అనువాదలహరి

విశ్వజనీన ప్రార్థన… అలెగ్జాండర్ పోప్, ఇంగ్లీషు కవి

సమస్త సృష్టికీ ఆద్యుడవైన ఓ తండ్రీ!
ప్రతి యుగంలో, ప్రతి దేశంళో
యోగులూ, పశుప్రాయులూ,వివేకులు
కొలిచే యెహోవా, ప్రభూ, పరమాత్మా!

నువ్వే ప్రథమ కారణానివి, అనవగతమవు,
నా ఇంద్రియాలన్నిటినీ స్వాధీనపరుచుకుని
ఇదొక్కటి తెలియజేస్తావు, నువ్వు సత్యమని
నామట్టుకు నేను నిను చూడలేని అంధుణ్ణి.

కానీ, ఈ విశాల నిశా సామ్రాజ్యంలో
చెడులో మంచి చూడగల శక్తి నిచ్చేవు.
ప్రకృతిని విధికి బానిసను చేసి
కాస్తంత వెసులు ఇచ్చావు తోచింది చెయ్యడానికి.

నా మనసు ఏది చెయ్యమని చెబుతుందో
లేక వద్దని వారిస్తుందో,
దీన్ని నరకంకంటే భయంగా త్రోసిపుచ్చేలా
దాన్ని స్వర్గంకంటే ప్రియంగా అనుసరించేలా అనుగ్రహించు.

నీవు దయతో ప్రసాదించిన వరాలను
నేను పోగొట్టుకోకుండా చూడు;
మనిషి తీసుకుంటేనే దేమునికి సంతృప్తి
వాటిని అనుభవించడమే, విధేయత.

అయినప్పటికీ, నీ కరుణ
ఈ భూతలానికే పరిమితమని నను పొరబడనీకు,
ఇన్ని విశ్వాలు వ్యాపించి ఉండగా
నిన్ను ఒక మానవుడికే దేవునిగా భ్రమించనీకు.

ఈ బలహీనమైన, తెలివితక్కువ చేయి
నీకు మారుగా అస్త్రాలను ప్రయోగించి
నీకు శత్రువని నేను నిర్ణయించిన ప్రతివారికీ
నేల నలుచెరగులా శిక్షలు విధించేలా చెయ్యనీకు.

నా మార్గము సరియైన దయితే, నీ కరుణ
నేను ఆ మార్గంలో కొనసాగేలా చూడనీ;
నేను తప్పు చేస్తే, ప్రభూ, నా మనసుకి
మంచి మార్గం వెతుక్కునేలా ఉపదేశించు!

మూర్ఖపు అహంకారమూ, పాపిష్టి అసంతృప్తీ
నన్ను ఈ రెంటినుండీ ఒకే రీతిగా కాపాడు:
నీ విజ్ఞత నాకు ఏది తిరస్కరించినా,
నీ కరుణ నాకు ఏది అనుగ్రహించినా

ఇతరుల కష్టాన్ని తెలుసుకునేలా బోధించు
నే కనుగొన్న లోపాలు దాచగలిగేలా చెయ్యి;
నేను ఇతరులపై ఏ మేరకు కరుణ ప్రదర్శిస్తానో
ఆ మేరకు నాకు నువ్వు నీ కరుణ ప్రసాదించు.

నేను నీచుణ్ణే గాని మరీ అంత కాదు;
నీ పేరు జపించిన కారణం చేత;
ప్రభూ, నేను ఎక్కడకి వెళ్ళినా త్రోవ చూపించు
అది ఈ రోజు జీవితమైనా, మృత్యువైనప్పటికీ.

ఈ రోజుకింత రొట్టె దొరికి, ప్రశాంతత చిక్కనీ,
సృష్టిలో ఈ విశాల గగనం క్రింద సమస్తానికీ
ఏది దొరికిందో ఏది దొరకలేదో అన్నీ నేకెరుకే,
నీ చిత్తం ఎలా ఉంటే అలా జరగనీ.

ఈ రోదసే దేవాలయమైన నీకి,
ఈ నేలా, సముద్రాలూ, ఆకాశమూ పూజాస్థలమైన నీకు
అన్ని ఆత్మలూ ముక్త కంఠంతో కీర్తించుగాక!
ప్రకృతి అంతా నీకు సుగంధాలు అర్చించుగాక!
.

అలెగ్జాండర్ పోప్

 21 May 1688 – 30 May 1744

ఇంగ్లీషు కవి

 

.

The Universal Prayer

Father of all! in every age,

  In every clime adored,

By saint, by savage, and by sage,

  Jehovah, Jove, or Lord!

Thou great First Cause, least understood,

  Who all my sense confined

To know but this, that thou art good,

  And that myself am blind;

Yet gave me, in this dark estate,

  To see the good from ill;

And, binding nature fast in fate,

  Left free the human will:

What conscience dictates to be done,

  Or warns me not to do,

This, teach me more than hell to shun,

  That, more than heaven pursue.

What blessings thy free bounty gives

  Let me not cast away;

For God is paid when man receives,

  To enjoy is to obey.

Yet not to earth’s contracted span

  Thy goodness let me bound,

Or think thee Lord alone of man,

  When thousand worlds are round:

Let not this weak, unknowing hand

  Presume thy bolts to throw,

And deal damnation round the land

  On each I judge thy foe.

If I am right thy grace impart

  Still in the right to stay;

If I am wrong, O, teach my heart

  To find that better way!

Save me alike from foolish pride

  And impious discontent

At aught thy wisdom has denied,

  Or aught thy goodness lent.

Teach me to feel another’s woe,

  To hide the fault I see;

That mercy I to others show,

  That mercy show to me.

Mean though I am, not wholly so,

  Since quickened by thy breath;

O, lead me wheresoe’er I go,

  Through this day’s life or death!

This day be bread and peace my lot;

  All else beneath the sun,

Thou knowest if best bestowed or not,

  And let thy will be done.

To thee, whose temple is all space,

  Whose altar, earth, sea, skies,

One chorus let all Being raise,

  All Nature incense rise!

.

Alexander Pope

(1688–1744)

English Poet

The World’s Best Poetry.

Eds. Bliss Carman, et al.

Volume IV. The Higher Life.  1904.

  1. The Divine Element—(God, Christ, the Holy Spirit)

http://www.bartleby.com/360/4/7.html

 

బెలిండా… అలెగ్జాండర్ పోప్, ఇంగ్లీషు కవి

ఆమె తెల్లని గుండెమీద మెరిసే శిలువ ధరించి ఉంది

దాన్ని ఆస్తికులు ముద్దాడితే, నాస్తికులు ఆరాధిస్తారు

ఆమె అందమైన చూపులు ఆమె సూక్ష్మ బుద్ధిని సూచిస్తున్నాయి,

చురుకైన కళ్ళలాగే, అంత నిలకడలేకుండానూ,

ఎవరిమీదా ప్రత్యేకతలేకుండా, అందరికీ చిరునవ్వు చిందిస్తునాయి

సూర్యుడంత ప్రకాశవంతంగా చూపరుల చూపులని ఆమె కళ్ళు తాకుతున్నాయి

సూర్యుడిలాగే, అవి అందరిమీద ఒక్కలాగే ప్రకాశిస్తున్నాయి.

అయినా, సరళతలో లాలిత్యం, గర్వపు పొడలేని మధురిమ ఉన్నాయి;

అవి ఆమె లోపాలు కప్పిపుచ్చవచ్చు, కన్నియలు దాచడానికి లోపాలంటూ ఉంటే,

ఒక వేళ ఆమె పాలుగా కొన్ని స్త్రీ సహజమైన బలహీనతలున్నా,

ఒకసారి ఆమె ముఖం చూస్తే చాలు, అవన్నీ చిటికెలో మరిచిపోతారు.

.

అలెగ్జాండర్ పోప్

21 May 1688 – 30 May 1744

ఇంగ్లీషు కవి

.

Belinda 
.
On her white breast a sparkling cross she wore,
Which Jews might kiss, and Infidels adore,
Her lively looks a sprightly mind disclose,
Quick as her eyes, and as unfixed as those:
Favors to none, to all she smiles extends:
Oft she rejects, but never once offends.
Bright as the sun, her eyes the gazers strike,
And, like the sun, they shine on all alike.
Yet, graceful ease and sweetness void of pride,
Might hide her faults, if belles had faults to hide;
If to her share some female errors fall,
Look on her face, and you ’ll forget them all.
.
(From “The Rape of the Lock,” Canto II. ll. 7–18.)
Alexander Pope
(21 May 1688 – 30 May 1744)
Poem Courtesy:
The World’s Best Poetry.
Bliss Carman, et al., eds.
Volume II. Love. 1904.
I. Admiration

సార్వజనీనిక ప్రార్థన… అలెగ్జాండర్ పోప్, ఇంగ్లీషు కవి

సమస్తభూతకోటికి తండ్రివయిన పరమాత్మా!
దేశకాలావధులుదాటి జనులు నిను కొలుస్తారు
ఋషులూ, పండితులూ, పామరులన్న భేదంలేకుండా
యెహోవావనో, అల్లావనో, ఈశ్వరుడవనో!
సృష్టికి ఆదికారణమవు; కానీ, ఎవరికీ ఆకళింపు కావు:
నా ఇంద్రియాలకి ఇంతవరకు మాత్రమే తెలుసుకునేలా
నిర్దేశించేవు:నువ్వు దయామయుడవనీ,
నేను మాత్రం నిన్ను కనుగొనలేననీ.
అయినప్పటికీ, ఈ విశాలనిశాజగతిలో
చెడులో మంచిని చూడగలిగే దృష్టి ప్రసాదించేవు;
ఈ ప్రకృతిని విధితో గట్టిగా ముడివేస్తూనే
మనిషికి ఇచ్చవచ్చినది చేయగల స్వేచ్ఛనిచ్చావు.
నా మనసు ఏది అనుమతిస్తుందో అది చేసేలా,
ఏది వద్దని వారిస్తుందో అది చెయ్యకుండుట ఎలాగో,
వాటితోపాటు,స్వర్గాన్ని పొందడమెలాగో కంటే,
నరకాన్ని తప్పించుకోడమెలాగో బోధించు;
నీవు కరుణతో అనుగ్రహించిన సంపదలేవీ
నేను అజ్ఞానంతో దూరం చేసుకోకుండా చూడు
ఎందుకంటే మనిషి స్వీకరణే దైవానికి మన్నన,
అనుభవించడమే … ఆజ్ఞ శిరసావహించడం.
అయినప్పటికీ, నా పై నీ అనుగ్రహాన్ని
లేశమైన ఈ భూమి మనుగడవరకే పరిమితి చేయకు,
పరీవ్యాప్తమై వేల జగత్తులున్నచోట కేవలం
మనిషికే నీవుదేవుడవని నేను భ్రమించకుండా చూడు,
ఈ బలహీణుణ్ణి, ఈ అవివేకిని
నీ ప్రయత్నాలని వృధా చేసి
నీ శత్రువని నేను భావించినవాడికి
ఇక్కడే నరకాన్ని చవిచూచేలా చెయ్యనీయకు.
నేను చెప్పినది సరియైతే, నీ కరుణ ప్రసరించి
నేను ఆ ఋజుమార్గంలో కొనసాగేలా ఆశీర్వదించు;
నేను పొరబడితే, ప్రభూ, నా హృదయానికి,
సరియైన త్రోవ కనుక్కోగల శక్తినిప్రసాదించు.
నన్ను వివేకహీనమైన అహంకారంనుండీ,
ధర్మదూరమైన అసంతృప్తినుండీ రక్షించు;
నీ వివేకము నిరాకరించినచోటులలోనూ,
నీ అనుగ్రహము వర్షించినచోటులలోనూ
ఇతరుల కష్తాలను అర్థంచేసుకోగల విజ్ఞతనీ,
నేను చూసేలోపాన్ని కప్పిపుచ్చగల శక్తినీ ఇవ్వు;
నేను ఇతరులపై ఏ అనుకంప ప్రదర్శించగలనో
అదే అనుకంప నీవు నాపై ప్రసరించు.
నేను అల్పుడినే, కానీ పూర్తిగా కాదు,
నీ ఊపిరి నాకు పునర్జన్మనిస్తుంది కనుక;
ప్రభూ, నేను ఏ యే చోటుల సంచరించినా
జీవ్వనంలోనూ, మరణంలోనూ నీవే నన్ను నడిపించు.
ఈ రోజు నాకు కడుపుకీ, మనసుకీ శాంతి అనుగ్రహించు.
తక్కినవి ఎన్ని నువ్వు అనుగ్రహించినా.
నీకు తెలుసు శ్రేష్ఠమైనది అనుగ్రహించేవో లేదో,
నీ సంకల్పం ఏదైతే అలాగే జరగనీ.
ఈ విశ్వమే నీ దేవాలయమైన చోట,
భూమ్యాకాశాలూ, రోదశీ నివేదనాస్థలమైన చోట,
అందరూ ఏకకంఠంతో కీర్తించనీ
సృష్టిలోని సమస్త సుగంధాలూ వ్యాపించనీ!

.
అలెగ్జాండర్ పోప్

21 May 1688 – 30 May 1744

ఇంగ్లీషు కవి

Alexander Pope

.

Universal Prayer

.

Father of all! in every age,

    In every clime adored,
By saint, by savage, and by sage,
    Jehovah, Jove, or Lord!
Thou Great First Cause, least understood:
    Who all my sense confined
To know but this—that thou art good,
    And that myself am blind:
Yet gave me, in this dark estate,
    To see the good from ill;
And binding Nature fast in fate,
    Left free the human will.
What conscience dictates to be done,
    Or warns me not to do,
This, teach me more than Hell to shun,
    That, more than Heaven pursue.
What blessings thy free bounty gives,
    Let me not cast away;
For God is paid when man receives,
    To enjoy is to obey.
Yet not to earth’s contracted span,
    Thy goodness let me bound,
Or think thee Lord alone of man,
    When thousand worlds are round:
Let not this weak, unknowing hand
    Presume thy bolts to throw,
And deal damnation round the land,
    On each I judge thy foe.
If I am right, thy grace impart,
    Still in the right to stay;
If I am wrong, oh teach my heart
    To find a better way.
Save me alike from foolish pride,
    Or impious discontent,
At aught thy wisdom has denied,
    Or aught thy goodness lent.
Teach me to feel another’s woe,
    To hide the fault I see;
That mercy I to others show,
    That mercy show to me.
Mean though I am, not wholly so
    Since quickened by thy breath;
Oh lead me wheresoe’er I go,
    Through this day’s life or death.
This day, be bread and peace my lot:
    All else beneath the sun,
Thou know’st if best bestowed or not,
    And let thy will be done.
To thee, whose temple is all space,
    Whose altar, earth, sea, skies!
One chorus let all being raise!
    All Nature’s incense rise!
.
Alexander Pope

poem Courtesy:

https://archive.org/stream/englishpoetryits00gaylrich#page/112/mode/1up

ఏకాంత స్తుతి … అలెగ్జాండర్ పోప్

Image Courtesy: http://2.bp.blogspot.com

.

వంశపారంపర్యంగా వచ్చే ఆ నాలుగుమూరల నేలకే
తన కోరికలూ, కష్టమూ పరిమితమై,
తను పుట్టిన నేలమీది గాలి పీలుస్తూ,
ఏవడు సంతృప్తిచెందుతాడో,

ఎవని పసులు పాలతో సమృధ్ధిగా,
ఎవని పొలాలు పంటలతో సుభిక్షంగా,
ఎవని “జీవాలు” ఉన్నితో పుష్కలంగా ఉంటాయో;
ఎవని వృక్షాలు వేసవిలో నీడనూ,
చలికాలంలో చితుకుల్నీ నిరాటంకంగా అందిస్తాయో,
వాడే సుఖజీవి.

ఎవనికి,
వాని ఎరుకలేకనే
గంటలూ, రోజులూ, వత్సరాలూ దొర్లిపోతుంటాయో;
ప్రశాంత చిత్తమూ,
ఆరోగ్యవంతమైన శరీరమూ,
చీకూ చింతాలేని ఉదయాలూ,
కలతనిదురలేని రాత్రులూ ఉంటాయో;
చదువూ, సుఖమూ మిళితమై
అందరినీ అలరించగల అమాయకత్వమూ,
సాలోచనాత్మకమైన వినోదమూ, ఉల్లాసమూ ఉండగలవో
వాడు ధన్యుడు!

ఎవరికీ తెలియకుండా,
ఎవరిదృష్టీ పడకుండా,
నన్నిలా బతకనీండి;
ఎవరి విషాదాశృలూ నాకై రాలకుండా,
నన్ను మరణించనీండి;
నేనెక్కడున్నానో తెలియబరిచే ఏ శిలాఫలకం లేకుండా
ఈ ప్రపంచం నుండి జారుకో నీండి.

.

—————————————————————————————–

(గమనిక: జీవాలు అన్నమాట ఉత్తరాంధ్ర జిల్లాలలో గొర్రెలకూ, మేకలకూ వాడతారు)

——————————————————————————————

.

Image Courtesy: http://images.suite101.com

అలెగ్జాండర్ పోప్

(మే 21, 1688 – మే 30 1744)

18వ శతాబ్దపు ఇంగ్లీషు సాహిత్య వాతావరణంలో తనకంటూ ఒక ప్రత్యేకమైనముద్ర వేయించుకోగలిగిన ప్రతిభాశాలి అలెగ్జాందర్ పోప్.  ముఖ్యంగా ఈ నాటికీ తను చేసిన హోమరు అనువాదానికీ, Heroic Couplet ల పునః ప్రయోగానికీ, Rape of the Lock అన్న వ్యంగ్య హాస్య నాటకానికీ, Essay on Man and Essay on Criticism అన్న రెండు అపురూపమైన, కవితలరూపంలో ఉన్న సునిశిత విశ్లేషణాత్మకమైన వ్యాసాలకీ, Dunciad అన్న అతని Mock-Epic (వ్యంగ్య-కావ్యం) కీ సాహిత్య వ్యాసాలలో పేర్కొనబడుతున్నాడు.

చిన్నతనం లోనే అంకురించిన వ్యాధి అతన్ని కృంగదీసి పొట్టివాడుగానూ (4 అడుగుల 6 అంగుళాలు), గూనివాడుగానూ చేసినా; ఆనాటి రాజకీయ వాతావరణం కేథలిక్కు అయిన అతనికి విద్యాభ్యాసం దూరం చేసినా, స్వయంకృషితో పట్టుదలతో అనేకభాషలు అభ్యసించిన ధీశాలి పోప్.

ఆ రోజుల్లో విగ్ లకీ టోరీలకీ తీవ్రమైన విభేదాలున్నప్పటికీ,  హేమాహేమీలైన రెండుపక్షాల కవులూ నాటకకర్తలతో పరిచయాలు నెరపిన వ్యక్తి. Richard Steele, Joseph Edison లతో స్నేహం పరాకాష్టలో ఉన్నప్పుడు, రోమనుసామ్రాజ్యం చరిత్రలో సీజరును ఎదిరించి నిలవగలిగిన ధైర్యశాలి, స్వాతంత్ర్యంకోసం తన ప్రాణాలు అర్పించిన దేశభక్తుడు Cato జీవితం ఆధారంగా ఆనాటి సంక్లిష్ట రాజకీయ పరిస్థితులను ప్రతిఫలిస్తూ, ఎడిసన్ వ్రాసిన అదే పేరుగల నాటకానికి Prologue వ్రాసేడు అంటే అతని ప్రతిభ ఎంతగా గుర్తింపబడినదో తెలుసుకో వచ్చు.

.

Ode on Solitude

.

Happy the man, whose wish and care
A few paternal acres bound,
Content to breathe his native air,
In his own ground.

Whose herds with milk, whose fields with bread,
Whose flocks supply him with attire,
Whose trees in summer yield him shade,
In winter fire.

Blest! who can unconcern’dly find
Hours, days, and years slide soft away,
In health of body, peace of mind,
Quiet by day,

Sound sleep by night; study and ease
Together mix’d; sweet recreation,
And innocence, which most does please,
With meditation.

Thus let me live, unseen, unknown;
Thus unlamented let me dye;
Steal from the world, and not a stone
Tell where I lye.

.

Alexander Pope

(21 May 1688 – 30 May 1744)

One of the key figures of 18th century english literary scene, Pope is still remembered for his translation of Homer, his satirical verses, Heroic Couplet, Rape of the Lock, Essay on Man and Essay on Criticism and The Dunciad.

While his Catholic lineage deprived him of formal education,  his numerous health problems stunted his growth to only 4 feet 6 inches; yet,  they could not dent his spirit, his humour and he became a polyglot by dint of his untiring efforts.

He kept very illustrious company of both Whigs and Tories. And at the height of his best relations, he wrote Prologue to Joseph Edison’s most successful play … The Cato, based on the life of  Roman Hero of the same name who vehemently opposed Caesar and his despotic ways.

%d bloggers like this: