Tag: A. E. Housman
-
మనసా! కాస్త నెమ్మది… A E హౌజ్మన్, ఇంగ్లీషు కవి
ఓ మనసా! కాస్త నెమ్మది వహించు; నీ అస్త్రాలు ఎందుకూ పనికిరావు, భూమ్యాకాశాల దగ్గర ఇంతకన్నా బలమైనవి ఎప్పటినుండో స్థిరంగా ఉన్నాయి. ఆలోచించు. ఒకసారి గుర్తుతెచ్చుకో, ఇప్పుడు నువ్వు విచారిస్తున్నావు గాని, ఒకప్పుడు మనం అచేతనంగా పడి ఉండే వాళ్ళం. ఆ రోజులు అనంతం. అప్పుడూ మనుషులు నిర్దాక్షిణ్యంగా ఉండెవారు; ణెను ఆ చీకటి గుహలో పడుకున్నాను అందుకు చూడలేదు; కన్నీళ్ళు చిందేవి, కానీ విచారించలేదు; చెమట కారేది, రక్తం ఉడుకెత్తేది, కానీ నే నెన్నడూ విచారించలెదు; […]
-
జనప్రవాహాన్ని చూస్తుంటే… ఏ ఈ హౌజ్మన్, ఇంగ్లండు
అద్దెకు దిగిన ఈ లాడ్జిలోంచి వీధిలో వెచ్చగా ఊపిరులూదుకుంటూ ఒకరివెనక ఒకరు ఉత్సవ ప్రభల్లా వెళుతున్న జనసందోహాన్ని చూస్తుంటే… ప్రేమక్రోధాల ఆవేశాలు నిజంగా ఈ మాంస గృహంలో బలీయమైనవయితే నేను శాశ్వతంగా నివసించవలసిన ఆ మట్టింటి గురించి కాస్త ఆలోచించనీండి. అగోచరమైన ఆ దేశంకాని దేశంలో పూర్వఛాయలేవీ అక్కడ మిగిలుండవు అక్కడ ప్రతీకారాలు మరుగునపడతాయి ద్వేషించినవాడికి ద్వేషం గుర్తుండదు. రెండువరుసల్లో నిద్రిస్తున్న ప్రేమికులు పక్కనున్నవారు ఎవరు అని అడగరు రాత్రిగడిచిపోతునా, పెళ్ళికొడుకు పెళ్ళికూతురుదగ్గరకి చేరుకోడు. . ఏ […]