అనువాదలహరి

జీవన కెరటం … ఆల్ఫ్రెడ్ టెన్నిసన్ ఇంగ్లీషు కవి

కాన్రాడ్! నీ జీవితం ఏ మార్పూలేక విసుగ్గా ఉందంటావేమి?

లంగరువేసి ఆలోచనలో పడ్డావెందుకు? అన్నిపక్కలా పాకిరిపోయిన

ఈ కలుపు తగ్గేది కాదు, పైపెచ్చు, నీటివాలు అంతా అల్లుకుంటుంది.

జీవిత నౌక చేరడానికి అందమైన తీరాలు అనేకం ఉన్నాయి

కానీ, నువ్వెప్పుడూ ఒక్క తీరాన్నే చేరాలని ఆరాటపడుతుంటావు.

ఆ తెడ్లని పైకిలాగి పడవకి అడ్డంగా గిరాటు వేశావేమి?

ప్రయత్నం లేకుండా పడవ దానంతట అది వాలులోకి ప్రయాణించదు.

ఈ జీవన కెరటాన్ని వెంటతరిమి ముందుకు తోసే అల ఉండదు.

మన మనుగడే అవరోధాల్ని అధిగమించి ముందుకు సాగడం మీద ఉంది.

జీవితంలో ఉత్తమ పార్శ్వమంతా మన కోరికల ఆరాట ఫలితమే.

మహా అయితే, ఎగుబోటు లేని నీ పడవ కాసేపు నిలకడగా ఉంటుందేమో గాని

ఆగిపోదు. దాన్ని రెండుపక్కలనుండి అశాంతి తాడిస్తూనే ఉంటుంది.

విను! ఆ ప్రశాంతతని నిర్లిప్తంగా సాగే కెరటాలకు విడిచిపెట్టి

బద్ధకంనుండిపుట్టిన కలుపుని వివేకంతో ముందుకు సాగుతూ జయించు.

.

ఆల్ఫ్రెడ్ టెన్నిసన్

(6 August 1809 – 6 October 1892) 

ఇంగ్లీషు కవి

 

 

.

Conrad! Why call thy life monotonous?

Why brood above thine anchor? The woven weed

Calms not, but blackens, the slope water bed.

The shores of life are fair and various,

But thou dost ever by one beach abide.

Why hast thou drawn thine oars across the boat?

Thou canst not without impulse downward float,

The wave of life hath no propelling tide.

We live but by resistance, and the best

Of life is but the struggle of the will:

Thine unresisting boat shall pause – not still

But beaten on both sides with swaying Unrest.

Oh! Cleave this calm to living eddies, breast

This sloth-sprung weed with progress sensible.

.

Alfred Lord Tennyson

(6 August 1809 – 6 October 1892) 

English Poet

Poem Courtesy:  Rhythm and Will in Victorian Poetry by Matthew Campbell

Copyright Cambridge University Press

From Google Books:

https://books.google.co.in/books?id=EGHJriLBYYcC&pg=PA157&lpg=PA157&dq=The+rhythm+of+oars+by+tennyson&source=bl&ots=5t2wS1up1B&sig=ACfU3U1MVV20XuPSvPLZnBeWnOoNGHx8OA&hl=en&sa=X&ved=2ahUKEwjA1fO1vrvpAhXlzDgGHULBDdkQ6AEwBnoECAkQAQ#v=onepage&q=The%20rhythm%20of%20oars%20by%20tennyson&f=false

సంశయమూ – విశ్వాసమూ… ఆల్ఫ్రెడ్ టెన్నీసన్, ఇంగ్లీషు కవి

ఏ తిరస్కారపు చాయలేకుండా, సహృదయంతో
చీకటిలో మునిగిపోతున్న ఆ కీటకాల్ని
నీ నీలికళ్ళతో జాలిగా చూస్తూ నాతో అంటావు:
అనుమానం దెయ్యంలా పడితే వదలదని.

నాకు తెలీదు: అయితే ఒకటి మా తెలుసు
ఎంతో మంది నిపుణులైన వైణికుల్ని చూశాను,
మొదటిసారి మీటినపుడు ఎప్పుడూ అపశృతే పలికేది,
తర్వాతే దానిలో ఎనలేవి నైపుణ్యం సంపాదించేరు.

సందేహాలు కలవరపెట్టినా, చేతల్లో నిజాయితీ ఉంది;
అందుకే చివరికి అంతరాంతర సంగీతాన్ని బయటపెట్టగలిగేరు.
నిజాయితీతో కూడిన సందేహంలోనే ఎక్కువ విశ్వాసం ఉంటుంది,
నా మాట నమ్ము, పైకి అందరూ తాము ప్రకటించే విశ్వాసాల్లో కంటే.

తన అపనమ్మకాలతో పోరాడి ధైర్యం సంపాదించిన వాడు
తన నిర్ణయాలను ఎప్పుడూ గుడ్డిగా తీసుకోడు,
అతడు మనసులోనే ఆ దయ్యాలను చూశాడు,
వాటిని గెలిచి, చివరికి ఇలా బయటపడగలిగేడు

తన శక్తిపై బలమైన నమ్మకాన్ని కూడగట్టుకుని;
ఇపుడు చీకటిలో కూడా అతనికి అతని ధైర్యమే తోడు;
చీకటి వెలుగులు దేని వల్ల కలుగుతాయో
అది కేవలం వెలుగులోనే దాగి లేదనీ,

పురాతన సినాయ్ పర్వత శిఖరంలా
చీకటిలోనూ, మేఘాల్లోనూ అవరించి ఉందనీ తెలుసు;
అందుకే చుట్టుపక్కల రణభేరీలు ఎంత గట్టిగా వినవస్తున్నా
ఇజ్రాయేల్ తన విశ్వాసాన్ని సడలనీ లేదు.
.
ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నీసన్

(6 August 1809 – 6 October 1892)

ఇంగ్లీషు కవి

 

.

 

Doubt and Faith

(From “In Memoriam,” XCV.)

.

You say, but with no touch of scorn,        

  Sweet-hearted, you, whose light-blue eyes        

  Are tender over drowning flies,      

You tell me, doubt is Devil-born.     

 

I know not: one indeed I knew

  In many a subtle question versed,  

  Who touched a jarring lyre at first,

But ever strove to make it true:       

 

Perplext in faith, but pure in deeds, 

  At last he beat his music out.

  There lives more faith in honest doubt,   

Believe me, than in half the creeds.  

 

He fought his doubts and gathered strength,       

  He would not make his judgment blind,  

  He faced the spectres of the mind  

And laid them: thus he came at length       

 

To find a stronger faith his own;      

  And Power was with him in the night,    

  Which makes the darkness and the light, 

And dwells not in the light alone,    

 

But in the darkness and the cloud,   

  As over Sinai’s peaks of old,

  While Israel made their gods of gold,      

Although the trumpet blew so loud.

.

Alfred, Lord Tennyson

(6 August 1809 – 6 October 1892)

English Poet

Poem Courtesy:

The World’s Best Poetry.

Bliss Carman, et al., eds. 

Volume IV. The Higher Life.  1904.

III. Faith: Hope: Love: Service

http://www.bartleby.com/360/4/89.html

AHH స్మృతిలో… ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నీసన్,ఇంగ్లీషు కవి

అనుభవిస్తున్న దుఃఖాన్ని మాటల్లో చెప్పడం


నా కొక్కసారి  ఒక పెద్ద అపరాధంలా అనిపిస్తుంది.  


ఎందుకంటే, ప్రకృతిలాగే, మాటలుకూడా


వ్యధాత్మని సగమే ఆవిష్కరించి సగం మరుగుపరుస్తాయి.   


అయితే, బాధాతప్తమైన మనసుకీ హృదయానికీ


ఆచితూచి ఉపయోగించిన మాటలవల్ల ప్రయోజనం లేకపోలేదు;


ఈ విషాదకరమైన యాంత్రిక అభ్యాసము


మాదకద్రవ్యాల్లా, బాధతెలియకుండా  మొద్దుబారుస్తుంది.

చలినుండికాపాడుకుందికి ముతకవస్త్రాలు ధరించినట్టు  


నేను కలుపుమొక్కల్లాంటి మాటలను పెనవేసుకుంటాను.


అయితే, వాటిలో నిక్షిప్తమైన అపారమైన దుఃఖాన్ని


అవి కేవలం రేఖామాత్రంగా రూపుకట్టగలవు. అంతే!   


.

ఆల్ఫ్రెడ్  లార్డ్ టెన్నీసన్

(6 August 1809 – 6 October 1892)

ఇంగ్లీషు కవి.

ఇది లార్డ్ టెన్నీసన్ తన మిత్రుడు, తన సోదరితో నిశ్చితార్థం జరిగి, వివాహం సంపన్నం కాకుండానే మరణించిన Arthur Henry Hallam స్మృతిలో రాసిన In Memorium కావ్యం లోనిది.  ఈ కావ్యం అతనికి బహుళప్రచారముతోపాటు అజరామరమైన కీర్తితెచ్చిపెట్టింది.

ఇందులో 133 విభాగాలున్నాయి,  ప్రతి విభాగంలోనూ abba అన్న అంత్యానుప్రాసతో  నాలుగు పాదాలున్న పద్యాలున్నాయి. ఈ ఛందస్సు టెన్నీసన్  కనిపెట్టేడని ప్రతీతి. ఇందులో ముఖ్యంగా అతను చెప్ప ప్రయత్నించినది, శోకానికి గురైన మనసు దాని నుండి తేరుకునే మార్గం.  అందుకని  abba అనులోమ విలోమం అనుగుణంగా ఉందని పండితుల సిద్ధాంతం.

మనం ముఖ్యంగా గమనించవలసినది …. “మనం ఉపయోగించే పదాలకు  మనలోని

భావాలను వెలిబుచ్చడంలో కొన్ని పరిమితులున్నాయి”  అని  కవి చేస్తున్న హెచ్చరిక.

.

.

Carbon print of Alfred Lord Tennyson, 1869, pr...
Carbon print of Alfred Lord Tennyson, 1869, printed 1875/79 (Photo credit: Wikipedia)

.

In Memorium AHH Section 5

.


I sometimes hold it half a sin

To put in words the grief I feel;


For words, like Nature, half reveal


And half conceal the Soul within.


But, for the unquiet heart and brain,


A use in measured language lies;


The sad mechanic exercise,


Like dull narcotics, numbing pain.


In words, like weeds, I’ll wrap me o’er,


Like coarsest clothes against the cold;


But that large grief which these enfold


Is given outline and no more.

.

Alfred, Lord Tennyson 

(6 August 1809 – 6 October 1892)

English Poet

 

 

.

ఇసుకకట్ట దాటుతున్నప్పుడు … టెన్నీసన్, ఆంగ్ల కవి.

అదిగో సూర్యుడస్తమిస్తున్నాడు, అదే రేచుక్క,

నన్ను రమ్మని ఆహ్వానం పలుకుతున్నాయి!

ఇసుకకట్ట*దాటి నేను కడలిలోకి అడుగిడుతున్నపుడు 

వీడ్కోలుచెప్పే కెరటాల కళ్ళు చెమరించకుండుగాక!   

ఈ అపారపారావారపు అగాధమైన

లోతులలోనుండి వెలువడి, సాగి, అలసిసొలసిన ఈ కెరటం

తిరిగి తనువచ్చినచోటికే పోతూ 

నురగలతో సడిచెయ్యడానికీ ఓపికలేనిది.

అదిగో మునిచీకటి, అవే సాంధ్యఘంటారావాలు 

ఇకపై అంతా చిక్కని చీకటి!

నేను నావలోకెక్కుతున్నప్పుడు,

సాగనంపినవారిలో విషాదము లేకుండు గాక; 

దేశాకాలావధులుదాటి నా ప్రయాణం కొనసాగినా

నన్ను తీరానికి చేర్చే శక్తి కెరటాలకు కలుగుగాక,

నేను తీరాన్ని దాటగానే,

నా నావికుడిని ముఖాముఖీ కలుసుకుంటాను.

.

ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నీసన్

6 August 1809 – 6 October 1892

ఆంగ్ల కవి

(* ఇసుకకట్ట : ప్రతిఓడరేవు ముఖద్వారంలో ఉండే ఇసుకకట్ట (Bar) )

ఈ కవిత టెన్నీసన్ తను చనిపోడానికి 3 సంవత్సరాలు ముందు వ్రాసినా, అతని చివరి కవితగా అచ్చువేయమని తన కుమారుడిని ఆదేశించాడు. ఈ కవితలో తన మృత్యువుని, దేశకాలావధులులేని సముద్రప్రయాణంతో పోలుస్తున్నాడు. సముద్రంలోకి అడుగుపెట్టడానికి ప్రతి ఓడా ముఖద్వారంలోని ఇసుకకట్టను దాటాలి (That is Crossing the Bar).  ఇక ఆ తర్వాత మరోతీరం చేరేదాకా అది మృత్యుముఖంలో ఉన్నట్టే. చెలియలికట్టలాంటి ఆ ఇసుక కట్టని, మృత్యువుతో పోలుస్తున్నాడు కవి.

.

Deutsch: Alfred Lord Tennyson 1809-1892 englis...
Deutsch: Alfred Lord Tennyson 1809-1892 englischer Poet. (Photo credit: Wikipedia)

.

Crossing The Bar*

.

.

Sunset and evening star,

And one clear call for me!

And may there be no ‘moaning of the bar’**,

When I put out to sea,

But such a tide as moving seems asleep,

Too full for sound and foam,

When that which drew from out the boundless deep

Turns again home.

Twilight and evening bell,

And after that the dark!

And may there be no sadness of farewell,

When I embark;

For tho’ from out our bourne of  Time and Place

The flood may bear me far,

 I hope to see my Pilot face to face

When I have crost the bar..

.

(1889)

Alfred Lord Tennyson

6 August 1809 – 6 October 1892

English

(Notes:

*Crossing the Bar : There will be a  Bar of Sand at the entrance of a harbour which the Ship crosses to enter into the Sea. The waves will be rough here making lots of sound.
 ** Moaning of the Bar: The poet wishes that the waves be not rough (lamenting his leaving) at the Bar.)

వీడ్కోలు … లార్డ్ టెన్నిసన్


Image Courtesy: http://t3.gstatic.com

.

పరుగెత్తు, పరుగెత్తు చలువ సెలయేరా!
వడివడిగ వడివడిగ కడలికడకు
మెచ్చుకుని కెరటాలు కౌగిలిస్తాయిలే!
ఈ ఏటితీరాన నా కాలిగురుతులు
కనుమరగులైపోవు నింక అనవరతము.

పరుగెత్తు నెమ్మదిగ పరుగెత్తు శాంతముగ
పసరు మైదానాలలో పిల్ల సెలయేరుగా
పచ్చికబయళ్ళలో పొరలు జీవన నదిగ
నీ నీటితీరాల నా కాలిగురుతులు
కనరావు కన రావు ఇంక అనవరతము.

ఇక్కడొక “ఆల్డరు” నిట్టూర్పు విడిచితే
అక్కడొక “ఆస్పెన్” విలవిలవణుకులే
అటు యిటు తిరుగాడు ఆ నల్ల తుమ్మెదా
ఝుమ్మనుచు పాడులే ఇంక అనవరతము.

వేవేల సూర్యులూ నీ మీద మెరిసితే
ఆ వేల చంద్రులూ తేలియాడేరులే
ఏ వేళ నీ చెంత నా కాలి గురుతులూ
కనబోము కనబోము ఇంక అనవరతము.

.

Image Courtesy: http://upload.wikimedia.org

లార్డ్ టెన్నిసన్

ఆగష్టు 6, 1809 – అక్టోబరు 6, 1892


ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్ విక్టోరియా మహరాణి ఏలికలో చాలాకాలం ఆస్థానకవి (Poet Laureate) గ ఉన్నాడు. అతని కవితలలో Charge of the Light Brigade అన్నది అతనికి అశేషమైన కీర్తి తెచ్చిపెట్టింది. అందులోని మాటలు కోట్స్ గా సాహిత్యం లో నిలిచిపోయేయి. అలాగే చారిత్రక విషయాలపై అతను రాసిన కవితలుగాక, ముఖ్యంగా టెన్నిసన్ అనగానే గుర్తుకు తెచ్చేవి Ulysses, In Memorium AHH, Crossing the Bar, Tears Tears Tears మొదలైన కవితలు.
ఈ కవిత తను పుట్టిపెరిగిన ఊరు Somersby లోని సెలయేటిపై తను తిరిగిరానని తెలిసి వెళుతున్నప్పుడు రాసిన అంకిత కవిత.

.

A Farewell

Flow down, cold rivulet, to the sea,
Thy tribute wave deliver:
No more by thee my steps shall be,
For ever and for ever.

Flow, softly flow, by lawn and lea,
A rivulet then a river:
Nowhere by thee my steps shall be
For ever and for ever.

But here will sigh thine alder tree
And here thine aspen shiver;
And here by thee will hum the bee,
For ever and for ever.

A thousand suns will stream on thee,
A thousand moons will quiver;
But not by thee my steps shall be,
For ever and for ever.

Alfred Lord Tennyson FRS.

(6 August 1809 – 6 October 1892)

Tennyson was a Poet Laureate during the reign of Queen Victoria and was famous for some of his short poems like “Charge of the Light Brigade” a historical poem of the battle at Balaclava during Crimean War ; his Virgilian lyric “Tears, Idle Tears” after his visit to Tintern Abbey, like William Wordsworth before him;  his elegiac Poem “Crossing the Bar” apart from many poems based on historical themes, Ulysses  and In Memorium AHH, to commemorate his friend, fellow poet and fellow student at Trinity College, Cambridge.

The above poem is a dedication to the brook in Somersby, Lincolnshire where he was born.%d bloggers like this: