అనువాదలహరి

చిన్న ఓడ … ఏలన్ సల్లివాన్, అమెరికను

సొగసైన తీరానికి వీడ్కోలు చెప్పి, చుక్కాని నిలకడజేసి జోరుగా
తెప్ప వెళుతుంటే, అందులో అటూ ఇటూ తిరగడం ఇష్టంగా ఉండేది.
తక్కిన ఓడసరంగులకు హుషారుగా చెయ్యి ఊపుతుండే వాడిని.
అన్నిటిలోకీ నాది ఎప్పుడూ వేగంగా పోయేదని గర్వించే వాడిని.

దాని పక్కలని చిన్నచిన్న అలలు తడుతూ పాడే జోలపాటలు
వినడానికి అనువుగా “చుక్కలబల్ల” దగ్గర ఒదిగి పడుకోడం ఇష్టం;
పెను గాలికో, వడి అలలకో అది దిశమారుతున్నప్పుడు
వాడ కిటికీల్లోంచి చూడడం, సముద్రకాకుల అరుపులు వినడం ఇష్టం.

అన్ని ఖర్చులూ భరించుకుని, మిత్రుల్ని తీసుకుపోయే దక్షిణాదిలోని
ఏ విలాసవంతమైన తీరంలో నిలబెట్టడమన్నా ఇష్టంగా ఉండేది.
తెగిపోయిన బెల్టూ, విరిగిపోయిన ప్రొపెల్లరు బ్లేడు వంటి
విడిభాగాలకోసం ఎదురుచూడడమూ సరదాగానే ఉండేది.

కానీ ఇప్పుడు మరొకరిసేవకుడు దాని త్రికోణపు తెరచాపనెగరేస్తున్నాడు 
బాగా సంపదగలిగిన ఓడ కేప్టెన్ దాన్ని సముద్రంలోకి తీసుకుపోతున్నాడు
మాటలు తియ్యగా పలకినంత సుళువుగా ఋణదాత దగ్గరనుండి డబ్బులు
రాలవన్న నిజం గ్రహించలేనందుకు ప్రతిఫలం అనుభవిస్తున్నాను.

అయితేనేం, నాలుగు అంచుల తెరచాపతో ఒక మోస్తరు ఆ చక్కని పడవని
యువకుడిగా ఎంత నేర్పుగా, తనివితో నడపాలో అలా నడిపాను.
దురదృష్టవశాత్తూ ఉన్నదానితో సంతృప్తి పడలేకపోయాను. అందుకే 
 ఇప్పుడు అందమైన నా పడవ నను విడిచిపోతుంటే ఊరికే చూస్తున్నాను.
.
ఏలన్ సల్లివాన్

(1948 – 9 July, 2010)

అమెరికను కవి

.

.

Catamaran

.

I loved to lounge between her racy prows

While auto helming off a ritzy coast.

I waved grandly at other sailors’ scows.

The fastest cat afloat, I used to boast.

I loved snuggling in her starboard stern

As lullabies of wavelets lapped her hulls

And peeping out her portholes at the turn

Of wind or tide, the calls of morning gulls.

I loved mooring her near a posh resort

For friends flown south with all expenses paid.

I even loved waiting for parts in port—

A broken belt or thrown propeller blade.

Now someone else’s mate unfurls her jib;

A solvent skipper steers her out to sea,

Comeuppance for a debtor far too glib

Before his cash flow proved illusory.

I gave my love more wisely as a lad—

A modest little skiff with gaff-rigged sail—

But I was not content with what I had

So now I watch my pretty cat turn tail.

.

Alan Sullivan

(1948 – 9 July, 2010)

American

Poem courtesy:

http://www.poemtree.com/poems/Catamaran.htm

ఒక చిన్న సందు… ఏలన్ సల్లివాన్, అమెరికను కవి

విను! హడావుడిగా వేసిన రోడ్డుమీద
పాంకోళ్ల టకటక ఇంకా వినిపిస్తూనే ఉంది.
ఒక చాకలి స్త్రీ శ్రమ మరవడానికి పదం పాడుకుంటోంది
ఇద్దరు అల్లరి పిల్లలు జాక్స్ ఆట ఆడుతూ
తగువులాడుకుంటున్నారు. కనిపించని ఘంట ఎక్కడో
ఆగష్టులోని ఓ రోజుముగిసిందనడానికి సూచికగా మోగుతోంది.
అయినా, అన్నీ ఉన్నచోటే ఉన్నాయి. ఈ కిటికీతలుపులు ఎన్నడూ కొట్టుకోవు
ఈ పిల్లలెప్పుడూ ఇంటిముంగిట తెలుపునలుపు గీతలు దాటిపోరు.
మేఘాలు పోతూపోతూ ఒక చినుకు రాల్చడమో, లేదా అస్తమసూర్యుడి
వెలుగులకి వాటి బుగ్గలు ఎరుపెక్కడమో జరుగుతోంది.
ఏ సరంగూ పాట అందుకోవడం లేదు; ఏ గాలి మరా తూములోకి
నీళ్ళు ఒంపడం లేదు. ఎక్కడో అనంతదూరాన యుద్ధభూమిలో
చిత్రకారుడి కుంచె దిగువ నిశ్శబ్దంలా తాత్కాలిక విరామం ప్రకటించబడింది.
.
ఏలన్ సల్లివాన్
(1948- July 9, 2010)
అమెరికను కవి .

(from Five Sonnets

On paintings by Vermeer)

The Little Street

Listen.  The clop of wooden soles still sounds

along this crudely cobbled alleyway,

a washerwoman sings a rondel, *

and two young truants haggle over rounds

of jacks.  Somewhere an unseen bell resounds,

tolling the passage of an August day;

yet nothing moves.  These shutters never sway.

These children never leave their checkered bounds

beside the entryway.  The clouds diffuse

a drop of rain or flush with sunset’s blush.

No bargeman hauls; no windmill fills a sluice.

Upon some far-off field of war, a truce

as time stands still beneath the artist’s brush.

Alan Sullivan

(1948 –  July 9, 2010)

American

Blog link: http://www.seablogger.com/

(*Rondelet: A song with a recurring refrain )

.

Poem Courtesy:

http://www.poemtree.com/poems/LittleStreet.htm

%d bloggers like this: