Tag: American
-
సహనశీలియైన సాలీడు… వాల్ట్ వ్హిట్మన్, అమెరికను కవి
. ఒక్కతే, ఏకాంతంగా, చడీ చప్పుడూ లేకుండా ఆ ఏత్తైన గుట్టమీద నుండీ వేలాడుతున్న ఒక సహనశీలియైన సాలీడుని చూశాను; ఆ విశాలమైన పరిసరాల శూన్యపుహద్దులని శోధించడానికి అలుపన్నది ఎరగకుండా తనలోంచి నిరంతరాయంగా ఒక్కొక్కపోగూ, ఒక్కొక్క పోగూ తియ్యడాన్ని గమనించేను. . ఓ మనసా! మేరలులేని శూన్యసాగరాలు చుట్టుముట్టిన నువ్వు అనంతంగా ఆలోచిస్తూ, ఏదోప్రయాసపడుతూ, చేతులెత్తేస్తూ చుక్కల్ని అందుకోవాలనీ, ముడివెయ్యాలనీ ఆరాటపడతావు; కానీ, తీగెసాగిన నీ ఊహలు సేతువు నిర్మించగలిగేదాకా వేసిన బలహీనమైన లంగరులు నిలదొక్కుకునేదాకా నువ్వు…
-
ప్రేమ… విస్టెన్ హ్యూ ఆడెన్, అమెరికను కవి
తలెత్తి నింగిలోని చుక్కలని చూసినపుడు, పాపం, అవి అంతగా పట్టించుకుంటున్నా, చివరకి నేనెందుకూ పనికిరాకుండా పోవచ్చు. అదే నేలమీదైతే, మనిషైనా, మృగమైనా అవి మనఊసెత్తకపోతే,అసలు వెరవనక్కరలేదు. . పాపం తారలు మనమీద ప్రేమతో రగిలిపోతుంటే మనం తగినరీతిలో స్పందిచకపోతే ఎలా ఉంటుంది? ఎవరూ సమానంగా ప్రేమించలేరనుకున్నప్పుడు, ఇద్దరిలో ఎక్కువ ప్రేమించేది నేననవుతా. . మనం వాటిని గుర్తించేమో లేదో ఖాతరుచెయ్యని నక్షత్రాలంటే ఇష్టమయిన నాకు, అవి ఇప్పుడు కనిపిస్తున్నా, పగలల్లా వాటిని చూడలేకపోయానన్న చింత లేదు. .…
-
నన్నెంతగా ప్రేమిస్తున్నావు? … కార్ల్ సాండ్ బర్గ్, అమెరికను కవి
నువ్వు నన్నెంతగా ప్రేమిస్తున్నావు ఇవాళ? ఒక మిలియను బుషెల్స్ ఉంటుందా? అంతకంటే ఎక్కువా? నిజంగా, అంతకంటే చాలా ఎక్కువ? . బహుశా, రేపు బుషెల్ లో సగం అయిపోతుందేమో? లేక, బుషెల్ లో సగం కంటే కూడ తక్కువో. . ఇదేనా ప్రేమంటే నీ హృదయగణితం? అచ్చం ఇలాగే, గాలికూడ, వాతావరణాన్ని కొలుస్తుంటుంది. . కార్ల్ సాండ్ బర్గ్ (January 6, 1878 – July 22, 1967) అమెరికను కవి (గాలికి ఎంత…
-
మనం ఏం చేసుకుంటాం? … చార్ల్స్ బ్యుకోవ్స్కీ, అమెరికను కవి
మహా బాగుందనుకున్నప్పుడు, ఈ మానవజాతిలో సాధుత్వం, కొంత అవగాహన, అప్పుడప్పుడు కొన్ని సాహసకృత్యాలూ ఉంటాయి గాని మొత్తం మీద ఇది ఒక మంద… చెప్పుకోదగ్గదేమీ లేని ఒక శూన్య గోళం. అది మంచి గాఢనిద్రలో ఉన్న ఒక పెద్ద జంతువులా ఉంటుంది; దాన్నెవ్వడూ మేల్కొలపలేడు. అది బాగా చురుకుగా ఉన్నప్పుడు మహాక్రూరంగా ఉంటుంది; స్వార్థపూరితంగా, హత్యలుచేస్తూ, అన్యాయంగా ప్రవర్తిస్తుంది. ఇలాంటిమానవజాతిని మనం ఏం చేసుకుంటాం? ఏమీ చేసుకోలేం. సాధ్యమైనంతవరకు దానికి దూరంగా ఉండడం మంచిది. ఏదైనా విషపదార్థాన్నీ,…
-
మోచాత్ విళంబిత నృత్యగీతం … Sara Teasdale, American Poet
మసకవెలుతురు పడుగులా పరుచుకున్న గదిలో వాయులీనపు స్వరాలు పేక నేస్తున్నాయి గాలిలో అల్లుకుంటూ, పెనవేసుకుంటూ, చిమ్మచీకటిలో పసిడి మెరుగులు చిమ్ముతున్నై సంగీతం వెలుగుగా మారడం నేను గమనించాను. కానీ, ఒకసారి కమాను ఆగగానే ఆ కలనేత చెదిరిపోయి ఆ మెరుపు ముంచెత్తుతున్న రాత్రి కెరటంలో మునకేసింది. . సారా టీజ్డేల్ (August 8, 1884 – January 29, 1933) ఆధునిక అమెరికను సాహిత్యం లో సారా టీజ్డేల్ ది ఒక ప్రత్యేక స్థానం. పదాల వాడుకలో…
-
శాశ్వతత్వం … ఎమిలీ డికిన్సన్.
కొందరు శాశ్వతత్వం కోసం కృషిచేస్తారు చాలామందికి తక్షణ ప్రయోజనాలుకావాలి. వీరికి ఫలితం వెంటనే లభిస్తే మొదటివారికి కీర్తి…భావి చెక్కులుగా దొరుకుతుంది అది చాలా మెల్లిగా లభ్యమౌతుంది… కాని శాశ్వతం. ఈ రోజుకి లభించే బంగారం మాత్రం నిత్యం చెల్లుబాటయే ఆ నాణేలతో పోలిస్తే వెలవెలపోతుంది అక్కడక్కడ ఉంటారు… నిర్భాగ్యులైనా స్టాకుబ్రోకరుని మించిన సూక్ష్మబుద్ధిగల మదుపుదారులు బ్రోకర్లకి కేవలం డబ్బులు మాత్రమే దక్కితే వాళ్ళకి దక్కేది … అంతులేని భాగ్యాల గని. . ఎమిలీ డికిన్సన్. (డిసెంబర్…
-
వాలిన పిట్ట … ఎమిలీ డికిన్సన్
. నే నడిచే దారిలోకి ఒక పిట్ట వచ్చి వాలింది దాన్ని నే చూసేనని గమనించలేదది వానపాముని పట్టి, రెండుముక్కలుచేసి, దాన్ని అలాగే ఆరగించింది పచ్చిగా . ఒక గడ్డిపరక అంచునుండి జారబోతున్న మంచుబిందువులు తాగింది పేడపురుగును చూసి, దారి ఇస్తూ, పక్కకి గెంతుకుంటూ తప్పుకుంది. . గబగబా నాలుగుదిక్కులూ చూస్తున్న భీతిచెందిన దాని కళ్ళు భయపడి చెదిరిన పూసల్లా ఉన్నాయి. దాని మొఖ్మలు తలను ఒకసారి విదిలించింది . భయంగా అప్రమత్తంగా ఉన్నదానికి నేనో రొట్టెముక్క…