అనువాదలహరి

అప్పచెల్లెళ్ళు… ల్యూసియో క్లిఫ్టన్, అమెరికను కవయిత్రి

నువ్వూ నేనూ అప్పచెల్లెళ్ళం
ఇద్దరం ఒక్కలా ఉంటాం.

నువ్వూ నేనూ ఇద్దరం
ఒకతల్లి బిడ్డలం.

నువ్వూ నేనూ
ఒకరితప్పులు మరొకరు సరిదిద్దుతూ
ఒకరికొకరు సహకరించుకుంటాం.

నీకూ నాకూ
పోకిరీవాళ్ళన్నా
మాదకద్రవ్యాలన్నా గొప్ప భయం.

నువ్వూ నేనూ
ఒకసారి పర్డీ స్ట్రీట్ నుండి తుళ్ళుతూ తేలుతూ వచ్చినప్పుడు
నిన్నూ నన్నూ చూసి
అమ్మ నవ్వుతూనే తలతాటిస్తూ మందలించింది.

నువ్వూ నేనూ
ఇద్దరం పిల్లల్ని కన్నాం
ఇద్దరికీ ముప్ఫై ఐదేళ్ళు పైబడ్డాయి
కొంచెం నల్లబడ్డాం
మన జుత్తు కూడా పలచబడింది
ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం
మనిద్దరం అప్పచెల్లెళ్ళం

కానీ, నువ్వు పాట ఎత్తుకుంటే చాలు
నేను కవయిత్రినైపోతాను.

.

ల్యూసియో క్లిఫ్టన్

(27 June 1936  – 13 February  2010)

అమెరికను కవయిత్రి.

.

.

Sisters

.

Me and you be sisters.

We be the same.

Me and you

Coming from the same place.

Me and you

Be greasing our legs

Touching up our edges.

Me and you

Be scared of rats

Be stepping on roaches.

Me and you

Come running high down Purdy Street one time

And mama laugh and shake her head at

Me and you.

Me and you

Got babies

Got thirty-five

Got black

Let our hair go back

Be loving ourselves

Be loving ourselves

Be sisters.

Only where you sing,

I poet.

.

Lucille Clifton

(27 June 1936  – 13 February  2010)

American

Poem Courtesy:

http://famouspoetsandpoems.com/poets/lucille_clifton/poems/5168

ప్రకటనలు

సానుభూతి… పాల్ లారెన్స్ డన్ బార్, అమెరికను కవి

పాపం! పంజరంలోని పిట్టకి ఎలా ఉంటుందో నాకు తెలుసు.

మిట్టలమీది వంపుల్లో సూర్యుడు బాగా ప్రకాశిస్తున్నప్పుడు

లేలేత గడ్డిమొలకల్లో గాలి మెత్తగా కదులుతున్నపుడు,

గాజుప్రవాహంలా నది తరళంగా పరిగెత్తుతున్నపుడు,

తొలిపికము పాడినపుడు, తొలిమొగ్గ విరిసినపుడు

దాని కలశంలోని మంద్రపరిమళం అంతరించినపుడు

పాపం, పంజరంలోని పిట్టకి ఎలా ఉంటుందో నాకు తెలుసు.

ఎర్రని తన రెక్కల రక్తం జాలిలేని తీగలపై గడ్డకట్టేదాకా

పంజరంలోని పిట్ట ఎందుకురెక్కలు కొట్టుకుంటుందో నాకు తెలుసు.

అది తిరిగి తనకొమ్మపైకి ఎగిరి వాలాలి, తను ఆనందంతో

ఊగుతున్నపుడు పడిపోకుండా గట్టిగా పట్టుకోవాలి;

పాతగాయాల మచ్చల్లో నొప్పి ఇంకా సలుపుతూనే ఉంటుంది —

అది సరికొత్తగా, మరింతసూదిగా పొడిచినట్టుంటుంది.

అది రెక్కలెందుకు కొట్టుకుంటుందో నాకు తెలుసు.

ఆహ్!  పంజరంలోని పిట్ట ఎందుకు పాడుతుందో నాకు తెలుసు.

తను స్వేచ్ఛగా బయటపడడానికి పంజరం గోడలు కొట్టికొట్టి

దాని రెక్కకి గాయమై, గుండె ఒరిసిపోయినపుడు,

అది ఆనందంతోనో, పట్టలేని సంతోషంతోనో కాదు,

దాని హృదయాంతరాళాలనుండి వినిపిస్తున్న ప్రార్థన అది

పైన స్వర్గంలో ఉన్నవానికి అది పెట్టుకుంటున్న మొర.

నాకు తెలుసు పంజరంలోని పిట్ట ఎందుకు పాడుతుందో!

.

పాల్ లారెన్స్ డన్ బార్

(June 27, 1872 – February 9, 1906)

ఆఫ్రికన్- అమెరికను కవి, నాటక కర్త, నవలాకారుడు.

Paul Laurence Dunbar

.

Sympathy

I know what the caged bird feels, alas!

When the sun is bright on the upland slopes;

When the wind stirs soft through the springing grass,

And the river flows like a stream of glass;

When the first bird sings and the first bud opes,

And the faint perfume from its chalice steals—

I know what the caged bird feels!

I know why the caged bird beats his wing

Till its blood is red on the cruel bars;

For he must fly back to his perch and cling

When he fain would be on the bough a-swing;

And a pain still throbs in the old, old scars

And they pulse again with a keener sting—

I know why he beats his wing!

I know why the caged bird sings, ah me,

When his wing is bruised and his bosom sore,—

When he beats his bars and he would be free;

It is not a carol of joy or glee,

But a prayer that he sends from his heart’s deep core,

But a plea, that upward to Heaven he flings—

I know why the caged bird sings!

.

Paul Laurence Dunbar

(June 27, 1872 – February 9, 1906)

American Poet, Novelist, Playwright

Poem Courtesy:

http://www.poemtree.com/poems/Sympathy.htm

 

సాయంస్తుతి… ఫిల్లిస్ వ్హీట్లీ, ఆఫ్రికను అమెరికను కవయిత్రి

సూర్యుని చివరి వెలుగులు తూరుపుని విడిచిపెట్టగానే

రోదసి  ఒక్క సారి ఘంటరావాలతో నిండిపోయింది  

అద్భుతమైన దృశ్యం! అప్పుడే వికసిస్తున్న వసంతపు

సుగంధాలని చిరుగాలి నలుదిక్కులా మోసుకొస్తోంది.

సెలయేళ్ళు గలగలమంటున్నాయి; పక్షులు నవరాగాలాలపిస్తున్నాయి;

గాలిలో వాటి సమ్మిళిత సంగీతం తెరలు తెరలుగా తేలియాడుతోంది.

ఆహ్! ఆకాశంనిండా ఎన్ని అందమైన రంగులు అలముకున్నాయి.  

పడమరమాత్రం ముదురు ఎరుపురంగును అద్దుకుంది

నల్లని చీకటి తెరలను దించడంతో పాటు

వెలుగులనూ విరజిమ్మే సృష్టికర్త సంకీర్తనలతో నిండి

అవనిమీద ప్రాణంతో స్పందించే దేవాలయాలైన మా హృదయాలు

సకల సద్గుణలతోనూ భాసించు గాక!

దివ్యమై, సంస్కారవంతమై ఉదయాన్నే మేల్కొనుగాక.

నిత్యనైమిత్తికాల జంజాటము పునః ప్రాంభమయినపుడు

వాటి ప్రలోభాలనుండి దూరంగా స్వచ్ఛంగా ఉండుగాక.

రాత్రి పదముద్రల భారానికి నా కళ్ళు బరువెక్కుతున్నాయి.

గీతమా! ఇక చాలు. తిరిగి ప్రభాతమయే దాకా శలవు.

.

 ఫిల్లిస్ వ్హీట్లీ

1753 – December 5, 1784

ఆఫ్రికను అమెరికను కవయిత్రి

.

Image Courtesy: http://upload.wikimedia.org
Image Courtesy: http://upload.wikimedia.org

ఫిలిస్ వ్హీట్లీ (1753 – 5, డిశెంబరు, 1784)

మొట్టమొదటి ఆఫ్రికన్- అమెరికన్ కవీ/ కవయిత్రి

ఫిలిస్ వ్హీట్లీ జీవితం చాలా చిత్రమైనది. తన ఏడవయేట నేటి సెనెగల్/ జాంబియాప్రాంతాలనుండి అపహరింపబడి “ఫిలిస్” అన్న నావలో అమెరికాలోని బోస్టను నగరానికి తరలింపబడింది. అదృష్టవశాత్తూ  ఒక ధనిక వర్తకుడు, ఆదర్శభావాలు కల జాన్ వ్హీట్లీ అన్న అతను తన భార్యకు సేవకురాలిగా ఆమెను కొనుక్కున్నాడు. అయితే వాళ్ళింట్లోనే ఆమె నేర్చుకున్న చదువులో అపురూపమైన ప్రతిభకనబరచడంతో ఆమెకు ఎక్కువ అవకాశాలు కల్పించాడు.  బానిసత్వం ప్రబలంగా ఉన్నరోజుల్లో, బానిసకు విద్యావకాసాలు కల్పించడమంటే, అందులోనూ ఒకస్త్రీకి, అది అపూర్వమే.  12 ఏళ్ళ వయసువచ్చేసరికి ఆమె ఇంగ్లీషుభాషే కాకుండా, గ్రీకు, లాటిను భాషల్లోని కావ్యాలను చదవనూ, బైబిలోని క్లిష్టమైన భాగాలను చదవనూ  నేర్చుకుంది. ఆమె మీద పోప్, మిల్టన్, హోమర్, వర్జిల్ ల ప్రభావం బాగా ఉంది. ఆమె త్వరలోనే కవిత్వ రాయడం ప్రారంభించింది. ఆరోజుల్లో ఒక తెల్ల కుర్రవాడు కూడ ఆ వయసులో సాధించలేని భాషా పాండిత్యానికీ, కవిత్వానికీ ఒక పక్క ఆశ్చర్యమూ, ఇంకొక పక్క అసూయతో కొందరు ఆమె రాసిన కవిత్వం  ఆమెది కాదని కోర్టులో వ్యాజ్యం వేస్తే, ఆమెను పండితులు పరీక్షించి ఆమె రాసినవే అని నిర్థారణ చెయ్యడంతో బాటు ఒక ధృవీకరణపత్రం కూడా ఇచ్చారు. అంత నమ్మశక్యం కానిది ఆమె ప్రతిభ.

ఆమె కథనే బానిసత్వ నిర్మూలనకు నడుము కట్టుకున్న వాళ్ళంతా, బానిసత్వానికి అనుకూలంగా మాటాడేవాళ్ళు చెప్పే “నీగ్రోలకు స్వంత తెలివితేటలు ఉండవు” అన్న వాదనను ఖండించడానికి వాడుకున్నారు.

విధి ఎంత దాఋణంగా ఉంటుందో చెప్పడానికి కూడా ఆమె జీవితం ఒక ఉదాహరణే. 1778 లో జాన్ వ్హీట్లీ  తను వ్రాసిన వీలునామాలో తన మరణానంతరం ఆమెకు బానిసత్వం నుండి విముక్తి ప్రసాదిస్తే (అప్పటికే ఆమె  యజమానురాలు మరణించింది) తను స్వాతంత్ర్యముగల  ఇంకొక నీగ్రోను పెళ్ళిచేసుకుంది. అయితే వ్యాపారం లో దెబ్బతిని అతను జైలుపాలయితే, ఉదరపోషణార్థం తను బానిసగా ఉన్నప్పుడు ఏ పనులయితే చేయనవసరం లేకపోయిందో, స్వతంత్రురాలుగా ఉన్నప్పుడు అదే పనులుచెయ్యవలసి వచ్చింది. చివరకి తన 31 వ ఏట దారిద్ర్యం లో మరణించింది.

 

.

An Hymn to Evening

.

Soon as the sun forsook the eastern main
The pealing thunder shook the heav’nly plain;
Majestic grandeur! From the zephyr’s wing,
Exhales the incense of the blooming spring.
Soft purl the streams, the birds renew their notes,
And through the air their mingled music floats.
Through all the heav’ns what beauteous dies are spread!
But the west glories in the deepest red:
So may our breasts with ev’ry virtue glow,
The living temples of our God below!
Fill’d with the praise of him who gives the light,
And draws the sable curtains of the night,
Let placid slumbers sooth each weary mind,
At morn to wake more heav’nly, more refin’d;
So shall the labours of the day begin
More pure, more guarded from the snares of sin.
Night’s leaden sceptre seals my drowsy eyes,
Then cease, my song, till fair Aurora rise.

.

Phillis Wheatley

1753 – December 5, 1784

First African- American Poetess 

Poem Courtesy:

http://etc.usf.edu/lit2go/206/poems-on-various-subjects-religious-and-moral/4893/an-hymn-to-the-evening/

 

Wheatley was very likely kidnapped at the age of 7 from Senegal / Gambia and brought to British-ruled Boston, Massachusetts on July 11, 1761, on a slave ship called The Phillis. She was purchased as a slave by a progressive wealthy Bostonian merchant and tailor John Wheatley, as a personal servant to his wife Susannah. Wheatley’s, particularly 18 years-old Mary Wheatley, gave Phillis an unprecedented education. It was a luxury rarest of its kind for an enslaved person and more so, for a female of any race those days. By the age of twelve, Phillis was able to read Greek and Latin classics and difficult passages from the Bible. She was strongly influenced by the works of Pope, Milton, Homer, Horace and Virgil and she even began writing poetry. Wheatley’s work was frequently cited by many abolitionists to combat the charge of innate intellectual inferiority among blacks and to promote educational opportunities for African Americans.

 It was a quirk of fate that after 1778, when John Wheatley legally freed her from the bonds of slavery by his will, she was forced, while free, to do what she was exempted from when she was a slave… as domestic servant (and scullery) for survival. And she ultimately died poor at 31.

రాత్రి ప్రయాణించే ఓడలు… పాల్ లారెన్స్ డన్ బార్, ఆఫ్రికన్- అమెరికన్ కవి

అల్లదిగో ఆకాశంలో దట్టమైన నల్లని మేఘాలు కమ్ముకుంటున్నాయి

ఏదో జరగబోతున్నట్టున్న చీకటిలోకి నేను దూరంగా చూస్తున్నాను

గంభీరంగా ధ్వనించే ఫిరంగులమోత నాకు వినిపిస్తుంది

ఉండీ ఉడిగీ మెరిసే ఏ చిన్న వెలుగైనా కనిపిస్తుంది.

దాన్నిబట్టి నాకు కావలసిన ఓడ ప్రయాణిస్తోందని తెలుస్తుంది.

గాయపడ్ద నా మనసు చిందించే కన్నీళ్ళతో కళ్ళు మసకబారుతున్నై

ఎందుకంటే నేనా ముఖ్యమైన ఓడకి సంకేతాలిస్తూ హెచ్చరించాలి

నేను చేతులు ఊపుతూ బ్రతిమాలుతున్నాను, గట్టిగా అరుస్తున్నాను

నాకు అడుగుదూరంలోనే మాటలు గాలిలో కలిసిపోతున్నాయి

అలా వెళిపోతున్న నౌకకి వాటి లేశమాత్రపు గుసగుస చేరుతుందేమో.

ఓ ధరణీ!ఓ ఆకాశమా!ఓ సాగరమా!అన్నిటినీ మించి

చీకటికి వెరచే నా హృదయమా! ఓ బేల మనసా!

నాకు ఆశ లేనట్టేనా? కనుచూపుకి అందకుండా

మాటకి అందకుండా అలా అలా పరిగెత్తుతున్న ఆ నౌకని

ఎదుర్కుని నిరోధించగల వేరే మార్గం లేదా?

.

పాల్ లారెన్స్ డన్ బార్

(June 27, 1872 – February 9, 1906)

ఆఫ్రికన్- అమెరికన్ కవి

 

 Paul Laurence Dunbar

.

Ships That Pass in the Night

.

 Out in the sky the great dark clouds are massing;

  I look far out into the pregnant night,

Where I can hear a solemn booming gun

  And catch the gleaming of a random light,

That tells me that the ship I seek is passing, passing.

 

My tearful eyes my soul’s deep hurt are glassing;

  For I would hail and check that ship of ships.

I stretch my hands imploring, cry aloud,

  My voice falls dead a foot from mine own lips,

And but its ghost doth reach that vessel, passing, passing.

 

O Earth, O Sky, O Ocean, both surpassing,

  O heart of mine, O soul that dreads the dark!

Is there no hope for me? Is there no way

  That I may sight and check that speeding bark

 Which out of sight and sound is passing, passing?

.

Paul Laurence Dunbar

(June 27, 1872 – February 9, 1906)

African-American poet, novelist, and playwright

Poem Courtesy:

The Book of American Negro Poetry.  1922.

Ed: James Weldon Johnson, (1871–1938). 

 (http://www.bartleby.com/269/3.html

 

పదో ఏడు వచ్చినపుడు … బిల్లీ కాలిన్స్, అమెరికను కవి

(చిన్నపిల్లల కోణం నుండి బాల్యాన్ని విడిచిపెడుతున్నప్పుడు కలిగే మనోవ్యథ బాగా చెప్పిన కవిత. )

ఆ ఆలోచన వచ్చేసరికే అనిపించింది
నాకు  ఏదో జరగబోతోందని…
గుడ్డిదీపం క్రింద చదువుతున్నప్పుడు వచ్చే తలనొప్పికంటే,
ఏ కడుపునొప్పికన్నా కూడా తీవ్రమైనది…
ఉత్సాహానికి  అమ్మవారు వచ్చినట్టు,
మనసుకి  రోగం వచ్చినట్టు
ఆత్మని కురూపిని చేసే అంటురోగం వచ్చినట్టు…  ఏదో జరగబోతోందని.

సింహావలోకనం చేసుకుందికి మూడు ఆదివారాలైనా కాలేదనొచ్చు,
కానీ ఒక విషయం మీరు మరిచిపోతున్నారు:
ఇద్దరిచేత పరిచయం చెయ్యబడడంలోని సంక్లిష్టతనీ
ఒక్కరిగా ఉండగలగడంలోని అచ్చమైన నిరాడంబరతనీ.
నేను పక్కమీద పడుక్కుని ప్రతి గంటనీ గుర్తుపెట్టుకోగలను.
నాలుగ్గంటలకి నేను అరేబియన్ మాంత్రికుడనయిపోతాను.
నన్ను నాకే కనిపించకుండా  చేసుకోగలను
ఒక గ్లాసుడు పాలని ఒక రకంగా తాగుతూ…
ఏడోగంటకి నేను సైనికుడినయిపోతా; తొమ్మిదికి యువరాజునే.

ఇప్పుడు చాలా భాగం నాకు కిటికీ దగ్గర
పొద్దు తిరుగుతున్న ఎండని అలా చూస్తూ గడిచిపోతుంది.
మునుపెన్నడూ ఇంత విషాదంగా
చెట్లమధ్యనున్న ఇంటిమీద ఇలా ఎండ పడలేదు,
నా సైకిలు ఇవాళ గేరేజీ గోడకి ఆనుకున్నట్టు
ముందెన్నడూ చేరబెట్టి లేదు.
దానికున్న ముదురు నీలపురంగు అంతా వెలిసిపోయింది.

ఇది విషాదానికి ప్రారంభం, అని నాకు నేను చెప్పుకుంటుంటాను,
నా లోకంలో నేను కాన్వాసుజోళ్ళతో నడుచుకుంటూ పోతూ.
నా ఊహల్లోని మిత్రులకి వీడ్కోలు పలికే సమయం వచ్చింది
మొదటి సారి పెద్దంకె గల వయసు రాబోతోంది.

ఇంకా నిన్న మొన్నటిలాగే ఉంది నా శరీరం క్రింద
వెలుగు తప్ప మరేదీ లేదనీ…
నన్ను కోస్తే మెరుస్తాననీ … భ్రమించి.
కానీ ఇప్పుడు జీవితపు కాలిబాట మీద పడితే
నా శరీరం చెక్కుకుంటుంది… రక్తం కారుతుంది.
.
బిల్లీ కాలిన్స్

(March 22, 1941)

అమెరికను కవి

Billy Collins

.

On Turning Ten

.

The whole idea of it makes me feel

like I’m coming down with something,

something worse than any stomach ache

or the headaches I get from reading in bad light–

a kind of measles of the spirit,

a mumps of the psyche,

a disfiguring chicken pox of the soul.

You tell me it is too early to be looking back,

but that is because you have forgotten

the perfect simplicity of being one

and the beautiful complexity introduced by two.

But I can lie on my bed and remember every digit.

At four I was an Arabian wizard.

I could make myself invisible

by drinking a glass of milk a certain way.

At seven I was a soldier, at nine a prince.

But now I am mostly at the window

watching the late afternoon light.

Back then it never fell so solemnly

against the side of my tree house,

and my bicycle never leaned against the garage

as it does today,

all the dark blue speed drained out of it.

This is the beginning of sadness, I say to myself,

as I walk through the universe in my sneakers.

It is time to say good-bye to my imaginary friends,

time to turn the first big number.

It seems only yesterday I used to believe

there was nothing under my skin but light.

If you cut me I could shine.

But now when I fall upon the sidewalks of life,

I skin my knees. I bleed.

.

Billy Collins

born March 22, 1941

American poet

Poem courtesy:

http://wonderingminstrels.blogspot.in/2002/10/on-turning-ten-billy-collins.html

వసంతం… ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి

వసంతమా! ఏమి పని ఉందని మళ్ళీ వచ్చేవు?

అందాలు తోడుతెస్తే సరిపోదు.

అప్పుడే విచ్చుకుంటున్న లేలేత చిగుళ్ళ

ఎర్ర దనాన్ని చూపించి నన్ను శాంతపరచలేవు.

నాకు తెలిసిందేదో నాకు తెలుసు.

కుంకుమపువ్వు కేసరాల మొనలవంక చూస్తుంటే

మెడమీద ఎండ చుర్రుమంటోంది.

మట్టి వాసన చాలా బాగుంది.

అంటే అక్కడ మృత్యువాసనలేదన్నమాట.

అయితే దానర్థం ఏమిటి?

ఒక్క నేలలోపలే మగాళ్ళ బుర్రల్ని

పురుగులు దొలచడం లేదు.

అసలు ప్రాణం దానిమట్టుకు దాని గురించి

 ఆలోచిస్తే ఏమీ లేదు….

ఒక ఖాళీ కప్పు, తివాసీ పరచని మేడమెట్టు.

ప్రతి ఏడూ కొండ మీంచి  దిగుతూ

ఓ వసంతమా,

మూర్ఖుడిలా ఏదో వాగుతూ, పూలు విరజిమ్మితే సరిపోదు.

.

ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే

February 22, 1892 – October 19, 1950

అమెరికను కవయిత్రి

 

 Edna St. Vincent Millay

 Spring

.

To what purpose, April, do you return again?

Beauty is not enough.

You can no longer quiet me with the redness

Of little leaves opening stickily.

I know what I know.

The sun is hot on my neck as I observe

The spikes of the crocus.

The smell of the earth is good.

It is apparent that there is no death.

But what does that signify?

Not only under ground are the brains of men

Eaten by maggots,

Life in itself

Is nothing,

An empty cup, a flight of uncarpeted stairs.

It is not enough that yearly, down this hill,

April

Comes like an idiot, babbling and strewing flowers.

.

Edna St. Vincent Millay

February 22, 1892 – October 19, 1950

American Poet

నేను రాస్తాను… మార్గరెట్ వాకర్. అమెరికను కవయిత్రి

నేను రాస్తాను

నేను నా ప్రజల పాటలు రాస్తాను

వాళ్లు రాత్రి చీకటిలో గీతాలు పాడడం వినాలి.

ఏడ్చి బొంగురుపోయిన వాళ్లగొంతులలో

కడపటి స్వరాన్ని నేను పట్టుకోగలగాలి.

నేను వాళ్ళ కలల్ని మాతలలోకి మళ్ళిస్తాను

వాళ్ళ ఆత్మల్ని స్వరాలుగా మలుచుకుంటూ…

సూర్యుడి వెలుగువంటి వాళ్లనవ్వుల్ని ఒక పాత్రలో పట్టి

చీకటి ఆకాశంలోకి వాళ్ళ నల్లని చేతులు విసిరేసి

వాటిని నక్షత్రాలతో నింపుతాను

ఆ వెలుగులని అన్నిటినీ కలిపి ఎంతగా నుజ్జు చేస్తానంటే

ఉషోదయవేళ దీధుతులు విరజిమ్మే సరసులా కనిపించాలి.

.

మార్గరెట్ వాకర్.

July 7, 1915– November 30, 1998

అమెరికను కవయిత్రి

Margaret Walker

.

I Want To Write

.

I want to write

I want to write the songs of my people.

I want to hear them singing melodies in the dark.

I want to catch the last floating strains from their sob-torn throats.

I want to frame their dreams into words;

their souls into notes.

I want to catch their sunshine laughter in a bowl;

fling dark hands to a darker sky

and fill them full of stars

then crush and mix such lights till they become

a mirrored pool of brilliance in the dawn.

.

Margaret Walker

July 7, 1915– November 30, 1998

American Poetess

%d bloggers like this: