Tag: American
-
మంచులో వేటగాళ్ళు… విలియం కార్లోస్ విలియమ్స్, అమెరికను కవి
This Poem is about this picture by Piter Brugel the elder (1525- 9th Sept 1569), the famous and most significant artist of Dutch and Flemish Renaissance Painting. The Painting is “Hunter In the Snow” … is an Oil on canvas, 46 inches x 63.75 inches displayed in Kunsthistorisches Museum, Vienna. *** ఆ చిత్రం శీతకాలంలో మంచుకొండలు.…
-
ఆటు… ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి
నీ ప్రేమ నానుండి మరలింది కనుక నాకు నా మనఃస్థితి తెలుస్తోందిలే: అదొక తీరంనుండి సముద్రంలోకి చొచ్చుకొచ్చిన బండరాయి, దానిమీద ఒక చిన్న గుంత; అందులో, ఎగసినకెరటాలనుండి జారిపోగా మిగిలిన నీటితో ఏర్పడిన చిన్న మడుగు. ఆ గోర్వెచ్చని నీరు ఎండకీ, గాలికీ మెల్లమెల్లగా హరించుకుపోతుంటుంది. . ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే (22 ఫిబ్రవరి 1892 – 19 అక్టోబరు 1950) అమెరికను కవయిత్రి . Ebb . I know what my heart…
-
మండువేసవిలో ఒక సూర్యోదయం… ఆర్చిబాల్డ్ మెక్లీష్, అమెరికను కవి
ఓ ఆకాశమా! విపుల వైశ్వానర స్వరూపమా! విను! బ్రహ్మాండమైన సూర్యగోళపు గర్జనలు వినిపించకపోవచ్చు నేమో గానీ, అవి వినలేనంత భీకర శబ్దాలు; వెలుగునే వేడెక్కించగలవవి. ఓ మహానుభావా! సూర్యుడా! మా ఆత్మలని వెలిగించు, కోరికలు రగిలించు… మా ఆత్మలకి ప్రేరణనివ్వు! మేము ఈ చీకటిని చాలా కాలమై ప్రేమిస్తున్నాం. ఈ చీకటికి చితి రగిలించి, వెలుగుని మరింత ప్రజ్వలనం చెయ్యి. ఎంతగా అంటే ఆ వేడిలో నిస్తేజమైన ఈ రోజులు రగిలి, ఆ సెగలలో సుషుప్తిలో మునిగి…
-
బట్టలుతికిన రోజు …జూలియా వార్డ్ హోవ్, అమెరికను కవయిత్రి
బట్టలారవేసిన తీగ … కుటుంబంలో ప్రేమకీ, సేవకీ ఒక రుద్రాక్షమాల వంటిది; తల్లి ప్రేమించే ప్రతి చిన్న దేవదూత దుస్తులూ అక్కడ మనకి దర్శనం ఇస్తాయి. ఆమె పెరటిలో ఆలోచనలలో మునిగి దండెం మీద ఒక్కొక్కబట్టా ఆరవేస్తున్నప్పుడు ప్రతి బట్టనీ ఒక రుద్రాక్షపూసగా పరిగణిస్తుందంటే ఆశ్చర్యపోనక్కరలేదు. అపరిచితవ్యక్తినైన నేను అటువైపుగా పోతూ ఆ ఇంటికీ, దుస్తులకీ ఒక అంజలి ఘటిస్తాను ప్రేమపూర్వకమైన శ్రమకీ, ప్రార్థనకీ గల దగ్గరపోలిక మదిలో మెదలినపుడు పెదాలపై చిరునవ్వు మెరుస్తుంది. . జూలియా…
-
నాకు నక్షత్రగతులు తెలుసు, కానీ… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
నాకు పేరు పేరునా నక్షత్రాలు తెలుసు ఆల్డెబరాన్ (రోహిణి), ఆల్టేర్ (శ్రవణం) … విశాలమైన నీలాకాశపు నెచ్చెన అవి ఎలా ఎక్కుతాయో కూడా తెలుసును. వాళ్ళు చూసే చూపులనుబట్టి మగవాళ్ళ రహస్యాలు పసిగట్టగలను వారి వింత వింత, చీకటి ఆలోచనలు బాధకలిగించడంతో పాటు జాగ్రత్తనీ బోధించాయి. కానీ నీ కళ్ళే నా ఊహకి అందటం లేదు, అవి పదే పదే పిలుస్తున్నట్టు అనిపిస్తున్నా… నువ్వు నన్ను ప్రేమిస్తున్నావో లేదో తెలీదు అలాగని, అసలు ప్రేమించటం లేదనీ చెప్పలేను.…
-
ప్రియతమా! నువ్వు ఆశ్చర్యపోకు… ఏంటోనెట్ డి కూర్సే పాటర్సన్, అమెరికను కవయిత్రి
ప్రియతమా! నా పెదాలు మౌనంగా ఉన్నాయని నువ్వు ఆశ్చర్యపోకు, ఏ కొత్తభాష నేర్చుకోవాలన్నా కొంత సమయం పడుతుంది. తొలిసారి ఈ వేళ్ళు ప్రేమవీణియ మీటినపుడు నా గళమూ, నా మనసూ ఒక శృతిలో లేవు. పాడిన పాటలన్నీ ఎప్పుడూ ఆనంద రుతాలే. గులాబి దండల సంతోష హేలల రూపంలో ప్రేమ; సంగీతంలా,గాఢానురక్తిని అతి సరళమైన స్వరాల్లో నినదిస్తూ పలికించలేని అశక్తులవి. ఇంతవరకు మౌనంగా ఉన్న నా పెదాలు ధైర్యంగా పలకగల కొత్త నుడికారాన్ని వెతుకుతున్నాయి నీనుండి పొందిన…
-
వెడల్పుకుంచె… ఆల్ఫ్రెడ్ నికోల్, అమెరికను కవి
(Vanity of vanities, says the Preacher; all is vanity. Eccl. 12:8) ఈ కవిత శీర్షిక దిగువనుదహరించిన బైబిలు వాక్యంలోని తాత్పర్యం కవి ఎంత నిగూఢంగా వ్యక్తంచేస్తున్నాడో గమనించండి. శీతకాలపు సంజె వెలుగు వాలుగా పడే వేళ ఆ తెల్లమేడకి పనివాళ్ళు తెల్లరంగు వేస్తుంటే వాళ్ళు నిల్చున్న నిచ్చెనల క్రీనీడలు ఎగబ్రాకుతున్నాయి ముసురుకుంటున్న చీకటిని వేగంగా అందుకుందికి. . ఆల్ఫ్రెడ్ నికోల్ అమెరికను కవి. Alfred Nicole Photo by George Disario Wide…
-
ఒక శిల్పి అంతిమ యాత్ర… విలా కేథర్, అమెరికను
లౌకిక అవసరాలకై వెంపర్లాట తప్ప మరొకటి తెలియని మనకి, దానికి అతీతమైన జీవితం ఉంటుందనీ, కొందరు దానికోసం తమ సర్వస్వం ధారపోస్తారనీ, ఈ లౌకిక విషయాలకి వాళ్ళు గుడ్డిగవ్వ విలువ ఇవ్వరనీ చాలా సున్నితంగా చెప్పిన కథ ఇది. *** కాన్సాస్ రాష్ట్రంలో అదొక చిన్న నగరం. అది శీతకాలం రాత్రి. ఆ ఊరిలోని కొందరు పౌరులు రైల్వే స్టేషనులో రైలింగుకి చేరబడి బండి కోసం ఎదురుచూస్తున్నారు. అప్పటికే అది రావడం 20 నిముషాలు ఆలస్యం…
-
రా!… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
మౌక్తికరజోసదృశమైన ఈ వాసంత సాయంసంధ్యవేళ వర్ణహీనమైన చంద్రుడు పూరేకలా తేలియాడుతుంటే, నను పొదువుకునేందుకు చేతులుజాచుకుంటూ, రా! వీడని ముద్దుకై పెదాలు సిద్ధంచేసుకుంటూ రా! రా! జీవితం, గడుస్తున్న వత్సరాల వలలో ఎగురుతూ చిక్కిన ఒక బలహీనమైన చిమ్మట. ఇంత కాంక్షతో రగిలే మన సంగతీ త్వరలో అంతే! బూడిదరంగు రాయి రప్పలమై గడ్డిలో పొరలాడడమే. . సారా టీజ్డేల్ (August 8, 1884 – January 29, 1933) అమెరికను కవయిత్రి . . Come .…
-
జాతీయ భద్రత… ఆర్చిబాల్డ్ మెక్లీష్, అమెరికను కవి
అక్కడ 3 పేర్లున్నాయి భద్రంగా దాచిన దస్త్రంలో రహస్య మందిరంలో వర్గీకరించబడ్డ అరలలో దేశభద్రతా భవనంలో. ష్! దాని గురించి గట్టిగా మాటాడవద్దు! . మొదటి మరీ పురాతనమైనది అక్కడ అంతా నల్ల బంగారం లక్క అంత చల్లన పసిడి రేగుపళ్ల వాసన. దాని పేరు కాంబోడియా. రెండవది లావోస్. మధ్యమధ్య వెండి మెరుపులతో మెరిసే బంగారు కంఠహారం. అక్కడి భాష గిజిగాడు భాషలా ఉంటుంది. మూడవది వియత్నాం. ఒక సెల్…