అనువాదలహరి

ఒక చలి రాత్రి… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి

నా కిటికీ అద్దం మంచుతో మెరుస్తోంది

లోకం అంతా ఈ రాత్రి చలికి వణుకుతోంది

చంద్రుడూ, గాలీ రెండంచుల కత్తిలా

భరించశక్యంకాకుండా బాధిస్తున్నారు.

భగవంతుడా! ఇలాంటపుడు తలదాచుకుందికి

కొంపలేనివాళ్లనీ, దేశద్రిమ్మరులనీ రక్షించు.

దేముడా! మంచుమేతలు వేసిన వీధుల్లో దీపాల

వెలుగుకి తచ్చాడే నిరుపేదలని కరుణించు.

మడతమీదమడతవేసిన తెరలతో వెచ్చగా,

నా గది ఇప్పుడు వేసవిని తలపిస్తోంది.

కానీ ఎక్కడో, గూడులేని అనాధలా

నా మనసు చలికి మూలుగుతోంది.

.

సారా టీజ్డేల్

(August 8, 1884 – January 29, 1933)

అమెరికను కవయిత్రి

220px-Sara_Teasdale._Photograph_by_Gerhard_Sisters,_ca._1910_Missouri_History_Museum_Photograph_and_Print_Collection._Portraits_n21492

.

A winter Night

.

My windowpane is starred with frost,

The world is bitter cold tonight,

The moon is cruel, and the wind

Is like a two-edged sword to smite.

God pity all the homeless ones,

The beggars pacing to and fro,

God pity all the poor tonight

Who walk the lamp-lit streets of snow.

My room is like a bit of June,

Warm and close-curtained fold on fold,

But somewhere, like a homeless child,

My heart is crying in the cold.

.

Sara Teasdale

Poem Courtesy:

https://archive.org/details/collectedpoemsof00teas/page/29

మృత్యువు కనికరిస్తే … సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి

మృత్యువు కనికరించి, మళ్ళీ ప్రాణం పోసుకోకపోతే
ఏదో ఒక పరిమళభరితమైన నిశీధిని మనిద్దరం భూమిమీదకి దిగి
ఈ రహదారి వంపులన్నీ తిరిగి ఈ సముద్రతీరం చేరుకుంటాం;
ఈ శ్వేతసౌగంధిక కుసుమాలనే మరొకమారు ఆఘ్రాణిస్తాం.

ఏ చీకటిరాత్రిలోనో, తరంగశృతులతో మారుమోగే ఈ తీరాలకి
అనవరతం లీలగా వినిపించే ఈ కడలి ఘోష వినడానికి వస్తాం;
ఎటుచూచినా సన్నగా జాలువారే చుక్కలకాంతిలో ఒక గంట గడిపి
ఆనందంతో పరవశిస్తాం. మనకేమిటి? మృతులు స్వతంత్రులుగదా!
.
సారా టీజ్డేల్
(August 8, 1884 – January 29, 1933)
అమెరికను కవయిత్రి

.

.

If Death Is Kind

Perhaps if Death is kind, and there can be returning,

We will come back to earth some fragrant night,

And take these lanes to find the sea, and bending

Breathe the same honeysuckle, low and white.

We will come down at night to these resounding beaches

And the long gentle thunder of the sea,

Here for a single hour in the wide starlight

We shall be happy, for the dead are free.

.

Sara Teasdale

(August 8, 1884 – January 29, 1933)

American Poet

%d bloggers like this: