వాసంత ప్రభాతవేళ… ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్, అమెరికను కవయిత్రి
ఇంత చక్కని మనోజ్ఞ వాసంత ప్రభాతవేళ హృదయమా!
ప్రాణప్రదమైన నా ప్రియుని అడుగుజాడలు తెలుపవా?
అప్పుడు నేను నా స్వామికి, నా ప్రభువుకి
ఉచితమైన దృక్కులతో, నైవేద్యములతో
త్వరత్వరగా ఎదురేగి స్వాగతిస్తాను
సప్తవర్ణాల ఇంద్రధనుస్సులను సృష్టించే తుంపరలుగా
మహోన్నతమైన శిలలపై పతనమయే నీటిచాలుల
అతని కనుగొంటే, అవి నే తెచ్చే కలలకు సాటిరావని గ్రహిస్తాడు;
తెల్లని ఎండలో తళతళలాడే పచ్చని గోరింటలతో
మైదానం కళకళలాడే చోట అతని దర్శించితినా
‘ఆమె బంగారురంగు శిరోజసౌందర్యము ముందు
ఈ పూలసౌందర్యమేకాదు, ఏదీ సాటిరా’దనీ
‘ఆమె చెక్కిళ్ళలో పూచే గులాబులముందు, తోట
సరిహద్దుల పూచే గులాబులు దిగదుడు’పనీ తప్పక అంటాడు
.
ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్
(1866-1925)
అమెరికను కవయిత్రి
.
In Spring
.
On this most perfect morning of the spring,
Tell me my heart, where Love’s dearest feet shall stray,
That I may haste to meet him on the way,
With looks, and with an offering
That shall seem fitting for my lord and king.
If I shall find him where the waters play
About the mighty rocks, their rainbow spray
He’ll think less lovely than these dreams I bring:
And if I meet him in the meadows where
Are yellow cowslips gleaming in the sun,
I know that he will say, her golden hair
Outshines them in its glory, everyone,-
And in her cheeks my roses bloom so fair
That those upon the hedgerows are outdone!
.
Antoinette De Coursey Patterson
(1866-1925)
American Poet, Translator and Artist
From:
Page 16
Sonnets and Quatrains by Antoinette De Coursey Patterson
Philadelphia
H W Fisher & Company
MDCCCCXIII
మారణహోమం… ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్, అమెరికను
Maple in Autumn
శరత్కాలం ఆ లోయని వరదలా కమ్ముకుంది—
సీసపు గుళ్ళలా చినుకులు టపటపా రాలుతున్నాయి
ఫర్ చెట్లు అటూ ఇటూ బాధతో మూలుగుతూ కదుల్తున్నాయి
నేలంతా గాయపడ్డ మేపిల్ చెట్ల రక్తపు మరకలే.
.
ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్
అమెరికను
Carnage
.
Over the valley swept the Autumn flood—
In showers of leaden bullets fell the rain;
the firs moved to and fro, drunken with pain,
And wounded maples stained the earth with blood.
.
Antoinette De Coursey Patterson
American
Poem Courtesy:
https://archive.org/details/poetry01assogoog/page/n91
తొలకరి జల్లు… ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్, అమెరికను కవయిత్రి
నులివెచ్చని తొలకరి వర్షమా! సన్నగా మృదువుగా
రాలే నీ జల్లుకై పులకరిస్తూ నా ముఖాన్ని ఎదురొడ్డుతున్నాను.
అవ్యాజమైన నీ ప్రేమనీ, సామర్థ్యాన్నీ నా మనసు గ్రహించాలనీ
మంచుసోనలవంటి స్వచ్ఛమైన కలలు కనాలనీ కోరుకుంటున్నాను.
కలలు దారితప్పినా, మంచుతెరలలో చిక్కిన ప్రేమలా
అందంగా, చక్కగా, తారకలంత సన్నని మెరుపుతోనో;
రాజమార్గంమీదా, సెలయేటిగట్లమీది దట్టమైన చెట్లమధ్యా,
ఎక్కడపడితే అక్కడ అడవిపూలతీగలా అల్లుకుని
చామంతిపూలంత పచ్చని వెలుగులు వెదజల్లాలనీ కోరుకుంటున్నాను…
లేకపోతే వాటికి అంత మెరుపు ఎక్కడనుండి వస్తుంది?
నీ అమృతవృష్టి జీవితపు హాలాహలాన్ని అణగార్చి
మనోమిత్తికకు మంచి బీజములు మొలకేత్తే యోగ్యత అనుగ్రహిస్తుంది.
ఓ అమృత ధారా! తనివితీరా కురువు! కురిసి కురిసి
పూలవంటి ఆలోచనలు నాలో విరిసి జీవంతో తొణికిసలాడనీ!
.
ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్
17 Sep 1866 – 30 Apr 1925
అమెరికను కవయిత్రి
.
To The Spring Rain
.
O warm Spring rain, to thee I lift my face,
Courting thy touch beneficient and light.
Would that this soul might feel thy pow’r and grace,
And dreams like snowdrops blossom pure and white.
Or errant ones, if they be sweet and fair
Like love-caught-in-the-mist, with starry gleam,
Or the wild rose that clambers everywhere
Along the highway and the wooded stream.
And golden visions, such as Daffodils
Must have… or whence is all their sunny glow?
Thy elixir might overcome life’s ills
And fit the soil for all good seed to grow
Within my soul. Fall gracious rain, and give
Me thoughts like flowers. Let them bloom and live!
.
Antoinette de Coursey Patterson
17 Sep 1866 – 30 Apr 1925
American Poet
.
Poem Courtesy:
https://archive.org/details/sonofmeropeandot00pattiala/page/65
అశాంతి… ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్, అమెరికను
ఓ సరంగూ! నన్ను రేవు దాటించు.
అవతలి గట్టున పూలు అందంగా కనిపిస్తున్నాయి
ఆ గట్టున రాళ్ళుకూడా సూదుగా గరుకుగా కనిపించటం లేదు,
అక్కడ పిట్టలుకూడా బాగా పాడతాయని అందరూ అంటున్నారు.
ఓ సరంగూ! నన్ను రేవు దాటించవూ.
ఓ సరంగూ! నన్ను రేవు దాటించు.
ఇక్కడ అన్నీ ఎప్పుడూ ఉండే పాత వెతలే, కాకపోతే,
నేను మరికొన్ని సరికొత్తవాటితో సతమతమౌతున్నాను.
గాలివాటూ, కెరటాలూ ప్రతికూలంగా ఉంటే ఉండనీ, బాబ్బాబు,
ఓ సరంగూ! నన్ను ఎలాగైనా రేవు దాటించవూ.
ఓ సరంగూ! నన్ను రేవు దాటించు.
ఈ వింత వింత పరిస్థితుల మధ్య నే నుండలేను;
కళ్ళు మసకబారుతున్నై, నా అంతరాంతరాల్లో
మళ్ళీ పరిచయమున్న పాతవాటికోసం ప్రాకులాట ఎక్కువైంది
అవి చనిపోయిన వాళ్లందరూ ఎప్పుడూ పచ్చిగా ఉంచే
ఎంత పాత విషాదకర సందర్భాలయినా సరే.
ఓ సరంగూ! ఊఁ త్వరగా, నన్ను గమ్యం చేర్చవూ!
.
ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్
17 Sep 1866 – 30 Apr 1925
అమెరికను కవయిత్రి
.
Restlessness
.
Ferryman, row me across.
The flowers look brighter on that farther side,
The stones less rough that lies along its shore,
And there, they tell me, birds sing even more.
Ferryman, row me across.
Ferry man row me across.
Here are same old sorrows of yore,
Among those newer beauties I would hide;
Heed not, I pray, an adverse wind or tide,
Ferry man row me across.
Ferry man row me across.
I cannot mid these scenes so strange abide;
Mine eyes grow dim, and in my heart’s deep core
I long for old familiar things once more,
E’en though they be sorrows known of yore,
Kept ever green by graves of those who died.
Ferry man, quick, row me home!
.
Antoinette de Coursey Patterson
17 Sep 1866 – 30 Apr 1925
American Poetess
Poem Courtesy:
https://archive.org/details/sonofmeropeandot00pattiala/page/39
అభిజ్ఞప్రేయసి… ఏంటోనెట్ డి కూర్సే పాటర్సన్, అమెరికను కవయిత్రి
ఓ ప్రకృతీ! నీ ముందు కాళ్ళపై మోకరిల్లే వారిని
నువ్వు పతితుడవా? పావనుడవా? అని ప్రశ్నించకు.
వా డెవరైనా నిన్ను మనసారా ప్రేమిస్తాడు.
అతనికున్న సంగీత, చిత్రకళా నైపుణ్యాలను
కోపంలోనూ, ఆనందంలోనూ నువ్వు చిందించే
శతసహస్రసౌందర్యావస్థలనీ ఆరాధిస్తాడు.
అతను నీ పాదాలచెంతనే మోకరిల్లి ఉండగా
అతని స్తోత్రసుగంధాలు రోదసి అంతా వ్యాపిస్తాయి.
పాపం, మనశ్శాంతికి ప్రాకులాడే ఈ మానవాత్మని
నీ అభిజ్ఞతతో ఎంతకీ సంతృప్తి చెందక నువ్వు విసిగిస్తే,
నీమీది మునపటి నమ్మకాల్నీ, విస్వాసాల్నీ విడిచిపెట్టి
సులభంగా సంతృప్తిపరచగల పంచల చేరతాడు.
