అనువాదలహరి

నేను అతిసామాన్యంగా జీవించడం నేర్చుకున్నాను… అనా అఖ్మతోవా, రష్యను కవయిత్రి

నేను వివేకంగా, అతిసామాన్యంగా జీవించడం నేర్చుకున్నాను:
ఆకాశం వంక చూడడం, దేవుణ్ణి ప్రార్థించడం,
అతివేలమయిన నా కష్టాలు మరిచిపోడానికి
చీకటిపడకముందే ఎక్కువదూరం అలా నడవడం.
కొండవాలులో అంట్రింత చెట్లు గలగలలాడుతున్నపుడూ,
సంజెరంగులోని బెర్రీపళ్ళు గుత్తులుగా వాలినపుడూ
నేను ఆనందంగా కవితలు అల్లుకుంటాను…
నశ్వరమైన జీవితంగురించీ, సౌందర్యం, మృత్యువుగురించీ.

నేను ఇంటికి తిరిగి వస్తాను. మెత్తని బొచ్చుగల పెంపుడుపిల్లి
నా అరచేతిని నాకుతుంది. ముద్దుగా కులుకుతుంది.
చెరువుగట్టుననున్న రంపపు మిల్లు పొగగొట్టం కొస
క్రింద పొయ్యిలో చెలరేగుతున్న మంటలకి ఎర్రగా కనిపిస్తోంది.
విశాలంగా పరుచుకున్న నిశ్శబ్దాన్ని, ఉండీ ఉడిగీ
మిద్దెమీద వాలుతున్న కొంగల అరుపులు భంగపరుస్తున్నాయి.
మీరు అప్పుడు నా తలుపు తట్టినా
నాకు వినిపించకపోవచ్చు.
.
అనా అఖ్మతోవా

(23 June  1889 – 5 March 1966)

రష్యను కవయిత్రి

Anna Akhmatova

I taught myself to live simply…

.

I taught myself to live simply and wisely,
to look at the sky and pray to God,
and to wander long before evening
to tire my superfluous worries.
When the burdocks rustle in the ravine
and the yellow-red rowan berry cluster droops
I compose happy verses
about life’s decay, decay and beauty.
I come back. The fluffy cat
licks my palm, purrs so sweetly
and the fire flares bright
on the saw-mill turret by the lake.
Only the cry of a stork landing on the roof
occasionally breaks the silence.
If you knock on my door
I may not even hear.

.

Anna Akhmatova

(23 June  1889 – 5 March 1966)

Russian Modernist Poetess

 

చేతులు చుట్టుకుని, దుఃఖపు ఉడుపుల్లో, … అనా అఖ్మతోవా, రష్యను కవయిత్రి

చేతులు చుట్టుకుని, దుఃఖపు ఉడుపుల్లో

“ఇవాళ అంత పాలిపోయినట్టు కనిపిస్తున్నావేమి?”

ఎందుకంటే, ఇవాళ అతనికో చేదు వార్త చెప్పి

అతని శోకపాత్ర పొంగిపొర్లేలా చేశాను.

.

ఎలా మరిచిపోగలను? అతని అడుగులు తడబడ్డాయి.

అతని ముఖం బాధతో వంకరలుపోయింది…

అత్రంగా మేడమీదనుండి క్రిందికి 

ఎకా ఎకిని వీధి గేటు దాకా పరిగెత్తేను. 

.

“ఊరికే, నీతో హాస్యం ఆడేను,” అన్నాను నేను వగరుస్తూ.

“నువ్వు వెళ్ళిపోతే ఇక నేను బతకలేను,” అన్నాను.

అతను చిత్రంగా నవ్వుతూ, ప్రశాంతంగా :

“చలిగాలిలో నిలబడకు, ప్రమాదం” అన్నాడు.

.

అనా అఖ్మతోవా

June 23, 1889 – March 5, 1966

రష్యను కవయిత్రి

.

“క్లుప్తతకీ, భావాల నియంత్రణకీ అనాఅఖ్మతోవా కవిత్వం అద్దపడుతుం”దని పేరుతెచ్చుకుందంటే ఆశ్చర్యం ఎంతమాత్రం లేదు. కేవలం, మూడే మూడు పద్యాల్లో, ఎంత కథని చెప్పగలిగిందో, ఎంత గాఢమైన భావనలని వ్యక్తీకరించగలిగిందో చూడవచ్చు.

English: Portrait of Anna Akhmatova
English: Portrait of Anna Akhmatova (Photo credit: Wikipedia)

.

Hands clasped, under the dark veil

.

Hands clasped, under the dark veil

‘Today, why are you so pale?’

– Because I’ve made him drink his fill

Of sorrow’s bitter tale.

How could I forget? He staggered,

His mouth twisted with pain…

I ran down not touching the rail,

I ran all the way to the gate.

‘I was joking,’ I cried, breathlessly.

‘If you go away, I am dead.’

Smiling strangely, calmly,

‘Don’t stand in the wind,’ he said.

.

Anna Akhmatova

June 23, 1889 – March 5, 1966

Russian modernist Poet

Economy and Emotional restraint were her distinguishing style.

(Poem Courtesy: http://www.poetryintranslation.com/PITBR/Russian/Akhmatova.htm#Toc322442106

నాకు పూలంటే ఇష్టం లేదు … అనా అఖ్మతోవా, రష్యను కవయిత్రి

Русский: Категория:Изображения:Одесса
Русский: Категория:Изображения:Одесса (Photo credit: Wikipedia)

నాకు పూలంటే ఇష్టం లేదు… అవి ఎప్పుడూ

విందుభోజనాలనీ, నాట్యశాలల్నీ, పెళ్ళిళ్ళనీ

శవయాత్రలనీ గుర్తుచేస్తుంటాయి.

కానీ, చిన్నప్పుడు నాకు ఊరటగా నిల్చిన

నశ్వరమైన గులాబీల నిత్య నూతన సౌందర్య శోభ

ఇన్ని సంవత్సరాలూ నాలో నిలిచిపోయింది…వారసత్వంలా…

మోచాత్ అజరామర సంగీతం గొంతులో కూనిరాగాలు తీసినట్టు.

.

అనా అఖ్మతోవా

(జూన్ 23, 1889 – మార్చి 5,  1966)

సోవియట్ రష్యను కవయిత్రి

.

(ఈ కవితలో ఆవేదన పూలంటే నిజంగా ఇష్టం లేకపోవడం కాదు. వాటిని ఎటువంటి పనులకు నియోగిస్తున్నారో తలచుకుని తనబాధని వ్యక్తం చేస్తున్నాది కవయిత్రి (నా అభిప్రాయంలో). ఆమె ఇందులో ఇంకొక్కటి చేర్చితే బాగుణ్నని పించింది. అయితే ఆమెకు అలాంటివి అనుభవంలో లేకపోబట్టివ్రాయలేదు. ఉంటే, అన్నిటికంటే ముందుగానే చెప్పేదేమో. ఈ మధ్య ఒక స్వామీజీ ఒకానొక నగరానికి వేంచేస్తే, ఆయనకి భక్తులు గులాబీపుష్పాలతివాచీ పరిచేరు. అది TVలో ప్రసారం అయింది.  ఒక స్వామీజీనడవడానికి అన్ని గులాబీ పూలు నాశనం చెయ్యాలా అని నా శ్రీమతి ఆవేదన వ్యక్తం చేసింది. నిరాడంబరత, నిస్సంగత్వం వంటి సత్యాలని వెయ్యి ప్రవచనాలకంటే, చిత్తశుధ్ధిగా చేసే ఆచరణ వల్ల ఆవిష్కరించగలమన్న సత్యం ఇటు ప్రజలకీ, అటు స్వామీజీలకీ ఎప్పుడు అవగతమవుతుందో)

.

I Don’t Like Flowers

.

I don’t like flowers – they do remind me often
Of funerals, of weddings and of balls;
Their presence on tables for a dinner calls.

But sub-eternal roses’ ever simple charm
Which was my solace when I was a child,
Has stayed – my heritage – a set of years behind,
Like Mozart’s ever-living music’s hum.

.

Anna Akhmatova

(June 23  1889 – March 5, 1966)

A Soviet Modernist Poet

Born Anna Andreyevna Gorenko, she is more popular by her pen name. Requiem (1935–40) is her tragic masterpiece about the Stalinist terror. Her simple and emotionally restrained style was original and distinguished her from her contemporaries. Her’s was a strong female voice. In spite of continued censorship and condemnation of her poetry she did not leave the country but chose to stand witness  to the atrocities around her. Meditations on Time and Memory, and difficulties in writing and living under the shadow of Stalinism were her recurrent themes.

In my opinion,  it is not her disliking for flowers that  Akhmatova portrays in this poem, but her protest for the kind of use they are put to. Had she known (or seen) the kind of misuse flowers are put to these days, I am sure, she might have mentioned it first thing here. People were mad to give a Rose-carpet welcome to a Swamiji which was broadcast live on TV.  My wife was upset and commented that if it was necessary to waste so many roses for such welcome.  No one knows when the simple truth dawns on Swamijis and their devout devotees that one can teach austerity and simplicity in life more by practice than by precept or any amount of lecturing.

%d bloggers like this: