Tag: Alexander Pushkin
-
ఆఖరి ఆకు… అలెగ్జాండర్ పూష్కిన్, రష్యను కవి
నా బ్రతుకు కోరికల పరిధి దాటింది నా వ్యామోహాలుతలుచుకుంటే విసుగేస్తోంది; శూన్యహృదయ జనితాలైన దుఃఖాలొక్కటే చివరకి మిగిలేది. నా అధికార తీరాలపై విధి రేపే క్రూరమైన తుఫానుల నీడలో నా తుది ఘడియకోసం ఎదురుచూస్తూ దుఃఖభరితమైన ఒంటరి బతుకు ఈడుస్తున్నాను. ఆవిధంగా, శీతగాలి ఊళలేస్తూ చలితో కోతపెడుతుంటే ఆఖరిఆకు మాత్రమే మిగిలి మోడుబారిన కొమ్మ … గజగజా వణుకుతోంది. . అలెగ్జాండర్ పూష్కిన్ 6 జూన్ 1799 – 10 ఫిబ్రవరి 1837 రష్యను కవి . […]
-
రైతుని గమనించండి… అలెగ్జాండర్ పుష్కిన్, రష్యను కవి
ఇసక పర్రలలో స్వేచ్ఛాబీజాలు జల్లుతుంటే చుక్క పొడవకముందే నేను నడుస్తున్నాను; పాపం బానిస నాగళ్ళు విడిచిన చాళ్లలోకి స్వచ్చమైన, నిష్కల్మషమైన వేళ్ళు విత్తులు జల్లుతున్నాయి ఫలప్రదమైనది ఈ విత్తనము, తరాలను సృష్టిస్తుంది; కానీ, ఈ పంట నొర్లుకునేవాడు, వట్టి అహంకారపు జులాయి ఇప్పుడు నాకు అర్థం అయింది ‘వృధాశ్రమ’ అంటే ఏమిటో. ఓ శాంతియుత దేశాల్లారా, మీకు కావలసినంత మెయ్యండి మీ రెన్నడూ అన్నార్తుల ఆక్రందనలకి బదులు పలకలేదు ! స్వాతంత్ర పోరాటాల పిలుపులకి గొర్రెలా బదులు పలికేది? […]
-
ఎక్కడికో దూరంగా… అలెగ్జాండర్ సెర్గేవిచ్ పుష్కిన్, రష్యను కవి
ఎక్కడో దూర దేశంలో ఉన్న ఇంటికి నువ్వు ప్రయాణమయ్యావు. ఇంతకుముందెన్నడూ ఎరుగనంత దుఃఖంతో నీ చేతుల్లో ఏడ్చాను నా చేతులు చల్లబడి తిమ్మిరెక్కాయి. అయినా నిన్ను వెళ్ళకుండా ఆపడనికి ప్రయత్నించేను; ఈ బాధకి అంతంలేదని గాయపడ్ద నా ఆత్మకి తెలుసు. మన గాఢమైన చుంబనం నుండి నీ పెదాల్ని అదాత్తుగా దూరం చేశావు. ఇలాంటి ఏకాంతప్రదేశానికి బదులు మరో అందమైన చోటు గురించి చెబుతూ “మేఘాచ్ఛాదనలేని అనంతాకాశం క్రింద ఆలివ్ చెట్టు నీడల్లో మళ్ళీ మనం ఇద్దరం […]
-
జీవన శకటం … అలెగ్జాండర్ పుష్కిన్, రష్యను కవి
ఉండుండి అదిమొయ్యవలసిన బరువు భారమైనా ఈ శకట గమనం నెమ్మదిగా సాగుతుంటుంది; జుత్తు నెరిసిన సాహస కాల చోదకుడు బండి మొగలులో సుఖంగా కూచిని తోలుతుంటాడు. ప్రాభాతవేళ దానిలోకి ఉత్సాహంతో దూకి ఒక అద్భుతమైన ప్రయాణానికి సిద్ధపడతాం. సోమరితనాన్నీ, అలసటనీ లక్ష్యపెట్టకుండా మనం అరుస్తాం: “ఊం! త్వరగా! మనం అక్కడికి చేరుకోవాలి” కానీ మధ్యాహ్నమయే సరికి మన ధైర్యం సన్నగిలితుంది, మనం భయపడతాం; ఆ సమయానికి కొండలూ లోయలూ భీతావహంగా కనిపిస్తాయి. అప్పుడు, “ఓ, సారధీ! మూర్ఖుడా! […]
-
ఆఖరి సుమం… అలెగ్జాండర్ పుష్కిన్. రష్యను కవి
కొత్తగా కుసుమించిన పుష్పపు సొబగులు దివ్యంగా ఉండొచ్చు; నాకు మాత్రం చివరి సుమమే ఇష్టం. నా కలలూ. ఆశలూ, కోరికలన్నిటిలోనూ ఎప్పుడూ నా మనసుకి పునస్సమాగమమే బాగుంటుంది మేమిద్దరం కలిసి గడిపిన క్షణాలకంటే, వీడ్కోలుపలుకుతూ గడిపిన ఘడియలే స్ఫూర్తినిస్తాయి. . అలెగ్జాండర్ పుష్కిన్ 6 జూన్ 1799 – 10 ఫిబ్రవరి 1837 రష్యను మహాకవి . Image Courtesy: http://en.wikipedia.org/wiki/File:A.S.Pushkin.jpg . The Last Flower . Rich the first flower’s graces be, […]
-
నేను శృంఖలాల బద్ధుణ్ణి… అలెక్సాండర్ సెర్గేవిచ్ పూష్కిన్, రష్యను
ఓ గులాబి కన్నియా! నేను శృంఖలాల బద్ధుణ్ణి. అయినా, ఈ బంధాల కాపలాదారులను చూసి సిగ్గుపడను; దట్టమైన కొమ్మలగుబురులలో కోకిలకూడ బందీనే, ఆ రెక్కల రేడు వనవాణికవులలో కలికితురాయి; కంటికింపైన ఒక సొగసరి గులాబికి చూపు మరల్చలేని మధురమైన దాస్యం చేస్తూ… ఇంద్రియ నిగ్రహాలను సడలించగల చీకటి ముసుగు వివశతలో, ఆమెకై లలితమధురమైన కుహుకుహూ రాగాలాలపిస్తుంది… . అలెక్సాండర్ సెర్గేవిచ్ పూష్కిన్ 6 June 1799 – 10 February 1837 రష్యను . . I am […]
-
నేను గతానికి వగవను … అలెక్సాండర్ సెర్గేవిచ్ పూష్కిన్ …
( 6 జూన్ 2012 అలెక్సాండర్ సెర్గేవిచ్ పూష్కిన్ 214 జయంతి సందర్భంగా) . కలలకీ, జీవితానికీ పొంతనలేకుండా గడచిన నా యవ్వనపురోజులకై వగవను; ప్రేమావేశంలో వీణతోడుగాపలికిన గీతాలని గుర్తుతెచ్చిన రాత్రులకై కూడా వగవను; . మిధ్యా స్నేహాలకై, విశ్వాసంలేని మిత్రులకై వగవను; విందులసందళ్ళకీ, వినోదాల సంబరాలకీ వగవను; అందమైన సాంకర్యాలకీ వగవను; యోచనాపరుడైన అపరిచితుడుగా, వాటికి దూరంగా ఉంటాను . కానీ, మనసునిండిన మౌనాలతో, యౌవ్వన ఆశల తీవెలతో సుకుమారమైన ఆశయాలతోగడిపిన కాలమేదీ? ఉద్రేకం రేకెత్తించే […]