అనువాదలహరి

పరిశీలన… స్విన్ బర్న్, ఇంగ్లీషు కవి

I

పాపాయి పాదాలు, గవ్వల్లా గులాబివన్నెలో ఉన్నాయి,
మనకి మోహము కలిగి, దైవముచితమని అనుగ్రహిస్తే,
ఒక దేవత పెదాలు ముద్దాడాలనుకున్నపుడు
మనకు ముందుగా కనిపించేవి పాపాయి పాదాలే.

సూర్యుడివైపు తిరిగే గులాబిరంగు వనధిపుష్పాల్లా
అవి ఆకాశంవైపు ప్రతి లిప్తా సాగుతూ, లేస్తాయి
ఆ పది కోమలమైన మొగ్గలూ కలుస్తూ వేరవుతుంటాయి.

విరిసి ముకుళించే ఏ కుసుమ కోరకమూ
అందులో సగపాటి నెత్తావినైనా విరజిమ్మలేదు
పాపాయి పాదాల్లా
జీవితపు కొత్తదారులలో వెలుగు వెదజల్లలేవు.

II

పాపాయి చేతులు, ముడుచుకున్న మొగ్గలు
పక్కన ఏ చిగురూ కనిపించకపోయినా;
ముట్టుకుంటే చాలు తెరుచుకుంటాయి ముంగురుల్లా
మళ్ళీ చుట్టుకునే పాపాయి చేతులు.

రణభేరీ వినిపించగానే యోధుల చేతులు
కత్తులు బిగించి పట్టుకున్నట్టు
అవి ముడుచుకుని, పటకాల్లా పట్టుబిగిస్తాయి.

వాటికి, అత్యంత సుందరమైన ప్రదేశాలలో వేకువ
ముత్యాలదండలేసిన గులాబిమొగ్గలు సైతం దీటు రావు;
సృష్టిలో ఎంతటి మనోహరమైన కుసుమమైనా
పాపాయి చేతులముందు దిగదుడుపే.

III

పాపాయి కన్నులు భాషిస్తాయి, పలుకు రాకముందే,
పెదాలు మాటలూ, నిట్టూర్పులూ నేర్వకముందునుండే,
వాటి దృష్టిని ఆకట్టుకోగల అన్ని వస్తువులనీ
అనుగ్రహిస్తాయి పాపాయి కన్నులు.

పాపాయి నవ్వుతూ పడుకుంటే,
నిద్ర వస్తూ పోతూ దోబూచులాడుతుంటే,
ప్రేమకి అందులో స్వర్గమే సాక్షాత్కరిస్తుంది.

వాళ్ళ ఒక్క చూపు చాలు పాపాలూ, కష్టాలూ పటాపంచలు;
వాళ్ళ మాటలు మేధావుల్ని సైతం నోరుమూయిస్తాయి.
పాపాయి కన్నుల్లో కనువిందు చేసే
దైవం తారాడుతున్నట్టు అనిపిస్తుంది.
.

స్విన్ బర్న్

5 April 1837 – 10 April 1909

ఇంగ్లీషు కవి

Image Courtesy: http://upload.wikimedia.org Sketch of Swinburne at age 23 by Dante Gabriel Rossetti
Image Courtesy: http://upload.wikimedia.org Sketch of Swinburne at age 23 by Dante Gabriel Rossetti

.

Étude Réaliste

(Realistic Study)

 .

I

A baby’s feet, like sea-shells pink,

      Might tempt, should heaven see meet,

An angel’s lips to kiss, we think,

      A baby’s feet.

Like rose-hued sea-flowers toward the heat

      They stretch and spread and wink

Their ten soft buds that part and meet.

No flower-bells that expand and shrink

      Gleam half so heavenly sweet

As shine on life’s untrodden brink

      A Baby’s feet.

II

A baby’s hands, like rosebuds furled

      Whence yet no leaf expands,

Ope if you touch, though close upcurled,

      A baby’s hands.

Then, fast as warriors grip their brands

      When battle’s bolt is hurled,

They close, clenched hard like tightening bands.

No rosebuds yet by dawn impearled

      Match, even in loveliest lands,

The sweetest flowers in the entire world—

      A baby’s hands.

III

A baby’s eyes, ere speech begin,

      Ere lips learn words or sighs,

Bless all things bright enough to win

      A baby’s eyes.

Love, while the sweet thing laughs and lies,

      And sleep flows out and in,

Sees perfect in them Paradise.

Their glance might cast out pain and sin,

      Their speech make dumb the wise,

By mute glad godhead felt within

      A baby’s eyes.

.

(Note: This is only a part of the poem)

.

Algernon Charles Swinburne

5 April 1837 – 10 April 1909

English Poet, Playwright, Novelist and Critic

Poem Courtesy:

http://www.bartleby.com/246/773.html

A Victorian Anthology, 1837–1895.

Ed: Edmund Clarence Stedman, (1833–1908).

 

కుర్రాడి నవ్వు … స్విన్ బర్న్

 

Image Courtesy: http://www.advocate.com

.

స్వర్గంలోని ఘంటలన్నీ మ్రోగవచ్చు

అక్కడి పక్షులన్నీ కిలకిలరవా లాలపించవచ్చు


భూమిమీది నీటిబుగ్గలన్నీ చిమ్ముతూ పైకెగయవచ్చు


అవనిమీది గాలులన్నీమధురస్వరాలనొకచోట పోగుచెయ్యొచ్చు…


ఇంతవరకు విని,  ఎరిగిన

మధుర స్వరాలన్నిటికంటే మధురమైనదీ,

వీణకంటే, పక్షి పాటకంటే,

అరుణోదయవేళ

వనిలో అతిశయించే ఆనందపుహేల కంటే,

పదాలుపాడుతున్నట్టు పైకెగజిమ్మే నీటి ఊటకంటే

వివర్ణమైన వేసవి వడగాలి వేడి ఊసులకంటే

తియ్యనిది ఇంకొకటుంది…

సృష్టిలో అంత తియ్యని స్వరం ఉందని

అది మోగేదాకా తెలీదు,

స్వర్గంలో ఉంటుందని ఊహించలేము…

అది


తూరుపు శిలాగ్రాలనుండి రాగరంజితంగా


జాలువారే కిరణాల సవ్వడిలా


సంతోషాతిశయంతో మనసు నిండినపుడు,

లలితంగానే కాని బలంగా, తేలికగానే  కాని స్పష్టంగా

తొణికిసలాడే ఒక కుర్రవాడి నిర్మలమైన చిరునవ్వు.


స్వాగత గీతాలెన్నడూ అంత మధురంగా విని ఉండము;

అంత గట్టిగా ఆనందం ఎప్పుడూ కేరింతలు కొట్టదు;

స్వర్గం ఇక్కడకు దిగిందేమో అని అనిపించే

ఆ బంగారు మోములో పలికే నవ్వు

కోయిలలూ, చకోరాలూ, ఒకటేమిటి మనిషి విన్నవీ కన్నవీ

మధురంగా ఆలపించే అన్నిపక్షుల ఆలాపనలూ

ఏడేళ్ళ కుర్రాడి నవ్వు తీయదనంలో

సగానికి కూడా సాటిరావు.

.

Image Courtesy: http://upload.wikimedia.org Sketch of Swinburne at age 23 by Dante Gabriel Rossetti

స్విన్ బర్న్

A Child’s Laughter

.

All the bells of heaven may ring,
All the birds of heaven may sing,
All the wells on earth may spring,
All the winds on earth may bring
All sweet sounds together—
Sweeter far than all things heard,
Hand of harper, tone of bird,
Sound of woods at sundawn stirred,
Welling water’s winsome word,
Wind in warm wan weather,

One thing yet there is, that none
Hearing ere its chime be done
Knows not well the sweetest one
Heard of man beneath the sun,
Hoped in heaven hereafter;
Soft and strong and loud and light,
Very sound of very light
Heard from morning’s rosiest height,
When the soul of all delight
Fills a child’s clear laughter.

Golden bells of welcome rolled
Never forth such notes, nor told
Hours so blithe in tones so bold,
As the radiant mouth of gold
Here that rings forth heaven.
If the golden-crested wren
Were a nightingale— why, then,
Something seen and heard of men
Might be half as sweet as when
Laughs a child of seven.

.

 Algernon Charles Swinburne

(5 April 1837 –  10 April 1909)

English poet, playwright, Novelist, and Critic.

Swinburne devised a verse form “Roundel” of 9 lines in 3 triplets,  with equal number of syllables for each line, the first and third lines rhyming and having a common refrain at the end of 3rd and last lines.  He wrote 100 Roundels and dedicated to his friend Christina Rossetti (5 December 1830 – 29 December 1894) a great poet in her own right.

మృత్యువుతో సంభాషణ … స్విన్ బర్న్

I

ఓ మృత్యువా! నీకభ్యంతరంలేకపోతే, నిన్నొకటడగాలని ఉంది.
మేము ఎన్నో ఆశల గూళ్ళను నిర్మించుకున్నామే.
నువ్వుతలుచుకుంటే, మా ఆత్మలు ప్రశాంతంగా ఉండడానికి
ఓ మృత్యువా! ఒక్కటంటే ఒక్కటి  మాకు ప్రసాదించలేవా?

ఏ సార్వభౌమ చిహ్నాలూ అక్కరలేదు.
సూర్యుడూ, మంచు ముత్యాల మెరుపులు పొదిగిన గోపురాలూ అక్కరలేదు.
అధికారముద్రలనీ, కరవాలాలపిడులనీ ఉంచడానికి యోగ్యతలేనిదైనా సరే,
ఏదో ఒక అడవిచెక్కతో చేసినదైనా, తలమీద ఒకకప్పు, చాలు!

మార్పులూ, భయాలూ, పీడకలలూ,అపరాథభావనలనుండి విముక్తమై,
ప్రేమ శాశ్వతంగా నిద్రించేలా ఎంత హీనమైనదైనా, ఒక చిన్న ప్రియమైన గూడు;
చూసి తలుచుకుందికి, మా జీవితాలకి ఆమాత్రం విడిచిపెట్టలేవా?
ఓ మృత్యువా! నువ్వు తలుచుకోవాలిగాని.

II

ఓరి మానవా! నన్నెదిరించి వాదించడానికి నీ కెంత ధైర్యం?
నా పనితీరు ఏమిటో, నేను ఎప్పుడు ఎక్కడ
ఏమేమి సృష్టించగలనో నీకు తెలుసా? తెలీదు, పరికించి చూడు,
మానవా! నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావు?

నీ జీవితసాఫల్యాలూ, నీ వంశవృక్షపు శాఖాగ్రాల నవకుసుమాలూ
నే వేసిన మొలకలు కాక మరేమిటనుకుంటున్నావు ?
ఈ భూమీ సప్తసముద్రాలూ నేను ఉఫ్ మని ఊదేనంటే
తట్టుకో లేవు. తల వాల్చవలసిందే.

నువ్వు గొప్పవాడివైతే కావచ్చు గాని, నా ముందు తల దించుకో:
కాలమూ, తిరుగులేని విస్మృతీ నిన్నక్కున జేర్చుకున్నాక,
నువ్వూ ఉండవు… నీ కనుబొమల మీద గర్వమూ ఉండదు.
మానవా! నువ్వనగా ఎంత?

III

ఓ మృత్యువా! నువ్వు చెప్పినట్టు నువ్వు శాశ్వతమైనా, కాకపోయినా,
మమ్మల్ని నువ్వు హరించినా, మేము బ్రతికిబట్టగట్టినా
ఓ మృత్యువా! నువ్వు ఉన్నావంటే, కారణం,
నీ బలం అంతా నువ్వంటే మాకున్న భీతి.

నీ శక్తి, మా భయం లోంచి పుట్టింది.
ఎవడు నీకు భయపడడో, వాడు నీ శిరసు మీది నుండి
భూమ్యాకాశాలను హరించగల కిరీటాన్ని సంగ్రహిస్తాడు.

భూమీ, సముద్రాలూ, ఆకాసమూ, చినుకులా ఆవిరిలా
మాయమైపోవచ్చు. వాటి అన్నిరూపాలూ నశించవచ్చు.
మృత్యువా! అసలు నువ్వు బ్రతికుంటావో లేదో
మాకు అప్పుడు ఖచ్చితంగా తెలుస్తుంది.

.

Image Courtesy: http://upload.wikimedia.org Sketch of Swinburne at age 23 by Dante Gabriel Rossetti

                                        చార్ల్స్ ఏల్గర్నాన్ స్విన్ బర్న్  

స్విన్ బర్న్ అనగానే శ్రీశ్రీ రాసిన “ఏవి తల్లీ నిరుడుకురిసిన హిమ సమూహములు” అన్న కవితా దానికి అతను ప్రేరణగా పేర్కొన్న “The Snows of Yesteryear” కవితా గుర్తుకొస్తాయి. ఇంగ్లీషు కవీ, నాటకకర్తా, నవలాకారుడూ, విమర్శకుడూ అయిన స్విన్ బర్న్ పేరు 1903 నుండి -1907 దాకా, తిరిగి 1909 లోనూ నోబెల్ బహుమతికి సిఫార్సు చెయ్యబడింది. గురజాడ ముత్యాలసరాలలాగా, ఆరుద్ర కూనలమ్మ పదాల్లా, ఇతనుకూడ Roundel అన్న ఛందోప్రక్రియను సృష్టించి  అందులో ఒక వందకవితలు రాసి, ప్రముఖ కవయిత్రి క్రిస్టినా రోజేటికి అంకితమిచ్చాడు.  అందులో ప్రముఖంగా ” A Baby’s Death ” అన్న కవిత అతనికి మంచి పేరు తేవడమే గాక Sir Edward Edgar అన్న బ్రిటిషు సంగీతకారుడు The Little Eyes That Never Knew Light అన్న పేరుతో దాన్నిస్వరపరిచేడు కూడా. శ్రీశ్రీలాగ, ఛందస్సూ, శబ్దము తోపాటు, వాటి లయమీదా అతనికి అపారమైన ప్రజ్ఞ ఉంది.  Atlanta in Calydon అన్న verse drama చాలా కాలం మన యూనివర్శిటీలలో పాఠ్యగ్రంథంగా ఉండేది.

.

A Dialog

I.

Death, if thou wilt, fain would I plead with thee:
Canst thou not spare, of all our hopes have built,
One shelter where our spirits fain would be,
Death, if thou wilt?

No dome with suns and dews impearled and gilt,
Imperial: but some roof of wildwood tree,
Too mean for sceptre’s heft or swordblade’s hilt.

Some low sweet roof where love might live, set free
From change and fear and dreams of grief or guilt;
Canst thou not leave life even thus much to see,
Death, if thou wilt?

II.

Man, what art thou to speak and plead with me?
What knowest thou of my workings, where and how
What things I fashion? Nay, behold and see,
Man, what art thou?

Thy fruits of life, and blossoms of thy bough,
What are they but my seedlings? Earth and sea
Bear nought but when I breathe on it must bow.

Bow thou too down before me: though thou be
Great, all the pride shall fade from off thy brow,
When Time and strong Oblivion ask of thee,
Man, what art thou?

III.

Death, if thou be or be not, as was said,
Immortal; if thou make us nought, or we
Survive: thy power is made but of our dread,
Death, if thou be.

Thy might is made out of our fear of thee:
Who fears thee not, hath plucked from off thine head
The crown of cloud that darkens earth and sea.

Earth, sea, and sky, as rain or vapour shed,
Shall vanish; all the shows of them shall flee:
Then shall we know full surely, quick or dead,
Death, if thou be.

Algernon Charles Swinburne

(5 April 1837 – London, 10 April 1909)

British Poet, Dramatist, Novelist and Critic.

%d bloggers like this: