poet.
(From Collected Poems 1917-1982)
Poem Courtesy:
https://books.google.co.in/books?id=KI0ESFOvi5QC&printsec=frontcover&source=gbs_ge_summary_r&cad=0#v=onepage&q&f=true

పచ్చికమీద మేనువాల్చినపుడు… ఆర్చిబాల్డ్ మెక్లీష్, అమెరికను కవి
ఈ మధ్య నాకు ఇట్టే నిద్ర వచ్చేస్తోంది…
ఓ మధ్యాహ్నం ఇలాగే నిద్రలోకి జారుకున్నాను
మంచి ఎండలో, హమ్మింగ బర్డ్ చెట్ల నీడన …
కానీ, వెంటనే తెలివి వచ్చేసింది.
చాలా త్వరగానూ, వణుకుతూనూ, మేలుకున్నాను.
కళ్లమీద సూర్యుడి తీవ్రతకీ, ఎండ వేడికీ.
కలలో నే పడుక్కున్న చోట అంతా చీకటిగా ఉండేది.
రేపు నేను సమాధిలో పడుకోబోయే చోటూ చీకటే.
ఆర్చిబాల్డ్ మెక్లీష్
(May 7, 1892 – April 20, 1982)
అమెరికను కవి.

Dozing on the Lawn
I fall asleep these days too easily—
Doze off of an afternoon.
In the warm sun by the humming trees—
But I wake soon:
Wake too soon and wake afraid
Of the blinding sun, of the blazing sky.
It was dark in the dream where I was laid:
It is dark in the earth where I will lie.
.
Archibald MacLeish
(May 7, 1892 – April 20, 1982)
3 times Pulitzer Prize winner
కవన కళ … ఆర్చిబాల్డ్ మెక్లీష్, అమెరికను కవి
అరచేతిలోని గుండ్రని పండులా
కవిత మౌనంగా ఉండాలి.
బొటనవేలికి వేలాడుతున్న పతకాల్లా కనిపించాలి,
మాటాడకూడదు.
నాచు పట్టి, అరిగిపోయిన కిటికీగట్టు
నాపరాయి పలకలా నిశ్శబ్దంగా ఉండాలి.
ఎగురుతున్న పక్షులగుంపులా
కవిత మాటలకందకుండా ఉండాలి
*
చందమామ ఆకాశానికి ఎగబాకుతున్నట్టు
కవిత కాలాతీతంగా ఉండాలి.
విడిచిపెడుతున్నపుడు, రాతిరిలో చిక్కుబడ్ద చెట్ల
కొమ్మల్ని చంద్రుడు ఒకటొకటిగా వీడినట్టు వీడాలి
పూర్తయిన తర్వాత, హేమంతపు చంద్రుడు
విడిచిపెట్టే ఒక్కొక్క జ్ఞాపకంలా వదలాలి.
చందమామ ఆకాశానికి ఎగబాకుతున్నట్టు
కవిత కాలాతీతంగా ఉండాలి.
*
కవిత సత్యానికి దగ్గరగా ఉండాలి
సత్యం కాకూడదు.
బాధాతప్తమైన దాని చరిత్రకి…
అది ఒక వాకిలి, ఒక చల్లని వీవన కావాలి.
ప్రేమకి సంకేతమైనపుడు
వాలిన పరకల్లా, సంద్రం మీది వెలుగుల్లా ఉండాలి
కవిత ఏ సందేశమూ ఇవ్వనక్కరలేదు,
దానికదిగా ఉండాలి.
.
ఆర్చిబాల్డ్ మెక్లీష్
(May 7, 1892 – April 20, 1982)
అమెరికను కవి
Ars Poetica
A poem should be palpable and mute
As a globed fruit
Dumb
As old medallions to the thumb
Silent as the sleeve-worn stone
Of casement ledges where the moss has grown –
A poem should be wordless
As the flight of birds
*
A poem should be motionless in time
As the moon climbs
Leaving, as the moon releases
Twig by twig the night-entangled trees,
Leaving, as the moon behind the winter leaves,
Memory by memory the mind –
A poem should be motionless in time
As the moon climbs
*
A poem should be equal to:
Not true
For all the history of grief
An empty doorway and a maple leaf
For love
The leaning grasses and two lights above the sea –
A poem should not mean
But be
.
Archibald MacLeish
May 7, 1892 – April 20, 1982)
American Poet
Poem Courtesy:
http://wonderingminstrels.blogspot.in/1999/08/ars-poetica-archibald-macleish.html