అనువాదలహరి

భట్రాజులుంటారు జాగ్రత్త… సిడియాస్, గ్రీకు శిల్పి

ఈ కవిత చదివేక, ఈ మధ్య ఆంధ్రలో కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుడు ఒకరు తన నాయకునికి విధేయత ప్రకటిస్తూ, భగవంతుడు చనిపోమంటే, తన నాయకుని తండ్రి పొందిన మరణంవంటి మరణాన్ని కోరుకుంటాను అని ప్రకటించడం గుర్తొచ్చింది.

.

అతి ముఖస్తుతిచేసే వాళ్ళుంటారు. జాగ్రత్త.

వాళ్ళు, సింహానికి ఎదురుగా నిలబడి

అది ఆకలితో అలమటిస్తోందేమోననన్న

ఆలోచనకే భయంతో వణుకుతూ చస్తారు.
.

సిడియాస్

క్రీ. పూ. 4 వ శతాబ్దం.

గ్రీకు శిల్పి

.

Beware

.

Beware.  There are fawns

who, facing the lion,

die of fright just thinking

the lion might be hungry.

.

Cydias

400 B.C. 

Greek Painter

(Translation by: Sam Hamill)

Poem Courtesy:

https://archive.org/details/worldpoetryantho0000wash/page/121

An Anthology of Verse From Antiquity to Our Time

Edited by : Katharine  Washburn and John S Major; Clifton Fadiman (General Editor)

Published by  W W Norton & Company ISBN 0-393-04130-1

(Part II: The Classical Empires: East and West)

57 వ కవిత, తావొ తే చింగ్ నుండి… చీనీ కవిత

నువ్వు గొప్ప నాయకుడివి కాదలచుకుంటే,

తావోని చదివి అనుసరించక తప్పదు.

నియంత్రించడానికిచేసే ప్రయత్నాలన్ని ఆపు.

స్థిరపడిపోయిన ప్రణాళికలూ, ఆలోచనలూ వదిలెయ్

ప్రపంచం దాన్ని అదే నడిపించుకుంటుంది. 

నువ్వు నిషేధాలు పెంచుతున్న కొద్దీ

ప్రజల నైతికతకూడా తగ్గుతుంది.

నీకు ఆయుధాలు ఎక్కువయినకొద్దీ

నీ ప్రజలకు అంత తక్కువ భద్రత ఉంటుంది.

నువ్వు రాయితీలు ఇస్తున్నకొద్దీ

ప్రజలు అంత స్వయం సమృద్ధిలేనివాళ్ళవుతారు.

అందుకనే గురువు ఇలా సెలవిస్తున్నాడు:

చట్టాన్ని పక్కకి తప్పించాను,

ప్రజలు నిజాయితీపరులయ్యారు.

ఆర్థిక సూత్రాల్ని పక్కనబెట్టాను,

ప్రజలు భాగ్యవంతులైనారు,

మతాన్ని పక్కనబెట్టాను,

ప్రజలు నిష్కల్మషులైనారు.

విశ్వశ్రేయస్సుకి నా కోరికలని వదిలేసాను

మంచి ఎక్కడపడితే అక్కడ గడ్డిలా వ్యాపించింది.

.

లావొ జు

చీనీ కవి

తావొ తే చింగ్ 

చీనీ గ్రంధము నుండి.

క్రీ. పూ. 4వ శతాబ్ది.

.

.

Tao Te Ching: Verse 57

.

If you want to be a great leader,

you must learn to follow the Tao.

Stop trying to control.

Let go of fixed plans and concepts,

and the world will govern itself.

 

The more prohibitions you have,

the less virtuous people will be.

The more weapons you have,

the less secure people will be.

The more subsidies you have,

the less self-reliant people will be.

 

Therefore the Master says:

I let go of the law,

and people become honest.

I let go of economics,

and people become prosperous.

I let go of religion,

and people become serene.

I let go of all desire for the common good,

and the good becomes common as grass.

.

Lao-Tzu

From Tao te Ching, Chinese Classical Text

4th Century BC

 

నిష్పాక్షికత … లావోజి, చీనీ కవి

అర్థంచేసుకున్నవాడు ఉపదేశాలివ్వడు;

ఉపదేశాలిచ్చేవాడు అర్థం చేసుకోలేడు.

 

నీ తీర్పులు, అభిప్రాయాలూ పక్కనబెట్టు;

నీ వివేచనకి కళ్ళెం వేసి,

నీ లక్ష్యాన్ని సులభంచేసుకో,

ప్రపంచాన్ని ఆమోదించు.

 

స్నేహం, శత్రుత్వం

లాభం నష్టం

కీర్తి, అపకీర్తి

నిన్ను ఏమాత్రం తాకవు.

ప్రపంచం నిన్ను అంగీకరిస్తుంది.

.

లావోజి

చీనీ కవి

తావో తే చింగ్ ( లావోజీ అనే నామాంతరం గల) క్రీ. పూ. 4 శతాబ్దపు సంకలనం నుండి.

.

VERSE 56 Impartiality.

.

Who understands does not preach;

Who preaches does not understand.

Reserve your judgments and words;

Smooth differences and forgive disagreements;

Dull your wit and simplify your purpose;

Accept the world.

Then,

Friendship and enmity,

Profit and loss,

Honour and disgrace,

will not affect you;

The world will accept you.

.

Laozi

from:

Tao Te Ching (Chinese Classic Text) 4th Century BC.

%d bloggers like this: