
వ్యక్తిపూజ… ఏమీ లోవెల్, అమెరికను కవయిత్రి
జనసమ్మర్దంగా ఉన్న వీధిలో పోతూ పోతూ చూసిన ఒక ముఖం
స్వేచ్ఛగా పాటపాడుతుండగా విన్న ఒక అందమైన కంఠస్వరం;
ఆ క్షణం నుండి జీవితం మారిపోతుంది. అప్పటినుండి
మనలో మునుపెన్నడూ ఎరుగని సాహస స్వభావం అంకురిస్తుంది;
బిడియం లేకుండా కలిసి అన్నీ అడిగి పుచ్చుకుంటాం.
మనిషికి ఒక నమ్మకం గొప్ప ధైర్యాన్నిస్తుంది.
మనజీవితాన్ని సార్ధకం చేసుకుందికి ప్రయత్నిస్తాం.
అటువంటి ఆరాధనే ఆదర్శవ్యక్తిత్వాన్ని ఊహించగలదు.
గడిచిన జీవితం నేర్పిన ఏ ఉపాయాలూ, నీతిబోధలూ
ఈ అణచలేని, గాఢమైన కోరికనుండి మనల్ని మరలించలేవు.
మనం అమితంగా అభిలషించేది చేతికి అందిన తర్వాత
ఇక ఏమాత్రం సంతృప్తి ఇవ్వదని తెలిసినా, భయాల్ని అణుచుకుంటాం.
మనం ఆరాధించేది మనకి అందకపోయినా, మనలో దానికై కోరిక
రగులుతూనే ఉంటుంది. నమ్మకం అంటే అంతే మరి!
.
ఏమీ లోవెల్
(9 February 1874 – 12 May 1925)
అమెరికను కవయిత్రి
.
Hero-Worship
.
A face seen passing in a crowded street,
A voice heard singing music, large and free;
And from that moment life is changed, and we
Become of more heroic temper, meet
To freely ask and give, a man complete
Radiant because of faith, we dare to be
What Nature meant us. Brave idolatry
Which can conceive a hero! No deceit,
No knowledge taught by unrelenting years,
Can quench this fierce, untamable desire.
We know that what we long for once achieved
Will cease to satisfy. Be still our fears;
If what we worship fail us, still the fire
Burns on, and it is much to have believed.
.
Amy Lowell
(9 February 1874 – 12 May 1925)
American
Poem Courtesy:
http://famouspoetsandpoems.com/poets/amy_lowell/poems/19984

నెలవంక… ఏమీ లోవెల్, అమెరికను కవయిత్రి
దుప్పికొమ్ములా కొనదేరిన నవ్వుల నెలరేడా!
అల్లంత ఎత్తున ఆకాశంలో మెల్ల మెల్లగా
జారుతూ, నా మాటలను వినగలవా?
తొందరగా క్రిందకి దిగి రాగలవా?
మా పూదోట కిటీకీ గూటిలో
కాసేపు నిలకడగా కనిపించగలవా?
తర్వాత మనిద్దరం ఈ వేసవి రేయి
చెట్టపట్టాలేసుకుని ఎగిరిపోదాం, సరేనా?
నక్షత్రాలతో దోబూచులాడుతూ,
మహావృక్షాల చివురుకొమ్మలు చేతితో నిమురుతూ,
తెల్లగా మెరిసే మేఘామాలికల సందులలోంచి
బృహస్పతినీ, అంగారకుడినీ తొంగిచూద్దామా?
ఇంటిలో మా అమ్మ పూజకోసం
పాలపుంత వనసీమల్లో ఏరిన
తారకాసుమాలతో నా ఒడి నింపుకుంటాను
అబ్బ! మా అమ్మ ఎంత పొంగిపోతుందో!
ఊగుతూ సాగుతూ తేలిపోయే చందురుడా,
నీకు “అహోయ్” అని అరిచిన నా అరుపు వినిపించిందా?
ఓ చందమామా! ఈ చిన్నిబాలుడి ఆనందంకోసం
మరికొంచెం దగ్గరకి రాలేవా?
.
ఏమీ లోవెల్
(9 Feb 1874 – 12 May 1925)
అమెరికను కవయిత్రి
.
.
The Crescent Moon
.
Slipping softly through the sky
Little horned, happy moon,
Can you hear me up so high?
Will you come down soon?
On my nursery window-sill
Will you stay your steady flight?
And then float away with me
Through the summer night?
Brushing over tops of trees,
Playing hide and seek with stars,
Peeping up through shiny clouds
At Jupiter or Mars.
I shall fill my lap with roses
Gathered in the milky way,
All to carry home to mother.
Oh! what will she say!
Little rocking, sailing moon,
Do you hear me shout — Ahoy!
Just a little nearer, moon,
To please a little boy.
.
Amy Lowell
February 9, 1874 – May 12, 1925
American Poet
Poem Courtesy:
http://famouspoetsandpoems.com/poets/amy_lowell/poems/19964

ఊహలు… ఏమీ లోవెల్, అమెరికను కవయిత్రి
నీ మాటలు నాలో ఎంతో సానుభూతి రేకెత్తించినా
నాకు నీతో మాటాడాలనిపించటం లేదు.
నా తనువులో మౌనంగా దాగిన మధురగీతికలన్నీ
మేల్కొని సంగీతమై నినదిస్తున్నాయి. నువ్వు నిష్క్రమించినపుడు
ఈ సున్నితమైన తంత్రులన్నిటినీ అకస్మాత్తుగా ఎవరో
నిర్దాక్షిణ్యంగా, సులభంగా త్రెంచిపారేసినట్టనిపిస్తుంది.
వద్దు, ఇంకేం మాటాడవద్దు; బదులుగా, మనిద్దరం
ఇద్దరికీ ఎంతో ఇష్టమైన మౌనాన్ని అక్కునచేర్చుకుందాం.
నలుపెక్కుతున్న మేఘాలని చూసి తుఫాను రాకడని ఊహించినట్టు
మన మాటలనుబట్టి ఇతరులు మన ఆంతర్యాన్ని పసిగట్టవచ్చు.
నామట్టుకు నాకు, ఏ రోజైనా మనం చేసిన పనుల సారాంశం
అందులోని మర్మాన్ని, ఆవేశాలతీవ్రతని బహిర్గతంచేస్తుంది.
అడవిలో పోప్లార్ చెట్లు రానున్న వర్షాన్ని ముందుగా కనిపెట్టి
తమ ఆకుల్ని వెనక్కి తిప్పి, తళతళ మెరిసిన చందంగా.
.
ఏమీ లోవెల్
(February 9, 1874 – May 12, 1925)
అమెరికను కవయిత్రి .
.
Dreams
.
I do not care to talk to you although
Your speech evokes a thousand sympathies,
And all my being’s silent harmonies
Wake trembling into music. When you go
It is as if some sudden, dreadful blow
Had severed all the strings with savage ease.
No, do not talk; but let us rather seize
This intimate gift of silence which we know.
Others may guess your thoughts from what you say,
As storms are guessed from clouds where darkness broods.
To me the very essence of the day
Reveals its inner purpose and its moods;
As poplars feel the rain and then straightway
Reverse their leaves and shimmer through the woods.
.
Amy Lowell
(February 9, 1874 – May 12, 1925)
American Poet
Poem Courtesy:
http://famouspoetsandpoems.com/poets/amy_lowell/poems/19961
జులై అర్థరాత్రి… ఏమీ లోవెల్, అమెరికను కవయిత్రి
చెట్ల చిటారుకొమ్మలలోనూ
నేలమీదజీరాడుతున్న దిగువరెమ్మలలోనూ
మిణుగురులు మెరుస్తున్నాయి.
నారింజవన్నె తారకల వెలుగులు లిప్తపాటు
వెన్నెలంత తెల్లని లిలీలపై మెరిసి మాయమౌతున్నాయి.
నువ్వు నాకు చేరబడితే
ఓ చంద్రికా!
నిన్నావరించిన పిల్లగాలి
తెలియరాని చీకటి తరులగుబురుల్లో పుట్టిన
తెలిపసుపు జ్వాలలకి
బీటలువడి, చీలి, రవ్వలుగా ఎగురుతోంది.
.
ఏమీ లోవెల్
(February 9, 1874 – May 12, 1925)
అమెరికను కవయిత్రి.
.
July Midnight
.
Fireflies flicker in the tops of trees,
Flicker in the lower branches,
Skim along the ground.
Over the moon-white lilies
Is a flashing and ceasing of small, lemon-green stars.
As you lean against me,
Moon-white,
The air all about you
Is slit, and pricked, and pointed with sparkles of
lemon-green flame
Starting out of a background of vague, blue trees.
.
Amy Lowell