Tag: American
-
కల… ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి
ప్రియతమా! నేను రోదించినా ఎవరూ పట్టించుకోరు నువ్వు దానికి నవ్వినా నేను దానికి బాధపడను. అలా అనుకోడం తెలివితక్కువగా కనిపించవచ్చు కానీ, నువ్వున్నావన్నది గొప్ప ధైర్యాన్నిస్తుంది. ప్రియతమా!నేను నిద్రలో మేల్కొన్నట్టు కలగన్నాను నేలమీద, తెల్లగా పిండారబోసినట్టున్న వెన్నెల చేతితో తాకాను; కానీ ఎక్కడో దూరంగా వదులుగా ఉన్న కిటికీ ఒకటి కిర్రుమని చప్పుడైంది గాలికి ఊగుతూ… కానీ గాలి వీచిన జాడలేదు, నాకు భయంవేసి నీ వైపు చూశాను నీ భరోసాకోసం చెయ్యి జాచేను కానీ, నువ్వక్కడలేవు!…
-
నాకు ఒంట్లో బాగులేదు… షెల్ సిల్వర్ స్టీన్, అమెరికను కవి
“ఇవాళ నేను బడికి వెళ్ళలేను” అంది పెగ్గీ ఏన్ మెకే. నాకు మశూచిసోకిందో, గవదబిళ్ళలు లేచాయో అక్కడక్కడగాట్లూ, దద్దుర్లూ, ఎర్రగా పొక్కులూ ఉన్నాయి. నా నోరు తడిగానూ, గొంతు పొడారిపోతూనూ ఉంది నాకు కుడికన్ను కనిపించడం లేదు. నా టాన్సిల్స్ బండరాయిల్లా తయారయ్యాయి నేను లెక్కెట్టేను పదహారు అమ్మవారుపోసిన పొక్కులున్నాయి ఇదిగో, దీనితో కలిపి పదిహేడు నా ముఖం నీకు పచ్చగా కనిపించటం లేదూ? నా కాలుకి దెబ్బతగిలింది, కళ్ళు వాచిపోయాయి… బహుశా అప్పుడే ఫ్లూ జ్వరం…
-
ఊహలు… ఏమీ లోవెల్, అమెరికను కవయిత్రి
నీ మాటలు నాలో ఎంతో సానుభూతి రేకెత్తించినా నాకు నీతో మాటాడాలనిపించటం లేదు. నా తనువులో మౌనంగా దాగిన మధురగీతికలన్నీ మేల్కొని సంగీతమై నినదిస్తున్నాయి. నువ్వు నిష్క్రమించినపుడు ఈ సున్నితమైన తంత్రులన్నిటినీ అకస్మాత్తుగా ఎవరో నిర్దాక్షిణ్యంగా, సులభంగా త్రెంచిపారేసినట్టనిపిస్తుంది. వద్దు, ఇంకేం మాటాడవద్దు; బదులుగా, మనిద్దరం ఇద్దరికీ ఎంతో ఇష్టమైన మౌనాన్ని అక్కునచేర్చుకుందాం. నలుపెక్కుతున్న మేఘాలని చూసి తుఫాను రాకడని ఊహించినట్టు మన మాటలనుబట్టి ఇతరులు మన ఆంతర్యాన్ని పసిగట్టవచ్చు. నామట్టుకు నాకు, ఏ రోజైనా మనం…
-
ఈ బొమ్మ ఏమై ఉంటుంది?… షెల్ సిల్వర్ స్టీన్, అమెరికను కవి
ఒక పాత బొమ్మలో చిన్న ముక్క రోడ్డుమీద పడి ఉంది. ఒక పాత బొమ్మలో చిన్న ముక్క వానలో తడుస్తూంది. అది అలవాటుగా షూ వేసుకునే స్త్రీ తొడుక్కున్న కోటుకి ఉండే నీలిరంగు బొత్తాము కావచ్చు. అది magic bean గాని ఒక మహారాణి గారు ధరించిన ఎర్రని మొకమలు వస్త్రంమీది మడత కావొచ్చు, లేదా, Snow White కి సవతి తల్లి ఇచ్చిన ఏపిలును ఆమె కొరికినపుడు పడిన పంటి గాటు కావొచ్చు. అది ఒక…
-
తపర్తులోకి మంచుసోనలా మరొకసారి… ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి
మరొకసారి నా తపర్తుజీవితంలోకి మంచుసోనలా ఎడారిలో నీటిచెలమమీంచి వీచే పిల్లగాలిలా చల్లని, కమ్మని నీటిబుగ్గమీద బుడగల జడిలా నీ గురించి, మోసకారి తలపొకటి పొడచూపుతుంది నా ఉత్సాహాన్ని హరించడానికి; మళ్ళీ ఎప్పటిలాగే నీ అలవిమాలిన ప్రేమకై ఆశలు పెంచుకుంటాను; అదొక పెద్ద ఇసుకతిన్నె అని నేను ఎన్నడో గ్రహించినా అక్కడ ఎప్పుడూ ఏ లేచిగురూ మొలవలేదని ఎరిగినా. మరొకసారి, తెలివిమాలినదానినై గాలిలో కదిలే నీ రంగురంగుల భ్రాంతిమదరూపం వెంటబడతాను. వెక్కివెక్కి ఏడుస్తూ, తిట్టుకుంటూ, పడుతూ లేస్తూ దిక్కుమాలి,…
-
కొవ్వొత్తి … ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి
. నా కొవ్వొత్తి రెండు వైపులా మండుతోంది అది ఈ రాత్రల్లా వెలగకపోవచ్చు కానీ, నా శత్రులారా! ఓ నా మిత్రులారా! అది వెలిగినంతసేపూ అద్భుతమైన కాంతినిస్తుంది. . ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, ( 22 February 1892 – 19 October 1950) అమెరికను కవయిత్రి . . First Fig . My Candle burns at both ends; It will not last the night; But, ah, my…
-
సంఘర్షణ… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
. నాలోని యోగీ, భోగీ రాత్రీ పగలూ పోట్లాడుకుంటూ ఉంటారు. సమ ఉజ్జీలేమో, అతి జాగ్రత్తగా, లొంగకుండా ఒకర్నొకరు తిట్టుకుంటూ నాకు ఒకపక్క చెమట్లు పట్టేస్తుంటే సూర్యోదయం మొదలు చీకటిపడేదాకా కొట్టుకుంటారు. రాత్రయినదగ్గరనుండీ పోరాటం మళ్ళీ ప్రారంభం. పొద్దుపొడుస్తుంటే వణుక్కుంటూ వాళ్ళని గమనిస్తాను. ఈసారి ఒకరి అంతు రెండోవాళ్ళు చూసేదాకా కొట్టుకుంటారు. ఎవరు జయిస్తారన్నది నేను పట్టించుకోను. ఏవరు గెలిచినా, చివరికొచ్చేసరికి ఓడిపోయేదాన్ని నేనే! . సారా టీజ్డేల్ (8 August 1884 – 29 January…
-
పిల్లలూ, మెల్లమెల్లగా మీరు గడపదాటి పోతున్నప్పుడు… ల్యూసియస్ ఫ్యూరియస్, అమెరికను కవి
పిల్లలూ, మీరు అంచెలంచెలుగా గడపదాటుతున్నప్పుడు — ఒకటో తరగతి… తర్వాత కాలేజీ… తర్వాత మీ స్వంత ఇల్లూ, తర్వాత బహుశా పెళ్ళి—, ఇన్నాళ్ళూ భద్రంగా దాచిన ఈ నాలుగుగోడల్నీ ప్రేమతో గుర్తుంచుకుంటారనుకుంటాను, ఈ ఏటవాలు పసుపుపచ్చ పైన్-చూరిల్లూ, ఇక్కడ మీ రనుభవించిన వెచ్చదనమూ- వాటిని మీరు జీవితంలో అవవలసినదానికి అవరోధాలుగా కాక నిరంతరం విశాలమవుతున్న ఈ ప్రపంచాన్ని ఎదుర్కోడానికి బలమైన గాలి తోడుగా ప్రయాణమైన మీ జీవననౌకల్ని క్షేమంగా ఉంచిన ఓడరేవులుగా తలచుకుంటారనుకుంటాను. నిజమే! లోకంలో చెడ్డ…
-
ఒక జ్ఞాపకం… ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి
బాగా అలసిపోయాం, ఎంతో ఉల్లాసంగా ఉన్నాం, రేయల్లా తెప్పమీద రేవుని అటూ ఇటూ దాటుతూనే ఉన్నాం. రాత్రి నిర్మలంగా, ప్రకాశంగా ఉంది, ఆ చోటు గుర్రాలశాల వాసనేసింది; మేజాకి చేరబడి, చలిమంటకేసి చూస్తూ కూచున్నాం, కొండకొమ్మున ఆరుబయట ఆకాశం క్రింద వెన్నెట్లో పడుక్కున్నాం; గాలి ఈలలు వేస్తూనే ఉంది,అంతలోనే సూర్యోదయం కాజొచ్చింది. బాగా అలసిపోయాం, ఎంతో ఉల్లాసంగా ఉన్నాం, రేయల్లా తెప్పమీద రేవుని అటూ ఇటూ దాటుతూనే ఉన్నాం. నువ్వో ఆపిలు తిన్నావు, నేనో నేరేడుపండు తిన్నాను,…