అతని ఆశలూ, కలలూ ఎంత కళావిహీనమై ఉంటాయంటే
నిన్ను పోగొట్టుకున్న ఆవేదన అతన్ని విడిచిపెట్టదు.
అంతే కాదు, ఒకప్పుడు నిన్ను చుంబించిన వారంతా
జీవితాలని ఎంత ప్రేమరహితంగా గడుపుతున్నారో గుర్తిస్తాడు.
.
ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్
17 Sep 1866 – 30 Apr 1925
అమెరికను కవయిత్రి
.
A Jealous Mistress
.
Thou askest not of him who kneels before thee,
O Nature, if he sinner be or saint,
But that with all his soul he shall adore thee,
And keep what gifts are his to sing or paint
Thy loveliness in all its myriad phases
Of sorrow or of laughter clear and sweet :
But only will the incense of his praises
Ascend to thee while he lies at thy feet.
And shouldst thou prove a mistress too exacting
For a poor human soul that seeks its ease,
So that, his one-time faith and creed retracting,
He turns to loves less difficult to please,
Ah then, he will know the pain of having missed thee…
So colourless are now all hopes and fears…
And he shall find that those who once have kissed thee
With lesser loves walk lonely all their years.
.
Antoinette De Coursey Patterson
September 17, 1866 – April 30, 1925
American Poet
Poem Courtesy:
https://archive.org/details/sonofmeropeandot00pattiala/page/28
ఒంటరి జాబిలి
అసూయ చెందిన ఆమె చెలికాడు మరలిపోయాడు;
ఒంటరితనంతో, భయాలతో సతమతమౌతూ చివరకి
సముద్రాన్ని ఆశ్రయించింది జాబిలి. ఆ పరాయి గుండెమీద
అపురూపమైన తన కన్నీళ్ళని ఒలకబోసుకుంటోంది.
.
ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్
17 Sep 1866 – 30 Apr 1925
అమెరికను కవయిత్రి
.
The Lonely Moon
Her envious kin turn from her; sore oppressed
With loneliness and fears,
She seeks the sea, and on that alien breast
Sheds her great golden tears.
.
Antoinette De Coursey Patterson
September 17, 1866 – April 30, 1925
American Poet
From: https://archive.org/details/sonofmeropeandot00pattiala/page/24
ప్రియతమా! నువ్వు ఆశ్చర్యపోకు… ఏంటోనెట్ డి కూర్సే పాటర్సన్, అమెరికను కవయిత్రి
ప్రియతమా! నా పెదాలు మౌనంగా ఉన్నాయని నువ్వు ఆశ్చర్యపోకు,
ఏ కొత్తభాష నేర్చుకోవాలన్నా కొంత సమయం పడుతుంది.
తొలిసారి ఈ వేళ్ళు ప్రేమవీణియ మీటినపుడు
నా గళమూ, నా మనసూ ఒక శృతిలో లేవు.
పాడిన పాటలన్నీ ఎప్పుడూ ఆనంద రుతాలే.
గులాబి దండల సంతోష హేలల రూపంలో ప్రేమ;
సంగీతంలా,గాఢానురక్తిని అతి సరళమైన
స్వరాల్లో నినదిస్తూ పలికించలేని అశక్తులవి.
ఇంతవరకు మౌనంగా ఉన్న నా పెదాలు
ధైర్యంగా పలకగల కొత్త నుడికారాన్ని వెతుకుతున్నాయి
నీనుండి పొందిన ప్రేరణ అనుభూతి చెందుతూ
ఆ గీత మాధుర్యానికి తన్మయత్వంలో మునిగాయి.
కనుక, నా మాటలు ఒక్కొకసారి నెమ్మదిగా, ఆగి ఆగి
వచ్చినపుడు, అసలు రహస్యమిదని నువ్వు గ్రహించుకో.
.
ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్,
(September 17, 1866 – April 30, 1925)
అమెరికను కవయిత్రి
.
You Should Not Wonder, Dear
.
You should not wonder, Dear, my lips are mute:
To learn a strange language must take time.
When first these fingers played upon Love’s lute,
Neither my soul nor voice were in the rhyme.
And then the tunes were always merry airs!-
Love in the guise of rose-wreathed joy and pleasure,-
And all unlike this music which declares
Deep passion throbbing through its simplest measure.
But now the lips that have been dumb so long
Struggle with words that are both brave and new,
Trembling, in all the ecstasy of song,
To feel the theme has been inspired by you.
So, when the words come haltingly and slow,
This sweetest reason for it you will know.
.
Antoinette De coursey Patterson
(September 17, 1866 – April 30, 1925)
American Poetess.
Poem Courtesy:
(Sonnets & Quatrains)
The Merrymount Press, Boston
February 1913
చిన్న చిన్న కవులు… ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్, అమెరికను కవయిత్రి
ఆకాశం నిర్మలంగా ఒక్క తారకా లేకుండా ఉంటే
అంత అందంగా ఉండదు, అక్కడ ఉండే ప్రతి గ్రహమూ,
సూర్యుడూ, చంద్రుడూ కంటికి ఇంపుగా కనిపించరు
వాటి వెనుక చుక్కలవంటి ఆ నక్షత్రాల వల లేకుంటే.
అలాగే, అందం తక్కువైనవాటికి కూడా వాటి స్థానం వాటికి ఉంది;
సముద్రంకోసం ఆరాటపడే వారు సెలయేటి సౌందర్యాన్ని అనుభవించలేరు,
అక్కడ ఒక నీలాకాశపు తునకేలేకుంటే, కొండలకి అందమెక్కడిదీ?
అక్కడ ఎన్ని అందమైన గులాబీలుంటే ఉండుగాక!
కనుక, కొద్ది కొద్దిగా కవితలు రాసే చిన్ని చిన్ని కవులారా,
కోకిలల పంచమ స్వరంలోని మెలకువల్ని స్తుతించేవారు
రాగాలుపోయే చిన్నిపిట్టల కూజితాన్నీ ఆస్వాదిస్తారు.
వాళ్ళు మీనుండి పెద్దగా స్థాయీ భేదాన్ని ఆశించరు
మధ్యమ శ్రుతుల్లో మీరు అందంగా అనగలిగితే చాలు.
.
ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్
(1866-1923)
అమెరికను కవయిత్రి
TO THE MINOR POETS
THE sky would be less lovely if swept clear
Of star-drift, and each planet, moon, and sun
Enmeshed therein no fairer would appear
Without the web those starry motes have spun.
The lesser beauties claim likewise their debt; —
Who loves the ocean best will miss the stream;
Hills would seem bare without the small bluet,
Although the rose’s reign is all supreme.
And so, ye Poets of the minor lays.
Sing on and charm us with your harmony:—
Those who the nightingale’s pure music praise
Can yet enjoy a thrush’s melody.
They look for no wide range, but ask of you,
Those notes in middle octaves shall ring true.
.
Antoinette De Coursey Patterson
(September 17, 1866 – April 30, 1925)
American Poetess
Poem Courtesy:
Sonnets & Quatrains
పిల్లల ఎంపిక… ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్, అమెరికను కవయిత్రి
వస్తువులలోని స్వారస్యాన్ని ఇట్టే పసిగట్టడానికి
కొన్ని హృదయాలకి కేవలం ఒక పూవు స్పర్శ చాలు.
ఒక గులాబిపొద సరసన, వాళ్ళ కళ్ళముందు
ఒక వెలుగుదారి తెరుచుకుంటుంది వాళ్ళ ఊహలు
ఒక్కసారి విచ్చుకుని అన్ని దిక్కులా పరిగెడుతుంటే.
వాళ్ళకి దారి చూపించడానికి ఒక తారక వచ్చినా రావొచ్చు
లేదా, అదుపుతీసిన ఊటలోంచి జలచిమ్మినట్టు కోకిల రాగమో,
లేదా, ఎక్కడో ఏ మూలనుండో అకస్మాత్తుగా వాళ్ళ పాదాలమీద
సూర్యుడి కిరణమొకటి వాలి సరియైన మార్గం చూపించవచ్చు.
అపుడు వారి ఊహలు ఎంత ఎత్తుకి ఎదుగుతాయంటే
చుట్టూ అంతా చిమ్మచీకటీ, శైధిల్యమే.
కాలాతీతంగా పిల్లలు కోరుకునేది అదే.
ఒక గులాబి, ఒక చుక్క, సముద్రపొడ్డున గవ్వ…ఇవే
పిల్లల ఎంపిక;వాళ్రికి నిగూఢ రహస్యాలు విప్పిచెబుతాయి.
.
ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్
17.9.1866 – 30.4. 1925
అమెరికను కవయిత్రి
Children Elect
It needeth but a flower’s touch to thrill
Some souls to an exquisite sense of things.
A shining path at just a rose’s will
Opens before them, its meanderings
To their awakened fancy now revealed.
Perchance there comes a star to guide them through,
Or thrush’s note like silver fount unsealed,
Or else across their steps from out the blue
A sunbeam darts to show the fairest way.
Ever that fancy finds some height to climb
Where all around is darkness and decay.
Children Elect they are, and for all time:
A rose, a star, a shell that holds the sea,
Unlocks for them sublimest mystery
.
Antoinette De Coursey Patterson
17.9.1866 – 30.4.1925
American Poet