అనువాదలహరి

పొడి రాత్రులు… ఫ్రెడెరిక్ టర్నర్, అమెరికను కవి

పాపం! ఆ చంటివాడు బాల్యానికి ప్రతీకలా ఉన్నాడు
అతని ‘పక్క’ అడవిజంతువు అవాసంలా కంపుకొడుతోంది
అతని శరీరం ఒక అలా నిద్రిస్తుంటే,
అమాయకత్వం అతనిలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.
అతని కలల్ల్ని కబ్జా చేస్తే అతనికి అన్యాయం చేసినవాళ్లమవుతాం!
ఆ పరాయీకరణనీ, వింతవింత సున్నపురాయంత తెల్లని
తీరాల్నీ, పేరులేని అందమైన ప్రదేశాలనీ,
అతని విశృంఖలమైన కలనీ మృదుస్పర్శతో తోసిపుచ్చగలమా?

ఈ మధ్యనే అతను మంగలిషాపులో కుర్చీలో కూచున్నాడు
పెద్దవ్యాపారస్థుడిలా ఠీవిగా, దర్జాగా. అతను నవ్విన నవ్వు
ఎంత విచిత్రంగా ఉందంటే నాకూ నవ్వు వచ్చింది
ఆ సెలూన్ లో ఒక స్టాన్ లారెన్ ని చూసినట్టనిపించి
కాకపోతే అతని చిన్న ప్రతీకలా, ముఖం బాగా విప్పార్చి,
జుత్తు కత్తిరించబడి; ఆ తర్వాత అకక్డ చెయ్యపెట్టనీయ లేదనుకోండి.
.
ఫ్రెడెరిక్ టర్నర్
జననం 1943
అమెరికను కవి

 

Dry Nights

.

That was the last poor rag of babyhood:

The way his bed stank like a fox’s set;

That easy flow of innocence he could

Let fall from him while all his body slept.

We do him wrong to colonize his dreams!

Can we afford to lose that alienness,

Those strange, limestone-bright coasts, lands without names,

And brush away his wilds with a caress?

Lately he sat up in the barber’s chair

Swathed like a businessman, and smiled with such

Clownish lopsidedness that I laughed there

In the saloon to see this Stan Laurel, much

Reduced, his face wide open, his cropped hair;

And afterwards could scarce forbear to touch.

Frederick Turner

(Born 1943 Northamptonshire, England)

American Poet

Poem Courtesy:

http://www.poemtree.com/poems/DryNights.htm

ప్రకటనలు

ఏలిస్ స్మృతిలో… కేథరీన్ టఫెరీలో, అమెరికను కవయిత్రి

ఈ ప్రపంచంలో ఎక్కడో ఒకచోట నువ్వున్నావని ఎప్పుడూ అనుకుంటుంటాను;
ఎప్పుడో ఒకరోజు మళ్ళీ మనిద్దరం తప్పకుండా కలుసుకుంటామనీ
ఎన్నో ఏళ్ళు గడిచిపోయిన తర్వాత హాయిగా తిరిగివచ్చిన హీరోల్లా,
మనిద్దరం మన సాహసగాథలు కలబోసుకుంటామనీ భావించేదాన్ని.

మనిద్దరం కలిసి కుస్తీపట్లు పడుతూ “ఈలియడ్” చదివి
అప్పుడే 12 ఏళ్లు గడిచిపోయాయంటే నమ్మశక్యం కాకుంది,
అది ట్రోజన్ యుద్ధం జరిగిన సమయంకంటే ఎక్కువ,
ఆ తర్వాత ఒడిస్సస్ చేసిన సాహసయాత్రలకన్నా తక్కువ.

మీ అమ్మగారు నువ్వు లేవని చెప్పిన తర్వాత
నాకు ముందుగుర్తొచ్చింది నువ్వు ఎప్పుడూ వాడే మాట
9X88T …  విచారానికి మన సంకేత పదం…
ఓ పని చేద్దామనుకోవడం, పూర్తిచెయ్యకుండా ఆగిపోవడానికి.

“నేను నిన్న రాత్రి గ్రీకు చదువుదా మనుకున్నాను,” అని నువ్వనేదానివి,
సమాధానంగా నే ననేదాన్ని, “అవును, నేనుకూడా అగతా,
ఎలాగైనా సూర్యుడి లేలేత ఎరుపు కిరణాలు ప్రసరించే లోపు
నా పనులు నేను ఎలాగైనా పూర్తిచెయ్యాలనుకుంటున్నాను,” అని.

నువ్వు విడిచి వెళ్ళి అప్పుడే 7 ఏళ్ళు గడిచిపోయాయి.
నేను మాత్రం నిస్సారమైన జీవితాన్ని ఈడుస్తున్నాను.
అశ్రద్ధగా, నీ జ్ఞాపకాల్లో నిన్నూహించుకుంటూ
(మధ్యలో ఎన్నోచోట్లు మారడంలో, మెక్సికోనుండి

నువ్వు ఎంతో సరదాగా రాసిన ఉత్తరాల్ని పోగొట్టుకున్నాను.)
నీకుకూడా వయసు పైబడుతుందని ఎన్నడూ అనుకోలేదు.
శోకంలో మునిగి ఏడుస్తున్న హెకాబే కుమార్తెలకు మల్లే
నీకు కూడా కాలం అకస్మాత్తుగా ఆగిపోయింది.

1983 శరత్తులో, నీకు “ప్రయం కొడుకుల కేటలోగ్” ని
అనువాదం చెయ్యడం నీకు అభ్యాసంగా ఇచ్చినపుడు
మంటల్లో చిక్కుకున్న ట్రోయ్… నుండి అజ్ఞాత వీరుల
సమాధి మృత్తికలనుండి నువ్వు వారిని ఆహ్వానించేవు!

నిద్రపోతున్న నీ ముఖం మీద నుండి నేను ఎంత సుకుమారంగా
ఎండుటాకులు పకక్కి తొలగించి నిన్ను పేరుపెట్టి పిలిచినా
నువ్వు తిరిగిరావనీ, మరో ప్రపంచంలో నీ సాహస
కృత్యాలు నాతో పంచుకోవన్న సత్యం నమ్మశక్యంగా లేదు.
.

కేథరీన్ టఫెరీలో

జననం 1963

అమెరికను కవయిత్రి.

Catherine Tufariello Image Courtesy:
http://www.ablemuse.com

.

Elegy for Alice

I always assumed you were somewhere in the world,

And that someday we’d find each other again

And tell our adventures, like happy heroes

Reunited after years of wandering.

Hard to believe it’s been a dozen years

Since we slogged together through the Iliad,

Longer than the whole of the Trojan War,

Or the wanderings of Odysseus afterward.

When your mother told me you were dead,

All I could think about was our favorite verb,

9X88T, our rueful shorthand for regret,

To be about to do, but leave undone.

“I meant,” you’d say, “to study Greek last night,”

And I’d reply, “I too, O Agathon,

Intended to accomplish many things

Before the light of rosy-fingered dawn.”

And now it’s seven years that you’ve been gone.

While I was living my ordinary life,

And carelessly, fondly imagining you in yours,

(Losing, in one of my many moves, the funny,

Wonderful letters you wrote me from Mexico),

I never dreamed that you would not grow old,

That time had stopped for you as suddenly

As for the daughters of weeping Hekabe

In burning Troy—the unremembered ones

You summoned from the ashes in the fall

Of 1983, when you were asked

To translate the catalogue of Priam’s sons.

Hard to believe that you will not return

And tell your adventures in the other world,

No matter how tenderly I brush the dead

Leaves from your sleeping face, and call your name.

 .

Catherine Tufariello

Born 1963

American

Poem Courtesy:

http://www.poemtree.com/poems/ElegyForAlice.htm

 

 

 

మనలో మన మాట… కెరొలీన్ రఫేల్, అమెరికను కవయిత్రి

ఎవరన్నారు ఈ పిల్లల్ని ఎగిరిపోనివ్వాలని?
ఈ పిల్లలు మన పేగుతో ముడిపడినవాళ్ళు
వాళ్లకి మన అవసరం ఉంటుంది, చివరకి ఎగిరిపోనివ్వడమేనా?
(నేను ఈ మాటలు అనవలసి వస్తుందని ఎన్నడూ ఊహించలేదు)

ఋతువులన్నీ సంగీతంలోని స్వరాల్లా
క్రమంతప్పకుండా వచ్చిపోయే
ఈ ఇంటి చెట్టుకి దగ్గరలోనే …
ఏ కొమ్మమీదో గూడుకట్టుకుంటే, ఏమిటిట నష్టం?

ఈ-ఉత్తరాలనీ, పుట్టినరోజు కార్డులనీ, ఫోన్లనీ
ఎప్పుడూ మనం రొట్టె తునకలే ఎందుకు ఏరుకోవాలి?
తక్కినవాళ్లందరూ వాళ్ళపిల్లలతో హాయిగా ఉంటే
మనమెందుకు ఇట్టే గడిచిపోయే శలవులతో సర్దుకుపోవాలి?

సాహసం చెయ్యాలని మనమే నూరిపోసామనుకో;
అయినా, ఎవరనుకున్నాడు వాళ్లంత స్వేచ్ఛగా ఎగిరిపోతారని?

.

కెరొలీన్ రఫేల్

అమెరికను కవయిత్రి .

Photo Courtesy:

http://carolynraphaelpoetry.com/

Between You and Me

 .

Who says we have to let them fly,

these children who were bound by cords

of flesh, then need, then, finally, sky?

(I never thought I’d say these words.)

What’s wrong with nesting close to home

in branches of the family tree,

where seasons, like a metronome,

count days of continuity?

Why must we always savor crumbs—

the emails, birthday cards, and calls,

the hurried holiday that numbs—

while others celebrate their smiles?

Of course we championed bravery;

who ever thought they’d fly so free?

 .

 Carolyn Raphael

American

6 Longview Place

Great Neck, NY 11021

craphael429@gmail.com

Poem Courtesy:

http://www.poemtree.com/poems/Between-You-and-Me.htm

 

విరహగీతి… రిచర్డ్ ఓ మూర్, అమెరికను కవి

ఓ ప్రభాతమా!నేను చాలా దీనావస్థలో ఉన్నాను.
బహుశా నేను ఏ హీనద్రవ్యంతోనో చెయ్యబడి ఉంటాను

తుత్తునాగం, సీసం లాంటివి.
నేను పక్కమీంచి లేవను.

నా మనసు విషాదంతో నిండిపోయింది
నీ బంగారు మెరుగు ఆశ్వాదించడానికి.

మనసు క్రుంగిపోయి, అంతా రసహీనంగా కనిపిస్తోంది.
సంజ వెలుగా, తక్షణం ఇక్కడనుండి పో! నీ వెలుగు నీదగ్గరే ఉంచుకో!

.

రిచర్డ్ ఓ మూర్

(February 26, 1920 – March 25, 2015)

అమెరికను కవి .

.

Aubade

.

Leave me, dawn!  I’m in wretched fettle.

I swear I’m made of some base metal,

           zinc, say, or lead.

           I’ll stay in bed.

           I’m too sad-souled

           for the day’s gold,

too lowdown, and my taste too bitter.

So bug off, daylight, keep your glitter.

.

Richard Moore

(February 26, 1920 – March 25, 2015)

American Poet

Poem Courtesy:

http://www.poemtree.com/poems/Aubade1.htm

 

ఏడ్నా సెంట్ విన్సెంట్ మిలే సమాధి దగ్గర… సామ్యూల్ మినాష్, అమెరికను కవి

ఇక్కడ పాతిన

అస్థికలశలో

నీ చితాభశ్మము

నాకు జీవితం పట్ల

మితిలేని ప్రేమ రగిల్చింది.

ఒకప్రక్క

కొవ్వొత్తి కరిగిపోతోంది.

మిత్రుడూ- శత్రువూ

కొవ్వూ- వత్తీ

పరిధుల్ని దాటి చీకటి శాశ్వతం.

.

సామ్యూల్ మినాష్

(September 16, 1925 – August 22, 2011)

అమెరికను కవి

 .

Edna St. Vincent Millay (February 22, 1892 – October 19, 1950) was an American poet and playwright. She received the Pulitzer Prize for Poetry in 1923, the third woman to win the award for poetry, and was also known for her feminist activism. She used the pseudonym Nancy Boyd for her prose work. The poet Richard Wilbur asserted, “She wrote some of the best sonnets of the century.”

***

At Millay’s Grave

.

Your ashes

In an urn

Buried here

Make me burn

For dear life

My candle

At one end—

Night outlasts

Wick and wax

Foe and friend

.

Samuel Menashe

(September 16, 1925 – August 22, 2011)

American Poet

Poem Courtesy:

http://www.poemtree.com/poems/AtMillaysGrave.htm

 

ఋతువు గడిచిపోయేక… కేట్ లైట్ , అమెరికను కవయిత్రి

ఇప్పుడు నాతో ఏమీ మాటాడొద్దు; నా మానాన్న నన్నుండనీ.
మనం మన బాధల్లో, నష్టాల్లో మునిగిపోయి ఉన్నాం, కనుక
సముద్రంలో మునిగిన ప్రేమికుల్ని గాలమేసిపట్టి తిరిగి కలుపుతున్నాను.

వాళ్ళ గుండెల్లోంచి బాకులు పైకి తీసి, గాయాలకి కుట్లుకుడుతున్నాను
ఎవరు ఎవరిని ప్రేమించారో స్పష్టం చేస్తున్నాను. ఇక్కడనుండి పో!
ఇప్పుడేమీ మాటాడకు; నన్ను నా మానాన్న వదిలెయ్.

నేను పువ్వుల్నీ, మందుల్నీ, శృతిమార్చి వేణువుల్నీ పంపిణీచేస్తున్నాను;
హేమంతంలోకూరుకుపోయిన వసంతాన్ని బయటకి లాగి ఉత్తరాలు తిరగరాస్తున్నాను
సముద్రంలో మునిగిన ప్రేమికుల్ని గాలమేసిపట్టి తిరిగి కలుపుతున్నాను.

నేను పిచ్చిని కుదుర్చుతున్నాను, బందీలకి విముక్తి ప్రసాదిస్తున్నాను,
కళతప్పిన బుగ్గలకి కవోష్ణరుచి తిరిగి అద్దుతున్నాను,
ఇప్పుడు నాతో ఏం మాటాడొద్దు,నన్ను నా మానాన్న వదిలెయ్.

గూఢచారీ, సీతాకోక చిలుకా చక్కని జోడీగా అమరుతారు.
వయొలెట్టాకి ఇప్పుడు చూపించడానికి ఐదు తోటలున్నాయి…
సముద్రంలో మునిగిన ప్రేమికుల్ని గాలమేసిపట్టి తిరిగి కలుపుతున్నాను.

విదూషకుడూ అతని కూతురూ వేరే నగరానికి మారిపోయారు
లూసియా ఇప్పుడు తనజుత్తుకి రంగు వేసుకుంటోంది, తెలుసా?
రా! ఇప్పుడు మనిద్దరం కూచుని, మాటలు కలబోసుకుని
సముద్రంలోంచి రక్షించబడిన ప్రేమికుల్లా తిరిగి కలుద్దాం.
.

కేట్ లైట్
(14 Feb 1960 – 13 Apr 2016)
అమెరికను కవయిత్రి.

Kate Light

.

After the Season 

Do not talk to me just now; let me be.

We were up to our ears in pain and loss, and so

I am reuniting all the lovers, fishing the drowned from the sea.

I am removing daggers from breasts and re-

zipping.  Making it clear who loves whom—please go.

Do not talk to me just now; let me be.

I am redistributing flowers and potions and flutes, changing key;

rewriting letters, pulling spring out of the snow.

I am reuniting all the lovers, fishing the drowned from the sea.

I am making madness sane, setting prisoners free,

cooling the consumptive cheek, the fevered glow.

Do not talk to me just now; let me be.

Pinkerton and Butterfly make such a happy

couple; Violetta has five gardens now to show …

I am reuniting all the lovers, fishing the drowned from the sea.

The jester and his daughter have moved to a distant city.

Lucia colors her hair now, did you know?

Come, let us talk, sit together and be

lovers reunited, fished like the drowned from the sea.

.

Kate Light

(14 Feb 1960 – 13 Apr 2016)

American poet, Lyricist, Librettist

Poem Courtesy:

http://www.poemtree.com/poems/After-the-Season.htm

 

తక్కినవాళ్ళు… డేవిడ్ బెర్మన్… అమెరికను కవి

కొందరికి సాహిత్యంలో జీవిత లక్ష్యం దొరుకుతుంది
కొందరికి లలిత కళలలో,
ఎవరికి వారికి అది మనసులోనే దొరుకుతుందన్న
నమ్మికకి కొందరు అంకితమౌతారు.

కొందరికి మదిరలో ఆనందం దొరుకుతుంది
కొందరికి మగువలో
కొందరికి జీవితంలో వెలుగెన్నడూ దొరకదు
వాళ్ళు చీకటితోనే సర్దుకుపోతారు.

మనం వాళ్ళగురించి ఆలోచిస్తున్నప్పుడు
వాళ్ళెప్పుడూ దుఃఖంలో మునిగి ఉన్నట్టు ఊహించుకోవచ్చు;
కానీ, అది నిజం కాదు; వాళ్ళకి కనిపించని ఆ వెలుగు
వాళ్ళెన్నడూ కోరుకున్నది కాదు.
.

డేవిడ్ బెర్మన్

జననం 4 జనవరి 1967

సమకాలీన అమెరికను కవి .

.

And the Others

.

Some find The Light in literature;

Others in fine art,

And some persist in being sure

The Light shines in the heart.

Some find The Light in alcohol;

Some, in the sexual spark;

Some never find The Light at all

And make do with the dark,

And one might guess that these would be

A gloomy lot indeed,

But, no, The Light they never see

They think they do not need.

David Berman

(Born 4 January 1967)

Contemporary American poet, cartoonist, and singer-songwriter best known for his work with indie-rock band the Silver Jews.

http://www.poemtree.com/poems/And-the-Others.htm

ముప్ఫయ్యవయేటినాటి చిత్తరువు… ఫ్రాంక్ పొలైట్, అమెరికను

ఆ చెట్టు కాండములో

30 వృత్తాలు.

అకస్మాత్తుగా, నన్ను నేనక్కడ చూసుకున్నాను,

చిన్నగా అయి, ఆ కలపలో భాగమైపోయాను,

గాలిని విసరుతూ .

.

ఫ్రాంక్ పొలైట్

 1936-2005

అమెరికను కవి

.

Image at Thirty

30 circles

In the heart of one tree.

Suddenly, I see me there, grown tiny,

Rooted in the wood of the stadium,

Fanning the air.

.

Frank Polite

1936-2005

American

Poem courtesy:

https://www.poetryfoundation.org/poetrymagazine/browse?volume=109&issue=1&page=41

తరుణి… లిండా గ్రెగ్, అమెరికను కవయిత్రి

నేను ఒకప్పుడు హాయిగా బ్రతికిన  నా స్వదేశానికి తిరిగివచ్చేను,

ఎన్నో మార్పులకు లోనై. ఇప్పుడు అవేశం నన్ను ఒత్తిడికి గురిచెయ్యదు.

ఇప్పుడు వాంఛల జాగాలో ఏవి వచ్చి చేరుతాయోనని కుతూహలంగా ఉంది.

నేను ఎంతో మెరుగ్గా ఎక్కడ జీవించేనో అక్కడ తిరుగాడుతున్న

నా గత ప్రకృతికి వికృతిలా ఉన్నానేమో! అటూ ఇటూ తచ్చాడుతూ

విలువైన వస్తువు నాకు కనిపించినపుడు తల పంకిస్తూ.

ఇప్పుడు నా ఇంట్లో గుడ్లగూబల అరుపులు వింటూ నివసిస్తున్నాను. అవి

నేను నెమ్మదిగా మళ్ళీ ఎప్పుడు ఒళ్ళు చేస్తానా అని ఆత్రంగా ఉన్నాయి.

.

లిండా గ్రెగ్

(జననం సెప్టెంబరు 9, 1942 )

అమెరికను కవయిత్రి

.

.

Adult

.

I’ve come back to the country where I was happy

changed. Passion puts no terrible strain on me now.

I wonder what will take the place of desire.

I could be the ghost of my own life returning

to the places I lived best. Walking here and there,

nodding when I see something I cared for deeply.

Now I’m in my house listening to the owls calling

and wondering if slowly I will take on flesh again.

.

Linda Gregg

Born September 9, 1942

American Poetess

Poem Courtesy: http://pgrnair.blogspot.in/2016/09/adult.html

 

తెల్లబడుతున్న ప్రకృతి… జేమ్స్ డి సెనెటో, సమకాలీన అమెరికను కవి

నాకు తెలుసు
అటకమీది కిటికీదగ్గర
చంద్రవంకల్లాంటి
మంచుపలకలు
ఈ హేమంతంలో
పేరుకుంటాయి.
వాటిలోంచి ప్రసరించే
సూర్యకిరణాలు
ఎర్రగా, నీలంగా
విడివడుతూ
నా కళ్ళలో ప్రతిఫలిస్తుంటాయి.
అక్కడి చల్లదనంలో
అచేతనత్వంలో
నేను నా ఊహల్లో
సిగరెట్లు తాగుతూ
ప్రపంచం చలికి
గడ్డకట్టుకుపోవడం గమనిస్తాను.
ఆ నా ఏకాంతంలో
నా కిటికీప్రక్కన దూదిమంచు
తేలియాడడం గమనిస్తున్నాను.
నేనున్న అనువైన ప్రదేశంనుండి
చెట్టు చివరలనుండి
క్రిందనున్న కంచెమీదకి
ఒక మంచు పలక ప్రయాణాన్ని
చూడగలుగుతున్నాను.
క్రమక్రమంగా పొదలన్నీ
“క్రంబ్ కేకు”ముక్కల్లా మారుతున్నై.
గడ్డిపరకలు మంచుతో
కప్పబడిపోయే లోపు
వీలయినంత నిటారుగా నిలబడుతున్నై.
ఇంటిప్రహారీలప్రక్కదారిలో
పిల్లుల కాలి జాడలు
మంచుమీద చిత్రవిచిత్రమైన
ఆకారాలు రచిస్తున్నాయి.
.

జేమ్స్ డి సెనెటో

సమకాలీన అమెరికను కవి

.

The Whitening

.

I remember

the attic window

would form

iced crescents

in the winter

and the sun’s rays

would separate

into blues and reds

as they passed through

and into my eyes.

There, in the chill

and stillness,

I’d smoke

imaginary cigarettes

and watch the world

bundle up against

the cold.

In my solitude

I could see the snow

float by my window

and from my vantage

I could trace

the path of a flake

from the tops of trees

to the hedgerow below

and in time the shrubs

would resemble crumb cakes

and the tips of grass

would reach out

before their snowy burial

and cat paws would leave

abstract images

on the whitening

sidewalk.

.

James D. Senetto

Contemporary American Poet.

Poem Courtesy:

http://gdancesbetty.blogspot.in/2010/04/whitening-james-d-senetto.html

For  James D. Senetto’s Artwork & Poetry Pl. Visit :

http://www.talkofthetownband.com/Jim/jim.htm

%d bloggers like this: