అనువాదలహరి

మనోకామన… అబ్రహామ్ కౌలీ, ఇంగ్లీషు కవి

ప్రభూ! నాకీ వరాన్నొక్కటీ ప్రసాదించు!

నా సంపద పరులు ఈర్ష్యపడనంత చిన్నదిగా,

చీదరించుకోనంత ఎక్కువగా ఉండేట్టు చూడు.

నేను సాధించబోయే ఏ గొప్పపనులవల్లనో కాకుండా, కేవలం

నా మంచితనంవల్ల నాకు కాసింత గౌరవం దక్కాలి.

చెడ్డపేరుకంటే ఏ గుర్తింపూ లేకపోవడం మెరుగు

పుకార్లు మరణానికి దారిచూపిస్తాయి.

నాకు మనుషుల పరిచయాలు ప్రసాదించు, అది కేవలం సంఖ్య మీద

ఆధారపడకుండా, నా స్నేహితులను నే నెంచుకునేట్టుగా ఉండాలి.

నా వ్యాపారం కాకుండా, పుస్తకాలు రాత్రి కొవ్వొత్తిని వెలిగించాలి

అలాగే, రాత్రివేళ మృత్యువంత కలతలేని నిద్ర పట్టాలి

నా నివాసం విశాలమైన భవంతి కాకుండా

చిన్న పూరిగుడిశ అయినా, నా విలాసాలకు కాకుండా

అవసరాలకు తీరేటట్టు ఉండాలి.

నా పూతోట కళాత్మకంగా మనుషులు చేత కాకుండా

ప్రకృతిచేత సహజసిద్ధంగా అలంకరించబడాలి.

అక్కడ లభించే ఆనందం తన

సబైన్ భవంతిలో కూడా దొరకదని హొరేస్ ఈర్ష్యపడాలి.

ఆ విధంగా తరిగిపోతున్న నా జీవిత కాలాన్ని

రెట్టింపు చేసుకోగలను; అలా నిజంగా ఎవరు జీవితాన్ని నడపగలరో

వాళ్ళు జీవితాన్ని రెండురెట్లు అనుభవించగలరు.

ఇటువంటి ఆనంద క్షణాల్ని, వాటిలోని నిజమైన

ఆనందానిభూతినీ ఖరీదులేని ఈ క్రీడలివ్వగలవు.

అపుడు నా భవిష్యత్తుగూర్చి ఆలోచించను, చింతించను.

ప్రతిరోజూ రాత్రి పదుకునేటపుడు ధైర్యంగా అనుకోగలను:

రేపు సూర్యుడు తన కిరణాల్ని ప్రసరిస్తే ప్రసరించనీ,

లేక మబ్బులు వాటిని కమ్మితే కమ్మనీ, ఈ రోజు నేను హాయిగా జీవించేను!

.

అబ్రహామ్ కౌలీ

(1618 – 28 July 1667)

ఇంగ్లీషు కవి

.

The Wish

.

This only grant me, that my means may lay

Too low for envy, for contempt too high.

Some honour I would have

Not from great deeds, but good alone.

The unknown are better than ill known;

Rumour can ope the grave.

Acquaintance I would have, but when’t depends

Not on the number, but the choice of friends:

Books should, not business, entertain the light,

And sleep, as undisturbed as death, the night.

My house a cottage, more

Than place, and should fitting be,

For all my use, not luxury.

My garden painted over

With nature’s hand not art’s; and pleasures yield

Horace might envy in his Sabine  field.   

Thus would I double my life’s fading space,

For he that runs it well, twice runs his race.

And in his true delight,

These unbought sports, this happy state,

I would not fear nor wish my fate,

But boldly say each night,

Tomorrow let my sun his beams display,

Or in clouds hide them; I have lived today.

.

Abraham Cowley 

(1618 – 28 July 1667)

English Poet

Poem Courtesy: https://archive.org/details/WithThePoets/page/n109

 

ఎపిక్యూర్… అబ్రహామ్ కౌలీ. ఇంగ్లీషు కవి

మీ పాత్రని ఎర్రని మధువుతో నింపండి

తలకట్టున గులాబుల దండ ధరించండి

మధువూ, గులాబుల్లా మనం నవ్వుతూ

కాసేపు హాయిగా ఆనందంగా గడుపుదాం.

గులాబుల కిరీటాన్ని ధరించిన మనం

“జహీజ్”(1) రాజమకుటాన్నైనా తలదన్నుదాం

ఈ రోజు మనది; మనం దేనికి భయపడాలి?

ఈ రోజు మనది; అది మనచేతిలోనే ఉంది.

దాన్ని సాదరంగా చూద్దాం. కనీసం

మనతోనే ఉండిపోవాలని కోరుకునేలా చేద్దాం.

పనులన్నీ కట్టిపెట్టండి, దుఃఖాన్ని తరిమేయండి

రే పన్నది సుఖపడడం తెలిసినవాళ్లకే.

.

అబ్రహామ్ కౌలీ

(1618 – 28 July 1667)

ఇంగ్లీషు కవి

Note 1:

Gyges గురించి ఇక్కడ చదవండి

Note 2:

ఎపిక్యూరియన్లు భోగలాలసులని చాలా అపోహ. నిజానికి వాళ్ళు సుఖజీవనం బోధించారు గాని, ఇంద్రియ లాలసకి వ్యతిరేకులు. అతి సాధారణమైన, నిర్మలిన జీవితం, పరిమితమైన కోరికలు, పెద్ద పెద్ద ఆశలూ ఆశయాలు లేకపోవడమే వాళ్ళు బోధించింది. ఈ జీవితం నశ్వరమనీ, దీనికి భగవంతుడు కారణం కాదనీ, మరణం తర్వాత జీవితం లేదనీ, జననానికి ముందున్న అనంత శూన్యంలోకే మరణం తర్వాత చేరుకుంటాము కనుక భయపడవలసినది ఏమీ లేదనీ, బాధలకి భయపడవద్దనీ, హాయిగా జీవించమనీ చెప్పారు.

.

Abraham Cowley

.

The Epicure

.

Fill the bowl with rosy wine,

Around our temples roses twine.

And let us cheerfully awhile,

Like the wine and roses smile.

Crowned with roses we contemn

Gyge’s wealthy diadem.

Today is ours; what do we fear?

Today is ours; we have it here.

Let’s treat it kindly, that it may

Wish, at least, with us to stay.

Let’s banish business, banish sorrow;

To the Gods belongs tomorrow

.

Abraham Cowley

(1618 – 28 July 1667)

English Poet

Note:

Epicureanism is a form of hedonism insofar as it declares pleasure to be its sole intrinsic goal, the concept that the absence of pain and fear constitutes the greatest pleasure, and its advocacy of a simple life, make it very different from “hedonism” as colloquially understood.

 

Poem Courtesy:

The Book of Restoration Verse. 1910.

Ed. William Stanley Braithwaite.

http://www.bartleby.com/332/102.html

Read the Bio of the poet here

\

మధుగీతం… అబ్రహాం కూలీ, ఇంగ్లీషు కవి

దాహంకొన్న భూమి వర్షపునీరు చుక్కమిగల్చదు

అంతా తాగేసి, ఇంకా కావాలని ఎదురుచూస్తుంటుంది;

వృక్షాలు నేలను పీల్చి, పీల్చి

నిరంతరం తాగుబోతులై ప్రవర్తిస్తుంటాయి.

పోనీ సముద్రం చూద్దామంటే

(ఎవరికైనా దానికి దాహం ఏమిటనిపిస్తుంది)

ఇరవైవేల నదుల్ని అవలీలగా తాగెస్తుంది

ఎంతగా అంటే దాని బొజ్జ పొర్లిపోతుంది.

అలా నిలకడలేక తిరుగుతుంటాడా సూరీడు

(అతని జేవురుమన్నముఖం తాగుబోతని చెప్పకచెబుతుంది)

సముద్రాలన్నిటినీ తాగేస్తాడు, అతని పనయిపోయేక

చంద్రుడూ, నక్షత్రాలూ అతన్ని తాగెస్తాయి

తాగేసి తమ పద్ధతిలో తందనాలాడతాయి,

తాగి రాత్రల్ల వేడుక చేసుకుంటాయి.

ప్రకృతిలో ఏదీ మత్తులేకుండా కనపడదు

నిరంతరం ఏదో ఒక మైకంలో తేలుతుంటాయి.

కాబట్టి, మధుపాత్ర నింపు, నింపేది పూర్తిగా నింపు

అక్కడున్న గ్లాసులన్నీ నింపు…

అందరూ తాగొచ్చుగాని నేనొక్కణ్ణే ఎందుకు తాగకూడదు?

ఇదిగో, నీతి వర్తనుడా, కారణం సెలవియ్యి?

.

అబ్రహాం కూలీ

1618 – 28 July 1667

ఇంగ్లీషు కవి

(Note: ఈ కవితలో చాలా ముఖ్యమైన పరిశీలన ఉంది.  సూర్యుడ్ని చంద్రుడూ నక్షత్రాలూ తాగెస్తాయని.  అది ఖగోళ పరంగా చూసినపుడు చిన్న సవరణ ఉంది:  సూర్యుడు  శ్వేత తారగా మారబోయే ముందు చంద్రుణ్ణీ భూమినీ మింగేస్తాడని ఆధునిక విజ్ఞానం చెబుతోంది.  అంతేకాదు, ఆ తర్వాత, సూర్యుణ్ణి కూడా ఆండ్రోమిడా, మన మిల్కీవే (పాలపుంత) గెలాక్సీలు గుద్దుకున్నప్పుడు ఇతర నక్షత్రాలు మింగేస్తాయను చెబుతోంది.  ఈ కవితలో  ప్రత్యేక వివరణ ఇవ్వకపోయినప్పటికీ,  ఈ విషయంలో అంత ఆధునిక పరిజ్ఞానం గురించిన (ఊహ నుకున్నప్పటికీ) ప్రస్తావన చాలా గొప్ప విషయమే.  శాస్త్ర విజ్ఞానం పట్ట్ల ఆ నాటి ప్రజలకున్న తపనకి ఇది ఒక గీటురాయి.)

.

AbrahaM Cowley

.

Anacreontics

(Drinking)

.

The thirsty earth soaks up the rain, 

And drinks and gapes for drink again;      

The plants suck in the earth, and are

With constant drinking fresh and fair;       

The sea itself (which one would think                

Should have but little need of drink)

Drinks twice ten thousand rivers up,         

So fill’d that they o’erflow the cup.  

The busy Sun (and one would guess

By’s drunken fiery face no less)       

Drinks up the sea, and when he’s done,    

The Moon and Stars drink up the Sun:     

They drink and dance by their own light,  

They drink and revel all the night:   

Nothing in Nature’s sober found,    

But an eternal health goes round.    

Fill up the bowl, then, fill it high,     

Fill all the glasses there—for why    

Should every creature drink but I?   

Why, man of morals, tell me why?

.

Abraham Cowley

1618 – 28 July 1667

English Poet

Poem Courtesy: The Oxford Book of English Verse: 1250–1900.

Ed. Arthur Quiller-Couch.

http://www.bartleby.com/101/349.html

%d bloggers like this: