అనువాదలహరి

ఒంటరి మరణం… ఎడిలేడ్ క్రాప్సీ, అమెరికను కవయిత్రి

చలిలో నేను బయటకు వస్తాను; నేను
చల్లటినీటిలోనే స్నానం చేస్తాను;
నేను వణుకుతూ, పశ్చాత్తాపపడతాను;
ఒంటరిగా ప్రభాతవేళ నా నుదిటికీ,
కాళ్ళకీ, చేతులకీ విభూతిపూసుకుంటాను;
వెలుతురు రాకుండా కిటికీలు మూసెస్తాను
పొడవాటి నాలుగు కొవ్వొత్తిల్నీ
వాటి ఒరల్లో నిలిపి వెలిగిస్తాను;
తూరుపు తెల్లవారుతుంటే,
నేను పక్కమీద శరీరాన్ని వాల్చి
మొహమ్మీదకి ముసుగులాక్కుంటాను.
.
ఎడిలేడ్ క్రాప్సీ

September 9, 1878 – October 8, 1914

అమెరికను కవయిత్రి

.

Adelaide Crapsey

September 9, 1878 – October 8, 1914

.

The Lonely Death

.

In the cold I will rise, I will bathe

In waters of ice; myself

Will shiver, and shrive myself,

Alone in the dawn, and anoint

Forehead and feet and hands;

I will shutter the windows from light,

I will place in their sockets the four

Tall candles and set them a-flame

In the grey of the dawn; and myself

Will lay myself straight in my bed,

And draw the sheet under my chin.

.

Adelaide Crapsey

September 9, 1878 – October 8, 1914

American

The New Poetry: An Anthology.  1917.

Harriet Monroe, ed. (1860–1936).

http://www.bartleby.com/265/80.html

పంచపాదులు…ఎడిలేడ్ క్రాప్సీ, అమెరికను కవయిత్రి

1. ఒక నవంబరు రాత్రి

జాగ్రత్తగా విను.
వినీ వినిపించని సడితో
ప్రేతాత్మల అడుగుల చప్పుడులా
మంచుకి బిరుసెక్కిన ఆకులు, చెట్లనుండి వేరై
క్రిందకి రాలుతున్నాయి.

2. ఆ మూడూ

ఆ మూడూ
ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండాలి…
రాలుతున్న మంచూ
వేకువకి ముందరి ఝాము
అప్పుడే మరణించిన వాడి నోరూ…

3. సుసన్నా – పెద్దలూ

“అవునూ, నువ్వు
ఎందుకు ఆమె గురించి చెడు
ప్రచారం చేస్తావు?”
“ఆమె అందంగా సుకుమారంగా ఉంటుంది.
అందుకు.”
.
ఎడిలేడ్ క్రాప్సీ
సెప్టెంబరు 9, 1878 – అక్టోబరు 8, 1914
అమెరికను కవయిత్రి.

.

.

      Cinquains

 1. November Night

Listen.         

With faint dry sound,      

Like steps of passing ghosts,    

The leaves, frost-crisp’d, break from the trees        

And fall.  

   

 2. Triad

These be     

Three silent things:

The falling snow …

The hour before the dawn …

The mouth of one Just dead.  

   

 3. Susanna and the Elders

“Why do     

You thus devise    

Evil against her?” “For that       

She is beautiful, delicate;

Therefore.” 

.

Adelaide Crapsey

September 9, 1878 – October 8, 1914

American Poetess

Poems Courtesy:

The New Poetry: An Anthology.  1917.

Harriet Monroe, ed. (1860–1936). 

http://www.bartleby.com/265/69.

http://www.bartleby.com/265/70.

http://www.bartleby.com/265/71.

 

నవంబరు రాత్రి … ఎడిలేడ్ క్రాప్సీ

శ్రద్ధగా విను…

చాలా అస్పష్టమైన సడితో…

ప్రేతాత్మల అడుగుల్లా…

మంచుకి బిరుసెక్కిన ఆకులు, చెట్లనుంది విడివడి

క్రిందకి రాలుతున్నాయి…

.

ఎడిలేడ్  క్రాప్సీ

సెప్టెంబరు 9, 1878 – అక్టోబరు 8, 1914

అమెరికను కవయిత్రి.

.

http://en.wikipedia.org/wiki/File:A_crapsey.jpg

.

November Night

.

Listen …

With faint dry sound,

Like steps of passing ghosts,

The leaves, frost-crisp’d, break from the trees

And fall.

.

Adelaide Crapsey

September 9, 1878 – October 8, 1914

American Poetess.

నా కిటికీ క్రిందనున్న శ్మశానంలోని మృతులకు … ఏడిలేడ్ క్రాప్సీ, అమెరికను కవయిత్రి.

.

చలనంలేకుండా అలా ఎలా పడుక్కోగలుగుతున్నారు?

మీరక్కడ అశాంతితో కదులుతున్నారని అనడానికీ,

విసుగెత్తి ఆవులిస్తూ చెయ్యి జాచేరనో, చాలా రోజులై తిరగక

కాళ్ళు పట్టేసి నొప్పిపెడుతున్నాయనో సూచించడానికి

రోజల్లా నేను గమనించినా ఒక్క గడ్డిదుబ్బూ కదలదు.

రాత్రంతా గమనిస్తూనే ఉంటాను; అయినా, ఒక్క ఆత్మా లేచిరాదు

అర్థరాత్రి చల్లనిగాలిలో స్వేచ్ఛగా విహరించడానికి.

.

ఏం? మీ ఎముకల్లో పోరాట పటిమ నశించిందా?

మీతోపాటు ఉండే క్రిములు మిమ్మల్ని అసహ్యించుకుంటాయి:

పాలిపోయి, చివికిపోతూ, మట్టిలోకలిసిపోతున్న

అన్నిటికీ తలలూపే పౌరుషంలేని శ్మశానవాసులని.

మీరెందుకక్కడ, ఒకరి పక్క ఒకరు వరసగా

నా మంచం మీంచి చూస్తుంటే కనిపిస్తూ,

కేవలం ఉన్నాం అంటే ఉన్నామని, పదే పదే 

“ష్!కదలకుండా పడుక్కో! కదలకుండా పడుక్కుని

విశ్రాంతి తీసుకో” అన్న హెచ్చరికలతో నన్ను విసుగెత్తిస్తూ?

.

నాకు ఓరిమి లేదు! నేను కదలకుండా పడుకోను!

ఆ దేవదారు చెట్లమధ్యనుండి పోతూ ఒక మట్టిరోడ్దుంది,

ముందుకిపోతే, రాజసమైన చిట్టడవి వస్తుంది,

అది దాటగానే, నీలగిరులు తలెత్తుకుని కనిపిస్తాయి;

నేను ఆ బాటమీదనే నడిచి, చిట్టడవిలో ప్రవేశించి, 

ఝంఝామారుతాలతో నిండిన మహానగాగ్రాలనధిరోహించి

అక్కడి కాలమేఘాలను అందుకుంటాను.

.

నా కాళ్ళు కట్టుబడిపోయినా, కళ్ళు అనుసరిస్తూనే ఉంటాయి.

పడుక్కున్నానుగదా అని, మీలాగే నేనూ ఒదిగి ఉండాలా?

తలగడనీ, కిటికీని, సమాధిరాయి, మట్టిగా భావించుకుని

మీ కదలలేనితనాన్నే నేనూ అనుకరించాలా?

విజ్ఞుల మాటలన్నీ ఎంత అణిగి ఉండమని చెప్పినా

నేను ఒదిగి ఉండనుగాక ఉండను;

అంతేకాదు, రాజీ లేని పోరాటస్ఫూర్తితో

శాంతించని నా తిరస్కారాన్ని, చుక్కలకి చూపిస్తాను.

.

నడుస్తూనో, పరిగెడుతూనో, గెంతుతూనో ఉండడం మంచిది

నవ్వుతూనో,తుళ్ళుతూనో, పాడుతూనో ఉండడం మంచిది;

పొద్దున్నా రాత్రీ ఆకాశంలో ఏముందో తెలుసుకోవడం

పండువెన్నెల్లో ఎదురులేకుండా సాగిపోడమూ మంచిదే.

ఈ విషయం నేను వయసుమీరినప్పుడూ గట్టిగా చెబుతాను

నేను అలా చెయ్యలేకపోయానన్న దిగులు నన్ను బాధిస్తుంటే.

అంతేగాని, ఓటమికి తోబుట్టువైన నిరాశనిండిన గొంతుతో

చిలకపలుకులు మాత్రం పలకను.

.

నేను ప్రశాంతంగా ఉండను. నేను కదలకుండానూ ఉండను.

ఈ భస్మసింహాసనపు ఏలికా, ఈనాటి నియంతా

అయిన ఇక్కడి ఈ హాస్యాస్పదమైన ‘ప్రశాంతత ‘, 

తిరుగుబాటు ముగియడంగురించి అన్న:

“అవునవును. వీళ్ళంతా మొండివాళ్ళూ, దురహంకారులూ.

అయితేనేం, మిగతావాళ్లలాగే ఇప్పుడు చచ్చినట్టుపడున్నారు”

కఠోరమైన మాటలు నేను లక్ష్యపెట్టను.

ఇది ఇక్కడి ప్రతి శరీరమూ, ప్రతి ఆత్మా విన్నాది గదా.

ఇక మీరు మీ సమాధుల్లో నిశ్చలంగా పడుక్కోండి.

.

ఏడిలేడ్ క్రాప్సీ

(September 9, 1878 – October 8, 1914)

అమెరికను కవయిత్రి.

ఏడిలేడ్ క్రాప్సీ జీవిత విశేషాలకి  దయచేసి ఈ  క్రింది లింకు చూడండి:

http://www.poetryfoundation.org/bio/adelaide-crapsey

Adelaide Crapsey
Adelaide Crapsey (Photo credit: Wikipedia)

.

To the Dead in the Graveyard Underneath My Window

.

How can you lie so still? All day I watch

And never a blade of all the green sod moves

To show where restlessly you toss and turn,

And fling a desperate arm or draw up knees

Stiffened and aching from their long disuse;

I watch all night and not one ghost comes forth

To take its freedom of the midnight hour.

.

 Oh, have you no rebellion in your bones?

The very worms must scorn you where you lie,

A pallid mouldering acquiescent folk,

Meek habitants of unresented graves.

Why are you there in your straight row on row

Where I must ever see you from my bed

That in your mere dumb presence iterate

The text so weary in my ears:

“Lie still  And rest; be patient and lie still and rest.”

.

 I’ll not be patient! I will not lie still!

There is a brown road runs between the pines,

And further on the purple woodlands lie,

And still beyond blue mountains lift and loom;

And I would walk the road and I would be

 Deep in the wooded shade and I would reach

The windy mountain tops that touch the clouds.

.

My eyes may follow but my feet are held.

Recumbent as you others must I too  Submit?

Be mimic of your movelessness

With pillow and counterpane for stone and sod?

And if the many sayings of the wise

Teach of submission I will not submit

But with a spirit all unreconciled

Flash an unquenched defiance to the stars.

,

Better it is to walk, to run, to dance,

Better it is to laugh and leap and sing,

To know the open skies of dawn and night,

To move untrammeled down the flaming noon,

And I will clamour it through weary days

Keeping the edge of deprivation sharp,

Nor with the pliant speaking on my lips

Of resignation, sister to defeat.

.

I’ll not be patient. I will not lie still.

And in ironic quietude who is

The despot of our days and lord of dust

Needs but, scarce heeding, wait to drop

Grim casual comment on rebellion’s end;

“Yes, yes… Wilful and petulant but now

As dead and quiet as the others are.”

And this each body and ghost of you hath heard

That in your graves do therefore lie so still.

.

.

Adelaide Crapsey

September 9, 1878 – October 8, 1914

American Poetess, inventor of Cinquain.   

For further study visit: http://en.wikipedia.org/wiki/Adelaide_Crapsey

or,

http://www.poetryfoundation.org/bio/adelaide-crapsey

  • Cinquain Cat (thepoetryoflife.wordpress.com)

%d bloggers like this: