అనువాదలహరి

నేను నిన్ను ప్రేమించేను గనుక… A E హౌజ్మన్, ఇంగ్లీషు కవి

మగవాడు తన అహాన్ని అథిగమించి
ప్రకటించేంతగా నిన్ను ప్రేమించేను గనుక,
నీకు చిరాకు కలిగించింది; ఆ ఆలోచన
విడిచిపెడతానని నీకు మాటిచ్చేను.

మనిద్దరం పెడసరంగా, ఏ స్పందనలూ లేకుండా 
విడిపోయాము … భూఖండాలు మారిపోయాము.
“నన్ను మరిచిపో, శలవు,” అన్నావు నువ్వు.
“ఫర్వాలేదు, మరిచిపోగలను,” అన్నాను నేను.

భవిష్యత్తులో, నువ్వు ఈ “తెల్ల పూల”తో నిండిన
శ్మశానపు దిబ్బలమీంచి వేళ్ళే సందర్భం కుదిరితే,
ఈ మూడాకుల గరికలో ఏ పొడవాటి పువ్వూ
నిన్ను పలకరించి ఆశ్చర్యపరచకపోతే,

“ఈ హృదయం స్పందించదు” అని రాసి ఉన్న
సమాధి ఫలకం దగ్గర కాసేపు ఆగు
నిన్ను ప్రేమించిన కుర్రాడు
తనమాట నిలబెట్టుకున్నాడని ఒప్పుకో.
.

ఏ ఇ. హౌజ్మన్
(26 March 1859 – 30 April 1936)
ఇంగ్లీషు కవి.

.

Because I Liked You

Because I liked you better

     Than suits a man to say,

It irked you, and I promised

     To throw the thought away.

To put the world between us

     We parted, stiff and dry;

‘Good-bye,’ said you, ‘forget me.’

     ‘I will, no fear’, said I.

If here, where clover whitens

     The dead man’s knoll, you pass,

And no tall flower to meet you

     Starts in the trefoiled grass,

Halt by the headstone naming

     The heart no longer stirred,

And say the lad that loved you

     Was one that kept his word.

A.E. Housman 

(26 March 1859 – 30 April 1936)

English Poet

Poem Courtesy:

http://www.poemtree.com/poems/BecauseILikedYou.htm

 

 

ప్రకటనలు

చివరి కవితలు… 12…. ఏ ఇ హౌజ్మన్, ఇంగ్లీషు కవి

దూరంగా పొద్దు కళ్ళు నులుపుకుంటోంది:

సూర్యుడు ఉదయించేడు, నేనూ లేవాలి,

కాలకృత్యాలు తీర్చుకుని, బట్టలేసుకుని, తిని, తాగి,

ప్రపంచాన్ని పరిశీలించి, మాటాడి, ఆలోచించి,

పనిచేసి… ఇవన్నీ ఎందుకుచేస్తున్నానో దేముడికెరుక. 

ఓహ్! ఎన్నిసార్లు స్నానంచేసి, బట్టలేసుకోలేదు!

ఇంత శ్రమపడినందుకూ ఫలితం ఏమైనా ఉందా?

హాయిగా పక్కమీద పడుకుని విశ్రాంతి తీసుకుంటాను:

పది వేలసార్లు నా శక్తివంచనలేకుండా పనిచేశాను

తిరిగి ప్రతీదీ మరోసారి చెయ్యడానికే.

.

ఏ ఇ హౌజ్మన్

26 March 1859 – 30 April 1936

ఇంగ్లీషు కవి

 

 AE Housman

.

Last Poems: XI

 .

Yonder see the morning blink:

   The sun is up, and up must I,

To wash and dress and eat and drink

And look at things and talk and think

   And work, and God knows why.

 

Oh often have I washed and dressed

   And what’s to show for all my pain?

Let me lie abed and rest:

Ten thousand times I’ve done my best

   And all’s to do again.

.

 

A E Housman

26 March 1859 – 30 April 1936

English Poet

Poem Courtesy:

wonderingminstrels.blogspot.in/2000/09/last-poems-xi-e-housman.html

ఇక్కడ చచ్చి పడున్నాం… ఆల్ఫ్రెడ్ ఎడ్వర్డ్ హౌజ్మన్, ఆంగ్ల కవి

మేం ఇక్కడ చచ్చి పడున్నాం

ఎందుకంటే, మేం బ్రతికి

జన్మించిన ఈ గడ్డకి అగౌరవం

తీసుకురాదలుచుకో లేదు.

.

జీవితం… నిజానికి

అందులో పోగొట్టుకున్న దేదీ లేదు.

కాని యువకులు అలా భావిస్తారు,

మరి మేం అందరం యువకులమే.

.

ఆల్ఫ్రెడ్ ఎడ్వర్డ్  హౌజ్మన్

26 March 1859 – 30 April 1936

ఆంగ్ల కవి

ఈ కవితలో గొప్ప తాత్త్విక చింతన ఉంది. జీవితం అపురూపమైనదీ, విలువైనదీ అని వృద్ధులు నమ్ముతారు. అసలు చాలా కాలం జీవించాలనుకోవడంలోని మర్మం కూడా అదే. కానీ, ఆ జీవించడం ఎటువంటిదై ఉండాలి? ప్రపంచ సంగ్రామాలూ, ఆర్థికమాంద్యాలూ, నేపథ్యంలో వ్రాస్తున్న కవితలో, నిరాశ, నిర్వేదమూ కలగలిసిన జీవన సంక్షోభలో, జీవించడం దుర్భరమైనప్పుడు, మరణానికీ జీవితానికీ మధ్యనున్న పలుచని రేఖ తొలగిపోతుంది. అప్పుడు ఒక లక్ష్యం కోసం, ఒక ఆదర్శంకోసం మరణించడం జీవితానికి విలువనిచ్చిన సంతృప్తి మిగులుస్తుంది.

ఈ కవితలో యుద్ధభూమిలో మరణించిన యువకుడి అంతరంగం ఆవిష్కరించబడింది. అందరికీ బ్రతకాలనే ఉంటుంది. కానీ, బ్రతుకు దుర్భరమైనపుడు మరణమే మేలనిపిస్తుంది. మనం వెతుకుతున్న అర్థం జీవితానికి దొరకనప్పుడు మనమే జీవితానికి ఒక అర్థాన్నీ, నిర్వచనాన్నీ ఇయ్యవలసిన సందర్భం తటస్థిస్తుంది. ఆ పని ఒక్క యువకులే చెయ్యగలరు. ఈ కవితలో యువకుడు తన మరణానికి విచారం వ్యక్తపరచడంతో పాటు, దానివల్ల పోగొట్టుకున్నదేదీ లేదనీ, అంతకుమించి, బ్రతికి తనుపుట్టిన నేలకి తలవంపులు తెచ్చేకన్నా, మరణమే మెరుగన్న సంతృప్తిని వ్యక్తం చేస్తున్నాడు

.

English: English classical scholar and poet .
English: English classical scholar and poet . (Photo credit: Wikipedia)

.

Here Dead We Lie…

.

Here dead we lie

Because we did not choose

To live and shame the land

From which we sprung.

 

Life, to be sure,

Is nothing much to lose,

But young men think it is,

And we were young.

 

Alfred Edward Housman

26 March 1859 – 30 April 1936 

English classical scholar and Poet

Poem Courtesy: http://wonderingminstrels.blogspot.in/2003/04/here-dead-we-lie-e-housman.html

%d bloggers like this: